రాచకొండ పోలీస్ కమీషనరేట్
Appearance
రాచకొండ పోలీస్ కమీషనరేట్ | |
---|---|
నినాదం | మీతో - మీకోసం |
ఏజెన్సీ అవలోకనం | |
ఏర్పాటు | 2016 |
ఉద్యోగులు | కమీషనర్ ఆఫ్ పోలీస్ డిప్యూటి కమీషనర్ అడిషనల్ డిప్యూటి కమీషనర్ పోలీస్ ఇన్స్పెక్టర్స్ అసిస్టెంట్ పోలీస్ ఇన్స్పెక్టర్స్ సబ్ పోలీస్ ఇన్స్పెక్టర్స్ |
అధికార పరిధి నిర్మాణం | |
కార్యకలాపాల అధికార పరిధి | మల్కాజిగిరి జోన్, ఎల్.బి. నగర్ జోన్, భువనగిరి జోన్, తెలంగాణ, భారతదేశం |
చట్టపరమైన అధికార పరిధి | మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, యాదాద్రి భువనగిరి జిల్లా, రంగారెడ్డి జిల్లా |
ప్రధాన కార్యాలయం | నేరెడ్‌మెట్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, తెలంగాణ[1] |
ఏజెన్సీ అధికారులు |
|
మాతృ ఏజెన్సీ | తెలంగాణ రాష్ట్ర పోలీస్ |
వెబ్‌సైట్ | |
http://rachakondapolice.telangana.gov.in/ |
రాచకొండ పోలీస్ కమీషనరేట్, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని పోలీసు కమిషనరేట్.[2] హైదరాబాదులోని మూడు పోలీసు కమిషనరేట్లలో ఇదీ ఒకటి.[3] ఈ కమిషనరేట్ కు ప్రస్తుతం జి. సుధీర్ బాబు కమిషనర్‌గా ఉన్నాడు.[4]
చరిత్ర
[మార్చు]2016 జూన్ నెలలో సైబరాబాద్ మెట్రోపాలిటన్ పోలీసు నుండి విడిపోయి ఈ కమీషనరేట్ ఏర్పడింది. గతంలో దీనిని సైబరాబాద్ ఈస్ట్ అని పిలిచేవారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ అధికార పరిధి 5091.48 చ.కి.మీ. జనాభా సుమారు 42 లక్షలు. దీని పరిధిలో 42 - పోలీస్ స్టేషన్లు, 2 - మహిళా పోలీస్ స్టేషన్, 1 - సైబర్ క్రైమ్ సెల్, 8 - సహాయక పోలీసు విభాగాలు ఉన్నాయి.[5]
జోన్స్
[మార్చు]రాచకొండ పోలీస్ కమిషనరేట్‌లో ప్రస్తుతం నాలుగు డీసీపీ మండలాలు ఉన్నాయి.
మల్కాజిగిరి డీసీపీ జోన్
[మార్చు]- మల్కాజిగిరి ఏసిపి జోన్: మల్కాజిగిరి, నాచారం, ఉప్పల్, మేడిపల్లి, ఘట్కేసర్, పోచారం, మహిళా పోలీస్ స్టేషన్ - ఉప్పల్
- కుషాయిగూడ ఏసిపి జోన్: కుషాయిగూడ, నేరెడ్‌మెట్, జవహర్ నగర్, కీసర, చెర్లపల్లి
ఎల్.బి. నగర్ డీసీపీ జోన్
[మార్చు]- ఎల్.బి. నగర్ ఏసిపి జోన్: ఎల్.బి. నగర్, సరూర్ నగర్, చైతన్యపురి, మహిళా పిఎస్
- వనస్థలిపురం ఏసిపి జోన్: వనస్థలిపురం, మీర్‌పేట్, హయత్ నగర్, అబ్దుల్లాపూర్‌మెట్, పహాడీషరీఫ్, బాలాపూర్
- ఇబ్రహీంపట్నం ఏసిపి జోన్: ఇబ్రహీంపట్నం, మంచాల్, యాచారం, మహేశ్వరం, కందుకూరు, ఆదిబట్ల, మద్గుల్
భువనగిరి డీసీపీ జోన్
[మార్చు]- భువనగిరి ఏసిపి జోన్: భువనగిరి టౌన్, మహిళా పిఎస్ (భువనగిరి), భువనగిరి సర్కిల్ (భువనగిరి రూరల్, బొమ్మలరామారం, బీబీనగర్)
- యాదాద్రి ఏసిపి జోన్: యాదాద్రి, యాదగిరిగుట్ట సర్కిల్ (తుర్కపల్లి, రాజాపేట, ఆలేరు, మోటకొండూర్, గుండాల)
- చౌటుప్పల్ ఏసిపి జోన్: చౌటుప్పల్, చౌటుప్పల్ సర్కిల్ (పోచంపల్లి, నారాయణపూర్), రామన్నపేట సర్కిల్ (రామన్నపేట, వలిగొండ, ఆత్మకూరు, మోత్కూర్, అడ్డగూడూరు)
- మహేశ్వరం ఏసీపీ జోన్: మహేశ్వరం, కందుకూరు, పహాడీ షరీఫ్, బాలాపూర్
- ఇబ్రహీంపట్నం ఏసీపీ జోన్: ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, ఆదిభట్ల, మాడ్గుల, గ్రీన్ ఫార్మా సిటీ
పోలీస్ కమిషనర్లు
[మార్చు]- మహేశ్ భగవత్
- దేవేంద్ర సింగ్ చౌహాన్ (డీఎస్ చౌహాన్)[7][8]
- జి. సుధీర్ బాబు - 13 డిసెంబర్ 2023 నుండి 12 ఫిబ్రవరి 2024 వరకు [9]
- తరుణ్ జోషి - 12 ఫిబ్రవరి 2024 నుండి ప్రస్తుతం [10]
ఇవి కూడా చూడండి
[మార్చు]- హైదరాబాదు నగర పోలీసులు
- కరీంనగర్ పోలీస్ కమీషనరేట్
- రామగుండం పోలీస్ కమీషనరేట్
- నిజామాబాద్ పోలీస్
- సైబరాబాద్ మెట్రోపాలిటన్ పోలీసు
మూలాలు
[మార్చు]- ↑ "New commissionerate bldg for Rachakonda cops | Hyderabad News - Times of India". The Times of India.
- ↑ Hindustantimes Telugu (24 December 2022). "రాచకొండ పరిధిలో కొత్త పోలీస్ స్టేషన్లు.. ఎక్కడంటే..?". Archived from the original on 2 September 2023. Retrieved 2 September 2023.
- ↑ "Rachakonda Police Commissionerate". rachakondapolice.telangana.gov.in. Retrieved 2021-09-21.
- ↑ Andhrajyothy (27 December 2023). "Rachakonda Crime Report: 2023 ఇయర్ ఎండింగ్ రాచకొండ క్రైమ్ రిపోర్ట్ ఇదే..." Archived from the original on 27 December 2023. Retrieved 27 December 2023.
- ↑ "About Us - Rachakonda Police Commissionerate". rachakondapolice.telangana.gov.in. Retrieved 2021-09-21.
- ↑ Sakshi (26 December 2022). "రాచకొండ పోలీసు కమిషనరేట్ మరింత బలోపేతం!". Archived from the original on 2 September 2023. Retrieved 2 September 2023.
- ↑ Namaste Telangana (30 December 2022). "'రాచకొండ' కొత్త బాస్ డీఎస్ చౌహాన్". Archived from the original on 30 December 2022. Retrieved 30 December 2022.
- ↑ Eenadu (30 December 2022). "రాచకొండ సీపీగా డీఎస్ చౌహాన్". Archived from the original on 30 December 2022. Retrieved 30 December 2022.
- ↑ Andhrajyothy (13 December 2023). "ముగ్గురు కొత్త కమిషనర్లు". Archived from the original on 13 December 2023. Retrieved 13 December 2023.
- ↑ A. B. P. Desam (12 February 2024). "తెలంగాణలో 12 మంది ఐపీఎస్‌ల బదిలీ, రాచకొండ సీపీగా తరుణ్ జోషి". Archived from the original on 12 February 2024. Retrieved 12 February 2024.