కబాలి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కబాలి
దర్శకత్వంపా. రంజిత్
రచనపా. రంజిత్
నిర్మాతఎస్. థాను
తారాగణం
ఛాయాగ్రహణంజి. మురళి
కూర్పు
సంగీతంసంతోష్ నారాయణన్
నిర్మాణ
సంస్థ
వి క్రియేషన్స్
పంపిణీదార్లుజెమినీ ఫిల్మ్ సర్క్యూట్
విడుదల తేదీ
2016 జూలై 1 (2016-07-01)[1]
దేశంభారతదేశం
భాషతమిళం

కబాలి 2016లో విడుదలయిన తమిళ భాషా చిత్రం. సినిమాకు రంజిత్ కుమార్ రచన, దర్శకత్వం చేపట్టాడు. చిత్రంలో రజనీకాంత్, దినేష్ రవి నటించారు. సినిమా చిత్రీకరణ 2015 ఆగస్టు 21న చెన్నైలో ప్రారంభం కాగా ప్రధానంగా చిత్రీకరణ మలేసియా,[2] బ్యాంకాక్, హాంగ్ కాంగ్ లలో జరుపుకుంది.[3][4][5]

కథ[మార్చు]

మలేషియా, కౌలాలంపూర్ లో జరిగిన గ్యాంగ్ వార్ లో అరెస్ట్ అయిన మాఫియా డాన్ కబాలి(రజనీ కాంత్). 25 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించిన కబాలి విడుదలవుతున్నాడంటూ, ప్రభుత్వం, పోలీస్ శాఖలు అలర్ట్ అవుతాయి. తిరిగి గ్యాంగ్ వార్ మొదలుపెట్టవద్దని కబాలికి చెప్పి విడుదల చేస్తారు. కానీ మలేషియాలో మగ్గిపోతున్న భారతీయుల కోసం పోరాటం చేసే కబాలి బయటకు రాగనే అక్కడి పరిస్థితులను చూసి మరోసారి పోరాటం మొదలు పెడతాడు. డ్రగ్స్ అమ్ముతూ, అమ్మాయిలను ఇబ్బంది పెట్టే 43 గ్యాంగ్ తో యుద్ధం ప్రకటిస్తాడు.

కబాలి రాకకోసం ఎదురుచూస్తున్న 43 గ్యాంగ్ లీడర్ టోని లీ (మలేషియా నటుడు విన్స్ స్టన్ చావో) తన అనుచరుడు వీరశంకర్ (కిశోర్) సాయంతో కబాలిని చంపేందుకు ప్రయత్నాలు మొదలు పెడతాడు. ఈ ప్రయత్నాల నుంచి కబాలి ఎలా బయటపడ్డాడు..? అసలు కబాలి డాన్ గా ఎందుకు మారాడు..? అతని కుటుంబం ఏమైంది..? చివరకు టోని లీ కథను కబాలి ఎలా ముగించాడు..? అన్నదే మిగతా కథ.

సంభాషణలు[మార్చు]

  • రజినీకాంత్: (పంజరాలలో బంధించబడిన పక్షులను చూస్తూ) నువ్వు చూపే ఈ జాలి కంటే, మృత్యువే వాటికి ఆనందాన్నిస్తుంది.
  • నాజర్: ఏది ధర్మం? ఏది నీతి? మనకు ఏది కావాలో అదే ధర్మం! అదే నీతి!!
  • రజినీకాంత్: Do you think I am blackmailing you? No, I am fighting for our rights. And if you think I am blackmailing you, yes, I will!!
  • రజినీకాంత్: నువ్వు చనిపోయావని అందరు...
రాధికా ఆప్టే: చనిపోయే ఉన్నాను, మిమ్మల్ని చూసే వరకు

చిత్ర విశేషాలు[మార్చు]

  • చిత్రంలో తైవాన్ నటుడు వింస్టన్ చావో ప్రతినాయకుడుగా నటించగా ప్రతినాయకుడికి కుడిభుజంగా మలేషియన్ నటుడు రోసియం నటించాడు.
  • మలేషియాలో జరిగిన చిత్రీకరణకు అవసరమైన విలాసవంతమైన కార్లను మలేషియాలో ఉన్న అభిమానులు అందించారు. ఆడియో విడుదలరోజున కార్ల యజమానులు సినిమా పోస్టర్లు, కార్లతో రోడ్ షో ప్రదర్శించారు.
  • చిత్రం ప్రీ రిలీజ్ సమయంలోనే చిత్రం 200 కోట్ల వసూల్ సాధించి నూతన రికార్డ్ సృష్టించింది.
  • చిత్రం అంతర్జాతీయంగా 10,000 ధియేటర్లలో విడుదల చేయబడుతుంది.చైనాలో మాత్రం 5,000 ధియేటర్లలో ప్రదర్శించబడుతున్న మూడవభాతరతీయ చిత్రంగా కబాలి ప్రత్యేకత సంతరించుకుంది. ఇతర రెండు చిత్రాలు పి.కె., బాహుబలి:ద బిగినింగ్.
  • చైనీస్, మలై, తాయ్, జపానీస్ భాషలలో విడుదల చేయబడుతున్న మొదటి తమిళ చిత్రంగా ఈ చిత్రానికి ప్రత్యేకత ఉంది.
  • చిత్రం మొదటి ప్రదర్శన చూడడానికి బెంగుళూరు నుండి చెన్నైకు వచ్చే అభిమానులకు బెంగుళూరు నుండి చెన్నైకు విమానసేవ ఏర్పాటు చేయబడింది. ఇందు కొరకు ఎయిర్ ఆసియాతో చిత్రనిర్మాతలు ఒప్పందం కుదుర్చుకున్నారు. చిత్రం చూడడానికి వచ్చే అభిమానులకు చిత్రం టికెట్, భోజనం, తదితర వసతులు చేయబడ్డాయి.
  • వర్ధన అనే అమ్మాయి కథానాయకుడు రజనీకాంత్‌కు దుస్తుల రూపకల్పన చేసింది. కథానాయకుని దుస్తులకు అవసరమైన వస్త్రాలు లండన్‌లో కొనుగోలు చేయబడ్డాయి. మలేషియాలో జరిగిన చిత్రీకరణకు అవసరమైన స్పోర్ట్ దుస్తులు సహజత్వం కొరకు మలేషియాలో కొనుగోలు చేయబడ్డాయి.
  • కబాలి అనే ఆప్ సృష్టించి అందులో చిత్రవిశేషాలు అందించారు.
  • అమెజాన్ ద్వారా కబాలికీ చైనులు, మైనపు బొమ్మలు విక్రయించడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తుంది.
  • ఐరోపా‌లోనే అతిపెద్ద దియేటర్‌గా భావించబడుతున్న " ది గ్రాండ్ రెక్స్ " దియేటర్‌లో ప్రదర్శించబడిన రెండవ భారతీయ చిత్రంగా కబాలి ప్రత్యేకత సంతరించుకుంది.
  • కబాలి చిత్రం విడుదల ఔతున్న మొదటి రోజున బెంగుళూరు, చెన్నైలోని కొన్ని ఐ.టి. సంస్థలు ఉద్యోగులకు సెలవు ప్రకటించడం ఒక ప్రత్యేకత.
  • కొన్ని సంస్థలు ఉద్యోగుల కుటుంబాలకు కబాలి చిత్ర టిక్కెట్లు అందజేసాయి.
  • పాండిచేరి డెఫ్యూటీ గవర్నర్ కిరణ్ బేడి గృహాలలో మరుగుదొడ్లు నిర్మించుకున్నవారి కుటుంబాలకు కబాలి చిత్రానికి టిక్కెట్లు అందించి ప్రోహించడం విశేషం.
  • డ్రగ్స్ నుండి సురక్షితంగా ఉండటానికి కబాలి స్కూల్‌లో చేరిన డ్రగ్స్‌కు బానిసైన అమ్మాయి మీనాగా రిత్విక నటిస్తుంది. తరువాత, కబాలి ఆమెను తన కుమార్తెగా దత్తత తీసుకుంటాడు.

మూలాలు[మార్చు]

  1. "Rajinikanths Kabali to Release on July 1: Sources - NDTV Movies". NDTVMovies.com. Archived from the original on 20 మే 2016. Retrieved 13 May 2016.
  2. Jyothsna (21 August 2015). "SUPERSTAR'S KABALI COMMENCES ..." Behindwoods. Archived from the original on 23 ఆగస్టు 2015. Retrieved 22 August 2015.
  3. "Pa Ranjith's Tamil film with Rajinikanth titled Kabali". Hindustan Times. IANS. 17 August 2015. Archived from the original on 22 ఆగస్టు 2015. Retrieved 22 August 2015.
  4. "Rajinikanth's next film is 'Kabali'". The Hindu. IANS. 17 August 2015. Retrieved 22 August 2015.
  5. "Rajinikanth's 159th film titled 'Kabali'". The Indian Express. 17 August 2015. Retrieved 22 August 2015.
"https://te.wikipedia.org/w/index.php?title=కబాలి&oldid=4139342" నుండి వెలికితీశారు