తూరుపునాయుడుపాలెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


తూరుపునాయుడుపాలెం
రెవిన్యూ గ్రామం
తూరుపునాయుడుపాలెం is located in Andhra Pradesh
తూరుపునాయుడుపాలెం
తూరుపునాయుడుపాలెం
నిర్దేశాంకాలు: 15°24′N 80°00′E / 15.4°N 80°E / 15.4; 80Coordinates: 15°24′N 80°00′E / 15.4°N 80°E / 15.4; 80 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా, ఒంగోలు రెవిన్యూ డివిజన్
మండలంటంగుటూరు మండలం Edit this on Wikidata
విస్తీర్ణం
 • మొత్తం289 హె. (714 ఎ.)
జనాభా
(2011)
 • మొత్తంString Module Error: Match not found
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 (08592 Edit this at Wikidata)
పిన్(PIN)523272 Edit this at Wikidata

తూరుపునాయుడుపాలెం, ప్రకాశం జిల్లా, టంగుటూరు మండలానికి చెందిన గ్రామం.[1]

సమీప పట్టణాలు[మార్చు]

సింగరాయకొండ 13 కి.మీ, కొత్తపట్నం 16.7 కి.మీ, ఒంగోలు 13 కి.మీ.

గ్రామ ప్రముఖులు[మార్చు]

శ్రీ దామచర్ల ఆంజనేయులు[మార్చు]

ఈ గ్రామానికి చెందిన శ్రీ దామచర్ల ఆంజనేయులు, 1987లో ప్రకాశం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అధ్యక్షులుగా ఉన్నారు. 1990 నుండి తె.దె.పా. జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు. 1994-99 ఎన్నికలలో కొండపి శాసనసభ్యులుగా గెలుపొంది, దేవాదాయ, మార్కెటింగ్, గిడ్డంగుల శాఖా మంత్రిగా పనిచేశారు. విద్యలేకపోయినా వ్యాపార, రాజకీయ రంగాలలో రాణించి, శభాష్ అనిపించుకున్నారు. [2]

శ్రీ దామచర్ల జనార్ధన్[మార్చు]

2014లో నిర్వహించిన శాసనసభ ఎన్నికలలో వీరు ఒంగోలు నియోజక వర్గం నుండి శాసనసభ్యులుగా ఎన్నికైనారు. [3]

శ్రీ బాలవీరాంజనేయస్వామి[మార్చు]

2014లో నిర్వహించిన శాసనసభ ఎన్నికలలో వీరు కొండపి నియోజకవర్గం నుండి శాసనసభ్యులుగా ఎన్నికైనారు. [3]

గ్రామ విశేషాలు[మార్చు]

ఈ గ్రామానికి చెందిన పాలకీర్తి కొండయ్య, వరలక్ష్మి దంపతులు వ్యవసాయ కూలీలు. వీరి కుమారుడు శ్రీను ఖో-ఖో క్రీడపై ఆసక్తితో పంగులూరు వచ్చి ఆ క్రీడలో శిక్షణ పొంది, ఆ క్రీడా పోటీలలో రాణించుచున్నాడు. ఇతడు 2007 నుండి పలు జిల్లా, రాష్త్ర, దక్షిణ భారతదేశస్థాయి, జాతీయపోటీలలో పాల్గొని తన ప్రతిభ ప్రదర్శించాడు. తాజాగా ఇతడు 2016,ఫిబ్రవరి-6 నుండి 9 వరకు, గువాహటి నగరంలో నిర్వహించిన ఆసియా క్రీడా పోటీలలో, 8 దేశాలు పాల్గొన్న ఖో-ఖో పోటీలలో భారతదేశం జట్టు తరఫున పాల్గొన్నాడు. ఈ పోటీలలో ఫైనల్స్ లో భారత్-బంగ్లాదేశ్ జట్ట్లు తలపడగా, ఈ ఆటలో ఇతడు కీలకంగా వ్యవహరించి జట్టు విజయం సాధించి, స్వర్ణపతకం సాధించడానికి కారకుడైనాడు. [4]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 1,913 - పురుషుల సంఖ్య 975 - స్త్రీల సంఖ్య 938 - గృహాల సంఖ్య 507

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1,918.[2] ఇందులో పురుషుల సంఖ్య 983, మహిళల సంఖ్య 935, గ్రామంలో నివాస గృహాలు 485 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 289 హెక్టారులు.

  • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]

మూలాలు[మార్చు]

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18

వెలుపలి లంకెలు[మార్చు]

[2] ఈనాడు ప్రకాశం; 2013,జులై-11; 8వపేజీ. [3] ఈనాడు ప్రకాశం; 2016,జనవరి-10; 7వపేజీ. [4] ఈనాడు ప్రకాశం; 2016,ఫిబ్రవరి-16; 16వపేజీ.