వంశోద్ధారకుడు (1972 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వంశోధ్ధారకుడు
(1972 తెలుగు సినిమా)
దర్శకత్వం పి. సాంబశివరావు
నిర్మాణం ఎ. ఎస్. ఆర్. ఆంజనేయులు
తారాగణం శోభన్ బాబు ,
కాంచన,
ఎస్.వి. రంగారావు,
రావి కొండలరావు,
బేబి డాలీ
సంగీతం ఘంటసాల వెంకటేశ్వరరావు
నిర్మాణ సంస్థ మాధవీ ఆర్ట్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

నటీనటులు[మార్చు]

సాంకేతిక నిపుణులు[మార్చు]

పాటలు[మార్చు]

  1. గుమ్మా గుమ్మన్న లార గుమ్మన్నలారో నా రాస గుమ్మడి - పి.సుశీల - రచన:ఆత్రేయ
  2. ధర్మం చెయ్యండి బాబు దానం చెయ్యండి - ఘంటసాల, ఎస్.జానకి - రచన: దాశరథి
  3. నానీ నా పేరును నిలపాలి నానీ మన వంశం పెరగాలి - ఘంటసాల - రచన: ఆత్రేయ
  4. నువ్వూ నవ్వూ జతగా నేను నువ్వొక కథగా - ఘంటసాల బృందం - రచన: ఆత్రేయ
  5. మురళీలోలుడు ఎవడమ్మా మోహన రూపుడు - సుశీల,ఘంటసాల బృందం - రచన: సినారె
  6. రెండు కళ్ళు వెతుకుతున్నవి మరి రెండుకళ్ళు వెంటపడ్డవి - ఘంటసాల,పి.సుశీల - రచన: ఆత్రేయ
  7. ఎక్కు రాజా కొండెక్కు రాజా కొండపైన స్వామివారు కూర్చున్నాడూ - మాధవపెద్ది, పిఠాపురం, బి.వసంత, విజయలక్ష్మీ కన్నారావు - రచన:కొసరాజు

కథా సంగ్రహం[మార్చు]

ప్రసవ సమయంలో శ్రీనివాసరావు భార్య, పుట్టినబిడ్డ చనిపోతారు. తట్టుకోలేని షాక్‌తో శ్రీనివాసరావు యాక్సిడెంట్ పాలవుతాడు. డాక్టర్లు అతనిక సాంసారిక జీవితానికి పనికిరాడని, పిల్లలు పుట్టరని చెబుతారు. అతడు పైలట్ ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి స్వగ్రామానికి వెడతాడు. ఆ గ్రామంలోని చాకులాంటి కుర్రాడు పైలట్ ఆఫీసర్ అమర్ కుమార్‌తో సన్నిహితం ఏర్పడుతుంది. అమర్ గౌరి అనే అల్లరి పిల్లను ప్రేమిస్తాడు. ఇద్దరూ ఒక వర్షపురోజున కాలు జారుతారు. ఫలితంగా గౌరి గర్భవతి అవుతుంది. ఫారిన్‌లో ఉన్న తన తల్లిదండ్రులకు గౌరిని ప్రేమించిన సంగతి తెలియజేసి పెళ్ళికి వారి అనుమతి తీసుకుంటాడు అమర్. గౌరి తల్లి దండ్రులు కూడా అంగీకరిస్తారు. రిపబ్లిక్ ఉత్సవాలలో పాల్గొనేందుకు అమర్ ఢిల్లీ వెళ్లి తిరిగి వస్తూ విమానప్రమాదంలో మరణిస్తాడు. పెళ్ళి కాకుండానే గర్భవతి ఐన గౌరి ఆ షాకింగ్ న్యూస్ విని ఆత్మహత్యకు పూనుకుంటుంది. శ్రీనివాసరావు ఆమెను కాపాడి ఆమెను కళంకం నుండి కాపాడటానికి పెళ్ళి చేసుకుంటాడు. ఆమెకు పుట్టిన శిశువుకు తండ్రి అవుతాడు. శ్రీనివాసరావు ఆ పసివాడిని తన ప్రాణంలో ప్రాణంగా చూసుకుంటూ వాని తప్పటడుగులలో, బోసినవ్వులలో, చిట్టిచిట్టి మాటలలో లీనమైపోతాడు. ఇంతలో విమాన ప్రమాదంలో మరణించాడనుకున్న అమర్ తిరిగి వస్తాడు. గౌరి శాశ్వతంగా మరణించింది అని గౌరి తల్లి అతనితో అబద్ధం చెబుతుంది. అమర్ అదే ఊళ్ళో ఉంటూ గౌరి కొడుకు నాని ఎవరో తెలియకపోయినా ఆ పసివాడితో అనురాగాన్నీ, ఆప్యాయతనూ పెంచుకుంటాడు. చివరికి ఆ నాని గౌరి కొడుకేనని తెలుసుకుంటాడు. ఆమె శ్రీనివాసరావును పెళ్ళి చేసుకుందని తెలిసి కోపంతో ఆమెను నానామాటలు అంటాడు. అటు అతనికి నిజం చెప్పలేక, ఇటు శ్రీనివాసరావుకు అన్యాయం చేయలేక గౌరి మథనపడుతుంది. చివరకు అమర్ బ్రతికే ఉన్నాడన్న వార్త శ్రీనివాసరావుకు తెలుస్తుంది. తన వంశోద్ధారకుడు అనుకున్న నాని పరాయి వాడు అవుతాడని బాధపడతాడు. చివరికి గౌరిని అమర్ చేతిలో పెట్టడానికి నిర్ణయించుకుంటాడు. ఈలోగా గౌరి, శ్రీనివాసరావులమీద పగబూనిన భుజంగం నానిని కిడ్నాప్ చేసి లక్షరూపాయలు డిమాండ్ చేస్తాడు. తన సర్వస్వాన్ని ఇచ్చేస్తానంటాడు శ్రీనివాసరావు. అయితే నాని తన కొడుకేనని అమర్‌కు తెలుస్తుందా? శ్రీనివాసరావు నానిని అమర్‌కు అప్పాగిస్తాడా? భుజంగం శ్రీనివాసరావు పై ఎందుకు కక్షగడతాడు? గౌరి, అమర్‌లు తిరిగి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారా? మొదలైన ప్రశ్నలకు సమాధానం చివరలో లభిస్తుంది.[1]

మూలాలు[మార్చు]

  1. ఈరంకి. దేశోద్ధారకుడు పాటల పుస్తకం. p. 12. Archived from the original on 20 ఆగస్టు 2020. Retrieved 20 August 2020.

బయటి లింకులు[మార్చు]