ఈదుల్ అజ్ హా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వ్యాసముల క్రమము
Allah1.png
ఇస్లాం మతం

విశ్వాసాలు

అల్లాహ్ · ఏకేశ్వర విశ్వాసం దేవుడు
ముహమ్మద్ · ఇతర ప్రవక్తలు

ఆచరణీయాలు

మూల విశ్వాసం · నమాజ్
ఉపవాసం · దాన ధర్మాలు · తీర్థయాత్ర

గ్రంధాలు మరియు చట్టాలు

ఖుర్'ఆన్ · సున్నహ్ · హదీస్
ఫిఖ॰ · షరియా · కలాం · సూఫీ తత్వం

చరిత్ర మరియు ఖలీఫాలు

ఇస్లామీయ చరిత్ర కాలపట్టిక
అహ్లె బైత్ · సహాబా
సున్నీ · షియా
రాషిదూన్ ఖలీఫాలు · ఇమామ్

సంస్కృతి మరియు సమాజం

విద్య · జంతువులు · కళలు
కేలండరు · పిల్లలు
జనగణన · పండుగలు
మస్జిద్‌లు · తత్వము
శాస్త్రము · స్త్రీ
రాజకీయాలు · దావాహ్ · జిహాద్

ఇస్లాం మరియు ఇతర మతములు

క్రైస్తవం · యూదమతము
హిందూ మతము · సిక్కు మతం · జైన మతము

'

విమర్శ ·  ముస్లింలలో అపవిశ్వాసాలు
ఇస్లామోఫోబియా
ఇస్లామీయ పదజాలము

భారతదేశంలో ఇస్లాం
ఆంధ్రప్రదేశ్‌లో ఇస్లాం

ఈద్ అల్-అజ్ హా (అరబ్బీ: عيد الأضحى ‘Īd ul-’Aḍḥā) ఈదుల్ అజ్ హా లేదా ఈదుజ్జుహా లేదా బఖర్ ఈద్ లేదా బక్రీదు. అల్లాహ్ ఆదేశం ప్రకారం ఇబ్రాహీం ప్రవక్త తనకుమారుడైన ఇస్మాయీల్ను బలి ఇవ్వడాని తీసుకెళ్ళే సాంప్రదాయాన్ని స్మరిస్తూ ప్రపంచంలోని ముస్లింలు ఈ పండుగను జరుపు కొంటారు. ఈ పండుగకు ప్రామాణికం ఖురాన్.[1] (ఇరాన్ లో ముస్లింలు దీనిని 3వ అతి ముఖ్యమైన పండుగగా జరుపుకొంటారు.) ఈదుల్ ఫిత్ర్ (రంజాన్) లో లాగ, బక్రీదు పండుగనాడు కూడా ప్రార్థనలు ఖుత్బా (ధార్మిక ప్రసంగం) తో ప్రారంభమౌతుంది.

ఇస్లామీయ కేలండర్ ప్రకారం 12వ నెల యైన జుల్ హజ్జా 10వ తేదీన ఈ పండుగ జరుపుకొంటారు. ఈ పండుగ 3 రోజుల పాటు జరుపుకుంటారు. ఈ నెలలోనే హజ్ తీర్థయాత్రగూడా చేస్తారు. ఈ యాత్రకొరకు సౌదీ అరేబియా లోని మక్కా నగరానికి వెళ్ళి మస్జిద్-అల్-హరామ్ లోని కాబా చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేస్తారు. ఈ పండుగ రంజాన్ పండుగ జరిగిన 70 రోజుల తరువాత జరుపుకుంటారు.

ఈదుల్ అజ్ హా కు ఇతర పేర్లు[మార్చు]

‍* 'ఈదుల్ అద్ హా' : (మలేషియా, సింగపూర్, ఇండోనేషియా మరియు బ్రూనై లో)

సాంప్రదాయాలు మరియు సంస్కృతి[మార్చు]

 • స్త్రీలు, పురుషులూ, పెద్దలు మరియు పిల్లలూ క్రొత్త బట్టలు ధరించడం.
 • ఈద్ నమాజ్ కు తయారు గావడం.
 • ఈద్ గాహ్ లలో ఈద్ నమాజ్ ను ఆచరించడం.
 • ఖుర్బానీ ఇవ్వడం (పెంపుడు జంతువులు గొర్రె, మేక, ఎద్దు లేదా ఒంటె లను అల్లాహ్ మార్గమున ఇబ్రాహీం ప్రవక్త సంస్మణార్థం బలి ఇవ్వడం) . ఈ ఖుర్బానీ ఇవ్వబడిన మాంసముము మూడు భాగాలు చేసి ఒక భాగము తమకొరకు ఉంచుకొని, రెండవభాగము చుట్టములకునూ మరియు స్నేహితులకునూ, మూడవభాగము పేదలకు పంచుతారు.
 • ఈద్ ముబారక్ శుభాకాంక్షలు ఒకరినొకరు తెలుపుకోవడం.
 • (Arabic audio with English meaning) .

  అల్లాహ్ పేరున بسم الله
  మరియు అల్లాహ్ మహాశక్తిమంతుడు والله أكبر
  ఓ అల్లాహ్, సత్యముగా ఇది నీనుండే మరియు నీ కొరకే اللهم إن هذا منك ولك
  ఓ అల్లాహ్ నా నుండి స్వీకరించు اللهم تقبل مني

  ఖుర్బానీ మాంసమును ప్రజలకు పంచడం ఈ ఈద్ లోని భాగం. తక్బీర్ ను పఠిస్తూ ప్రార్థనలకు పోవడం రివాజు

  ఖుర్బానీ మాంసాన్ని పంచడం

  ఈదుల్ అజ్ హా గ్రెగేరియన్ కేలెండరులో[మార్చు]

  ఇస్లామీయ కేలండర్ లో ఈదుల్ అజ్ హా ఒకే దినంలో వచ్చిననూ గ్రెగేరియన్ కేలండరులో తేదీలు మారుతాయి. దీనికి కారణం ఇస్లామీయ కేలండర్ చంద్రమాసాన్ననుసరించి మరియు గ్రెగేరియన్ కేలండర్ సూర్యమాసాన్ననుసరించి వుంటుంది. చంద్రమాన సంవత్సరం, సూర్యమాన సంవత్సరం కంటే దాదాపు పదకొండు రోజులు తక్కువ.[2] ప్రతి సంవత్సరం ఈదుల్ అజ్ హా ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో రెండు గ్రెగేరియన్ కేలండర్ దినములలో సంభవిస్తుంది, దీని కారణం అంతర్జాతీయ దినరేఖ ననుసరించి వివిధ ప్రాంతాలలో చంద్రవంక వేర్వేరు దినాలలో కానరావడమే.

  ఈ క్రింది పట్టిక ఈదుల్ అజ్ హా యొక్క అధికారిక దిన పట్టిక. దీనిని సౌదీ అరేబియాకు చెందిన సుప్రీం జుడీషియల్ కౌన్సిల్ ప్రకటించింది.

  నోట్స్[మార్చు]

  బయటి లింకులు[మార్చు]