రాముడు భీముడు (1964 సినిమా)
| రాముడు భీముడు (1964 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | తాపీ చాణక్య |
|---|---|
| తారాగణం | నందమూరి తారక రామారావు (ద్విపాత్రాభినయం), జమున, ఎల్. విజయలక్ష్మి, ఎస్.వి. రంగారావు రాజనాల, రమణారెడ్డి, రేలంగి, గిరిజ, శాంతకుమారి, జమున |
| సంగీతం | పెండ్యాల నాగేశ్వరరావు |
| నిర్మాణ సంస్థ | సురేష్ ప్రొడక్షన్స్ |
| భాష | తెలుగు |
రాముడు భీముడు 1964లో విడుదలైన ఒక తెలుగు చిత్రం. ప్రముఖ నిర్మాత డి.రామానాయుడు, సురేష్ ప్రొడుక్షన్స్ పతాకంపై నిర్మించిన తొలి చిత్రం. చిత్రం విజయవంతమై అనేక చిత్రాలకు మాతృక అయ్యింది. నందమూరి తారక రామారావు, జమున, ఎల్. విజయలక్ష్మి, ఎస్. వి. రంగారావు ప్రధాన పాత్రలు పోషించారు. సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు స్వరపరిచారు.
సంక్షిప్త చిత్రకథ
[మార్చు]చిన్నతనంలోనే దూరమైన ఇద్దరు అన్నదమ్ముల కథ. రాముడు శాంతకుమారి కొడుకు. తండ్రి లేడు. మేనమామ (రాజనాల) ఆస్తి అజమాయిషీ చేస్తూ రాముడ్ని చాలా హీనంగా చూస్తుంటాడు. అమాయకుడైన రాముడు మేనమామ చే కొరడా దెబ్బలు తింటుంటాడు. భీముడు పల్లెటూర్లో నాటకాలరాయుడిలా తిరుగుతూ పెంపుడుతల్లి మాట వినకుండా అల్లరి పనులు చేస్తుంటాడు. మేనమామ ఏర్పాటు చేసిన పెళ్ళి చూపుల్లో రాముడు అవమాన పడతాడు. మేనమామ మీద భయంతో ఇంటినుండి వెళ్ళిపోతాడు. అదే సమయానికి భీముడు పల్లెటూరినుండి పారిపోయి పట్నం వస్తాడు. కొన్ని పరిస్థితుల్లో ఒకరి స్థానంలో ఒకరు ప్రవేశిస్తారు. మేనమామకి రాముడి స్థానంలో ఉన్న భీముడు బుద్ధి చెబుతాడు. రాముడు భీముడు అన్నదమ్ములని తెలుస్తుంది. రాముడు పల్లె పడుచు ఎల్.విజయలక్ష్మిని భీముడు పట్నం పిల్ల జమునను పెళ్ళాడతారు.
ట్రెండ్ సెట్టింగ్
[మార్చు]రాజు పేద నవలలో ఒకే పోలికతో ఉన్న యువరాజు, పేద బాలుడు స్థానాలు మారుతారు. అదే విషయం మీద ఆధారపడి రాముడు భీముడు కథ తయారయ్యింది. తెలుగులో విజయవంతమయ్యాక తమిళ హిందీ భాషల్లో నిర్మించబడింది. హిందీలో రామ్ ఔర్ శ్యామ్ గా దిలీప్ కుమార్ నటించారు. అక్కడ కూడా విజయవంతమయ్యింది. అదేకథను జెండరు మార్పుతో హేమమాలిని ద్విపాత్రాభినయంతో 'సిప్పీ' లు సీత ఔర్ గీత తీశారు. అదే కథను మళ్ళీ తెలుగులో గంగ మంగ (వాణిశ్రీ) గా తీశారు. ఎ.ఎన్.ఆర్ 'శ్రీరామరక్ష'చిత్రకథ కూడా దీనిని పోలి ఉంటుంది. చిరంజీవి నటించిన యముడుకి మొగుడు చిత్రంలో కూడా రాముడు భీముడు చిత్ర ఛాయలు కనిపిస్తాయి. బాలకృష్ణ హీరోగా రాముడు భీముడు వచ్చింది. అందులోనూ అవే ఛాయలున్నాయి. హిందీలో శ్రీదేవి చిత్రం చాల్ బాజ్, సీతా ఔర్ గీతాను పోలి ఉంటుంది.
తారాగణం
[మార్చు]- నందమూరి తారక రామారావు_ రాముడు/ భీముడు(ద్విపాత్రాభినయం)
- జూలూరి జమున_ లీల
- ఎల్.విజయలక్ష్మి_శాంత
- సామర్ల వెంకట రంగారావు_రంగనాధo
- రాజనాల కాళేశ్వరరావు_పానకాలరావు
- రేలంగి వెంకట్రామయ్య_ జయరాం
- తిక్కవరపు రమణారెడ్డి_ శరభయ్య
- మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి_డైరెక్టర్ సోమయ్య
- రావి కొండలరావు_రిజిస్ట్రార్
- దగ్గుబాటి రామానాయుడు_లాయర్(అతిథి పాత్ర)
- శాంతకుమారి_ సుశీల
- ఋష్యేంద్ర మణి_వెంకమ్మ
- సూర్యకాంతం_ సుందరమ్మ
- హేమలత_నైనమ్మ
- గిరిజ_కమల
- కుచలకుమారి_ డ్యాన్సర్.
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకుడు: తాపీ చాణక్య
- కధ: డి.వి.నరసరాజు
- సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
- గీత రచయితలు: శ్రీరంగం శ్రీనివాసరావు, కొసరాజు రాఘవయ్య చౌదరి, సింగిరెడ్డి నారాయణరెడ్డి
- నేపథ్య గాయకులు: ఘంటసాల వెంకటేశ్వరరావు, మాధవపెద్ది సత్యం, కె.జమునారాణి, పులపాక సుశీల
- ఛాయా గ్రహణం: అన్నయ్య
- ఎడిటింగ్: కె.ఎ.మార్తాండ్
- నిర్మాత: దగ్గుబాటి రామానాయుడు
- నిర్మాణ సంస్థ: సురేష్ ప్రొడక్షన్స్
- విడుదల:21:05:1964.
పాటలు
[మార్చు]| పాట | రచయిత | సంగీతం | గాయకులు |
|---|---|---|---|
| ఉందిలే మంచికాలం ముందుముందునా | శ్రీశ్రీ | పెండ్యాల నాగేశ్వరరావు | ఘంటసాల, పి.సుశీల |
| దేశమ్ము మారిందోయ్ కాలమ్ము మారిందోయ్ | కొసరాజు | పెండ్యాల నాగేశ్వరరావు | ఘంటసాల, పి.సుశీల |
| అదే నాకు అంతు తెలియకున్నది : ఏదో లాగు మనసు లాగుతున్నది | సి.నారాయణరెడ్డి | పెండ్యాల నాగేశ్వరరావు | ఘంటసాల, పి.సుశీల |
| తెలిసిందిలే తెలిసిందిలే, నెలరాజ నీ రూపు తెలిసిందిలే | సి.నారాయణరెడ్డి | పెండ్యాల నాగేశ్వరరావు | ఘంటసాల, పి.సుశీల |
| సరదా సరదా సిగిరెట్టు | కొసరాజు | పెండ్యాల నాగేశ్వరరావు | మాధవపెద్ది సత్యం, జమునారాణి |
తగునా ఇది మామా తమారే , ఘంటసాల, మాధవపెద్ది, రచన: కొసరాజు
పో మామా పొమ్మికన్ , ఘంటసాల, రచన: కొసరాజు
హాయ్ తళుకు తళుకు మని గలగల సాగే , ఘంటసాల, సుశీల, రచన; సి.నారాయణ రెడ్డి
కురువృద్దుల్ మరియు థారుని రాజ్యసంపద ,(పద్యం), మాధవపెద్ది సత్యం.
విశేషాలు
[మార్చు]
- ఎన్.టి.ఆర్ ద్విపాత్రాభినయం చేసిన తొలిచిత్రం.
- నాగార్జున సాగర్ నిర్మాణకాలంలో తీసిన ఈ చిత్రంలో ఒక పాటలో సాగర్ డామ్ నిర్మాణం నేపథ్యంగా చూపారు (దేశమ్ము మారిందోయ్ కాలమ్ము మారిందోయ్.. పాట)
- అప్పటి సంకేతిక పరిమితుల దౄష్ట్యా కావచ్చుఎన్.టి.ఆర్ రెండుపాత్రలు తెరపై కలిసి కనిపించే సన్నివేశాలు రెండు/మూడు మాత్రమే ఉన్నాయి.
- ఎన్.టి.ఆర్ డూప్ గా సత్యనారాయణ ఒక సన్నివేశంలో స్పష్టంగా కనిపిస్తారు.
మూలాలు
[మార్చు]- సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుండి.
- 1964 తెలుగు సినిమాలు
- ఎన్టీఆర్ సినిమాలు
- రమణారెడ్డి నటించిన సినిమాలు
- రేలంగి నటించిన సినిమాలు
- రామానాయుడు నిర్మించిన సినిమాలు
- రాజనాల నటించిన సినిమాలు
- జమున నటించిన సినిమాలు
- మిక్కిలినేని నటించిన సినిమాలు
- ఎస్.వి.రంగారావు నటించిన సినిమాలు
- ఋష్యేంద్రమణి నటించిన సినిమాలు
- పి.హేమలత నటించిన సినిమాలు
- ద్విపాత్రాభినయం ఉన్న సినిమాలు