రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్
Typeచిత్ర నిర్మాణం
సినిమా పంపిణీ
పరిశ్రమవినోద పరిశ్రమ
స్థాపన1981
Foundersకమల్ హాసన్
ప్రధాన కార్యాలయం,
భారతదేశం
Key people
కమల్ హాసన్
చంద్రహాసన్
Productsచలన చిత్రాలు

రాజ్‌కమల్‌ ఫిలిం ఇంటర్నేషనల్‌ (ఆంగ్లం: Raaj Kamal Films International) అనేది కమల్ హాసన్ స్థాపించి, సారథ్యం వహిస్తున్న భారతీయ చలనచిత్ర నిర్మాణ, పంపిణీ సంస్థ. మొదట కమల్ హాసన్ సోదరులు చంద్రహాసన్, చారుహాసన్లు కలసి రాజా పార్వై (1981) అనే చిత్రం "హాసన్ బ్రదర్స్" బ్యానర్‌పై నిర్మించారు. ఈ తమిళ సినిమాను సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో కమల్ హాసన్, మాధవి హీరోహీరోయిన్లుగా తెలుగులో అమావాస్య చంద్రుడు (1981) నిర్మించారు. ఆ తరువాత ఈ బ్యానర్ పేరును రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్‌గా మార్చారు.[1] తెలుగులో ద్రోహి (1995), ఈనాడు (2009), చీకటిరాజ్యం (2015) మొదలైన చిత్రాలు నిర్మించారు.

సోనీ సంస్థ ఒప్పందం[మార్చు]

రాజ్‌కమల్‌ ఫిలిం ఇంటర్నేషనల్‌ సంస్థ, సోనీ ఫిలిమ్స్‌ పిక్చర్స్‌ సంస్థ సంయుక్తంగా తమిళంలో చిత్రాలు నిర్మించడానికి 2022 జనవరిలో ఒప్పందం కుదుర్చుకున్నాయి.[2] ఈ సంస్థలు తొలి ప్రయత్నంగా రాజ్‌కుమార్‌ పెరియస్వామి దర్శకత్వంలో శివకార్తికేయన్‌ కథానాయకుడిగా చిత్రం నిర్మాణం చేపట్టారు.

అవార్డులు[మార్చు]

S.no Ceremony Year Category Nominee Result
1 జాతీయ చలనచిత్ర అవార్డులు 1992 తమిళంలో ఉత్తమ చలనచిత్రంగా జాతీయ చలనచిత్ర పురస్కారం తేవర్ మగన్ గెలుపు
2 తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డులు 1992 ఉత్తమ చిత్రంగా తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర పురస్కారం తేవర్ మగన్ గెలుపు
3 ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ 1989 ఉత్తమ చిత్రంగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు - తమిళం అపూర్వ సగోధరార్గల్ గెలుపు
4 సినిమా ఎక్స్‌ప్రెస్ అవార్డులు 1989 ఉత్తమ చిత్రంగా సినిమా ఎక్స్‌ప్రెస్ అవార్డు – తమిళం అపూర్వ సగోధరార్గల్ గెలుపు
5 1992 ఉత్తమ చిత్రంగా సినిమా ఎక్స్‌ప్రెస్ అవార్డు – తమిళం తేవర్ మగన్ గెలుపు
6 1995 ఉత్తమ చిత్రంగా సినిమా ఎక్స్‌ప్రెస్ అవార్డు – తమిళం కురుతిపునల్ గెలుపు
7 పుచోన్ ఇంటర్నేషనల్ ఫెంటాస్టిక్ ఫిల్మ్ ఫెస్టివల్ (దక్షిణ కొరియా) 2004 ఉత్తమ ఆసియా చిత్రంగా అంతర్జాతీయ అవార్డు విరుమాండి గెలుపు
8 లాస్ ఏంజిల్స్ ఇండిపెండెంట్ ఫిల్మ్ ఫెస్టివల్ 2015 ఉత్తమ చిత్రం ఉత్తమ విలన్ గెలుపు

మూలాలు[మార్చు]

  1. Srinivas Chari, T. K. (July 2012). "The actor in the shadows". Madras Musings. Archived from the original on 8 October 2017. Retrieved 26 May 2021.
  2. "Sony Pictures Films forays into Tamil cinema; collaborates with Kamal Haasan - BusinessToday". web.archive.org. 2022-05-26. Archived from the original on 2022-05-26. Retrieved 2022-05-26.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)