రాజా రఘునాథ్ దాస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాజా రఘునాథ్ దాస్
రాజా రఘునాథ్ దాస్
హైదరాబాదు రాజ్య ప్రధానమంత్రి
పరిపాలన1750 – 1752
పూర్వాధికారిషా నవాజ్ ఖాన్
ఉత్తరాధికారిసయ్యద్ లష్కర్ ఖాన్ రుక్నుద్దౌలా
జననంరామదాస్ పంత్
మరణం1752
హైదరాబాదు

రాజా రఘునాథ్ దాస్ 1750 నుండి 1752 వరకు నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల్లో హైదరాబాదు రాజ్య ప్రధానమంత్రి (దీవాను)గా పనిచేశాడు.

ఈయన అసలు పేరు రామదాస్ పంత్. ఈయన శ్రీకాకుళానికి చెందిన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. ఈయనకు ఫ్రెంచి సైనికాధికారి బుస్సీ, రాజా రఘునాథ్ దాస్ అనే బిరుదునిచ్చాడు. 1752లో జీతభత్యాల విషయంలో వివాదం చెలరేగి, నిజాం సైనికులు రామదాస్ పంత్‌ను హతమార్చారు.[1]

ఫ్రెంచ్‍వారి ప్రాపకంతో శ్రీకాకుళంలో ఫౌజుదార్‍గా ఉన్నటు వంటి రామదాసు పంత్ తన కుతంత్రాలు, కుట్రలతో నిజాం కొలువులో పేష్కర్‍ బక్షీగా, ఆ తర్వాత దివాన్‍గా ఎదిగాడు. నాసిర్‍ జంగ్‍ దగ్గర సైన్యానికి డబ్బులు చెల్లించే పేష్కారుగా ఉన్నాడు. సైన్యానికి జీతాల చెల్లింపులన్నీ ఈతని నేతృత్వంలోనే జరిగేవి. ఇతను నాసిర్‍జంగ్‍ దగ్గర ఉద్యోగిగా ఉన్నప్పటికీ లోపాయకారిగా ఫ్రెంచ్‍ వారికి సహాయం చేసేవాడు. ఫ్రెంచ్‍ వారికి ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తూ వారి ప్రాపకం పొందుతూ ఉండేవాడు. అయితే డూప్లే సూచనల మేరకు, కర్నూలు నవాబు హిమ్మత్‍ఖాన్‍ ద్వారా నాసిర్‍జంగ్‍ని కుట్రపూరితంగా చంపిస్తాడు.[2] బుస్సీ సూచనల మేరకు తర్వాతి కాలంలో ముజఫర్‍ జంగ్‍, రామదాసు పంత్‌కు "రాజా రఘునాథ్‍ దాస్‍" బిరుదు ఇవ్వడమే గాకుండా ప్రధానమంత్రి (దీవాను)హోదాను ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసాడు. ప్రధానమంత్రి హోదాలో ఉంటూ కూడా ముజఫ్ఫర్ జంగ్ రహస్యాలన్నీ ఫ్రెంచివారికి చేరవేసేవాడు.

రామదాసు పంత్ ఫ్రెంచ్‍ వారి ప్రాపకంలోకి రావడానికి బుస్సీ దీవానుగా పనిచేసిన అబ్దుర్‍ రెహ్మాన్‍ (హైదర్‌ జంగ్) దోహదం చేశాడు. అబ్దుర్‍ రెహ్మాన్‍ తండ్రి కొన్ని అప్పులు చేసి, కప్పం కట్టకుండా తప్పించుకు పోవడంతో, అతనిపై నిజాం సైన్యం నిఘా వేసింది. ఈ దశలో ఆయన శిక్షనుంచి తప్పించుకునేందుకు పాండిచ్చేరిలో ఫ్రెంచ్‍వారి ఆశ్రయం తీసుకున్నడు. తండ్రితోపాటు చిన్నతనం నుంచి పాండిచ్చేరిలోనే పెరిగిన అబ్దుర్‍ రెహ్మాన్‍ ఫ్రెంచ్‍ నేర్చుకోవడమే గాకుండా వారికి దుబాసీగా, రాయబారిగా, నమ్మకస్తుడైన వ్యక్తిగా పనిచేసాడు. ఈ అబ్దుల్‍ రెహ్మాన్‍, శ్రీకాకుళం ఫౌజుదారుగా ఉన్నప్పుడు రామదాసు పంత్ చాకచక్యాన్ని, నేర్పుని గ్రహించి అతన్ని ఫ్రెంచ్‍ వారికి పరిచయం చేసాడు.[3]

అయితే ఈతని హత్యా రాజకీయాలను దగ్గరి నుంచి గమనిస్తూ ఉన్నటువంటి నమ్మకస్తులైన సైనికులు తమకు చెల్లించాల్సిన జీత భత్యాలు సమాయానికి చెల్లించడంలో రామదాసు పంత్ విఫలమయ్యాడనీ, ఇందుకు ఆయన తలబిరుసు తనమే కారణమని గ్రహించి, ఏప్రిల్‍ 7, 1752 నాడు మహారాష్ట్రలోని భాల్కిలో సైనికులు రామదాసు పంత్ తల నరికి చంపారు.[4]

మూలాలు

[మార్చు]
  1. Kulkarni, Uday S. "THE THREE AND A HALF WISE MEN OF THE PESHWA PERIOD". eSamskriti. Retrieved 31 August 2024.
  2. Briggs, Henry George (1861). The Nizam His history and relations with British government Vol 1. London: Bernard Quaritch. p. 123. Retrieved 9 September 2024.
  3. Duff, James Grant. A History Of The Mahrattas Vol 2. London: A.&R. Spottiswoode. p. 46. Retrieved 9 September 2024.
  4. సంగిశెట్టి, శ్రీనివాస్‍ (February 2020). "చరిత్రలో వెలుగు చూడని చీకటి కోణాలు". దక్కన్ ల్యాండ్. Retrieved 8 September 2024.