యువికా చౌదరి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
యువికా చౌదరి
2023లో యువిక
జననం (1983-08-02) 1983 ఆగస్టు 2 (వయసు 40)
ఇతర పేర్లుయువిక చౌదరి
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2000 – ప్రస్తుతం
జీవిత భాగస్వామి
ప్రిన్స్ నరులా
(m. 2018)

యువిక చౌదరి (జననం 1983 ఆగస్ట్ 2) భారతీయ నటి. ఓం శాంతి ఓం, సమ్మర్ 2007, తో బాత్ పక్కీ! వంటి బాలీవుడ్ చిత్రాలలో నటించింది.[1] 2009లో, ఆమె గణేష్ సరసన కన్నడ చిత్రం మలేయాలి జోతెయాలిలో కూడా నటించింది. 2015లో, ఆమె కలర్స్ టీవీ రియాలిటీ షో బిగ్ బాస్ 9లో పోటీదారుగా ఉంది.[2] 2019లో, ఆమె తన భర్త ప్రిన్స్ నరులాతో కలిసి నాచ్ బలియే 9 అనే డ్యాన్స్ రియాలిటీ షోలో పాల్గొని విజేతగా నిలిచింది.[3]

బాల్యం

[మార్చు]

ఆమె 1983 ఆగస్టు 2న ఉత్తరప్రదేశ్‌లోని బరౌత్ లో జన్మించింది.[4][5][6][7]

కెరీర్

[మార్చు]

ఆమె 2004లో జీ సినీ స్టార్స్ కి ఖోజ్‌లో పాల్గొంది. దీంతో ఆమెకు ప్రముఖ టీవీ సీరియల్ అస్తిత్వ...ఏక్ ప్రేమ్ కహానీ లో నటిగా అవకాశం వచ్చింది, ఇందులో ఆమె ఆస్తా పాత్రను పోషించింది. 2006లో, ఆమె హిమేశ్ రేషమ్మియా మ్యూజిక్ వీడియోలో ఆప్ కా సురూర్ ఆల్బమ్ నుండి వాడా టైను పాటలో నటించింది. ఆమె కునాల్ కపూర్ సరసన కోకాకోలా వాణిజ్య ప్రకటనలో కూడా వచ్చింది. దీంతో ఫరా ఖాన్ దృష్టిని ఆకర్షించిన ఆమె ఓం శాంతి ఓం (2007) చిత్రంతో బాలీవుడ్ బ్రేక్ సాధించింది.

ఆమె తర్వాత సమ్మర్ 2007, తో బాత్ పక్కి వంటి చిత్రాలను చేసింది. 2011లో, ఆమె నాటీ @ 40లో కనిపించింది, ఇందులో ఆమె గోవిందా సరసన నటించింది. మనోజ్ పహ్వా సరసన ఖాప్‌లో ఆమె నటించింది. ఎనిమీ (2013)లో ఆమె కే కే మీనన్ సరసన నటించింది. ఆమె షౌకీన్స్, అఫ్రా తఫ్రి, యారానాలలో నటించిన ఆమె పంజాబీ చిత్రం యారన్ ద కట్చప్ (2014)లో కూడా చేసింది.

ఆమె లైఫ్ ఓకే షో దఫా 420తో టెలివిజన్‌కి తిరిగి వచ్చింది, అయితే ఆ తర్వాత మధురిమ తులి భర్తీ చేయబడింది. 2015లో, ఆమె రియాలిటీ టీవీ షో బిగ్ బాస్ 9లో పాల్గొంది.[8] 2018లో, ఆమె జీ టీవీ కుంకుమ్ భాగ్యలో టీనాగా నటించింది.[9] ఆమె లాల్ ఇష్క్ ఎపిసోడ్‌లో ప్రిన్స్ నరులా సరసన శిఖా పాత్రలో కూడా మెప్పించింది.[10]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

ఆమె నటుడు విపుల్ రాయ్‌తో పదేళ్లపాటు డేటింగ్ లో ఉంది.[11] ఆ తరువాత ఆమె బిగ్ బాస్ 9 సమయంలో ప్రిన్స్ నరులాను కలిసింది. వీళ్లిద్దరు 2018 ఫిబ్రవరి 14న నిశ్చితార్థం చేసుకుని[12], 2018 అక్టోబరు 12న ముంబైలో వివాహం చేసుకున్నారు.[13][14]

మూలాలు

[మార్చు]
 1. "Toh Baat Pakki". Times of India. Retrieved 27 March 2010.
 2. PTI (12 October 2015). "Will not create unnecessary controversy on 'Bigg Boss 9': Yuvika Chaudhary". The Indian Express (in ఇంగ్లీష్). Retrieved 22 April 2022.
 3. "Nach Baliye 9 finale highlights: Prince Narula-Yuvika Chaudhary lift trophy". Indian Express. 4 November 2019. Retrieved 22 April 2022.
 4. "Varanasi Chaudhary dances the night away with beau Prince Narula and other TV celebs; watch video". India Today. 2 August 2018. Retrieved 16 May 2019.
 5. "प्रिंस नरूला की 'क्वीन' बनीं बड़ौत की युविका चौधरी". Dainik Jagran (in హిందీ). 13 October 2018. Retrieved 16 May 2019.
 6. "पापा गांव में ढूंढते रह गए दूल्हा, बेटी ने मॉडल ब्वॉयफ्रेंड से कर ली सगाई". Dainik Bhaskar (in హిందీ). 24 January 2018. Retrieved 16 May 2019.
 7. "अंगदपुर जौहड़ी तक खिंचा चला आया बॉलीवुड". Amar Ujala (in హిందీ). 11 December 2020. Retrieved 11 January 2021.
 8. IANS (9 November 2015). "Bigg Boss 9: Yuvika Chaudhary Eliminated, Says 'It's a Challenging Life'". NDTV. Retrieved 22 April 2022.
 9. "Yuvika Chaudhary, Vishal Singh and Rhea Sharma recreate Kuch Kuch Hota Hai scene in Kumkum Bhagya". The Times of India. 28 July 2018. Retrieved 19 August 2018.
 10. "Prince and Yuvika to romance on screen in Laal Ishq". The Times of India. 19 August 2018. Retrieved 19 August 2018.
 11. "Did you know Yuvika Choudhary dated this guy for ten years before meeting Prince Narula?". India Today. 29 August 2018. Retrieved 12 July 2019.
 12. Sonali, Kriti (24 January 2018). "Bigg Boss couple Prince Narula and Yuvika Chaudhary are engaged, see photos". The Indian Express (in ఇంగ్లీష్). Retrieved 22 April 2022.
 13. "Prince Narula and Yuvika Chaudhary get married in a grand ceremony, see pics". India Today (in ఇంగ్లీష్). 13 October 2018. Retrieved 22 April 2022.
 14. "Inside Prince Narula and Yuvika Chaudhary's wedding". The Indian Express (in ఇంగ్లీష్). 13 October 2018. Retrieved 22 April 2022.