రేష్మా గాంధీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రేష్మా గాంధీ
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ (1974-12-16) 1974 డిసెంబరు 16 (వయసు 49)
అహ్మద్‌నగర్, మహారాష్ట్ర
బ్యాటింగుకుడిచేతి బ్యాటింగ్
పాత్రవికెట్ కీపర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 54)1999 జూన్ 26 - ఐర్లాండ్ తో
చివరి వన్‌డే1999 జూలై 11 - ఇంగ్లాండ్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ మహిళల వన్డే
మ్యాచ్‌లు 2
చేసిన పరుగులు 122
బ్యాటింగు సగటు 61.00
100లు/50లు 1/0
అత్యుత్తమ స్కోరు 104*
వేసిన బంతులు
వికెట్లు
బౌలింగు సగటు
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు
అత్యుత్తమ బౌలింగు
క్యాచ్‌లు/స్టంపింగులు 1/1
మూలం: CricketArchive, 2020 మే 8

రేష్మా గాంధీ మహారాష్ట్రకు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారిణి. వన్డే అంతర్జాతీయ క్రికెట్ లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది.[1] కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్, వికెట్ కీపర్ గాగా రాణించింది. వికెట్ కీపర్‌గా రెండు అంతర్జాతీయ వన్డేలు ఆడిన రేష్మా, అజేయ సెంచరీ కూడా చేసింది.[2]

జననం[మార్చు]

రేష్మా గాంధీ 1974, డిసెంబరు 14న మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌లో జన్మించింది.[3]

క్రికెట్ రంగం[మార్చు]

1999 జూన్ 26న మిల్టన్ కీన్స్ వేదికగా ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్ తో అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టింది.[4] ఐర్లాండ్‌లో ఐర్లాండ్ మహిళల క్రికెట్ జట్టుతో జరిగిన వన్డేలో మిథాలీ రాజ్‌తో కలిసి 258 పరుగుల భాగస్వామ్యాన్ని చేసింది. ఇందులో రేష్మా 104 పరుగులు చేయగా, మిథాలీ అజేయంగా 114 పరుగులు చేసింది.[5] అరంగేట్రం మ్యాచ్‌లో సెంచరీ చేసిన ఐదుగురు మహిళా క్రికెటర్లలో గాంధీ ఒకరు.

1999 జూలై 11న నాటింగ్‌హామ్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్ లో చివరిసారిగా ఆడింది. ఇందులో 18 పరుగులతో నాటౌట్ గా నిలిచింది.[6]

మూలాలు[మార్చు]

  1. "R Gandhi". CricketArchive. Retrieved 2023-08-01.
  2. "R Gandhi". Cricinfo. Retrieved 2023-08-01.
  3. "Reshma Gandhi Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-08-01.
  4. "IND-W vs IRE-W, India Women tour of England 1999, Only ODI at Milton Keynes, June 26, 1999 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-01.
  5. Kumar, Abhishek (2015-12-03). "Mithali Raj: 37 interesting facts about India's best batswoman". Cricket Country. Retrieved 2023-08-01.
  6. "IND-W vs ENG-W, India Women tour of England 1999, 3rd ODI at Nottingham, July 11, 1999 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-01.