వర్గం చర్చ:అంతర్వికీ లింకుల్లేని మూసలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వాడుకలో సమస్యలు

[మార్చు]

@చదువరి గారు, మీరు AWB ఖాతా ద్వారా మూసలలో ఈ వర్గాన్ని చేర్చటం వలన ఆ మూసలు వాడిన పేజీలలో తరువాతి పాఠ్యపు వరుస ఖాళీ అక్షరంతో ప్రారంభమై, పాఠ్య రూపంలో సమస్య కలిగిస్తున్నది. అంతే కాక, ఆంగ్లంలో మూస మార్పులకు గురైతే, మరల దిగుమతి చేసినపుడు తాజా పడటలేదు. మానవీయంగా తాజా చేయవలసివస్తున్నది. ఉదాహరణ చేర్పు, సవరణ చూడండి. కావున ఈ చేర్పులను రద్దు చేయండి. ధన్యవాదాలు. అర్జున (చర్చ) 02:07, 25 ఫిబ్రవరి 2022 (UTC)[ప్రత్యుత్తరం]

అసలు సమస్య ఏమిటి?

[మార్చు]

అర్జున గారు పైన లేవనెత్తిన అంశానికి సంబంధించి వివరణ ఇది. కొందరికి ఇదంతా తెలిసే ఉండవచ్చు బహుశా. తెలియని వారి కోసం ఇది రాస్తున్నాను.

అనువాద పరికరం వాడి వ్యాసాలను అనువదించేటపుడు, ఆ పరికరం వలన కలిగే అనేక ప్రయోజనాల్లో ఒకటి, మూసలను ఆటోమాటిగ్గా చేర్చడం. మూల భాష లోని వ్యాసంలో ఒక మూస ఉందనుకోండి.., ఆ మూస తెలుగులోనూ ఉంటే అనువాద పేరికరం మన ప్రమేయమేమీ లేకుండానే ఆ తెలుగు మూసను తెచ్చి అనువాదంలో పెట్టేస్తుంది! కానీ ఈ పని చెయ్యాలంటే, ఆ మూస ఏదో అనువాద పరికరానికి తెలియాలి. ఎలా తెలుస్తుందది? భాషాంతర లింకులు ఉంటే అనువాద పరికరానికి ఈ సంగతి తెలిసిపోతుంది. పేజీకి ఎడమపక్కన ఉన్న పట్టీలో ఈ భాషాంతర లింకులు ఉంటాయి.

అయితే తెవికీలో ఉన్న మూసల్లో దాదాపు 4500 మూసలకు ఈ భాషాంతర లింకుల్లేవు. అంచేత, ఈ మూసలను ఇమిడ్చిన వ్యాసాలను ఇతర భాషల నుండి అనువదించేటపుడు ఈ మూసలు ఆటోమాటిగ్గా అనువాదం లోకి చేరవు. ఆ రకంగా అనువాద పరికరం లోని ఒక ముఖ్యమైన సౌకర్యాన్ని వాడుకోలేకపోతున్నాం. దాన్ని పరిష్కరించడంలో భాగంగా అలాంటి మూసలను ఎంచి ఒక వర్గం లోకి చేర్చాను. తద్వారా వాటికి భాషాంతర లింకులు ఇవ్వవచ్చు.

ఇలా చేర్చడానికి నేను కింది కోడును చేrచాను: <noinclude> [[వర్గం:అంతర్వికీ లింకుల్లేని మూసలు]] </noinclude> దీన్ని చేర్చడంలో పై కోడుకు ముందు అనుకోకుండా ఒక లీడింగ్ న్యూలైన్ కూడా చేర్చాను. దాని వలన కొన్ని మూసల్లో బ్రేక్ వచ్చింది. దాన్ని గమనించి, తగు సవరణలు చేసాను. అయితే ఈ సవరణ సుమారు 2300 వ్యాసాల్లోనే చేసాను. వాటిలో కూడా సమస్యలున్న మూసలు కొన్ని ఉన్నట్లున్నాయి. అంచేత మిగిలిన వాటిని కూడా ఇప్పుడు చేసేసాను. బహుశా ఇక ఆ సమస్య ఉండకపోవచ్చు. ఇంకా ఎక్కడైనా సమస్య కనిపిస్తే నాకు తెలియజేయగలరు.

మూసలపై ఆసక్తి, శ్రద్ధ ఉన్నవారు ఈ వర్గం లోని మూసలకు అంతర్వికీ లింకులు ఇవ్వవలసినదిగా కోరుతున్నాను. __చదువరి (చర్చరచనలు) 03:11, 27 ఫిబ్రవరి 2022 (UTC)[ప్రత్యుత్తరం]

@Chaduvari గారు, మీ స్పందనకు ధన్యవాదాలు. మీరు గమనించిన సమస్యకు చేసిన పనివలన ఇతర సమస్యలు ఏర్పడుతున్నందున అది అంత మంచిది కాదు. మీరు అటువంటి మూసలపై పని జరగాలని గమనించినపుడు, వాటికోసం వర్గం సృష్టించకుండా, ఒక వికీపీడియా పేరుబరి పేజీలో జాబితాను తయారు చేసి, దానిని నిర్వహణకు చేయవలసిన పనుల జాబితాలో చేర్చటమో, లేక నిర్వాహకుల దృష్టికి తెలపటమో మంచిది. లేకుంటే ఇటువంటి వర్గాలను వాటి చర్చాపేజీలలో చేర్చవచ్చు. petscan ద్వారా చర్చపేజీలోని వర్గం ద్వారా దానికి సంబంధించిన వ్యాస పేరుబరిలో జాబితాను పొందవచ్చు. ఈ మూసలకు అంతర్వికీ లింకులు వికీడేటాలో చేర్చే పని ప్రారంభించాను. అర్జున (చర్చ) 11:20, 27 ఫిబ్రవరి 2022 (UTC)[ప్రత్యుత్తరం]
@Arjunaraoc గారూ, న్యూలైను రావడమనే తప్పు జరిగింది కాబట్టి మీరు ఇలా మాట్లాడుతున్నారు గానీ, మీరు చెప్పిన ఇతర పద్ధతులకంటే నేను చేసిన వర్గం లోకి చేర్చడమనేది మెరుగైన పని. కాబట్టి మీరు చెప్పిన పద్ధతులను నేను గుడ్దిగా పాటించను. సందర్భాన్ని బట్టి ఏది మంచిదనుకుంటే అదే చేస్తాను. అయితే, ఏది చేసినా మళ్ళీ ఇలా పొరపాట్లు జరక్కుండా చూసుకుంటాను. ఇకపోతే నిర్వాహకుల దృష్టికి తేవడం సంగతి.. మీరు నిర్వాహకులే, మీ దృష్టికి తెచ్చినా పెద్ద ప్రయోజనం ఉండదు అని నా స్వానుభవం. కాబట్టి నేను మీపై పెద్దగా ఆశలు పెట్టుకోను. __ చదువరి (చర్చరచనలు) 17:30, 27 ఫిబ్రవరి 2022 (UTC)[ప్రత్యుత్తరం]
@Chaduvari గారు, కొత్తగా సమస్య సృష్టిస్తున్న పని ఏ విధంగా మెరుగైనదో వివరిస్తారా? అర్జున (చర్చ) 05:34, 2 మార్చి 2022 (UTC)[ప్రత్యుత్తరం]
@Arjunaraoc గారూ, నాకు తెలిసినవి ఇవి.
  1. మీరు చెప్పిన పద్ధతిలో ఒక పేజీని తయారు చేసి పెడితే, ఏయే మూసల్లో మార్పులు చెయ్యాలో తెలుసుకోవాలంటే కచ్చితంగా ఆ పేజీకే వెళ్ళాలి. కొన్నాళ్ళకు ఆ పేజీ ఎక్కడుందో వెతుక్కోవాల్సి ఉంటుంది. ఆ పేజీని చూడని వాడుకరులకు అదొకటి ఉందన్న సంగతే తెలవదు. నేను చేసిన పద్ధతిలోనైతే
    1. ఏ మూసకు వెళ్ళినా ఆ సంగతి తెలుస్తుంది
    2. ఆ వర్గం పేజీకి వెళ్ళినా తెలుస్తుంది
  2. మీరు చెప్పిన పద్ధతిలో 4500 పేర్లతో పేజీని తయారు చెయ్యడమనేది చాలా పెద్ద పని. పేజీ సరిగ్గా కదలదు. మొత్తం జాబితాను విభాగాలుగా చెయ్యాలి.
  3. వికీపీడియా పేరుబరిలో పట్టిక తయారు చెయ్యాలంటే సోర్సు కోడు వాడాలి. అది విజువల్ ఎడిటరుతో పోలిస్తే కష్టం. పట్టిక చేసాక, దానిలో మార్పులు చెయ్యాలంటే మరీ కష్టం. అంచేత ముందు దాన్ని వాడుకరి పేరుబరిలో (విజువల్ ఎడిటరులో) తయారుచేసి, దాన్ని కాపీ చేసుకుని, ఆపైన వికీపీడియా పేరుబరిలోని పేజీలోకి పేస్టు చేసుకోవాలి.
  4. పై పనులు మానవికంగానే చెయ్యాలి. వర్గం లోకి చేర్చడం మాత్రం AWB తో చేసెయ్యవచ్చు. తేలిక గదా!
నా గత వ్యాఖ్యలోఒకమాట చెప్పాను.. సందర్భాన్ని బట్టి ఏది అనుకూలంగా ఉంటే అది చేస్తాను అని. అంతే తప్ప నేను అనుకున్నదే జరగాలి అని మూర్ఖంగా అనుకోను. ఉదాహరణకు ఒకటి చెబుతాను.. ఇప్పుడు యర్రా రామారావు గారు, నేను తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణ కారణంగా గ్రామాల పేజీల్లో చెయ్యాల్సిన మార్పులను ఒక జాబితా చేసేందుకు సంకల్పించాం (గతంలో మండలాల పేజీల్లో చేసాం). దాదాపు 10 వేల పేర్లతో జాబితా చెయ్యాలి. ఆ డేటాను వర్గంలో పెట్టే వీల్లేదు; ఒక పట్టికలో పెట్టడం తప్ప వేరే మార్గం కనబళ్ళేదు నాకు. అయితే డేటా ఎక్కువ కాబట్టి ఒక పట్టికలో పెట్టలేం. అంచేత 33 పేజీలు తయారుచెయ్యాలని అనుకున్నాం. ఆ పనిని మీరు తేలిగ్గా చేస్తానంటే సంతోషంగా మీకు అప్పగిస్తాం. __ చదువరి (చర్చరచనలు) 08:28, 2 మార్చి 2022 (UTC)[ప్రత్యుత్తరం]
@Chaduvari గారు, మీ వివరణకు ధన్యవాదాలు. డేటా పెద్ద మొత్తంలో వుంటే ఒక పేజీలో చేర్చటం వలన వాడుక సమస్యలు వుంటాయన్నదానిని నేను అంగీకరిస్తాను. అటువంటి పరిస్థితులలో ఒకటి కంటే ఎక్కువ పేజీలు చేయడమే మంచిదనే మీ ఆలోచనను అంగీకరిస్తాను. తెలుగు వికీపీడియా అభివృద్ధి ప్రాధాన్యతల లాంటి విషయాలలో సభ్యుల మధ్య భిన్నాభిప్రాయలు వుండి ఏకాభిప్రాయం కుదరడంలో ఇబ్బందులున్నా, సాంకేతిక సమస్యలకు చర్చల ద్వారా అన్నివిధాల మెరుగైన ఏకాభిప్రాయం కుదరడం సాధ్యమే అని నేను నమ్ముతాను. సాంకేతిక సమస్యలు ఏమైనా రచ్చబండ(సాంకేతికము)లో తెలియచేయండి. నా శక్తికొలది సహాయపడటానికి ప్రయత్నిస్తాను. అర్జున (చర్చ) 06:14, 3 మార్చి 2022 (UTC)[ప్రత్యుత్తరం]

పరిష్కారం పురోగతి

[మార్చు]

వర్గం తొలగించటానికి బాట్ ఆదేశాలు (నమూనా)

[మార్చు]


pwb.py replace -file:"pagestofix.txt" -summary:"అంతర్వికీ లింకు వున్నది కావున" -regex "<noinclude>.?\n\[\[వర్గం:అంతర్వికీ లింకుల్లేని మూసలు]].?\n</noinclude>" ""

pwb.py replace -file:"pagepile.txt" -summary:"అంతర్వికీ లింకు వున్నది కావున" "<noinclude>[[వర్గం:అంతర్వికీ లింకుల్లేని మూసలు]]</noinclude>" ""

pwb.py replace -file:"pagepile.txt" -summary:"అంతర్వికీ లింకు వున్నది కావున" "[[వర్గం:అంతర్వికీ లింకుల్లేని మూసలు]]" ""

మిగిలిన మూసలలో వున్న వర్గం పేరుకు పరిష్కారం

[మార్చు]

@చదువరి గారు, పై విభాగాలలో తెలిపినట్లు 916 మూసలలో ఈ నిర్వహణ వర్గం (వర్గం:అంతర్వికీ లింకుల్లేని మూసలు) చేర్చి వున్నది. ఇవి enwikiలో తొలగించబడిన లేక స్థానికంగా సృష్టించిన మూసలు అయివుంటాయి. వీటిపై జరగవలసిన కృషి గురించి మీ సలహా తెలియచేయండి. --అర్జున (చర్చ) 06:54, 3 మార్చి 2022 (UTC)[ప్రత్యుత్తరం]

@Arjunaraoc గారూ, ఈ పని చేసినందుకు ధన్యవాదాలు. మిగిలిన వాటిలో కొన్నిటిని ర్యాండమ్‌గా ఎన్వికీలో చూసాను.. వాటిని తొలగించారు. ఇక వీటిని ఆ వర్గం నుండి తీసెయ్యడమే మనం చెయ్యాల్సింది. __ చదువరి (చర్చరచనలు) 08:41, 4 మార్చి 2022 (UTC)[ప్రత్యుత్తరం]
@Chaduvari గారు, మీ సలహాకు ధన్యవాదాలు. పని పూర్తయ్యింది. అర్జున (చర్చ) 05:09, 5 మార్చి 2022 (UTC)[ప్రత్యుత్తరం]