వర్గం చర్చ:కలం పేరుతో రచనలు చేసిన ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అక్షరభేదాలుతో రెండు వర్గాలు

[మార్చు]

వర్గం:కలం పేరుతో రచనలు చేసిన ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు , వర్గం:కలం పేరుతో ప్రసిద్ధులైన ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు అనే రెండు వర్గాలు ఉన్నాయి.ఇందులో ఏది ఉంచాలి? ఏది తొలగించాలి?--యర్రా రామారావు (చర్చ) 15:49, 25 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ రెండు వర్గాలను సృష్టించినపుడు వాటి హేతుబద్ధతను నేను ఇలా అనుకున్నాను:
  • కలం పేరుతో ప్రసిద్ధులైన వ్యక్తులు అంటే నా ఉద్దేశం, వారి అసలు పేరు తెలియదు, కేవలం కలంపేరుతోనే ప్రజలకు తెలిసినవారు. ఉదాహరణకు బీనాదేవి (అసలు పేరు భాగవతుల త్రిపుర సుందరి), బాపు (సత్తిరాజు లక్ష్మీనారాయణ).
  • కలం పేరుతో రచనలు చేసిన వ్యక్తులు అంటే కలంపేరుతో రచనలు చేసారు గానీ వాళ్ళు తమ స్వంత పేరుతోనే ప్రసిద్ధులు. ఉదాహరణకు పురాణం సీత (వీరు తన అసలు పేరు పురాణం సుబ్రహ్మణ్య శర్మ గానే ప్రసిద్ధులు). ఈ కారణంగా ఈ రెండు వర్గాలనూ ఉంచాలనేది నా అభిప్రాయం. __చదువరి (చర్చరచనలు) 16:27, 25 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
అయితే ఈ వర్గాల పేర్లు మరీ దగ్గరగా ఉన్నాయని రామారావు గారి సందేహాన్ని బట్టి నాకు అర్థమైంది. నాకూ అలాగే తోస్తోంది కూడా. అంచేత వీటి తేడాను మరింతగా స్ఫురింప జేస్తూ "కలం పేరుతో ప్రసిద్ధులైన ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు" వర్గపు పేరు మారిస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నాను. "కలం పేరుతో మాత్రమే ప్రసిద్ధులైన ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు" అనో, మరో లాగానో మారుద్దామని నా సూచన. పరిశీలించండి. __చదువరి (చర్చరచనలు) 16:46, 25 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]