Jump to content

రెడ్డిపాలెం (గుడ్లవల్లేరు)

అక్షాంశ రేఖాంశాలు: 16°17′42″N 81°07′02″E / 16.294960°N 81.117335°E / 16.294960; 81.117335
వికీపీడియా నుండి

"రెడ్డిపాలెం" కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

రెడ్డిపాలెం
—  రెవెన్యూయేతర గ్రామం  —
రెడ్డిపాలెం is located in Andhra Pradesh
రెడ్డిపాలెం
రెడ్డిపాలెం
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°17′42″N 81°07′02″E / 16.294960°N 81.117335°E / 16.294960; 81.117335
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం గుడ్లవల్లేరు
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 521 331
ఎస్.టి.డి కోడ్ 08674

సమీప గ్రామాలు

[మార్చు]

గుడివాడ, పెడన, హనుమాన్ జంక్షన్, మచిలీపట్నం

గ్రామానికి రవాణా సౌకర్యాలు

[మార్చు]

గుడ్లవల్లేరు, పామర్రు నుండి రోడ్దురవాణా సొకర్యం ఉంది. రైల్వేస్టేషన్ విజయవాడ 56 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలు

[మార్చు]

మందల పరిషత్తు పాఠశాల

గ్రామములోని మౌలిక సదుపాయాలు

[మార్చు]

వృద్ధుల సంరక్షణ కేంద్రం:- ఈ కేంద్రం కొత్తఢిల్లీకి చెందిన ఆల్ ఇండియా ఉమెన్స్ కాంఫరెన్స్ [ఎ.ఐ.డబ్ల్యూ.సి] సంస్థ ఆర్థిక సొజన్యంతో స్థానిక ప్రియదర్శిని మహిళా మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసారు. పిల్లల ఆదరణ కరవిన 25 మంది వృద్ధ మహిళలకు ఇక్కడ ఉచిత భోజన,వసతి సౌకర్యం కలుగజేయుచున్నారు. ఈ కేంద్రాన్ని గ్రామానికి చెందిన శ్రీమతి కానూరి విజయలక్ష్మి ఏర్పాటు చేసారు. [2]

గ్రామ పంచాయతీ

[మార్చు]

ఈ గ్రామం వడ్లమన్నాడు గ్రామ పంచాయతీలోని ఒక శివారు గ్రామం.

గ్రామంలోని దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

[మార్చు]

శ్రీ అభయాంజనేయస్వామివారి ఆలయం

[మార్చు]

ఈ ఆలయం, వేమవరం కొండలమ్మ అమ్మవారి ఆలయానికి దత్తత ఆలయం. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం, హనుమజ్జయంతి వేడుకలు వైభవంగా నిర్వహించెదరు. హనుమజ్జయంతి రోజు రాత్రికి, స్వామివారి కళ్యాణంం కన్నులపండువగా నిర్వహించెదరు. అనంతరం స్వామివారి గ్రామోత్సవం నిర్వహించెదరు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించెదరు. విచ్చేసిన భక్తులకు అన్నదానం నిర్వహించెదరు. [1]

శ్రీ అంకమ్మ తల్లి ఆలయం

[మార్చు]

గ్రామములోని మోదుగుమూడి వంశస్థుల ఇలవేలుపు అయిన ఈ అమ్మవారి వార్షిక జాతర మహాఒత్సవాన్ని, 2017,జూన్-14వతేదీ బుధవారం నుండి 18వతేదీ ఆదివారం వరకు వైభవంగా నిర్వహించెదరు. బుధవారంనాడు అమ్మవారిని కృష్ణానదిలో స్నానం చేయించడం, గ్రామోత్సవం, గురువారంనాడు వంశీయులతో సుడికపిరి బాండవలో అన్నంవేయడం, శుక్రవారంనాడు అమ్మవారి కళ్యాణం, శనివారంనాడు జలబిందెల కార్యక్రమం నిర్వహిస్తారు. [3]

గ్రామంలో ప్రధాన పంటలు

[మార్చు]

వరి, కూరగాయలు, అపరాలు

గ్రామంలో ప్రధాన వృత్తులు

[మార్చు]

వ్యవసాయం

మూలాలు

[మార్చు]

వెలుపలి లింకులు

[మార్చు]

[1] ఈనాడు అమరావతి; 2015,మే-13; 2వపేజీ. [2] ఈనాడు అమరావతి; 2015,ఆగస్టు-31; 26వపేజీ. [3] ఈనాడు అమరావతి/గుడివాడ; 2017,జూన్-14; 1వపేజీ.