రామగుండం పోలీస్ కమీషనరేట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రామగుండం పోలీస్ కమీషనరేట్
Ramagundam Police Logo.jpg
రామగుండం పోలీస్ లోగో
Common nameరామగుండం నగర పోలీస్
Mottoసర్వీస్ ప్రైడ్ డెడికేషన్
Agency overview
Formed11 అక్టోబరు, 2016
Employeesకమీషనర్ ఆఫ్ పోలీస్
డిప్యూటి కమీషనర్
అడిషనల్ డిప్యూటి కమీషనర్
పోలీస్ ఇన్స్పెక్టర్స్
అసిస్టెంట్ పోలీస్ ఇన్స్పెక్టర్స్
సబ్ పోలీస్ ఇన్స్పెక్టర్స్
Jurisdictional structure
Operations jurisdictionపెద్దపల్లి జిల్లా, మంచిర్యాల జిల్లా, భారతదేశం
Size8670 చ.కి.మీ.
Populationసుమారు 16 లక్షలు
Legal jurisdictionరామగుండం గోదావరిఖని
Primary governing body[[తెలంగాణ ప్రభుత్వం ]]
Secondary governing body[[తెలంగాణ రాష్ట్ర పోలీస్ ]]
Headquartersరామగుండం
Agency executive
 • కె. చంద్రశేఖర్ రెడ్డి ఐసిఎస్ (డిఐజి), పోలీసు కమీషనర్
Parent agencyతెలంగాణ రాష్ట్ర పోలీస్
Facilities
Stations44 పోలీస్ స్టేషన్లు
Website
http://ramagundampolice.in

రామగుండం పోలీస్ కమీషనరేట్, తెలంగాణ రాష్ట్రం, పెద్దపల్లి జిల్లాలోని రామగుండంలో ఉన్న పోలీసు కమీషనరేట్.[1] మంచిర్యాల, రామగుండం, గోదావరిఖని పట్టణ ప్రాంతాలలో చట్ట అమలుకు, దర్యాప్తులో ప్రాథమిక బాధ్యతలను కలిగి ఉన్న ఒక నగర పోలీసు విభాగం.[2][3] రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలో పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలు ఉన్నాయి. ప్రస్తుత పోలీసు కమిషనర్ గా కె. చంద్రశేఖర్ రెడ్డి ఐపిఎస్ విధులు నిర్వర్తిస్తున్నాడు.

Ramagundam Police Commissionerate
రామగుండం పోలీస్ కమిషనరేట్

చరిత్ర[మార్చు]

2016 అక్టోబరు 11న రామగుండం పోలీస్ కమిషనర్ నేతృత్వంలో రామగుండంలో హెడ్ క్వార్టర్స్‌తో ఈ కమీషనరేట్ ఏర్పడింది.[4] రామగుండం పోలీస్ కమిషనరేట్ అధికార పరిధి 8,670 చ.కి.మీ. (మంచిర్యాల జిల్లా 4,056 చ.కి.మీ., పెద్దపల్లి జిల్లా 4,614 చ.కి.మీ) కాగా, జనాభా సుమారు 16,02,369 మంది (మంచిర్యాల జిల్లా 8,07,037 మంది, పెద్దపల్లి జిల్లా 7,95,332 మంది) ఉన్నారు. ఈ కమీషనరేట్‌ పరిధిలో 5 సబ్ డివిజన్లు, 12 సర్కిళ్ళు, 44 - పోలీస్ స్టేషన్లు ఉన్నాయి.[5]

జోన్స్[మార్చు]

రామగుండం పోలీస్ కమిషనరేట్‌లో ప్రస్తుతం రెండు డిసిపి జోన్స్ ఉన్నాయి.[6]

మంచిర్యాల జోన్[మార్చు]

 1. మంచిర్యాల: మంచిర్యాల, మంచిర్యాల రూరల్, లక్సెట్టిపేట్
 2. జైపూర్: శ్రీరాంపూర్, చెన్నూరు టౌన్, చెన్నూరు రూరల్
 3. బెల్లంపల్లి: బెల్లంపల్లి టౌన్, బెల్లంపల్లి రూరల్, తాండూర్, మందమర్రి

పెద్దపల్లి జోన్[మార్చు]

 • పెద్దపల్లి: పెద్దపల్లి, సుల్తానాబాద్
 • గోదావరిఖని: రామగుండం, మంథని, గోదావరిఖని- I, గోదావరిఖని- II, రామగుండం ట్రాఫిక్

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

 1. "Telangana State Portal పోలీస్ శాఖ పునర్వ్యవస్థీకరణపై సిఎం సమీక్ష". www.telangana.gov.in. Retrieved 2021-09-22.
 2. "Khammam made police commissionerate". 10 October 2016 – via The Hindu.
 3. Dayashankar, K. M. (10 October 2016). "Minister reviews arrangements for police commissionerates" – via The Hindu.
 4. "Telangana Bill". www.telanganalegislature.org.in. Retrieved 2021-09-22.
 5. "Official Website of Ramagundam Police". ramagundampolice.in. Retrieved 2021-09-22.
 6. "Official Website of Ramagundam Police". ramagundampolice.in. Retrieved 2021-09-22.