Jump to content

లాయర్ విశ్వనాథ్

వికీపీడియా నుండి
లాయర్ విశ్వనాథ్
(1978 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎస్.డి.లాల్
నిర్మాణం వై.వి.రావు
కథ ముక్తా ఘాయ్
చిత్రానువాదం రాం కేల్కర్
తారాగణం నందమూరి తారక రామారావు ,
జయసుధ
సంగీతం కె. చక్రవర్తి
సంభాషణలు గొల్లపూడి మారుతీరావు
ఛాయాగ్రహణం పి. దేవరాజ్
కూర్పు డి రాజగోపాలరావు
నిర్మాణ సంస్థ రవి చిత్ర ఫిల్మ్స్
భాష తెలుగు

లాయర్ విశ్వనాథ్ 1978, నవంబరు 17న విడుదలైన తెలుగు చలనచిత్రం. ఎస్.డి.లాల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నందమూరి తారక రామారావు , జయసుధ నటించారు.[1] రవి చిత్ర ఫిల్మ్స్ నిర్మాణ సంస్థ [2] పై వై.వి.రావు నిర్మించాడు.[3] సత్యం సంగీతం సమకూర్చాడు.[4] ఈ చిత్రం విశ్వనాథ్ (1978) అనే హిందీ చిత్రానికి రీమేక్.[5]

విశ్వనాథ్ (ఎన్.టి.రామారావు) ఒక మధ్యతరగతికి కుటుంబీకుడు. పబ్లిక్ ప్రాసిక్యూటరుగా పనిచేస్తూంటాడు. అత్యాచారం, హత్య ఆరోపణలపై పారిశ్రామికవేత్త జిఎన్‌కె (ప్రభాకర్ రెడ్డి) కుమారుడు ప్రభు (శరత్ బాబు), అతని అనుచరుడు షక్కా (శ్రీలంక మనోహర్) కు జీవిత ఖైదు వేయిస్తాడు. జిఎన్‌కె కూడా అన్ని రకాల నేర కార్యకలాపాలకు పాల్పడే అండర్‌వరల్డ్ డాన్ అని నగరంలో చాలామందికి తెలియదు. ప్రతీకారం తీర్చుకోవడం కోసం, అన్ని రకాల పన్నాగాలనూ పన్ని, విశ్వనాథ్‌ను లంచం కేసులో ఇరికించి, స్వల్పకాలిక జైలు శిక్ష పడేలా చేస్తాడు. అతను విడుదలై, ప్రతీకారం తీర్చుకోవాలని నిశ్చయించుకుని, చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకొని, జిఎన్‌కె వ్యాపార ప్రయోజనాలపై క్రమపద్ధతిలో దాడి చేయడం మొదలుపెడతాడు. తద్వారా జిఎన్‌కెకు వ్యతిరేకంగా యుద్ధాన్ని మొదలు పెడతాడు, ఈ పనిలో అతడికి కచేరీ కొండయ్య (సత్యనారాయణ) సహాయం చేస్తాడు.

నటీనటులు

[మార్చు]
  • ఎన్.టి.రామారావు_ లాయర్ విశ్వనాథ్
  • జయసుధ_ గీత
  • రాజనాల_ లాయర్ డి. పి.రావు
  • ప్రభాకరరెడ్డి_ జి . ఎన్. కె
  • అల్లు రామలింగయ్య_ పక్షిరాజు సీతారామయ్య " పక్షి"
  • త్యాగరాజు
  • ధూళిపాళ_ జడ్జి
  • కన్నడ ప్రభాకర్ _ జగ్గు
  • కైకాల సత్యనారాయణ_ కచేరి కొండయ్య
  • కాంతారావు_ కమలాకర్
  • ముక్కామల_ రాఘవయ్య
  • రమణమూర్తి_ లాయర్ వర్మ
  • రంగనాథ్_ భాస్కర్
  • శరత్ బాబు_ ప్రభు
  • శ్రీలంక మనోహర్_ షక్క
  • సాక్షి రంగారావు_ జానీ జాలయ్య
  • రామ్ మోహన్_ కంటి డాక్టర్
  • మాడా వెంకటేశ్వరరావు_ హిప్నాటిజర్
  • కె.వి.చలం_ వరహాల శెట్టి
  • బాలకృష్ణ_ కొండయ్య అనుచరుడు
  • పొట్టి ప్రసాద్_ జైలు వార్డెన్
  • కె.కె.శర్మ_ పూజారి
  • పండరీబాయి_ శాంతమ్మ
  • కవిత_ గౌరి
  • పుష్పకుమారి.

సాంకేతిక వర్గం

[మార్చు]

1.దర్శకుడు: ఎస్.డి.లాల్

2.నిర్మాత: వై.వి.రావు

3.నిర్మాణ సంస్థ: రవి చిత్ర ఫిలిమ్స్

4.సంగీతం: చెళ్లపిళ్ల సత్యం

5.కధ: ముక్తా ఘాయి

6.మాటలు: గొల్లపూడి మారుతీరావు

7.పాటలు: ఆరుద్ర, సి.నారాయణరెడ్డి, వేటూరి సుందరరామమూర్తి

8.నేపథ్య గానం: ఎస్.పి .బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, ఎస్ జానకి, ఎం.రమేష్

9.చిత్రానువాదం: రాం కేల్కర్

10.స్టంట్: మాధవన్

11.కొరియోగ్రఫీ: బి.హీరాలాల్

12.ఫోటోగ్రఫి: దేవరాజ్

13.కూర్పు: డి.రాజగోపాల్

14.కళ: చలం

15.విడుదల:17:11:1978.

పాటలు

[మార్చు]
క్రమసంఖ్య పేరుగాయనీ గాయకులు నిడివి
1. "పిలిచే పిలిచే"  పి. సుశీల 4:30
2. "షరాబీ"  ఎస్. జానకి 3:41
3. "రాముడెప్పుడో"  ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం 3:59
4. "కలకాలం"  పి. సుశీల, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం 3:52
5. "భం భం భం"  పి. సుశీల, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం 5:30

మూలాలు

[మార్చు]
  1. తెలుగు గ్రేట్ ఆంధ్ర. "సినీ స్నిప్పెట్స్‌: ఎన్టీయార్‌తో గొల్లపూడి అనుభవాలు". telugu.greatandhra.com. ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (మార్చి 2016). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 3 November 2017.
  2. "Lawyer Viswanath (Banner)". Chitr.com.[permanent dead link]
  3. "Lawyer Viswanath (Director)". Spicy Onion. the original నుండి 2020-07-12 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2020-08-11.
  4. "Lawyer Viswanath (Cast & Crew)". Know Your Films.[permanent dead link]
  5. "Lawyer Viswanath (Review)". The Cine Bay.[permanent dead link]