రాధిక ఆప్టే

వికీపీడియా నుండి
(రాధికా ఆప్టే నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
రాధిక ఆప్టే
రక్త చరిత్ర చిత్రంలో రాధిక ఆప్టే
జననం
రాధిక ఆప్టే

(1985-09-07) 1985 సెప్టెంబరు 7 (వయసు 39)
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2005– ఇప్పటి వరకు
జీవిత భాగస్వామిబెనెడిక్ట్ టేలర్ (2012– ఇప్పటి వరకు)

రాధిక ఆప్టే ఒక భారతీయ నటి. స్వతహాగా మరాఠీ నటి అయినప్పటికీ కొన్ని తెలుగు, హిందీ సినిమా లలో నటించింది.

నేపధ్యము

[మార్చు]

వీరిది సినిమాలతో సంబంధం లేని కుటుంబం. వీరి నాన్న గారు చారుదత్ ఆప్టే ఒక్క పుణేలోనే కాదు... మహారాష్ట్ర అంతటా పేరున్న నరాల వైద్యుడు. అమ్మ జయశ్రీ ఆప్టే పేరున్న మత్తు మందు వైద్యనిపుణురాలు. ఈమె, ఇద్దరు తమ్ముళ్ళు - మొత్తం ముగ్గురు సంతానం. ఈవిడ లండన్‌లో నృత్యం నేర్చుకుని రంగస్థలం మీద నటిస్తూ, అటు నుంచి మరాఠీ రంగానికీ, హిందీ సినీ రంగానికీ పరిచయమయ్యింది. ఈవిడ సినిమాలు చూసి, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సహాయకులెవరో చెప్పడంతో, ఆయన ‘రక్తచరిత్ర’ సినిమాకు ఆడిషనింగ్‌కు పిలిచారు.తర్వాత అందులో ఎంపికై రక్తచరిత్ర సినిమాలో నటించింది[1].

రంగస్థల నటన

[మార్చు]

సినిమాలలోకి రాకముందే 2002 నుండి రంగస్థల నటిగా కొనసాగుతున్నది. మరాఠీ, హిందీ, ఇంగ్లీషుల్లో ప్రయోగాత్మక నాటకాలలో నటించింది. వీరి సొంత ఊరు పుణేలో చాలా నాటక సంస్థలతో కలసి పనిచేసింది. ముఖ్యంగా 'ఆసక్త ' అనే రంగస్థల బృందంతో ఎక్కువగా పనిచేసింది. పుణేలోని 'బాల గంధర్వ ' లాంటి ప్రసిద్ధ వేదికలపై ప్రదర్శనలిచ్చింది.

నటించిన చిత్రాలు

[మార్చు]

తెలుగు

[మార్చు]

హిందీ

[మార్చు]

బెంగాలీ

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "ఆ ఫొటోలు నావి కావు!". Sakshi.com. 11 March 2015. Retrieved 2015-03-11.

బయటి లంకెలు

[మార్చు]

ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో రాధిక ఆప్టే పేజీ