రిత్విక
రిత్విక | |
---|---|
జననం | |
ఇతర పేర్లు | రిత్విక పన్నీర్ సెల్వం |
క్రియాశీల సంవత్సరాలు | 2013–ప్రస్తుతం |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | మద్రాస్ (సినిమా) బిగ్ బాస్ తమిళం సీజన్ 2 (టెలివిజన్ రియాలిటీ షో) |
రిత్విక పన్నీర్‌సెల్వం (జననం 1992 ఆగస్టు 5) భారతీయ నటి. రిత్విక అని కూడా పిలుస్తారు. తమిళ చిత్రాలలో సహాయక పాత్రల్లో కనిపించే ఆమె పాపులర్ రియాల్టీ షో బిగ్ బాస్ తమిళ సీజన్ 2 విజేత కూడా.
కెరీర్
[మార్చు]దర్శకుడు బాలా రూపొందించిన పరదేశి (2013)లో నటించింది. దీనికి ఆధారం ఆంగ్ల నవల రెడ్ టీ (1969). ఇది బ్రిటీష్ రాజ్ కాలంలో మద్రాస్ ప్రెసిడెన్సీలో టీ తోటల కార్మికుల దుస్థితిని ప్రతిబింబిస్తుంది. తోటలలో చిత్రహింసలకు, లైంగిక దోపిడీకి గురయ్యే యువతి కరుతకన్ని పాత్రను ఆమె పోషించింది. ఆమె విక్రమన్ శృంగార చిత్రం నినైతతు యారో (2014)లో నటించడానికి ముందు, పా.రంజిత్ మద్రాస్ (2014) కోసం కలైయరసన్ సరసన కీలకమైన సహాయ పాత్రలో నటించింది. ఉత్తర చెన్నై అమ్మాయిగా ఆమె చేసిన పాత్ర విమర్శకుల ప్రశంసలు అందుకుంది. దీనికిగాను తమిళం - ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును గెలుచుకుంది.[1][2]
ఆమె ముఖ్యంగా కబాలి (2016), ఇరు ముగన్ (2016), టార్చ్‌లైట్ (2018), సిగై (2019)లలో వ్యభిచారిణి పాత్రలు పోషించింది.[3][4] ఇతర అసైన్‌మెంట్‌లలో, ఆమె ఒరు నాల్ కూతు (2016)లో లిబరల్ రేడియో జాకీగా, హారర్ కామెడీ ఒనైగల్ జక్కిరధై (2018)లో దెయ్యంగా కనిపించింది.
2018లో, రిత్విక రియాలిటీ షో బిగ్ బాస్ తమిళం సీజన్ 2లో కంటెస్టెంట్‌గా పాల్గొన్నది. ఆ తర్వాత ఫ్రాంచైజీలో 2వ సీజన్ విజేతగా నిలిచింది. ఆమె టార్చ్‌లైట్ (2018) చిత్రంలో నటి సదాతో కలిసి చిత్రంలో కీలక పాత్రను పోషించింది.
ఆమె ప్రస్తుతం ఒడవుం ముడియతు ఒలియావుం ముడియతుతో సహా ప్రాజెక్ట్‌లలో పని చేస్తోంది. నటుడు, రాజకీయవేత్త ఎంజీఆర్ పేరుపెట్టని బయోపిక్‌లో ఆమె జానకి రామచంద్రన్ పాత్రను పోషించనుంది.[5]
వ్యక్తిగత జీవితం
[మార్చు]రిత్విక చెన్నైలోని తేనాంపేటలోని జస్టిస్ బషీర్ అహ్మద్ సయీద్ కాలేజ్ ఫర్ ఉమెన్ (SIET)లో చదువుకుంది. చిన్నతనంలో సినిమాల్లోని సన్నివేశాలు, డైలాగులు వల్లె వేస్తుండేది. అలా సినిమాల్లో నటించాలని ఆసక్తిని కనబరిచేది. కళాశాల రోజుల్లో ఆమె అనేక షార్ట్ ఫిల్మ్‌లలో నటించింది. సినీ పరిశ్రమలోకి ప్రవేశించడానికి ప్రయత్నించింది.[6]
ఫిల్మోగ్రఫీ
[మార్చు]సినిమాలు
[మార్చు]సంవత్సరం | సినిమా | పాత్ర | నోట్స్ |
---|---|---|---|
2013 | పరదేశి | కారుతకన్ని | |
సంధితతుం సింధితతుమ్ | కుమరేశన్ సోదరి | ||
2014 | నినైతతు యారో | తేన్మొళి | |
మద్రాసు | మేరీ |
| |
2016 | అళగు కుట్టి చెల్లం | శరవణన్ భార్య | |
అంజల | అంజల | ||
ఓరు నాల్ కూతు | సుశీల | ||
కబాలి | మీనా | ||
ఎనక్కు వేరు ఎంగుమ్ కిలైగల్ కిదయతు | దివ్య | ||
ఇరు ముగన్ | కిడ్నాప్ చేసిన అమ్మాయి | అతిధి పాత్ర / తెలుగులో ఇంకొక్కడుగా విడుదలైంది. | |
2018 | ఒనైగల్ జక్కిరధై | అంజలి | |
టార్చ్లైట్ | కవిత | తెలుగులో శ్రీమతి 21Fగా విడుదలైంది. | |
2019 | సిగై | భువన | జీ5లో డైరెక్ట్-టు-వీడియో విడుదల చేయబడింది[7] |
నేత్ర | జెస్సీ | ||
ఇరందఁ ఉలగపోరిఁ కడైసి గుండు | తాన్య | ||
2020 | వాల్టర్ | పద్మావతి | |
2021 | 4 సారీ | సెల్వి | |
2022 | సిల నెరంగళిల్ సిల మణిధర్గళ్ | కయల్ | |
కడావర్ | ప్రియా | ||
ఆధార్ | తులసి | ||
2023 | యాదుం ఊరే యావరుం కేళిర్ | కన్నిగై | |
800 | అంగమ్మాళ్ | ||
ఒడవుం ముడియదు ఒలియవుం ముడియదు |
టెలివిజన్
[మార్చు]సంవత్సరం | ధారావాహిక | పాత్ర | టీవి ఛానెల్ | నోట్స్ |
---|---|---|---|---|
2018 | బిగ్ బాస్ తమిళ్ 2 | పోటీదారు | స్టార్ విజయ్ | విజేత |
2019 | బిగ్ బాస్ తమిళ్ 3 | అతిథి | స్టార్ విజయ్ | ఆమె చిత్రం ఇరందామ్ ఉలగపోరిన్ కడైసి కుందు ప్రమోట్ చేయడానికి |
బిగ్ బాస్ తమిళ్ 3 | అతిథి | స్టార్ విజయ్ | బిగ్ బాస్ ట్రోఫీని పరిచయం చేయడానికి, షెరిన్ శృంగార్ నాల్గవ స్థానంలో నిలిచింది | |
వనక్కం తమిజా | అతిథి | సన్ టీవీ | ||
2020 | ఆనంద వికటన్ సినిమా అవార్డులు | అతిథి | సన్ టీవీ | |
2022 | తవమై తవమిరుండు | అతిథి | జీ తమిళం | లాయర్ ఈశ్వరి గా |
వెబ్ సిరీస్
[మార్చు]సంవత్సరం | శీర్షిక | పాత్ర | ప్లాట్ ఫాం | నోట్స్ |
---|---|---|---|---|
2019 | మద్రాసు మీటర్ షో | అతిథి | జీ5 | ఎపిసోడ్ 4[8] |
2021 | నవరస | అన్బు | నెట్‌ఫ్లిక్స్ |
మూలాలు
[మార్చు]- ↑ Cr, Sharanya. "Ritwika to play an RJ in her next". The Times of India. Archived from the original on 3 July 2015. Retrieved 27 September 2015.
- ↑ "Complete list of Filmfare awards (Tamil)". Sify. Archived from the original on 2 November 2015. Retrieved 27 September 2015.
- ↑ Balachandran, Logesh. "Rajini sir appreciated my act and I got emotional". The Times of India. Archived from the original on 29 September 2015. Retrieved 27 September 2015.
- ↑ Riythvika is the new ghost in town Archived 8 సెప్టెంబరు 2018 at the Wayback Machine. Deccan Chronicle (22 September 2017).
- ↑ Excited to play Janaki in MGR biopic: Riythvika Archived 10 సెప్టెంబరు 2018 at the Wayback Machine. The Times of India (18 January 2018). Retrieved 10 October 2018.
- ↑ "An eye on good films – Chennai – The Hindu". The Hindu. 5 November 2014. Archived from the original on 10 August 2020. Retrieved 27 September 2015.
- ↑ "'Sigai' movie review: A whodunit that over-emphasises its message". The New Indian Express. Archived from the original on 16 April 2021. Retrieved 16 April 2021.
- ↑ "Episode 4 – Riythvika and Aishwarya Dutta's fun chat show". Zee5.com. 19 August 2019. Retrieved 17 December 2020.