లక్ష్మీశ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జి. లక్ష్మీశ
జననం1984
హోలుగుండనహళ్లి, కర్ణాటక రాష్ట్రం , భారతదేశం
సుపరిచితుడు/
సుపరిచితురాలు
ఐ.ఎ.ఎస్ ఆఫీసర్
జీవిత భాగస్వామిజ్ఞానేశ్వరి
పిల్లలుఆద్వీ, సిద్ధార్థ చక్రవర్తి
తల్లిదండ్రులు
  • గంగముత్తయ్య (తండ్రి)
  • లక్ష్మమ్మ (తల్లి)

జి.లక్ష్మీశ 2013 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి. ఆయన సివిల్ సర్వీసెస్ - 2013 ఫలితాల్లో 275వ ర్యాంకును సాధించాడు. లక్ష్మీశ ప్రస్తుతం గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.[1]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

లక్ష్మీశ 1980లో కర్ణాటక రాష్ట్రం, హోలుగుండనహళ్లిలో గంగముత్తయ్య, లక్ష్మమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన డిగ్రీలో బీఎస్సీ అగ్రికల్చర్‌ పూర్తి చేసి డిగ్రీ అయ్యాక అలహాబాద్‌ జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌ రావడంతో ఎమ్మెస్సీ పూర్తి చేసి, ఢిల్లీలో పీహెచ్‌డీ పూర్తి చేశాడు. ఇండియన్‌ అగ్రికల్చర్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌లో సీనియర్‌ ఫెలోషిప్‌ రావడంతో అగ్రికల్చర్‌ యూనివర్సిటీలో శాస్త్రవేత్తగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించాడు.[2]

వృత్తి జీవితం

[మార్చు]

లక్ష్మీశ 2009లో సివిల్స్‌ రాసినా ఫలితం దక్కలేదు, తిరిగి 2010లో ఐఎఫ్‌ఎస్‌కు ఎంపికై, హిమాచల్‌ ప్రదేశ్‌ క్యాడర్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ ఆఫీసర్‌గా పోస్టింగ్‌ అందుకున్నాడు. ఆయన సర్వీసులో చేరిన తాను ఆశించిన స్థాయి ఫలితం రాలేదనే కసితో మళ్లీ సివిల్స్ కు ప్రిపేర్‌ అయి నాలుగో ప్రయత్నంలో 2013లో 275వ ర్యాంకు సాధించి ఐఏఎస్‌గా ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు ఎంపికయ్యాడు. లక్ష్మీశ ఐఏఎస్‌గా కర్నూలు జిల్లాలో శిక్షణ పూర్తి చేసుకొని తొలి పోస్టింగ్ కృష్ణా జిల్లా నూజివీడు సబ్‌ కలెక్టర్‌గా పని చేశాడు. ఆయన తర్వాత పార్వతీపురం ఐటీడీఏ పీవోగా, తూర్పు గోదావరి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా, తరువాత గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.

నిర్వహించిన భాద్యతలు
  1. కృష్ణా జిల్లా నూజివీడు సబ్‌ కలెక్టర్‌
  2. పార్వతీపురం ఐటీడీఏ పీవో [3]
  3. తూర్పు గోదావరి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ - 28 జూన్ 2019 నుండి వరకు 24 అక్టోబర్ 2021 [4][5]
  4. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) కమిషనర్‌
  5. తిరుపతి జిల్లా కలెక్టరు [6]

మూలాలు

[మార్చు]
  1. Andrajyothy (30 October 2021). "జీవీఎంసీ కమిషనర్‌గా డాక్టర్ లక్ష్మీశ". Archived from the original on 14 నవంబరు 2021. Retrieved 14 November 2021.
  2. Sakshi Education (5 November 2021). "పేపర్‌బాయ్‌ టూ 'ఐఏఎస్‌'..సెలవుల్లో పొలం పనులే..." Archived from the original on 14 నవంబరు 2021. Retrieved 14 November 2021.
  3. Sakshi (30 January 2019). "అన్నదాత ఇంట ఐఏఎస్‌". Archived from the original on 14 నవంబరు 2021. Retrieved 14 November 2021.
  4. The Hans India (29 June 2019). "G Lakshmisha assumes charge as East Godavari Joint Collector" (in ఇంగ్లీష్). Archived from the original on 14 నవంబరు 2021. Retrieved 14 November 2021.
  5. Eenadu (24 October 2021). "జేసీ లక్ష్మీశ బదిలీ". Archived from the original on 14 నవంబరు 2021. Retrieved 14 November 2021.
  6. "21 IAS Officers transferred in Andhra Pradesh, IAS Dr G Lakshmisha appointed Tirupati Collector" (in అమెరికన్ ఇంగ్లీష్). 2024-01-30. Retrieved 2024-02-08.
"https://te.wikipedia.org/w/index.php?title=లక్ష్మీశ&oldid=4113744" నుండి వెలికితీశారు