Jump to content

వట్టికొండ విశాలాక్షి

వికీపీడియా నుండి
భారతి మాసపత్రిక 1946 జనవరి సంచిక ముఖచిత్రం, వట్టికొండ విశాలాక్షి సుదీర్ఘ కవిత భారతనారి భారతిలో ప్రచురించింది

నలభయవ దశకంలో చైతన్యవంతమైన రచనలు చేసి ప్రసిద్ధి పొందిన రచయిత్రి వట్టికొండ విశాలాక్షి.

ఈమె 1920లోచేబ్రోలు లో జన్మించింది. గుంటూరులో నివాసమున్నది. 1944లో వట్టికొండ రంగయ్యతో వివాహమైంది. ఆమె సుదీర్ఘ కవిత భారతనారి భారతిలో ప్రచురించి, ఉత్తమరచయిత్రిగా పేరు పొందినది. ఆమె ""నిష్కామయోగి"" స్వాతంత్రపోరాటంలో స్త్రీల పాత్రని చిత్రిస్తుంది. ఆమెకృషికి గుర్తింపుగా వట్టికొండ విశాలాక్షి కల్చరల్ ట్రస్టు పురస్కారం ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం ఉత్తమ రచయిత్రులకు పురస్కారం అందజేస్తున్నారు.

"స్వాతంత్రానికి పూర్వం తెలుగు కవయిత్రులు" అన్న వ్యాసంలో కాత్యాయనీ విద్మహే, కందాల శోభారాణి విశాలాక్షిగురించి ఇలా రాసేరు.[1]

అభ్యుదయ సాహిత్య ఉద్యమంతో ముడిపడి తన కవితా శక్తిని వికసింపచేసుకున్న స్త్రీ వట్టికొండ విశాలాక్షి. ఒకవైపు అంతర్జాతీయ కమ్యూనిస్టు తాత్వికత మరొకవైపు దేశీయ స్వాతంత్ర్య ఆకాంక్ష రెండు ఆమె కవిత్వంలో పెనవేసుకొని ఆవిష్కరించబడ్డాయి. 1942 జూలైలో క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైంది. అందులోకి భిన్న వర్గాల ప్రజా సమూహాలను కల్పుకొని రావాలని గాంధీ ఆకాంక్షించాడు. అందులో భాగంగానే జాతీయోద్యమంలోకి స్త్రీల సమీకరణ ఆనాడు ఒక ప్రధాన కార్యక్రమం అయ్యింది. ఆ నేపథ్యంలో వట్టికొండ విశాలాక్షి ప్రబోధం అనే శీర్షికతో ఒక ఖండిక వ్రాసింది.

"స్వాతంత్ర్య పోరాట శక్తిలో సగమైన మహిళా మణుల స్వేచ్ఛ మంటలో గల్పేసి
స్వాతంత్ర్య సమరాన సాగిపోయే రంచు
పురుషలోకానికి బోధ చేయాలి.
స్వేచ్ఛ కావాలంటు స్త్రీలే అడగాలి.
సాహసముతో స్త్రీలే సాగిరావాలి.”

అని స్త్రీల స్వేచ్ఛకు హామీ లభించినపుడే దేశ స్వాతంత్ర్యం సాధ్యమవుతుందన్న దృక్పధాన్ని కనబరిచింది.

స్త్రీలు స్వేచ్ఛ సాధించినపుడే స్వాతంత్ర్య పోరాటం సమర్థవంతంగా సాగుతుందని ముందుగా పురుషులకు అర్థం కావాలి. స్వేచ్ఛ పిపాస స్త్రీలలో సమాంతరంగా అభివృద్ధి చెందాలి. అది విశాలాక్షి ఆకాంక్ష. స్త్రీలను జాతీయోద్యమంలోకి సమీకరించటమేకాదు సామ్రాజ్యవాద వ్యతిరేక యుద్ధంలోకి కూడా వాళ్ళను ఆహ్వానించే చైతన్యం ఆమెది.

“ఫాసిస్టు శత్రువుల పాతిపెట్టాలి
సబలలమేమంచు చాటి చెప్పాలి.”

అన్నది విశాలాక్షి ఆదర్శం. స్త్రీల విముక్తి ఫాసిస్టు వ్యతిరేక ప్రజా ఉద్యమంతో ముడిపడి ఉన్నదని కమ్యూనిస్టుగా విశాలాక్షి నమ్మకం. అందుకనే ఫాసిజాన్ని సర్వనాశనం చేయటం స్త్రీలకు కార్యక్రమంగా ఇచ్చింది ఆమె.

రచనలు

[మార్చు]
  • భారతనారి (దీర్ఘ కవిత)
  • నిష్కామయోగి (నవల)

మూలాలు

[మార్చు]
  1. "వ్యాసం". Archived from the original on 2014-08-18. Retrieved 2014-03-26.

వర్గాలు

[మార్చు]