యెద్దుల ఈశ్వరరెడ్డి
(యెద్దుల ఈశ్వర రెడ్డి నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation
Jump to search
ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
వై.ఈశ్వరరెడ్డి గా ప్రసిద్ధులైన యెద్దుల ఈశ్వరరెడ్డి భారత పార్లమెంటు సభ్యుడు మరియు స్వాతంత్ర్య సమరయోధుడు. ఇతడు కడప లోకసభ నియోజకవర్గం నుండి 1వ లోకసభ, 3వ లోకసభ, 4వ లోకసభ మరియు 5వ లోకసభ లకు ఎన్నికయ్యారు.[1]
ఇతడు 1915 సంవత్సరంలో జన్మించి ఆజన్మాంతం బ్రహ్మచారిగా జీవించారు.
భారత స్వాతంత్ర్య సంగ్రామంలో భారత జాతీయ కాంగ్రెసు సభ్యునిగా వ్యక్తిగత సత్యాగ్రహంలో పాల్గొని 4 నెలలు కారాగార శిక్షను అనుభవించారు. 1942 నుండి భారత కమ్యూనిస్టు పార్టీలో చేరి రైతుల సత్యాగ్రహంలో పాల్గొన్నారు.
వీరు కొంతకాలం (1958-62) ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యునిగా కూడా సేవచేశారు.