యెద్దుల ఈశ్వరరెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


వై.ఈశ్వరరెడ్డి గా ప్రసిద్ధులైన యెద్దుల ఈశ్వరరెడ్డి భారత పార్లమెంటు సభ్యుడు, స్వాతంత్ర్య సమరయోధుడు. ఇతడు కడప లోకసభ నియోజకవర్గం నుండి 1వ లోకసభ, 3వ లోకసభ, 4వ లోకసభ, 5వ లోకసభ లకు ఎన్నికయ్యారు.[1]

ఇతడు 1915 సంవత్సరంలో జన్మించి ఆజన్మాంతం బ్రహ్మచారిగా జీవించారు.

భారత స్వాతంత్ర్య సంగ్రామంలో భారత జాతీయ కాంగ్రెసు సభ్యునిగా వ్యక్తిగత సత్యాగ్రహంలో పాల్గొని 4 నెలలు కారాగార శిక్షను అనుభవించారు. 1942 నుండి భారత కమ్యూనిస్టు పార్టీలో చేరి రైతుల సత్యాగ్రహంలో పాల్గొన్నారు.

వీరు కొంతకాలం (1958-62) ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యునిగా కూడా సేవచేశారు.

మూలాలు[మార్చు]