Jump to content

కిరణ్ బేడీ

వికీపీడియా నుండి
(కిరణ్ బేడి నుండి దారిమార్పు చెందింది)
Kiran Bedi
24th Lieutenant Governor of Pondicherry
In office
28 మే 2016 (2016-05-28) – 16 ఫిబ్రవరి 2021 (2021-02-16)
Chief MinisterV. Narayanasamy
అంతకు ముందు వారుA. K. Singh
తరువాత వారుTamilisai Soundararajan (additional charge)
Director General of Bureau of Police Research and Development
In office
2005 (2005)–2007 (2007)
Police Adviser and Director of United Nations Police
In office
2003 (2003)–2005 (2005)
వ్యక్తిగత వివరాలు
జననం
Kiran Peshawaria

(1949-06-09) 1949 జూన్ 9 (వయసు 75)
Amritsar, East Punjab, India
పౌరసత్వంIndian
రాజకీయ పార్టీBharatiya Janata Party
ఇతర రాజకీయ
పదవులు
National Democratic Alliance
జీవిత భాగస్వామి
Brij Bedi
(m. 1972; died 2016)
[1]
సంతానం1
తల్లిదండ్రులు
  • Prakash Lal Peshawaria
  • Prem Lata
బంధువులుAnu Peshawaria (Sister), Tek Chandra Arora
నివాసంNew Delhi
చదువుSacred Heart Convent School
Cambridge College
కళాశాలS.R. Govt. College (BA Hons.)
(MA)
Delhi University (LL.B.)
IIT Delhi (Ph.D.)
పురస్కారాలు

కిరణ్ బేడీ, భారతదేశపు మొట్టమొదటి ఐ.పి.ఎస్.అధికారిణి. 1972 బ్యాచ్‌కు చెందిన కిరణ్ బేడీ పోలీసు శాఖలో అనేక పదవులు చేపట్టి, అనేక సంస్కరణలు చేపట్టి, మెగసెసె అవార్డుతో సహా పలు అవార్డులను పొందినది. బ్యూరో అఫ్ పోలీస్ రీసెర్చి అండ్ డెవెలప్‌మెంట్ డైరెక్టర్ జనరల్ గా పనిచేస్తూ 2007 డిసెంబరులో స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకొంది.[2] స్థానికంగా అమృత్‌సర్ లోనే విద్యాభాసం కొనసాగించింది. 1968-70లో రాజనీతి శాస్త్రంలో పంజాబ్ విశ్వవిద్యాలయం, చండీగఢ్ నుంచి ఎం.ఏ.పట్టా పొందింది. ఉద్యోగంలో చేరిన తరువాత 1988లో ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో డిగ్రీ పట్టా పొందింది. 1993లో ఢిల్లీ ఐ.ఐ.టి. పి.హెచ్.డి. పట్టాను ప్రధానం చేసింది. కిరణ్ బేడీ చిన్న వయస్సులో మంచి క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. గతంలో అఖిల భారత టెన్నిస్ టైటిల్ ను, ఆల్ ఏషియన్ టెన్నిస్ టైటిల్‌ను గెలుపొందింది. 22 ఏళ్ళ వయసులో ఏషియా మహిళల టైటిల్ ను గెలుపొందింది. 1972లో జూలైలో మొట్టమొదటి ఐ పి యస్ గా ఎన్నికైైంది.1973 జనవరి 26న జరిగిన రిపబ్లిక్ డే పెరేడ్ సందర్భంగా మొట్టమొదట మహిళా ఐ పి యస్ ను చూసిన ప్రజలు ఆనందాశ్చర్యాలకి లోనయ్యారు. ఆ మరుసటిరోజే అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఈమెను అల్పాహారానికి ఆహ్వానించింది.1982లో ప్రధాని ఇందిరాగాంధీ కారుని ప్రవేశంలేని చోట ఆపివుంచిన కారణంతో క్రేన్ సహాయంతో అక్కడనుండి తీయించింది. ఆసమయాన ఆమె చూపిన కర్తవ్యనిర్వాహణపట్ల ముగ్డులైన ప్రజలు ఆమెను క్రేన్ బేడి అని పిలిచేవారు. 1987లో నవజ్యోతి, 1994లో ఇండియావిజన్ పౌండేషన్ అనే రెండు స్వచ్ఛంద సంస్థలను ఏర్పరిచారు.

జీవితం తొలి దశ

[మార్చు]

కిరణ్ బేడీ పంజాబ్లో అమృతసర్లో 1949 జూన్ 9న జన్మించింది. ఈమె తల్లిదండ్రులు ప్రకాష్ లాల్ పేష్వారియా , ప్రేమ్ లత. ఈమెకు ముగ్గురు సోదరులు ఉన్నారు. వారిలో ఈమె రెండవ కుమార్తె. కిరణ్ బేడీ అమృత్‌సర్ లోని ఖాల్సా మహిళల కళాశాలలో రాజనీతి శాస్త్రంలో ఉపన్యాసకురాలిగా (లెక్చరర్) జీవితం ప్రారంభించింది. (1970-72) . 1972లో ఆమె ఇండియన్ పోలీస్ సర్వీసుకు ఎంపైకైంది. ఢిల్లీలో ట్రాఫిక్ పోలీస్ కమీషనర్‌గా, మిజోరంలో డిప్యూటీ ఇన్స్‌పెక్టర్ జనరల్ ఆప్ పోలీస్‌గా, చంఢీగఢ్ లెప్టినెంట్ గవర్నర్ సలహాదారునిగా, ఐక్యరాజ్య సమితి లోనూ పనిచేసింది. ఢిల్లీ ట్రాపిక్ పోలీస్ కమీషనర్ గా ఉన్నప్పుడు రోడ్లపై ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించిన కార్లను క్రేన్లతో పారద్రోలి క్రేన్ బేడీగా ప్రసిద్ధి చెందింది. తీహారు జైలులో పలు సంస్కరణలు ప్రవేశపెట్టి అందరి మన్ననలను పొందింది. వాటి ఫలితంగా ప్రభుత్వ సర్వీసు రంగంలో రామన్ మెగసెసె అవార్డు పొందింది.

ఆత్మకథ

[మార్చు]
నవజ్యోతి ఇండియా ఫౌండేషన్

1972 జులై 16న భారత పోలీస్‌ వ్యవస్థలోనే సంచలనం చోటు చేసుకుంది. దేశ చరిత్రలోనే తొలిసారిగా ఒక మహిళ ఐపీఎస్‌ ఆఫీసర్‌గా బాధ్యతలు స్వీక రించింది. అమృత్‌సర్‌కు చెందిన కిరణ్‌ బేడి ఈ ఘనత సాధించి చరిత్ర సృష్టించింది. పంజాబ్‌ విశ్వవిద్యాలయం నుండి రాజనీతి శాస్త్రంలో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసిన కిరణ్‌ బేడి ఢిల్లీ ఐఐటీ సోషల్‌ సైన్సెస్‌ విభాగం నుండి డాక్టర్‌ను పూర్తి చేసింది. ఢిల్లీ డిప్యూటీ కమీషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ (ట్రాఫిక్‌) గా ధైర్యసాహసాలతో తన బాధ్యతలను నిర్వహించింది. 9 వేల మంది ఖైదీలున్న తీహార్‌ జైలకు బదిలీ అయ్యాక అక్కడ ఖైదీల పట్ల సేవాదృ క్పథాన్ని ప్రదర్శించింది. ఎన్నో సంస్కరణలు చేసింది. ఈమె సేవలకు గుర్తింపుగా 1994లో రామన్‌ మెగసెసే అవార్డు లభించింది. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శికి పౌర పోలీస్‌ సలహాదారుగా నియమింపబడిన తొలి మహిళ కిరణ్‌ బేడీనే కావడం విశేషం. కిరణ్‌ బేడీ. ‘ఐ డేర్‌’ పేరుతో తన ఆత్మకథను రాసుకుంది.

సాధించిన అవార్డులు

[మార్చు]
  • 1979: రాష్ట్రపతి గ్యాలెంటరీ అవార్డు
  • 1980: విమెన్ ఆప్ ది ఇయర్ అవార్డ్
  • 1991: మత్తుపదార్థాల నివారణ, నిర్మూలన వారి ఆసియా స్థాయి అవార్డు
  • 1994: మెగ్సేసే అవార్డు (ప్రభుత్వ రంగంలో)
  • 1995: మహిళా శిరోమణి అవార్డు
  • 1995: లయన్ ఆప్ ది ఇయర్ అవార్డు
  • 1999; ప్రైడ్ ఆప్ ఇండియా అవార్డు
  • 2005: మదర్ థెరీసా జాతీయ స్మారక అవార్డు (సాంఘిక న్యాయం)

మూలాలు

[మార్చు]
  1. "Kiran Bedi's Husband Brij Bedi Passed Away in Gurgaon". The New Indian Express. 31 January 2016. Archived from the original on 2 February 2016.
  2. http://www.eenadu.net/district/districtshow1.asp?dis=delhi Archived 2007-12-31 at the Wayback Machine తీసుకున్న తేది 27.12.2007

బయటి లింకులు

[మార్చు]