యనమదుర్రు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
యనమదుర్రు
—  రెవిన్యూ గ్రామం  —
యనమదుర్రు is located in Andhra Pradesh
యనమదుర్రు
యనమదుర్రు
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 16°29′24″N 81°31′34″E / 16.489935°N 81.526210°E / 16.489935; 81.526210
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా పశ్చిమ గోదావరి
మండలం భీమవరం
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 3,878
 - పురుషులు 1,954
 - స్త్రీలు 1,924
 - గృహాల సంఖ్య 1,156
పిన్ కోడ్ 534239
ఎస్.టి.డి కోడ్

యనమదుర్రు పశ్చిమగోదావరి జిల్లా, భీమవరం మండలానికి చెందిన గ్రామం.[1]. నిడదవోలు నుండి ప్రారంభమయ్యే డ్రెయిన్ ఇక్కడ నుండి సముద్రములో కలుస్తుంది. దీనిని కృష్ణా పశ్చిమగోదావరి జిల్లాలవాళ్ళు ఎనమదుర్రు మురుగు కాలువగా పిలుస్తుంటారు.

గ్రామచరిత్ర[మార్చు]

యనమదుర్రులోని ప్రఖ్యాత శక్తీశ్వరస్వామి ఆలయం తూర్పుచాళుక్యుల కాలంలో నిర్మితమైంది. 12వ శతాబ్దిలో ఢిల్లీ పాలకుల దండయాత్రలో చరిత్రగర్భంలో మరుగునపడిపోయింది. తర్వాతిక కాలంలో పునరుద్ధరణ పొందింది.[2]

గ్రామంలోని ఆలయాలు[మార్చు]

శక్తీశ్వరస్వామివారి ఆలయం[మార్చు]

గ్రామంలో ఉన్న శక్తీశ్వరాలయం విశిష్టమైనది. శీర్షాసనంలో అపురూపమైన భంగిమలో శివుడు శివలింగంపై దర్శనమిస్తాడు.[2] దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న స్వయంభూ శ్రీ పార్వతీ సమేత శ్రీ శక్తీశ్వర స్వామివారి ఆలయ చరిత్ర-స్థల పురాణము : నమపర్తిని ( యామధర్మరాజు) భక్తితో తలచుకునే జీవులు అరుదుగా కనిపిస్తాయి. ఈ సకల జీవరాశిలో పాములు, శునకాలు ( కుక్కలు) మాత్రమే ధర్మరాజు రాకపోకలను కనిపెట్టగలవిగా పేరు పొందాయి.యమధర్మరాజుకూ, శక్తీశ్వరస్వామిగా పిలువబడుతూ పూజలందుకుంటున్న శివునికి ఏమిటి సంబంధం? శివుడు సాక్షాత్ ఆరుద్ర రూపమేనని, రుద్రునికే కాలుడని, హరించే వాడనే నామాలున్నాయి. కాబట్టి ఇక్క్డ సంహారం తర్వాతనే జీవుల ఆత్మ సమవర్తి వెంట నడఛి తాను చేసిన కర్మానుసారంగా శిక్షలను అనుభవిస్తుంటుంది. నూటికి 99 మంది ఈ సమవర్తి పేరువింటేనే హడలిపోతుంటారు. అయితా ఇటువంటి న్యాయమూర్తికి తాను చేసే విధి కొంచం అసహ్యం కలిగిందట. అపుడాయన శివుని గురించి తపం ఆచరించగా, హరుడు సాక్షాత్కరించి "ఒకానొక రాక్షసుని వధానంతరం అతడు మనదగ్గరకు రావడం జరుగుతుందని, అప్పుడు తాను అతనిచేతనే ఆంధ్రదేశంలో ప్రతిష్టించబడటం, త్ద్వారా యముడంటే ప్రాణాలు తీసేవాడు కాదు, దీర్ఘరోగాలను సైతం నయం చేయగలడనే మంచిపేరు తెచ్చుకోవడమే కాక, మనుష్యులందరి చేత స్మరింపబడతాడని" వరం ఇచ్చాడు. ఆ వర ప్రభావంగా వెలసిన యనమదుర్రు శీర్షాసన శివ భంగిస్ క్షేత్రమే ఇప్పుడు తెలుసుకోబోయే శక్తీశ్వరస్వామివారి ఆలయం. పశ్ఛిమగోదావరి జిల్లా భీమవరం పట్టాణానికి సుమారు 5 కిలోమీటర్ల దూరంలోని యనమదుర్రు అనే గ్రామం ఉన్నట్లుండి వార్తల్లోకి ఎక్కింది.ఇక్కడ త్రేతయుగం నాటిదిగా చెప్పబడుతున్న ఒక ఆలయం 100 సంవత్సరాలక్రిందట తవ్వకాలలో బయటపడింది. ఈ త్రవ్వకాల్లో శివుని రూపమైన శక్తీశ్వరుడు, మూడు నెలల పసికండు అయిన కుమారస్వామిని ఒడిలో పెట్టుకుని లాలిస్తున్న పార్వతిమాత విగ్రహాలు ఏక పీఠంపై బయటపడ్డాయి.

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 3,878 - పురుషుల సంఖ్య 1,954 - స్త్రీల సంఖ్య 1,924 - గృహాల సంఖ్య 1,156

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3811.[1] ఇందులో పురుషుల సంఖ్య 1912, మహిళల సంఖ్య 1899, గ్రామంలో నివాస గృహాలు 852 ఉన్నాయి. యెనమదుర్రు పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం మండలం లోని గ్రామం. ఇది మండల కేంద్రమైన భీమవరం నుండి 2 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1156 ఇళ్లతో, 3878 జనాభాతో 998 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1954, ఆడవారి సంఖ్య 1924. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 472 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 20. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 588732[3].పిన్ కోడ్: 534239.

విద్యా సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు నాలుగు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాల ఒకటి, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి ఉన్నాయి. సమీప మాధ్యమిక పాఠశాల దిరుమర్రులో ఉంది.సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్‌లు, సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం భీమవరం లోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల, సమీప వైద్య కళాశాల, ఏలూరు లోనూ ఉన్నాయి.

వైద్య సౌకర్యం[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం[మార్చు]

యెనమదుర్రులో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఒకరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. పశు వైద్యశాల, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. డిస్పెన్సరీ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం[మార్చు]

గ్రామంలోఒక ప్రైవేటు వైద్య సౌకర్యం ఉంది. డిగ్రీ లేని డాక్టరు ఒకరు ఉన్నారు.

తాగు నీరు[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. కాలువ/వాగు/నది ద్వారా, చెరువు ద్వారా కూడా గ్రామానికి తాగునీరు లభిస్తుంది.

పారిశుధ్యం[మార్చు]

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం ఉంది. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు[మార్చు]

పోస్టాఫీసు సౌకర్యం, సబ్ పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి.

గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులుప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. రాష్ట్ర రహదారి గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు[మార్చు]

గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. రోజువారీ మార్కెట్, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సమీకృత బాలల అభివృద్ధి పథకం, ఆటల మైదానం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 5 కి.మీ.లోపు దూరంలో ఉన్నాయి.

విద్యుత్తు[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 18 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం[మార్చు]

యెనమదుర్రులో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 232 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 766 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 766 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు[మార్చు]

యెనమదుర్రులో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • కాలువలు: 766 హెక్టార్లు

ఉత్పత్తి[మార్చు]

యెనమదుర్రులో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు[మార్చు]

వరి

పారిశ్రామిక ఉత్పత్తులు[మార్చు]

బియ్యం

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-14. Retrieved 2013-11-24.
  2. 2.0 2.1 వల్లూరి, విజయ హనుమంతరావు (జనవరి - ఫిబ్రవరి 2015). వల్లూరి, విజయ హనుమంతరావు (ed.). "మన చరిత్రరచన". సుపథ సాంస్కృతిక ద్వైమాసిక పత్రిక. తాడేపల్లిగూడెం: శివానంద సుపథ ఫౌండేషన్. 15 (2): 11–20. Check date values in: |date= (help)
  3. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".