Jump to content

యూసుఫ్ బీ

వికీపీడియా నుండి

యూసుఫ్ బీ తెలంగాణ ప్రాంతానికి చెందిన మావోయిస్ట్. మెదక్ జిల్లా దౌల్తాబాద్ మండలం మాచిన్‌పల్లి ఇమె స్వగ్రామం. సోనీ, భాగ్యక్క, మునీబీ వంటి పేర్లతో ఉద్యమ జీవితాన్ని గడిపింది[1]. పదహారు సంవత్సరాల వయసులోనే ప్రజా ఉద్యమాల పట్ల ఆకర్షితురాలై అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది. 1993లో ఇందుప్రియాల్ దళ సభ్యురాలుగా ఉద్యమజీవితాన్ని ప్రారంభించింది. 2001లో దళ కమాండర్‌గా బాధ్యతలు స్వీకరించింది. 2002లో నల్లమల్ల మావోయిస్ట్ విభాగానికి బదిలీ అయింది. తరువాత మావోయిస్ట్ ఆంధ్రా-ఒడిశా బోర్డర్ కార్యదర్శిగా, తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ ఏరియా మావోయిస్ట్ కమిటీ కార్యదర్శిగా పనిచేసింది. ఇమెపై ప్రభుత్వం ఐదు లక్షల రివార్డు ప్రకటించింది. ఇరవై మూడు సంవత్సరాలు అజ్ఞాత జీవితాన్ని గడిపిన భాగ్యక్క 2016 మార్చి 1 వ తేది ఛత్తీస్‌గడ్‌లోని బీజాపూర్ జిల్లా పామేడు పోలీస్ స్టేషన్ పరిధిలోని బొట్టెంతోంగు గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో జరిగిన పోలీస్ ఎదురు కాల్పుల్లో మరణించింది[2].

వైవాహిక జీవితం

[మార్చు]

యూసుఫ్ బీ తన సహచర ఉద్యమకారుడైన గొట్టిముక్కల రమేశ్‌ను వివాహం చేసుకుంది. రమేశ్ ఉద్యమంలో లచ్చన్నగా చలామణి అయ్యాడు. ఇతనిది గుంటూరు జిల్లా, క్రోసూరు మండలంలోని అందుకూరు గ్రామం. హైదరాబాద్‌లో వ్యవసాయ శాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీ చేస్తున్నప్పుడే ఉద్యమాల పట్ల ఆకర్షితుడై 1990లో ఉద్యమంలో చేరాడు. అక్కడే పరిచయమైన యూసుఫ్ బీని జీవిత భాగస్వామిగా స్వీకరించాడు.

మూలాలు

[మార్చు]
  1. ఎరుపెక్కిన సరిహద్దు, సాక్షి,దినపత్రిక, పుట-2,తేది:02.03.2016
  2. భారీ ఎన్‌కౌంటర్, ఈనాడు, దినపత్రిక, పుట-1, తేది:02.03.2016
"https://te.wikipedia.org/w/index.php?title=యూసుఫ్_బీ&oldid=2606631" నుండి వెలికితీశారు