Jump to content

వాడుకరి:Narsimhuluyamba/ప్రయోగశాల

వికీపీడియా నుండి
(వాడుకరి:Bharathyamba/ప్రయోగశాల నుండి దారిమార్పు చెందింది)
యంబ నర్సింహులు
Yamba Narsimhulu
జననం (1970-01-30) 1970 జనవరి 30 (వయసు 54)
షోలాపూర్, మహారాష్ట్ర
నివాస ప్రాంతంఆలేరు
జాతీయతభారతీయుడు
వృత్తిపాత్రికేయుడు
ఉద్యోగంసాక్షి (దినపత్రిక)
ప్రసిద్ధికవి, పాత్రికేయుడు
పదవి పేరుస్టాఫ్ రిపోర్టర్, యాదాద్రి భువనగిరి జిల్లా
మతంహిందువు
భార్య / భర్తజగదంబ
పిల్లలుభారతీరాజా, భువన
తల్లిదండ్రులుయాదగిరి, నిర్మల

యంబ నర్సింహులు, తెలంగాణ రాష్ట్రానికి చెందిన పాత్రికేయుడు, కవి. పాత్రికేయుడిగా 30 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న నర్సింహులు ప్రస్తుతం సాక్షి (దినపత్రిక)లో యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ గా పని చేస్తున్నారు.

జననం, విద్య

[మార్చు]

యంబ నర్సింహులు 1970, జనవరి 30న మహారాష్ట్రలోని షోలాపూర్ లో జన్మించారు. యంబ యాదగిరి, నిర్మల దంపతులకు నర్సింహులు మొదటి సంతానం. నర్సింహులు జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాల, కొలనుపాకలో ఎస్.ఎస్.సి.(1985-86), గవర్నమెంట్ జూనియర్ కళాశాల, ఆలేరులో ఇంటర్మీడియట్-సి.ఇ.సి.(1986-88), సికింద్రాబాద్ సర్దార్ పటేల్(ఎస్.పి.) కాలేజీలో బి.ఏ.(1988-91), అంబేద్కర్ విశ్వవిద్యాలయం నుండి సామాజిక శాస్త్రంలో(సోషియాలజీ) ఎం.ఏ.(1998-2000), మాస్ మీడియా కోసం రాయడంలో(రైటింగ్ ఫర్ మాస్ మీడియా) పీ.జీ.డీ. పూర్తి చేసారు.

పాత్రికేయరంగం

[మార్చు]

నర్సింహులు విద్యార్థి దశలో ఉన్ననాటి నుంచే వరంగల్ వాణి, జన ధర్మ(ఆదివారం), తేజ ప్రభ(పక్ష పత్రిక) వంటి పత్రికలకు వ్యాసాలు రాసారు. 1991లో ప్రజాపోరు పత్రికతో పాత్రికేయ వృత్తిలోకి వచ్చిన నర్సింహులు 1992 వరకు ఆలేరు విలేకరిగా, 1993 నుండి 1995 వరకు ఉదయం (పత్రిక)లో రాజాపేట విలేకరిగా, 1996 నుండి 2008 వార్త (పత్రిక)కు - రాజాపేట విలేకరిగా (1996-98 వరకు), ఆలేరు విలేకరిగా(1998-2006 వరకు), జనగాం(వరంగల్ జిల్లా) స్టాఫ్ రిపొర్టర్ గా(2006-2008 వరకు), సాక్షి (దినపత్రిక)లో భువనగిరి ఆర్.సి. ఇంచార్జిగా(2008-2016 వరకు) సేవలందించారు. ప్రస్తుతం సాక్షి తెలుగు దినపత్రికలో యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ గా(2016-ప్రస్తుతం) పని చేస్తున్నారు.

సాహిత్యరంగం

[మార్చు]

నర్సింహులు డిగ్రీలో ఉన్నప్పుడే స్రవంతి, వరంగల్ వాణి, జనధర్మ, ప్రజాపోరు, ఆంధ్రప్రదేశ్ తెలుగు మాసపత్రిక వంటి పత్రికలకు కవితలు, సాహిత్య సాంఘిక వ్యాసాలు రాసారు[1]. 1989 నుండి 1992 వరకు రేడియో ఆకాశవాణి - యువవాణి కేంద్రం, హైదరాబాద్ నుంచి నర్సింహులు కవితలు, వ్యాసాలు, కథలు ప్రసారం అయ్యాయి. 2004లో వార్త దినపత్రికలో ఆలేరు రిపోర్టర్ గా పనిచేస్తున్న సమయంలో "పల్లె గుండెల్లో"[2] కవితా సంపుటిని శ్రీ రామక్రిష్ణ విద్యాలయం, ఆలేరు వేదికగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత శ్రీ ఆచార్య ఎన్. గోపి గారు ఆవిష్కరించారు.

పురస్కారాలు

[మార్చు]
  • వార్త (పత్రిక) ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ గిరీష్ సంఘీ గారి చేతులమీదుగా 2003-04 సంవత్సరానికి గాను నల్లగొండ జిల్లా ఉత్తమ విలేకరి పురస్కారం [3].
  • లయన్స్ క్లబ్ ఆఫ్ ఆలేరు - ఉత్తమ జర్నలిస్ట్ పురస్కారం -2004.
  • శ్రీ కళాతరంగిణి, ఆలేరు - ఉత్తమ జర్నలిస్ట్ పురస్కారం - 2004.
  • డా. దాసరి నారయణరావు కల్చరల్ అసోసియేషన్, ఆలేరు - ఉత్తమ జర్నలిస్ట్ పురస్కారం - 2005.
  • పల్లె గుండెల్లో కవితా సంపుటికి తేజ ఆర్ట్స్ క్రియేషన్స్ వారి అభినందన పురస్కారం[4] - 2006.
  • లయన్స్ క్లబ్ ఆఫ్ జనగాం - ఉత్తమ జర్నలిస్ట్ పురస్కారం - 2007.
  • తెలుగు సాహిత్య కళాపీఠం, హైదరాబాద్ వారిచే రవీంద్రభారతిలో ప్రశంసా పత్రము[5] - 2014.

ఇతర వివరాలు

[మార్చు]
  • ప్రస్తుతం(2019-ప్రస్తుతం) ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్-ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్, జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా ఉన్నారు.
  • 2017 నుంచి 2021 వరకు తెలంగాణ స్టేట్ మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యుడి(పెద్ద పత్రికల ప్రతినిధి)గా సేవలందించారు.
  • ఆలేరు కేంద్ర ప్రాథమిక పాఠశాల విద్యాకమిటీ చైర్మన్ మరియు మండల విద్యా కమిటీ డైరెక్టర్(పదవీ కాలం 2 సంవత్సరాలు)గా 2001-2004 వరకు 2 సార్లు పనిచేసారు.
  • 1994లో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ నల్గొండ జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఉన్నారు.

మూలాలు

[మార్చు]
  1. స్రవంతి, వరంగల్ వాణి, జనధర్మ, ప్రజాపోరు, సైనిక్ సమాచార్, ఆంధ్రప్రదేశ్ తెలుగు మాసపత్రికల్లో ప్రచురితమైన కొన్ని కవితలు
  2. పల్లె గుండెల్లో కవితా సంపుటి పల్లె గుండెల్లో కవితా సంపుటి ఆవిష్కరణ 2004. Retrieved 13 August 2022.
  3. నల్లగొండ జిల్లా ఉత్తమ విలేకరి పురస్కారం
  4. తేజ ఆర్ట్స్ క్రియేషన్స్ వారి అభినందన పురస్కారం
  5. తెలుగు సాహిత్య కళాపీఠం వారిచే రవీంద్రభారతిలో ప్రశంసా పత్రము