రాయికల్ జలపాతం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాయికల్ జలపాతం
ప్రదేశంరాయికల్, సైదాపురం మండలం, కరీంనగర్ జిల్లా
రకంజలపాతం
మొత్తం ఎత్తు170 అడుగులు

రాయికల్ జలపాతం కరీంనగర్ జిల్లా సైదాపురం మండలంలోని రాయికల్ అనే గ్రామానికి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న జలపాతం.[1] వరంగల్ జిల్లా కేంద్రానికి 43 కిలోమీటర్ల దూరంలో వరంగల్ అర్బన్ కరీంనగర్ జిల్లా ల సరిహద్దుల్లో సైదాపురం దట్టమైన పచ్చని అటవీ ప్రాంతంలోని కొండకోనల నుంచి హోరెత్తే నీటి హొయల నిండైన జలపాతం ఇది. 170 అడుగుల ఎత్తులో నుండి కిందికి దూకుతున్న ఈ జలపాతం చుట్టుప్రక్కల ప్రాంతంలోని ఈ సుందర ప్రదేశం పర్యాటకులకు, ప్రకృతి ప్రేమికులకు కనులవిందును కలిగిస్తుంది.

ఎలా చేరుకోవాలి[మార్చు]

ఎత్తైన పర్వతశ్రేణిలో ఉండే ఈ జలపాతాన్ని చేరాలంటే కాలినడకన కొంత దూరం గుట్టలమీదుగా వెళ్లాల్సి ఉంటుంది. చుట్టూ అల్లుకున్న పచ్చటి అడవి, పైన జలపాతం నుంచి పారే సెలయేటి గలగల సవ్వడులు, పక్షుల కిలకిలా రావాలు, పట్టణ కాలుష్యానికి దూరంగా ప్రశాంతమైన ప్రకృతిమాత ఒడిలో హాయిగా సేద తీరేందుకు చక్కటి ప్రదేశం ఇది.

హుస్నాబాద్ - సిద్దిపేట రోడ్డులో ములకనూరు వద్ద కుడివైపు వెళ్లాలి. మాజీ ప్రధానమంత్రి పీవీనరసింహారావు స్వగ్రామమైన వంగర మీదుగా రాయికల్ గ్రామానికి వెళ్ళాలి. గ్రామం నుండి దక్షిణ దిశలో 3 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే గ్రామ చెరువు వస్తుంది. అక్కడ వాహనాలను నిలిపి, జలపాతాల వైపు సుమారు 1 1/2 కిలోమీటర్ల దూరం ట్రెక్కింగ్ చేస్తూ జలపాతాలను చేరుకోవాలి.[2]

పర్యటక ప్రాంతంగా[మార్చు]

రాయికల్‌ జలపాతాన్ని కరీంనగర్‌ పాలనాధికారి సర్ఫరాజ్‌ అహ్మద్‌, కరీంనగర్‌ పోలీసు కమిషనర్‌ వి.బి కమలాసన్‌రెడ్డి, జిల్లా పర్యాటక శాఖ అధికారి వెంకటేశ్వర్‌రావు సందర్శించి, ఇక్కడి జలపాతం, గుట్టలు, చెరువు పరిసరాలను పరిశీలించారు. ఈ ప్రాంతాన్ని పర్యటకంగా అభివృద్ధి చేసేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామని, రాయికల్‌ నుంచి జలపాతం వరకు 3 కి.మీ మేర రహదారి నిర్మాణానికి నిధుల మంజూరుకు చర్యలు తీసుకుంటామన్నారు.[3][4]

మూలాలు[మార్చు]

  1. నవతెలంగాణ. "జలపాతం వద్ద అధికారుల సందడి." Retrieved 25 October 2017.[permanent dead link]
  2. కబుర్లు గురూ..., పర్యాటకం. "అబ్బుర పరిచే రాయికల్ జలపాతాలు !!". kaburluguru.com. Archived from the original on 23 అక్టోబరు 2017. Retrieved 25 October 2017.
  3. ది హిందూ. "A trek to popularise waterfall at Raikal". Retrieved 25 October 2017.
  4. డైలీహంట్. "పర్యటక ప్రాంతంగా రాయికల్‌ జలపాతం". m.dailyhunt.in. Retrieved 25 October 2017.