వసుంధర దాస్
వసుంధర దాస్ | |
---|---|
జననం | బెంగళూరు, భారతదేశం | 1977 ఆగస్టు 18
వృత్తి | గాయని, నటి |
క్రియాశీల సంవత్సరాలు | 1998–2012 |
జీవిత భాగస్వామి | రాబర్టో నారాయణ్ (m. 2012) |
వసుంధర దాస్ (జననం 1977 ఆగస్టు 18) భారతీయ గాయని, సంగీత విద్వాంసురాలు, నటి.
ఆమె 2000లో వచ్చిన హే రామ్ (తమిళం/హిందీ), మాన్‌సూన్ వెడ్డింగ్ (ఇంగ్లీష్ 2001), సిటిజన్ (తమిళం 2001), రావణ ప్రభు (మలయాళం 2001), లంకేష్ పత్రికే (కన్నడ 2003) వంటి అనేక చిత్రాలకు నేపథ్య గాయనిగా గుర్తింపుతెచ్చుకుంది.
ఆమె ముధల్వన్ చిత్రానికి గానూ తమిళంలో ఉత్తమ నేపథ్య గాయనిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును గెలుచుకుంది.[1] ఇదే చిత్రం 1999లో తెలుగు అనువాదంగా ఎస్. శంకర్ దర్శకత్వంలో ఒకే ఒక్కడు విడుదలైంది.
వ్యక్తిగత జీవితం
[మార్చు]ఆమె 1977 అక్టోబరు 27న కర్ణాటకలోని బెంగుళూరులో కిషన్ దాస్, నిర్మలా దాస్ దంపతులకు హెబ్బార్ అయ్యంగార్ కుటుంబంలో జన్మించింది. ఆమె బెంగుళూరులోని క్లూనీ కాన్వెంట్ హై స్కూల్, శ్రీ విద్యా మందిర్, మౌంట్ కార్మెల్ కాలేజీలలో చదువుకుంది. ఆమె ఆర్థికశాస్త్రం, గణాంకాలు, గణితశాస్త్రంలో డిగ్రీ పట్టభద్రురాలైంది.[2]
ఆమె ఆరేళ్ల వయసులో తన అమ్మమ్మ ఇందిరా దాస్ వద్ద హిందూస్థానీ శాస్త్రీయ సంగీతంలో శిక్షణ పొందడం ప్రారంభించింది. ఇందిరా దాస్ సంగీత పాఠశాలను నిర్వహించేది. ఆ తర్వాత లలిత కళా అకాడమీలో చేరి పండిట్ పరమేశ్వర్ హెగ్డే దగ్గర వసుంధర దాస్ సంగీత పాఠాలు నేర్చుకుంది. ఆమె కళాశాల రోజుల్లోనే గర్ల్ బ్యాండ్‌కి ప్రధాన గాయని, కళాశాల గాయక బృందంలో సోప్రానో. ఆమె తమిళం, కన్నడ, తెలుగు, ఇంగ్లీష్, మలయాళం, హిందీ, స్పానిష్.. ఇలా ఏ భాష అయినా అనర్గలంగా మాట్లాడుతుంది.[3]
2012లో ఆమె తన చిరకాల స్నేహితుడు, డ్రమ్మర్, పెర్కషనిస్ట్ అయిన రాబర్టో నరైన్‌ని వివాహం చేసుకుంది.[4]
కెరీర్
[మార్చు]నటిగా
[మార్చు]వసుంధర దాస్ తన కెరీర్‌ను ముందుగా ప్లే బ్యాక్ సింగర్‌గా ప్రారంభించింది. అయినా ఆమె 1999లో కమల్ హాసన్‌తో కలిసి హే రామ్ చిత్రంతో నటిగా రంగప్రవేశం చేసింది. ఆమె మలయాళ చిత్రం రావణప్రభు (2001)లో మోహన్‌లాల్‌తో పాటు, తమిళ చిత్రం సిటిజన్ (2001)లో అజిత్ కుమార్‌తో, కన్నడ చిత్రం లంకేష్ పత్రికేలో దర్శన్‌తో కలిసి ప్రధాన నటిగా చేసింది.[5]
ఆమె మీరా నాయర్ చిత్రం మాన్‌సూన్ వెడ్డింగ్ (2001)లో కూడా నటించి మెప్పించింది.[6][7]
సంగీతకారిణిగా
[మార్చు]ఆమె ఎ. ఆర్. రెహమాన్ తమిళ చిత్రం ముధల్వన్‌తో ప్లేబ్యాక్ సింగింగ్ కెరీర్‌ను మొదలుపెట్టింది. ఇందులో ఆమె పాడిన షకలక బేబీ పాటకు గాను 2001లో ఉత్తమ మహిళా నేపథ్య గాయని-తమిళం ఫిల్మ్‌ఫేర్ అవార్డును గెలుచుకుంది. తరువాత ఆమె విజయ భాస్కర్, యువన్ శంకర్ రాజా, జి. వి. ప్రకాష్ కుమార్ వంటి స్వరకర్తలతో కలిసి పనిచేసింది. సంగీత స్వరకర్తగా ఆమె మొదటి చిత్రం 2014లో వచ్చిన పరంతే వాలీ గాలి.[8] ఈ చిత్రం విక్రమ్ ఖజురియాతో కలిసి చేసింది.
ఫిల్మోగ్రఫీ
[మార్చు]Year | Title | Role | Language | Notes |
2000 | హే రామ్ | మైథిలీ అయ్యంగార్ | తమిళం/ హిందీ | తొలి చలనచిత్రం |
2001 | మాన్‌సూన్ వెడ్డింగ్ | అదితి వర్మ | హిందీ/ఇంగ్లీష్ | |
2001 | సిటిజన్ | ఇంధు | తమిళం | |
2001 | రావణప్రభు | ముండకల్ జానకి | మలయాళం | |
2003 | లంకేష్ పత్రికే | ప్రీతి | కన్నడ | |
2003 | ఫిల్మ్ స్టార్ | లీల, ఒక ఖైదీ | హిందీ | |
2004 | వజ్రం | మిధునరాశి | మలయాళం | |
2004 | పత్తర్ బెజుబాన్ | కల్పనా వర్మ | హిందీ | |
2006 | కుడియోం కా హై జమానా | నటాషా | హిందీ | |
2006 | కార్పొరేట్ | ఆమెనే | హిందీ | |
2007 | ఏక్ దస్తక్ | ఆకాంక్ష | హిందీ |
మూలాలు
[మార్చు]- ↑ Santosh (5 February 2017). "47th Annual Filmfare South Best Playback Singer". Archived from the original on 5 February 2017.
- ↑ Venkatesh Koteshwar (25 January 2012). "Vasundhara Das Quietly Weds Robert Narain at 'Namma Bhoomi'". mangalorean.com. Archived from the original on 20 December 2013. Retrieved 20 December 2013.
- ↑ "#UnforgettableOnes: 'Citizen' actress Vasundhara Das". The Times of India. 16 February 2022. Retrieved 13 June 2022.
{{cite web}}
: Cite uses deprecated parameter|authors=
(help) - ↑ Namita Gupta (26 October 2011). "Drum Maaro Drum". raintreemedia.com. Archived from the original on 25 జూన్ 2022. Retrieved 22 June 2022.
- ↑ Digital Native (26 September 2019). "Indrajit Lankesh to direct Hollywood film". The News Minute. Retrieved 28 June 2022.
- ↑ "Monsoon Wedding (2001) - BFI". British Film Institute. 7 May 2017. Retrieved 8 June 2022.
- ↑ "Vasundhara's focus is now music therapy | Deccan Herald". 18 June 2020.
- ↑ Natasha Coutinho (22 January 2014). "Vasundhara Das is busy making music". Deccan Chronicle. Retrieved 14 June 2022.
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with BIBSYS identifiers
- Wikipedia articles with MusicBrainz identifiers
- 1977 జననాలు
- మలయాళ సినిమా నటీమణులు
- భారతీయ మహిళా గాయకులు
- బెంగళూరు సినిమా నటీమణులు
- హిందీ సినిమా నటీమణులు
- తమిళ సినిమా నటీమణులు
- కన్నడ సినిమా నటీమణులు
- భారతీయ సినిమా నటీమణులు
- భారతీయ పాప్ గాయకులు
- భారతీయ రచయిత్రులు
- నేపథ్యగాయకులు
- భారతీయ పర్యావరణ కార్యకర్తలు
- భారతీయ వ్యాపారవేత్తలు
- ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ విజేతలు
- భారతీయ మహిళా సంగీత విద్వాంసులు