వల్లూరు (టంగుటూరు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వల్లూరు
—  రెవిన్యూ గ్రామం  —
వల్లూరు is located in Andhra Pradesh
వల్లూరు
వల్లూరు
అక్షాంశరేఖాంశాలు: 15°21′N 80°03′E / 15.35°N 80.05°E / 15.35; 80.05
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా ప్రకాశం జిల్లా
మండలం టంగుటూరు
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం
 - పురుషుల సంఖ్య 1,683
 - స్త్రీల సంఖ్య 1,793
 - గృహాల సంఖ్య 931
పిన్ కోడ్ 523272
ఎస్.టి.డి కోడ్ 08598

వల్లూరు, టంగుటూరు, ప్రకాశం జిల్లా, టంగుటూరు మండలానికి చెందిన గ్రామము.[1]

గ్రామ భౌగోళికం[మార్చు]

ఈ గ్రామము, ఒంగోలు పట్టణానికి దక్షిణంగా 8 కి.మీ.దూరంలో జాతీయ రహదారి ప్రక్కన ఉన్నది.బంగాళాఖాతానికి సుమారు 8 కి.మీ దూరములో ఉన్నది.

సమీప గ్రామాలు[మార్చు]

మల్లవరపాడు 2.6 కి.మీ, పాలేటిపాడు 3.1 కి.మీ, తుమ్మడు 3.6 కి.మీ, మర్లపాడు 4.2 కి.మీ, వావిలేటిపాడు 4.8 కి.మీ.

సమీప మండలాలు[మార్చు]

సమీప పట్టణాలు[మార్చు]

జరుగుమిల్లి 7 కి.మీ, టంగుటూరు 8.2 కి.మీ, కొండపి 13.1 కి.మీ, ఒంగోలు 14.9 కి.మీ.

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

వల్లూరు గ్రామానికి రోడ్డు,రైలు రవాణా మార్గాలు అతి సమీపంలో ఉన్నాయి.వల్లూరు గ్రామాన్ని ఆనుకుని జాతీయ రహదారి నెం.5 పోవుచున్నది.ఒంగోలు పట్టణము నుండి కందుకూరు,కావలి,కొండేపి,మడనూరు,చాకిచర్ల మరియు కారుమంచి వంటి తెలుగు వెలుగు బస్సుల ద్వరా అరగంటలో విజయవాడ,గూడురు రైలు సూరారెడ్డిపాలెం రైల్వే స్టేషన్ వల్లూరుకు సుమారుగా కిలోమీటరు దూరంలో కలదు.

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

వల్లూరు గ్రామములో 1 నుండి 5వ తరగతి వరకు ప్రాథమిక పాఠశాల మరియు 6 నుండి 10వ తరగతి వరకు ఉన్నత పాఠశాలలు(హై స్కూల్) ఉన్నాయి.ఉన్నత పాఠశాల పేరును టంగుటూరి ప్రకాశం పంతులు గారి గుర్తుగా ఆంధ్రకేసరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలగా పేరు పెట్టారు.ఒకప్పుడు బడులు పిల్లలతో కలకలలాడేవి.కాని తల్లిదండ్రుల ప్రైవేటు పాఠశాలల వ్యామోహం వలన వీటి భవితవ్యం ప్రమాదంలో పడింది.

గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]

గ్రామంలో దాదాపుగా ప్రతి బజారుకి సిమెంటు రోడ్లు,కరూర్ వైశ్యా బ్యాంక్,ఓవర్ హెడ్ టాంక్,R.O వాటర్ ప్లాంట్ ఉన్నాయి.గ్రామ పరిధిలో Rise Krishna Sai Group of Institution మరియు Pace Institute of technology వంటి కళాశాలలు ఉన్నాయి.

గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం[మార్చు]

వల్లూరు గ్రామానికి పెద్ద చెరువు ఉంది.చెరువుకి తూర్పుగా గ్రామం మరియు పంట పొలాలు విస్తరించి ఉన్నాయి.చెరువుకి పడమరగా మెట్ట భూములు ఉన్నాయి.ఇందులో ఎక్కువగా జామాయిల్,మినప,మిరప వంటివి సాగులో ఉన్నాయి.ఇక్కడే మామిడి తోట కూడా ఉన్నది.చెరువుకి తూర్పుగా ఉన్న మాగాణిలో ఎక్కువగా వరి సాగు చేస్తారు.ఈ సాగు పూర్తిగా చెరువు నీటిపై ఆధారపడి ఉంది.కానీ చెరువు వర్షం వచ్చినపుడు మాత్రమే నిండుతుంది.కావున ప్రతి సంవత్సరం వరి పండదు.ఇక్కడి నేలలు తక్కువ సారవంతమైనవి.

గ్రామ పంచాయతీ[మార్చు]

2013,జులైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీమతి చుండి సుబ్బమ్మ సర్పంచిగా ఎన్నికైనారు. []

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శ్రీ వల్లూరమ్మ దేవస్థానం[మార్చు]

  1. కార్యనిర్వహణాధికారి
  2. వల్లూరమ్మ దేవాలయం ప్రకాశం జిల్లా లోనే కాక నెల్లూరు,గుంటూరు జిల్లాలలో మంచి పేరు కలిగి ఉంది.దసరా,సంక్రాంతి వంటి పండుగలు బాగా జరుపుతారు.

శివాలయం[మార్చు]

శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయం[మార్చు]

శ్రీ షిర్డీ సాయిబాబా మందిరం[మార్చు]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వల్లూరు గ్రామంలో అనేక కులవృత్తులు కలవారు నివసిస్తున్నారు.ఒకప్పుడు బ్రాహ్మణులు ఎక్కువగా ఉండేవారు.కాని వారి పట్టణ వలసల వలన వారి సంఖ్య నేడు తగ్గినది.ఇక వృత్తి కులాలలో చాకలి,మంగలి,కంసాలి,కుమ్మరి వంటి కులాల వారు ఉన్నారు.ఇంకా రెడ్డి,యాదవ,బలిజ,వడ్డెర,మరాఠి,కోమటి శెట్టి,మాల,మాదిగ,సాయిబులు,ఎరుకలు మొదలయిన కులస్తులు గ్రామములో ఎక్కువ మంది వ్యవసాయం మరియు కూలి పనుల మీద ఆధారపడి జీవిస్తున్నారు.కూలి పనులకు సమీప పట్టణమైన ఒంగోలుకు వెళతారు.చాలా మంది పశుపోషణ కూడా జీవనాధారంగా కలిగి ఉన్నారు.

గ్రామ ప్రముఖులు[మార్చు]

  • ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులుగారి సొంత గ్రామం వల్లూరు.వీరి పూర్వీకులు టంగుటూరు నుంచి ఇక్కడకి వలస వచ్చారు.ప్రకాశంగారి బాల్య విద్యాభ్యాసం కొంతకాలం ఇక్కడే గడిచింది.ఈయన గుర్తుగా ఒంగోలు జిల్లాకి,విజయవాడ వద్ద కృష్ణ నదిపై గల బ్యారేజికి ఈయన పేరు పెట్టారు.
  • టంగుటూరి ఆదిశేషయ్య, భక్తకవి, ఉత్తమ ఉపాధ్యాయులు

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 3,476 - పురుషుల సంఖ్య 1,683 - స్త్రీల సంఖ్య 1,793 - గృహాల సంఖ్య 931

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3,391.[2] ఇందులో పురుషుల సంఖ్య 1,687, మహిళల సంఖ్య 1,704, గ్రామంలో నివాస గృహాలు 870 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 2,414 హెక్టారులు.

  • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]

మూలాలు[మార్చు]

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18