రాఘవయ్య (నటుడు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాఘవయ్య
Raghavaiah (actor).jpg
జననంరాఘవయ్య
నివాసంహైదరాబాదు
వృత్తినటుడు
పిల్లలుకుమారుడు (బెనర్జీ), కుమార్తె[1]

రాఘవయ్య తెలుగు సినిమా నటుడు. 50 ఏళ్ళకుపైగా సినిమా నటుడిగా కొనసాగాడు.[2] ఈయన కుమారుడు బెనర్జీ కూడా తెలుగు సినీ పరిశ్రమలో గుర్తింపు పొందిన నటుడు.

జీవిత విశేషాలు[మార్చు]

రాఘవయ్య దాదాపు 50 ఏళ్లుగా ప‌రిశ్ర‌మ‌లో న‌టుడిగా కొనసాగాడు. మ‌ద్రాసులో వేళ్లూనుకున్న తెలుగు సినిమా, అట్నుంచి హైద‌రాబాద్ షిఫ్ట్ అయిన క్ర‌మంలోనూ సినీరంగంలో న‌టుడిగా కొన‌సాగాడు. బ్ర‌హ్మ‌చారి అనే సినిమాతో కెరీర్ ప్రారంభించిన ఆయ‌న‌ వంద‌లాది చిత్రాల్లో న‌టించారు.[3]

టాలీవుడ్‌లో ప‌లువురు సీనియ‌ర్ న‌టులతో ప‌నిచేసిన రాఘ‌వ‌య్య వీరాంజ‌నేయ‌, క‌థానాయ‌కుడు, య‌మ గోల చిత్రాల్లో న‌టించారు. ఈనెల 2018, ఏప్రిల్ 20న మ‌హేష్ బాబు కథానాయకునిగా విడుదలవనున్న భ‌ర‌త్ అనే నేను చిత్రంలోనూ ఆయ‌న ఓ పాత్ర‌లో న‌టించారు. టాలీవుడ్‌లో ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి పలువురు సీనియర్ నటులతో కలిసి పనిచేసిన రాఘవయ్య క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.[4]

ఆయనకు ఓ కొడుకు, కుమార్తె. న‌ట‌వార‌సుడు బెన‌ర్జీ టాలీవుడ్‌లో ద‌శాబ్ధాలుగా కెరీర్‌ని సాగిస్తున్నాడు. కుమార్తె ప్ర‌స్తుతం చెన్న‌య్‌లోనే స్థిర‌ప‌డింది. బెన‌ర్జీ ప్ర‌స్తుతం "మా" అసోసియేష‌న్‌లో వైస్ ప్రెసిడెంట్ గా బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్నారు.

అతడు 2018, ఏప్రిల్ 15 ఉదయం హైదరాబాద్ ఫిలిం నగర్ లోని ఆయన కొడుకు బెనర్జీ నివాసంలో తుదిశ్వాస విడిచారు.[5]

మూలాలు[మార్చు]

  1. "నటుడు బెనర్జీకి పితృవియోగం". eenadu.net. ఈనాడు. 15 April 2018. మూలం నుండి 15 April 2018 న ఆర్కైవు చేసారు. Retrieved 15 April 2018.
  2. "హైదరాబాద్‌: ప్రముఖ నటుడు రాఘవయ్య (86) కన్నుమూత – Andhra Prabha Telugu Daily". prabhanews.com. Retrieved 2018-04-15.
  3. "న‌టుడు బెన‌ర్జీ కి పితృవియోగం". Telugu Movie Reviews | Telugu Cinema Reviews. 2018-04-15. Retrieved 2018-04-15.
  4. selvi. "సినీయర్ నటుడు రాఘవయ్య కన్నుమూత... భరత్ అనే నేనులో?". Retrieved 2018-04-15. Cite news requires |newspaper= (help)
  5. Stories, Prajasakti News. "సీనియర్ నటుడు రాఘవయ్య మృతి". Prajasakti. Retrieved 2018-04-15.

బయటి లింకులు[మార్చు]