రొమేనియాలో హిందూమతం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అభిజ్ఞానశాకుంతలం కు జార్జ్ కోస్‌బక్ చేసిన అనుసరణ. 1897లో ప్రచురితం.

రొమేనియాలో హిందూమత చరిత్ర చాలా తక్కువ. అయితే చాలా మంది ప్రముఖ రోమేనియన్ మేధావులకు హిందూమతంపై ఆసక్తి ఉండేది. 1989 రొమేనియన్ విప్లవం నుండి ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ కృష్ణ కాన్షియస్‌నెస్ (ఇస్కాన్) పని ద్వారా కొంతమంది హిందూమతం లోకి మారారు. హరే కృష్ణ భక్తులు దేశవ్యాప్తంగా ఉచిత ఫుడ్ ఫర్ లైఫ్ కార్యక్రమానికి, ఇతర సాంస్కృతిక ఉత్సవాలకూ ఆహారాన్ని అందిస్తారు. ప్రతి సంవత్సరం హరే కృష్ణ భక్తులు నిర్వహించే జగన్నాధ రథయాత్రలో వేలమంది ప్రజలు పాల్గొంటారు.

1989 నుండి

[మార్చు]

డివైన్ లైఫ్ సొసైటీ, వేదాంత సొసైటీకి బుకారెస్ట్‌లో లోటస్ పేరుతో ఒక ప్రచురణ సంస్థ ఉంది. వారు వేద తత్వశాస్త్రం ( వివేకానంద, రామచారక, కృష్ణానంద ) పుస్తకాలను ప్రచురిస్తారు. డివైన్ లైఫ్ సొసైటీ నాయకుడు గౌరవ సభ్యుడు ఎ. రుస్సు, భారతదేశంలోని రిషికేశ్‌లో ఉన్న ప్రధాన కార్యాలయానికి జవాబుదారీగా ఉంటారు. [1]


అతీంద్రియ ధ్యానం చాలా సంవత్సరాల నుండే రోమానియాలో ఉంది. నికోలే సీసెస్కు పాలనలో దీన్ని నిషేధించారు. కానీ విప్లవం తర్వాత, మేధావులలో మళ్లీ అభివృద్ధి చెందింది. బుకారెస్ట్, క్లజ్-నపోకాల్లో ఇద్ బలంగా ప్రాచుర్యంలో ఉంది . [1]

ఇస్కాన్ బుకారెస్ట్, టిమిసోరాలో చిన్న సంఘాలను ఏర్పాటు చేసింది. టిమిసోరా లోని పాలిటెక్నికల్ ఇన్‌స్టిట్యూట్‌లో నెలవారీ సమావేశాలను నిర్వహిస్తారు. [1]


థియోసాఫికల్ సొసైటీ, ఆంత్రోపోసోఫికల్ సొసైటీ బుకారెస్ట్, టిమిసోరా, క్లజ్‌లలో ఉన్నాయి. వారు తమను తాము ఈ పేర్లతో అరుదుగా పిలుచుకుంటారు. వారు తమను తాము "పారా-సైకలాజికల్ రీసెర్చ్ గ్రూపులు" అని పిలుచుకుంటారు. వారి నమ్మకాలు చాలా సమకాలీనమైనవి, తూర్పు దేశాల నమ్మకాలతో చేస్తాయి. [1]

సత్యసాయిబాబా భక్తులు రొమేనియాలో కూడా ఉన్నారు. [1]

రొమేనియాలో భారతీయులు

[మార్చు]

ప్రస్తుతం రొమేనియాలో సుమారు 1000 మంది భారతీయులు నివసిస్తున్నారు, వారిలో ఎక్కువ మంది బుకారెస్ట్, టిమిసోరాలో ఉన్నారు . [2]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 1.4 Valea 1993
  2. [1]