మేఘ్రాజ్ మిట్టర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మేఘ్రాజ్ మిట్టర్

మేఘ్రాజ్ మిట్టర్ పంజాబ్ కు చెందిన నాస్తికుడు. ఇతను తర్కశీల్ సొసైటీ కి సహ వ్యవస్థాపకుడు. అతను సర్జిత్ తల్వార్ తో కలసి ఈ సంస్థను స్థాపించాడు. మత ఛాందసవాదం, మతతత్వం, కుల వ్యవస్థ, అంటరానితనం, మూఢ నమ్మకాలను నిర్మూలించడానికి,[1] భారతీయ ప్రజలలో హేతువాద ఆలోచనలను, శాస్త్రీయ దృక్పధాన్ని వ్యాప్తి చేయడమే తర్కశీల్ సొసైటీ లక్ష్యం.[2] ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ హేతువాద సంఘాలకు అనుబంధంగా ఉన్న తర్కశీల్ సొసైటీ మతం, విద్యను వేరుచేయాలని సూచించింది.[3] ప్రస్తుతం పంజాబ్‌లోని దాదాపు అన్ని గ్రామాలు, పట్టణాల్లో యూనిట్లు ఉన్నాయి. ప్రధానంగా పంజాబ్ రాష్ట్రానికి పరిమితం అయినప్పటికీ, సొసైటీ ఇప్పుడు పొరుగు రాష్ట్రాలైన హర్యానా, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, జమ్మూ కాశ్మీర్లలో కూడా పనిచేస్తుంది. దక్షిణాసియా జనాభా అధికంగా ఉన్నందున, కెనడాలోని మూడు ప్రధాన నగరాల్లో వాంకోవర్, కాల్గరీ, టొరంటోలలో కూడా ఈ సొసైటీ చురుకుగా ఉంది.[4]

అతను విజ్ఞాన్ జోత్ పత్రిక సంపాదకుడు. బాబాలు, సన్యాసులు, బైరాగులు, మంత్రగాళ్ళు, జ్యోతిష్యులు ఇంకెవరైనా దేవుడు, మంత్రాలు, మహిమలు, జాతకాలు లాంటివి నిజమని నిరూపిస్తే 20 లక్షలు బహుమతి ఇస్తామని అతను చాలెంజ్ చేశారు. ఇతను 1984లో పంజాబ్ లో రేషనలిస్ట్ సొసైటీ పేరుతో సంస్థను స్థాపించాడు. తరువాత ఆ సంస్థ పేరుని తర్క్ శీల్ సొసైటీగా మార్చారు. ఇతను పంజాబీ భాషలో 15 పుస్తకాలు వ్రాసారు. అందులో కొన్నింటిని ఇతర భాషలలోకి అనువదించడం జరిగింది.

మూలాలు[మార్చు]

  1. "Bhoot talk continues in village - Tarksheel member gets a ghost call.", expressindia.com, The Indian Express, 27 August 2004, retrieved 18 August 2009
  2. "National Conference to fight communalisation.", The Times of India, 6 April 2004, retrieved 18 August 2009
  3. Garg, Balwant (1 April 2004), "Separation of religion and politics demanded.", The Times of India, retrieved 18 August 2009
  4. Tarksheel Society, Tarksheel Society in Canada., retrieved 11 August 2010