రోను తుఫాను

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Roanu style="border-left:1px solid #AAAAAA; width:24px;background: #00faf4
text-align
center;" | TS
Roanu Geostationary VIS-IR 2016.png
Satellite image

JTWC io0116.gif
Forecast map
Current storm status
Cyclonic storm (IMD)
Current storm status
Tropical storm (1-min mean)
As of: 08:30 IST (03:00 UTC) 20 May
Location: 18°00′N 84°12′E / 18.0°N 84.2°E / 18.0; 84.2 (Roanu)

About 40 km (25 mi) SSE of Kalingapatnam
About 360 km (225 mi) SSW of Paradip

Winds: 75 km/h (45 mph) sustained (3-min mean)
85 km/h (50 mph) sustained (1-min mean)
gusting to 90 km/h (55 mph)
Pressure: 992 hPa (mbar; 29.29 inHg)
Movement: NE at 25 km/h (16 mph)
colspan=3 style="text-align:center;background: #00faf4
" | See more detailed information.

రోను తుఫాను (Cyclone Roanu) బంగాళాఖాతంలో యేర్పడిన తుఫాను. దీని ఫలితంగా భారతదేశం తూర్పు ప్రాంతాల్లో నష్ఠం సంభవించినది. 2016 ఉత్తర హిందూ మహాసముద్రంలోతుఫాను మొట్టమొదటిది. ఈ తుఫాను శ్రీలంక దక్షిణ ప్రాంతంలో అల్పపీడన ద్రోణితో ప్రారంభమైనది. ఇది క్రమంగా ఉత్తర దిశగా ప్రయాణించి తుఫానుగా పరిణమించింది. ఈ తుఫాను ప్రారంభ దశలో ఉన్నపుడు శ్రీలంకలో సుమారు 58 మంది మరణాలు సంభవించినవి. ఈ తుఫాను ఫలితంగా భారతదేశంలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలొ భారీ వర్షాలు సంభవించాయి. రానున్న 25-48 గంటలలో ఒడిశా, పశ్చిమ బెంగాల్ లో కూడా వర్షాలు సంభవించె అవకాశం ఉంది. ఈ తుఫాను బంగ్లాదేశ్ తీరాన్ని చివరికి దాటే అవకాశం ఉంది.[1]

తుఫాను చరిత్ర[మార్చు]

Storm path

మే 14, 2016న బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడింది.[2][3] ఇది ఏకీకృతమైనప్పటికీ మే 17 న క్షీణిస్తుందని భారత వాతావతణ సంస్థ భావించింది.[4] మే 17 సాయంత్రం "జాయింట్ టైఫూన్ వార్నింగ్ సెంటర్" ద్వారా "ట్రాపికల్ సైక్లోన్ ఫార్మేషన్ అలర్ట్" ఈ వాయుగుండం తుఫానుగా పరిణమిస్తుందని ప్రకటించారు.[5][6] తరువాత రోజు ఐ.ఎం.డి ఈ తుపాను ఉదృతమగునని ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాలకు హెచ్చరికలు జారీచేసింది. [7] మే 19న ఐ.ఎం.డి ఈ తుఫాను తీవ్రమైనదిగా భావించి దానికి "రోను" గా నామకరణం చేసింది.[8]

ఆంధ్రప్రదేశ్ లో ప్రభావం[మార్చు]

బంగాళాఖాతంలో మొదలైన "రోను" తుఫాను కోస్తాంధ్రపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో కోస్తా జిల్లాల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసాయి. ముఖ్యంగా నెల్లూరు, గూడూరు, కావలి, నాయుడుపేట ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ నమోదయింది. ప్రకాశం, కృష్ణా, ఉభయగోదావరి, విశాఖ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీవర్షాలు కురుస్తున్నాయి. విశాఖకు 110 కి.మీ, కాకినాడకు 60 కి.మీ దూరంలో రోను తుఫాన్ ఉందని అధికారులు అంటున్నారు. తీరం వెంబడి 90 కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయి. [9] ఆంధ్రప్రదేశ్‌ తీరంపై తుఫాను తీవ్రత తగ్గింది. బంగాళాఖాతంలో ఆంధ్రప్రదేశ్‌ తీరానికి సమాంతరంగా కదులుతున్న రోను.. తుఫాను వేగాన్ని పుంజుకుంది. వేగంగా ఒడిశా తీరవైపు కదులుతుండటంతో ఆంధ్రప్రదేశ్‌ తీరం పరిధిలో దీని ప్రభావం తగ్గింది. ప్రస్తుతం కళింగపట్నంకు దక్షిణ ఆగ్నేయంగా 40 కిలోమీటర్ల దూరంలో స్థిరంగా కదులుతోంది. గంటకు 17 కిలోమీటర్ల వేగంతో.. ఉత్తర ఈశాన్యంగా ఒడిశా తీరం వైపు పయనిస్తోంది. మందస్తు అంచనాల ప్రకారం ఇవాళ ఉదయం 5.30గంటలకు ఏపీ తీరంలోనే తీవ్ర తుఫానుగా మారుతుందని భావించారు. అయితే ఇది.. ఈ రాత్రికి ఒడిశా తీరంలో తీవ్ర తుఫానుగా మారనుందని వాతావరణశాఖ అంచనావేస్తోంది. తుపాను ప్రభావంతో ఉత్తరకోస్తా, గోదావరి జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. గడచిన 24 గంటల్లో కళింగపట్నంలో 15, విశాఖలో 8, మచిలీపట్నంలో 7, అమలాపురం, కాకినాడ, నర్సాపురం, ఒంగోలులో 6 సెం.మీ, గన్నవరం, బాపట్ల, తునిలో 3 సెంంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. [10]

మూలాలు[మార్చు]

 1. Singh, Charan. "Bulletin no. 12 for Cyclonic Storm Roanu". India Meteorological Department. Retrieved 19 May 2016.
 2. "Tropical Weather Outlook". India Meteorological Department. Retrieved 14 May 2016.
 3. "All India Weather Summary and Forecast Bulletin, Night of 14 May 2016". India Meteorological Department. Retrieved 14 May 2016.
 4. Yadav, B. P. "Special Tropical Outlook for the North Indian Ocean issued at 0600 UTC of 17 May 2016". India Meteorological Department. Retrieved 17 May 2016.
 5. "Current Significant Tropical Weather Advisories ABIO10 (Indian Ocean) reissued at 18 May 2016, 0030 UTC". Joint Typhoon Warning Center. Retrieved 18 May 2016.
 6. "Tropical Cyclone 01B (One) Warning #01 Issued on 18 May 2016 at 0900 UTC". Joint Typhoon Warning Center. Retrieved 18 May 2016.
 7. B.P. Yadav (18 May 2016). "Deep Depression BOB 01 Warning Bulletin 5 issued on 18 May 2016". India Meteorological Department. p. 1. Retrieved 18 May 2016.
 8. Kotal, S. D. "Cyclonic Storm Roanu, Bulletin No. 9 issued at 0300 UTC, 19 May 2016". India Meteorological Department. Retrieved 19 May 2016.
 9. కాకినాడకు 90 కిలోమీటర్ల దూరంలో 'రోను' తుఫాను శుక్రవారం, 20 మే 2016
 10. నిమ్మ‌ళించిన రోను తుఫాను

ఇతర లింకులు[మార్చు]

 • 01B.ROANU from the U.S. Naval Research Laboratory