వలేటి వారిపాళెం
వలేటి వారిపాళెం | |
---|---|
గ్రామం | |
అక్షాంశ రేఖాంశాలు: 15°33′0.036″N 80°5′21.948″E / 15.55001000°N 80.08943000°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం |
మండలం | ఒంగోలు |
అదనపు జనాభాగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | స్త్రీ పురుష జనాభా వివరాలు లేవు |
ప్రాంతపు కోడ్ | +91 ( | )
పిన్‌కోడ్ | 523116 |
వలేటి వారిపాలెం ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం లోని రెవెన్యూయేతర గ్రామం.
పేరువెనుక చరిత్ర
[మార్చు]వలేటి వారి పాలెం అన్న పేరు వలేటి లేక ఓలేటి అన్న ఇంటిపేరు ఆధారంగా వచ్చింది.[1]
సమీప గ్రామాలు
[మార్చు]మద్దిపాడు 13.7 కి.మీ, కొత్తపట్నం 13.9 కి.మీ, సంతనూతలపాడు 16.1 కి.మీ, నాగులుప్పలపాడు 16.5 కి.
మౌలిక సదుపాయాలు
[మార్చు]బ్యాంకులు
[మార్చు]త్రాగునీటి సౌకర్యం
[మార్చు]ఈ గ్రామంలో ఒక శుద్ధజల కేంద్రానికి ఐ.టి.సి.సంస్థ సహకారం అందించింది.
సామాజిక భవనo
[మార్చు]ఈ గ్రామ ఎస్.సి.కాలనీలో 25 లక్షల రూపాయల వ్యయంతో ఐ.టి.సి.సంస్థ నూతనంగా నిర్మించనున్న సామాజిక భవన నిర్మాణానికి, 2015, సెప్టెంబరు-5వ తేదీనాడు శంకుస్థాపన నిర్వహించారు.
సాగు/త్రాగునీటి సౌకర్యం
[మార్చు]గ్రామంలోని త్రాగునీటి చెరువులో, నీరు-చెట్టు కార్యక్రమం క్రింద పూడికతీత పనులు జరుగుచున్నవి.
గ్రామ పంచాయతీ
[మార్చు]- ఈ గ్రామానికి చెందిన శ్రీ మట్టుపల్లి అంజయ్య, 1973లో ఈ గ్రామ పంచాయతీ కార్యాలయంలో స్వీపరుగా రు. 113-00 నెల జీతంతో పనిచేసారు. 1988 నాటికి అటెండరుగా రు. 4,000-00, 1989 లో కాపలాదారుగా రు. 5,000-00 జీతం తీసుకునేవారు. వీరు 2006 పంచాయతీ ఎన్నికలలో, మరో 18 నెలలలో పదవీ విరమణ చేయబోవుచుండగా, గ్రామస్థుల కోరికపై, ఉద్యోగానికి రాజీనామా చేసి, సర్పంచిగా పోటీ చేసి గెలుపొందినారు. గ్రామాభివృద్ధికి తన వంతు తోడ్పడ్డారు. పదవీ కాలం 2011లో ముగియగానే 2012 నుండి మళ్ళీ అదే కార్యాలయంలో ఒప్పంద పద్ధతిలో స్వీపరుగా చేరినారు.
- శ్రీ రుద్రబోయిన కోటేశ్వరరావు, 2001-2006 మధ్య, ఈ గ్రామ సర్పంచిగా పనిచేసారు. ఈయన ఎన్నికలకు డబ్బు ఏమీ ఖర్చు చేయలేదు. ఈయన సర్పంచిగా పనిచేసిన కాలంలో, ప్రభుత్వం నుండి, రు. 60 లక్షల నిధులు మంజూరుచేయించి, గ్రామాబివృద్ధికి పాటుపడినారు.
- 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ నలమోతు శేషగిరిరావు, సర్పంచిగా ఎన్నికైనారు.
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
[మార్చు]శ్రీ కోదండరామస్వామివారి ఆలయం.
ప్రధాన వృత్తులు
[మార్చు]ప్రముఖవ్యక్తులు
[మార్చు]- ఓలేటి వెంకట సుబ్బా నాయుడు
- దివి కొండయ్య చౌదరి
- దివి శివరాం
- దివి తిరుపరి నాయుడు
- ఉప్పుటూరి కొండప్ప నాయుడు
- నర్రా రామ నాయుడు
- రావి అచ్చయ్యనాయుడు: కవి, నాటకకర్త.[2]
గ్రామ విశేషాలు
[మార్చు]ఈ గ్రామం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్పీకర్ గా దివి కొండయ్య చౌదరి1978-82 పనిచేసారు. ఈ గ్రామంలోని ఒక నిరుపేద కుటుంబానికి చెందిన నిడమానూరి ఆంజనేయులు టైలరింగ్ చేయుచూ జీవనం సాగించుచున్నారు. వీరి శ్రీమతి ముత్యాలు భర్తకు కుట్టుమిషన్ లో సాయంగా ఉంటున్నారు. ఈ దంపతుల కుమారుడు సునీల్ కాకినాడలోని ప్రభుత్వ ఆంధ్రా పాలిటెక్నిక్ లో ఇ.సి.ఇ. విభాగంలో డిప్లమా చదివినాడు. అనంతరం 2016 లో ఈ.సెట్. ప్రవేశ పరీక్ష వ్రాయగా మే నెలలో ప్రకటించిన ఆ పరీక్షా ఫలితాలలో ఇతడు రాష్ట్రస్థాయిలో మూడవ ర్యాంక్ సాధించాడు
మూలాలు
[మార్చు]- ↑ యార్లగడ్డ, బాలగంగాధరరావు. "తెలుగువారి ఊళ్ల పేర్లు – ఇంటి పేర్లు – Page 3 – ఈమాట". Retrieved 2018-01-12.
{{cite journal}}
: Cite journal requires|journal=
(help) - ↑ రావి, అచ్చయ్య నాయుడు (1930). అభినవ ఉత్తర గోధనాపహరణము. Retrieved 13 March 2015.