Jump to content

నిజామాబాద్ పోలీస్

వికీపీడియా నుండి
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్
నినాదంకర్తవ్యం, గౌరవం, కరుణ
ఏజెన్సీ అవలోకనం
ఏర్పాటు1876 ఎ.డి[1]
ఉద్యోగులుకమీషనర్ ఆఫ్ పోలీసు
డిప్యూటి కమీషనర్
అడిషినల్ డిప్యూటి కమీషనర్స్
పోలీసు ఇస్స్పెక్టర్స్
అసిస్టెంట్ పోలీసు ఇస్స్పెక్టర్స్
సబ్ ఇస్స్పెక్టర్స్
అధికార పరిధి నిర్మాణం
కార్యకలాపాల అధికార పరిధినిజామాబాదు, తెలంగాణ, భారతదేశం
నిజామాబాద్ పోలీస్ is located in Telangana
నిజామాబాద్ పోలీస్
నిజామాబాద్ పోలీస్ (Telangana)
చట్టపరమైన అధికార పరిధినిజామాబాదు జిల్లా
పరిపాలన సంస్థతెలంగాణ ప్రభుత్వం
ప్రధాన కార్యాలయంనిజామాబాదు నగరం
ఏజెన్సీ అధికారులు
  • వి. సత్యనారాయణ, కమీషనర్ ఆఫ్ పోలీసు
మాతృ ఏజెన్సీతెలంగాణ రాష్ట్ర పోలీస్
Facilities
స్టేషనుs35 [2]
కార్లుమహేంద్ర బొలెరో 44,[3] టయోట ఇన్నోవా క్రిస్టా ~20
మోటార్ సైకిల్స్హీరో గ్లామర్ 50[4]
జీపులురక్షక్ జీపులు ~50
వెబ్‌సైట్
అధికారిక వెబ్‌సైటు

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ అనేది తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాదు జిల్లాలో చట్టాన్ని అమలుచేయడానికి, నేర దర్యాప్తులో ప్రాథమిక బాధ్యతలను కలిగి ఉన్న నగర పోలీసు విభాగం. దీనికి పోలీస్ కమిషనర్ నేతృత్వం వహిస్తాడు. 1847లో హైదరాబాద్ స్టేట్ పరిధిలోని నగర పోలీస్ వ్యవస్థ ఏర్పాటుచేయబడింది. నిజామాబాద్‌ జిల్లా పరిధిలో జిల్లా పోలీసు కమిషనరేట్ కార్యాలయం ద్వారా నిర్వహించబడుతుంది.[5]

చరిత్ర

[మార్చు]

1905లో నిజాం కాలంలో నిజామాబాదు స్థాపించబడింది. 18వ శతాబ్దంలో హైదరాబాద్ నిజాం రాజు దక్కన్ ప్రాంతాన్ని పాలించాడు. అతని పాలనలో చట్టాన్ని అమలుచేసే సంస్థ ఏర్పడింది. 2016 అక్టోబరు వరకు డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఈ నిజామాబాద్ పోలీస్ వ్యవస్థకు ముఖ్య అధికారిగా ఉండేవాడు. తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిజామాబాద్ జిల్లా పోలీసు కమిషనరేట్ గా అప్ గ్రేడ్ చేసే తీర్మానాన్ని ఆమోదించాడు.[6]

సంస్థాగత నిర్మాణం

[మార్చు]

ఐపిఎస్ అధికారైన పోలీస్ కమిషనర్ నేతృత్వంలో నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ ఉంటుంది.[7] ఇందులో 3 సబ్ డివిజన్లు ఉన్నాయి. ప్రతి డివిజనులో సర్కిల్స్ ఉంటాయి. ప్రతి సర్కిల్ లో నిర్దిష్ట సంఖ్యలో పోలీస్ స్టేషన్లు ఉంటాయి.[8] ఈ ప్రతి సర్కిల్‌కు సర్కిల్ ఇన్స్‌పెక్టర్, ప్రతి పోలీస్ స్టేషన్‌కు సబ్ ఇన్‌స్పెక్టర్ నేతృత్వం వహిస్తాడు. జిల్లావ్యాప్తంగా అధికార పరిధి జిల్లా పోలీసు కమిషనరేట్ కార్యాలయం ద్వారా నిర్వహించబడుతుంది.

డివిజను సర్కిల్ పోలీస్ స్టేషన్లు
ఉత్తర నిజామాబాద్ టౌన్ సర్కిల్, ట్రాఫిక్ సర్కిల్, నార్త్ రూరల్ సర్కిల్, ఎస్.హెచ్.ఓ. జోన్ 08
దక్షిణ నిజామాబాద్ దక్షిణ గ్రామీణ సర్కిల్, డిచ్‌పల్లి సర్కిల్, ధర్పల్లి సర్కిల్ 10
ఆర్మూర్ ఆర్మూర్ రూరల్, భీమ్‌గల్ సర్కిల్ 10
బోధన్ బోధన్ రూరల్, రుద్రూర్ సర్కిల్ 07

మౌలిక సదుపాయాలు

[మార్చు]

ఇంటర్‌సెప్టర్ వాహనాలు

[మార్చు]
ఇంటర్‌సెప్టర్‌లో 360 డిగ్రీల తిరిగే కెమెరా అతివేగంగా వెళ్లే వాహనాలను గుర్తిస్తుంది

శాంతిభద్రతలను కాపాడటానికి 2015లో రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ ఇంటర్‌సెప్టర్ వాహనాన్ని (మల్టీ-పర్పస్ ఎస్‌యూవీ) కేటాయించింది. ఇందులో అధునాతన స్పీడ్ కెమెరా, బ్రీత్ ఎనలైజర్ అమర్చబడింది. దీనిద్వారా ఎవరైనా మద్యం సేవించిన తర్వాత వాహనం నడుపుతున్నారా అని తెలుసుకోవచ్చు. ఈ వాహనంలో 360 డిగ్రీల తిరిగే కెమెరా ఉంది.[9]

ఆన్‌లైన్ సేవ

[మార్చు]

2015, ఫిబ్రవరి నుండి నిజామాబాద్ పోలీసులు సోషల్ నెట్‌వర్క్ వాట్సప్ ద్వారా క్రైమ్ రిపోర్టింగ్ సేవలను అందించారు. నేరస్తులను పట్టుకోవడానికి పోలీసులకు సహాయపడే వీడియో లేదా క్లిప్పింగ్‌లను +919491398540 అనే మొబైల్ నంబర్ కు పౌరులు పంపవచ్చని ఎస్పీ చెప్పాడు.[10]

శాఖలు

[మార్చు]

క్రైమ్ బ్రాంచ్

[మార్చు]
నిజామాబాద్ సిటీ పోలీస్ కారు

నిజామామాదు నగరంలో, జిల్లాలో నేరాల నివారణకోసం ఏర్పాటుచేసిన నిజామాబాద్ పోలీసుల ప్రధాన శాఖ ఇది. దీనికి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నేతృత్వం వహిస్తాడు. 2012లో నగరాన్ని రాడార్ కిందకు తీసుకురావాలనే ప్రణాళికతో ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం తీసుకోకుండా నగరంలో 11 ముఖ్యమైన జంక్షన్లలో 22 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయబడ్డాయి.[11] ఈదుల్ అజ్ హా, వినాయక చవితి పండుగల సమయంలో ట్రాఫిక్‌ను పర్యవేక్షించడానికి, ఇరు వర్గాల మధ్య విభేదాలను నివారించడానికి 2015లో అదనంగా 50కి పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయబడ్డాయి.

నిజామాబాద్ కమిషనరేట్ ప్రధాన కార్యాలయం

ట్రాఫిక్ శాఖ

[మార్చు]
నిజామాబాద్ ట్రాఫిక్ పోలీస్ వాహనం

ట్రాఫిక్ భద్రత, ట్రాఫిక్ నిబంధనలు, ప్రమాదాల నివారణలకు ఈ ట్రాఫిక్ శాఖ వ్యవహరిస్తుంది. ట్రాఫిక్ పోలీసులు కొత్తగా కేటాయించిన మహీంద్రా బొలెరోలు, పాత రక్షక్ జీపులను పెట్రోలింగ్ కోసం ఉపయోగిస్తుంటారు. ట్రాఫిక్ శాఖలో హైవే పెట్రోల్ యూనిట్ కూడా ఉంది.[12] నగరం సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉన్నందున ట్రాఫిక్, నేరాల పర్యవేక్షణ కోసం ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయబడింది.

షీ టీమ్స్

[మార్చు]

ఈవ్ టీజింగ్, మహిళలపై వేధింపులను అరికట్టే లక్ష్యంతో, తెలంగాణ రాష్ట్ర పోలీస్ విభాగం 2015 ఏప్రిల్ నెలలో ప్రతి జిల్లాలో షి టీమ్స్ ను ప్రారంభించింది. నిజామాబాదు జిల్లా పరిధిలోని ఐదు షీ టీమ్స్[13] పోలీసు సబ్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్, ఒక మహిళా కానిస్టేబుల్, ముగ్గురు ఇతర కానిస్టేబుళ్ళ బృందాలు బహిరంగ ప్రదేశాలలో జరిగే వేధింపులు, ఈవ్ టీజింగ్ నుండి మహిళలను రక్షించడానికి కాపలాగా ఉంటారు.[14] ఈ షీ టీమ్స్ కు సొంత వాహనాలు, పోలీస్ స్టేషన్స్ కూడా ఉన్నాయి.

బ్లూ కోల్ట్స్

[మార్చు]

బ్లూ కోల్ట్స్ అనేది సమర్థవంతమైన పోలీస్ వ్యవస్థ కోసం, నేరాలను అరికట్టడానికి, జిల్లావ్యాప్తంగా నిఘా ఉంచడానికి ఏర్పాటుచేసిన పోలీస్ ఫోర్స్ విభాగం. 2015లో తెలంగాణ ప్రభుత్వం ఈ బ్లూ కోల్ట్‌లను ప్రవేశపెట్టింది, ఈ జిల్లాకు 50 మోటార్ వాహనాలను కేటాయించింది.[15] పోలీసు రక్షక్ బృందాలు సమయానికి చేరుకోలేని ప్రాంతాలకు ఈ బ్లూ కోల్ట్స్ బృందాలు చేరుకోగలవు.

మొబైల్ పెట్రోలింగ్

[మార్చు]

జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్‌లో పెట్రోలింగ్ కోసం సొంత నాలుగు చక్రాల వాహనాలు, ద్విచక్ర వాహనాలు ఉంటాయి. ప్రతి కారులో 5 నుండి 6 మంది పోలీసులు నిజామాబాదులో అర్ధరాత్రి పెట్రోలింగ్ చేస్తుంటారు.[16]

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "History of Indur". Nizamabad.nic.in. Archived from the original on 19 June 2015. Retrieved 18 August 2021.
  2. "List of police stations in nizamabad". Nizamabad Police. Retrieved 18 August 2021.
  3. "Photos of Police Vehicles". Nizamabad PoliceNizamabad.nic.in. Retrieved 18 August 2021.
  4. "Blue Colts Cops Get New Bikes". Gonizamabad.com. 2015-04-22. Archived from the original on 2015-06-24. Retrieved 2015-06-25.
  5. "Nizamabad gets Police Commissionerate". The Hans India. 12 October 2016.
  6. "Police Commissionerate to be set up soon in Nizamabad". Deccan Chronicle. 22 September 2016.
  7. "Officers Contact List || Police Station Contact List || Police Department, Nizamabad, Andhra Pradesh, India". Nizamabadpolice.com. Retrieved 18 August 2021.
  8. "Inspectors as SHO || Police Department, Nizamabad, Telangana, India". Nizamabadpolice.com. Retrieved 18 August 2021.
  9. "Police interceptor vehicle launched in Nizamabad". 3 July 2015 – via www.thehindu.com.
  10. "Complaints Via WhatsApp". Archived from the original on 2019-04-23. Retrieved 2021-08-18.
  11. "CCTVs lie unused in Nizamabad". Thehindu.com. 4 December 2014. Archived from the original on 7 May 2015. Retrieved 18 April 2015.
  12. "Nizamabad News: Patrol party saves accident victim". The Hindu. Retrieved 18 August 2021.
  13. "SHE Teams Launched in Nizamabad - The Hans India". Thehansindia.com. Retrieved 18 August 2021.
  14. S. Harpal Singh. "SHE teams launched in Adilabad, Nizamabad". Thehindu.com. Retrieved 18 August 2021.
  15. "50 motorcycles presented to Blue Colts teams". M.newshunt.comN. Retrieved 18 August 2021.[permanent dead link]
  16. "9 Kashmiris held in Nizamabad". The Hindu. Retrieved 18 August 2021.