Jump to content

తరుణ్ జోషి

వికీపీడియా నుండి
తరుణ్‌ జోషి

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2024 ఫిబ్రవరి 12 నుంచి ప్రస్తుతం

వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
4 ఏప్రిల్ 2021 [1] - 30 నవంబర్ 2022

వ్యక్తిగత వివరాలు

జననం 1980
పంజాబ్‌ రాష్ట్రం, భారతదేశం
జాతీయత  భారతదేశం
పూర్వ విద్యార్థి ఉస్మానియా యూనివర్సిటీ
వృత్తి పోలీస్ అధికారి (ఐపీఎస్ అధికారి)

తరుణ్‌ జోషి 2004 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి, వైద్యుడు, పర్వతారోహకుడు. ఆయన ఐజీ హోదాలో ప్రస్తుతం ACB Telangana లో విధులు నిర్వహిస్తున్నాడు

జననం & విద్యాభాస్యం

[మార్చు]

తరుణ్‌ జోషి పంజాబ్‌ రాష్ట్రంలో జన్మించాడు. ఆయన పటియాలాలోని గవర్నమెంట్‌ డెంటల్‌ కాలేజ్‌ అండ్‌ హాస్పిటల్‌ నుంచి బీడీఎస్‌ పూర్తి చేసి దంత వైద్యుడిగా మారాడు. ఆయన 2004లో సివిల్‌ సర్వీసెస్‌ ఉత్తీర్ణుడై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కేడర్‌లో ఐపీఎస్‌ అధికారిగా నియమితులయ్యాడు. ఆయన అనంతరం 2014లో ఉస్మానియా యూనివర్సిటీ నుండి పోలీస్‌ మేనేజ్‌మెంట్‌ విభాగంలో మాస్టర్స్‌, 2019లో ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశాడు.[2][3]

వృత్తి జీవితం

[మార్చు]

పర్వతారోహణ

[మార్చు]

తరుణ్‌ జోషి 2014 నుంచి 2016 వరకు ఆదిలాబాద్ జిల్లా ఎస్పీగా పని చేస్తున్న సమయంలో ఆదిలాబాద్ జిల్లా అదనపు ఎస్పీగా విధులు నిరవహిస్తున్న జి.రాధిక పర్వతారోహణపై పట్టున్న ఆమె అప్పట్లోనే కొన్నింటిని అధిరోహిస్తూ ఉందేది, విధి నిర్వహణలో భాగంగా అనునిత్యం తరుణ్‌ జోషిని కలిసే ఆమె తన పర్వతారోహణ అనుభవాలను పంచునేది, ఈ క్రమంలో ఆయన పర్వతారోహణపై ఆసక్తి పెంచుకొని 2017లో డార్జిలింగ్‌లోని హిమాలయన్‌ మౌంటెనీరింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ తీసుకుని అదే ఏడాది అక్టోబర్‌లో తొలిసారిగా హిమాలయాల్లోని మౌంట్‌ రీనాక్‌ను అధిరోహించాడు.

ఆయన 2018 మేలో యూరప్‌లోని సదరన్‌ రష్యాలోని భారీ అగ్నిపర్వతమైన మౌంట్‌ ఎల్బ్రస్‌ను, 2019 జనవరిలో అర్జెంటీనాలో ఉన్న మౌంట్‌ ఎకనగ్వా, 2019 ఆగస్టులో ఇండోనేషియాలో ఉన్న మౌంట్‌ కార్‌స్టెంజ్స్‌ , 2019 ఆగస్టు 21న అంటార్కిటికాలోనే అత్యంత ఎల్తైన మౌంట్‌ విన్సన్‌ను అధిరోహించిన మూడు రోజుల్లోనే ఆస్ట్రేలియాలోని అత్యంత ఎత్తయిన మౌండ్‌ కోస్యూస్కో ను అధిరోహించాడు. ఆయన జనవరి 2021న ఆఫ్రికాలో అత్యంత ఎత్తైన పర్వతం కిలిమంజారోను అధిరోహించాడు.[11][12]

మూలాలు

[మార్చు]
  1. Dishadaily (దిశ) (4 April 2021). "వరంగల్ సీపీగా తరుణ్ జోషి." Archived from the original on 15 February 2022. Retrieved 15 February 2022.
  2. Sakshi (31 January 2020). "ఎంబీబీఎస్‌ టు ఐపీఎస్‌". Archived from the original on 12 February 2024. Retrieved 12 February 2024.
  3. The Hindu (4 January 2023). "In major reshuffle, 29 IPS officers given new postings" (in Indian English). Archived from the original on 18 July 2023. Retrieved 18 July 2023.
  4. Deccan Chronicle (27 October 2014). "Hyderabad gets new top police officers" (in ఇంగ్లీష్). Archived from the original on 15 February 2022. Retrieved 15 February 2022.
  5. Sakshi (1 November 2013). "జనానికి చేరువవుతా బాధ్యతలు స్వీకరించిన నూతన ఎస్‌పీ తరుణ్‌జోషి". Archived from the original on 15 February 2022. Retrieved 15 February 2022.
  6. Sakshi (18 November 2014). "శాంతిభద్రతలు కాపాడుతా." Archived from the original on 15 February 2022. Retrieved 15 February 2022. శాంతిభద్రతలు కాపాడుతా..
  7. Mana Telangana (4 April 2021). "వరంగల్, ఖమ్మం పోలీసు కమిషనర్ల బదిలీ". Archived from the original on 15 February 2022. Retrieved 15 February 2022.
  8. The Hans India (8 April 2021). "Warangal: Tarun Joshi takes charge" (in ఇంగ్లీష్). Archived from the original on 15 February 2022. Retrieved 15 February 2022.
  9. Eenadu (19 December 2023). "రాష్ట్రంలో 20మంది ఐపీఎస్‌ల బదిలీ.. డీజీపీగా రవిగుప్తాకి పూర్తి బాధ్యతలు". Archived from the original on 12 February 2024. Retrieved 12 February 2024.
  10. A. B. P. Desam (12 February 2024). "తెలంగాణలో 12 మంది ఐపీఎస్‌ల బదిలీ, రాచకొండ సీపీగా తరుణ్‌ జోషి". Archived from the original on 12 February 2024. Retrieved 12 February 2024.
  11. Namasthe Telangana (12 December 2021). "పోలీస్‌ బాస్‌ కొండంత జోష్‌". Archived from the original on 15 February 2022. Retrieved 15 February 2022.
  12. Sakshi (23 January 2021). "కిలిమంజారోపై ఐపీఎస్‌". Archived from the original on 15 February 2022. Retrieved 15 February 2022.