లిజ్ ట్రస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ది రైట్ హానరబుల్
ఎలిజబెత్ ట్రస్
పార్లమెంటు సభ్యురాలు (యునైటెడ్ కింగ్‌డమ్)
అధికారిక చిత్రం, 2022
యునైటెడ్ కింగ్‌డమ్ ప్రధాన మంత్రి
Assuming office
6 సెప్టెంబరు 2022
చక్రవర్తిఎలిజబెత్ II
Succeedingబోరిస్ జాన్సన్
కన్సర్వేటివ్ పార్టీ నాయకుడు
Assumed office
5 సెప్టెంబరు 2022
అంతకు ముందు వారుబోరిస్ జాన్సన్
విదేశీ, కామన్వెల్త్ , అభివృద్ధి వ్యవహారాల శాఖ కార్యదర్శి
Assumed office
15 సెప్టెంబరు 2021
ప్రధాన మంత్రిబోరిస్ జాన్సన్
అంతకు ముందు వారుడొమినిక్ రాబ్
మినిస్టర్ ఫర్ వుమెన్ అండ్ ఈక్వాలిటీస్
Assumed office
10 సెప్టెంబరు 2019
ప్రధాన మంత్రిబోరిస్ జాన్సన్
అంతకు ముందు వారుఅంబర్ రూడ్
  • అంతర్జాతీయ వాణిజ్యానికి రాష్ట్ర కార్యదర్శి
  • బోర్డు ఆఫ్ ట్రేడ్ ప్రెసిడెంట్
In office
24 జులై 2019 – 15 సెప్టెంబరు 2021
ప్రధాన మంత్రిబోరిస్ జాన్సన్
అంతకు ముందు వారులియామ్ ఫాక్స్
తరువాత వారుఅన్నే-మేరీ ట్రెవెల్యన్
చీఫ్ సెక్రటరీ టు ది ట్రెజరీ
In office
11 జూన్ 2017 – 24 జులై 2019
ప్రధాన మంత్రిథెరిసా మే
అంతకు ముందు వారుడేవిడ్ గౌకే
తరువాత వారురిషి సునక్
  • సెక్రెటరీ ఆఫ్ స్టేట్ ఫర్ జస్టిస్
  • లార్డ్ ఛాన్సలర్
In office
14 జులై 2016 – 11 జూన్ 2017
ప్రధాన మంత్రిథెరిసా మే
అంతకు ముందు వారుమైఖేల్ గోవ్
తరువాత వారుడేవిడ్ లిడింగ్టన్
పర్యావరణ, ఆహారం , గ్రామీణ వ్యవహారాల రాష్ట్ర కార్యదర్శి
In office
15 జులై 2014 – 14 జులై 2016
ప్రధాన మంత్రిడేవిడ్ కామెరాన్
అంతకు ముందు వారుఓవెన్ ప్యాటర్సన్
తరువాత వారుఆండ్రియా లీడ్సమ్
పార్లమెంటరీ అండర్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ చైల్డ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్
In office
4 సెప్టెంబరు 2012 – 15 జులై 2014
ప్రధాన మంత్రిడేవిడ్ కామెరాన్
అంతకు ముందు వారుసారా టీథర్
తరువాత వారుసామ్ గైమా
పార్లమెంట్ సభ్యురాలు, సౌత్ వెస్ట్ నార్ఫోక్
Assumed office
6 మే 2010
అంతకు ముందు వారుక్రిస్టోఫర్ ఫ్రేజర్
మెజారిటీ26,195 (50.9%)
వ్యక్తిగత వివరాలు
జననం
మేరీ ఎలిజబెత్ ట్రస్

(1975-07-26) 1975 జూలై 26 (వయసు 48)
ఆక్స్‌ఫర్డ్, ఇంగ్లాండ్
రాజకీయ పార్టీకన్సర్వేటివ్ పార్టీ (1996–ప్రస్తుతం)
ఇతర రాజకీయ
పదవులు
లిబరల్ డెమొక్రాట్స్ (1996కి ముందు)
జీవిత భాగస్వామి
హగ్ ఓ లియరీ
(m. 2000)
సంతానం2
చదువుమెర్టన్ కాలేజ్, ఆక్స్‌ఫర్డ్ (బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్)

మేరీ ఎలిజబెత్ ట్రస్ (జననం 1975 జూలై 26) కన్జర్వేటివ్‌ పార్టీ నేతగా, బ్రిటన్‌ ప్రధానిగా 2022 సెప్టెంబరు 5న విజయం సాధించారు.[1] బోరిస్‌ జాన్సన్‌ రాజీనామా తర్వాత జరిగిన కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వ ఎన్నికల్లో తన ప్రత్యర్థి భారత సంతతికి చెందిన రిషి సునాక్‌ను ఓడించి లిజ్ ట్రస్ గెలుపొందింది. ఆమె క్వీన్ ఎలిజబెత్ II ద్వారా యునైటెడ్ కింగ్‌డమ్ ప్రధాన మంత్రిగా 2022 సెప్టెంబరు 6న నియమితులు అయింది. మార్గరెట్‌ థాచర్‌, థెరిసా మే తర్వాత బ్రిటన్‌ పగ్గాలు చేపట్టిన మూడో మహిళా ప్రధానిగా లిజ్‌ ట్రస్ రికార్డు సృష్టించారు.

ఆమె ప్రస్తుతం విదేశీ, కామన్వెల్త్ , అభివృద్ధి వ్యవహారాల స్టేట్ సెక్రటరీగా 2021 నుండి పనిచేస్తోంది. అలాగే 2019 నుండి మహిళలు , సమానత్వ శాఖ మంత్రిగా కూడా ఉంది. 2010 నుండి సౌత్ వెస్ట్ నార్ఫోక్ పార్లమెంటు సభ్యురాలుగా ఉంది. ఆమె మాజి ప్రధానమంత్రులు డేవిడ్ కామెరూన్, థెరిసా మే, బోరిస్ జాన్సన్ ల వద్ద వివిధ క్యాబినెట్ స్థానాల్లో పనిచేసింది.

లిజ్ ట్రస్ ఆక్స్‌ఫర్డ్‌లోని మెర్టన్ కాలేజీలో చదివింది. ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ లిబరల్ డెమోక్రాట్‌లకు అధ్యక్షురాలిగా చేసింది. 1996లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఆమె కన్జర్వేటివ్ పార్టీలో చేరింది. ఆమె షెల్, కేబుల్ & వైర్‌లెస్‌లో పనిచేసింది. థింక్ ట్యాంక్ రిఫార్మ్‌కు డిప్యూటీ డైరెక్టర్‌గా వ్యవహరించింది. 2010 సాధారణ ఎన్నికలలో సౌత్ వెస్ట్ నార్ఫోక్ నుంచి లిజ్ ట్రస్ ఎన్నికయింది. బ్యాక్‌బెంచర్‌ అయిన ఆమె పిల్లల సంరక్షణ, గణిత విద్య , ఆర్థిక వ్యవస్థతో సహా అనేక విధాన రంగాలలో సంస్కరణలకు పిలుపునిచ్చింది. ఆమె ఫ్రీ ఎంటర్‌ప్రైజ్ గ్రూప్ ఆఫ్ కన్జర్వేటివ్ ఎంపీలను స్థాపించింది. ఆఫ్టర్ ది కోయాలిషన్ (2011), బ్రిటానియా అన్‌చెయిన్డ్ (2012)తో సహా అనేక పత్రాలు, పుస్తకాల రచనాసహకారం, రచన చేసింది.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

2000లో లిజ్ ట్రస్ తోటి అకౌంటెంట్ అయిన హ్యూ ఓ లియరీని వివాహం చేసుకుంది.[2] వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.[3]

మూలాలు

[మార్చు]
  1. "UK Prime Minister Election Results 2022 : బ్రిటన్ నూత‌న‌ ప్రధానిగా లిజ్‌ ట్రస్‌.. ఈమె జీవిత ప్ర‌స్థానం ఇదే.. | Sakshi Education". web.archive.org. 2022-09-05. Archived from the original on 2022-09-05. Retrieved 2022-09-05.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "'Ambition greater than ability': Liz Truss's rise from teen Lib Dem to would-be PM". the Guardian (in ఇంగ్లీష్). 2022-07-30. Retrieved 2022-09-06.
  3. "A political affair: We profile cabinet minister Liz Truss". belfasttelegraph (in బ్రిటిష్ ఇంగ్లీష్). ISSN 0307-1235. Retrieved 2022-09-06.