Jump to content

వాడుకరి చర్చ:వైజాసత్య/పాత చర్చ 11/పాత చర్చ 6

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

మహాప్రభో!! నాకు నా చర్చా పేజిలు నిక్షిప్తం చేయడడం రావడంలేదు. దయచేసి కొద్దిగా సహాయం చేయండి. --మాటలబాబు 17:24, 26 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

సైజువారీగా వ్యాసాల జాబితా

[మార్చు]

పదికిలోబైట్ల పైన, ఐదు నుండి పది కిలోబైట్లు, రెండు నుండి ఐదు కిలో బైట్లు; ఈ లింకులలో ఉన్న జాబితాలను చూసారా... __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 17:12, 27 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

తయారయిన తర్వాత చూడలేదు. ఈ జాబితాలు మనము వ్యాసాల నాణ్యతపై కేంద్రీకరించి పనిచేయటానికి చాల ఉపయోగపడతాయి. ఇవి చేసినందుకు మీకు ధన్యవాదాలు. జాబితాలను నెలకొకసారి తాజాకరించండి --వైజాసత్య 17:16, 27 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
పది కిలోబైట్లు దాటిన వ్యాసాలు 181 మాత్రమే ఉండటం నన్ను కొంచెం నిరుత్సాహ పరిచినా...వెయ్యి విశేషవ్యాసాల ప్రగతిని కొలవటానికి ఇది మంచి సూచిక..మొదట 10 కిలోబైట్లు దాటిన వ్యాసాలు ఒక వెయ్యి తయారు చేయాలి !! --వైజాసత్య 17:19, 27 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

బొమ్మలు

[మార్చు]

విశ్వామిత్రునికి, కుంభకర్ణునికి, శ్రీకాళహస్తికి బొమ్మలు చేర్చాను. చూశారా? --వైజాసత్య 19:20, 27 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

బొమ్మలు బాగున్నాయి, దన్యవాదాలు, విశ్వామిత్రుడి వ్యాసములొ రవి వర్మ వేసిన బొమ్మలు బాగా అంటించారు, మేనకా మీద రెండు బొమ్మలు ఉన్నాయి. అయితే రెండు బొమ్మలు వ్యాసానికి క్రిందకు వస్తే బాగుంటుందని నాఅభిప్రాయము. రాముడు కి లక్ష్మణుడికి విద్యలు చెప్పే బొమ్మ మరియు బ్రహ్మ బ్రహ్మర్షి అని దీవించిన బొమ్మలు పెడితే బాగుటుందని భావిస్తున్నాను. కుంభకర్ణుడి బొమ్మ భలే పట్టారే, శ్రీకాళహస్తి బొమ్మలు కూడా బాగున్నాయి.--మాటలబాబు 19:27, 27 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
సత్యా గారు మీరు ఏమి రాయడము లేదే!! పని వత్తిడి లొ ఉన్నారా కాసు బాబు గారిని చూసి చాలా రోజులయ్యింది--మాటలబాబు 20:17, 27 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
పర్లేదు పని బాగానే సాగుతుంది. అవును, రెండు మేనక బొమ్మలు క్రిందనే అతికించి, రామలక్షణులతో పాటు ఉన్న బొమ్మను పైన అతికించాలని నాకూ అనిపించింది. ఆ బొమ్మ కోసమే వెతుకుతున్నాను --వైజాసత్య 20:32, 27 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
బొమ్మ నాకు దొరికింది కాని చాలా చిన్న బొమ్మ కాపీ రైటు గురించి తెలియదు,బ్రహ్మ దీవించిన బొమ్మ కూడా దొరికింది కాని అదే పరిస్థితి చిన్న బొమ్మ కాపీరైటు గురించి తెలియదు రెండు బొమ్మలు నలుపు తెలుపు బొమ్మలు--మాటలబాబు 20:36, 27 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
ఆ లింకులు ఇక్కడ అతికించండి చూద్దాం --వైజాసత్య 20:48, 27 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
మరేమి అనుకోవద్దు మరి చిన్న చిన్న బొమ్మలు, నేను వాటిని చూసి గీసి రంగులు వేద్దాము అని అనుకొంటున్నాను. మీరు చూసే ఉంటారు అని భావిస్తున్నాను.

[1] --మాటలబాబు 20:53, 27 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ బ్రహ్మ దీవించిన బొమ్మ ఇంతకంటే మంచిది నాకూ ఎక్కడా కనిపించలేదు. వీలైతే గీసి రంగులు వేయగలిగితే బాగుంటుంది --వైజాసత్య 21:16, 27 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
మీకున్న కార్య దీక్ష కు జోహార్లు--మాటలబాబు 21:35, 27 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

కన్నడ భాష

[మార్చు]

మాటలబాబు సభ్యపేజీలో నీ సందేశం చూశాను. నాకు కన్నడ చదవటం, మాట్లాడటం బాగానే వచ్చు. నేనెలాగైనా ఉపయోగపడగలనా? --నవీన్ 11:10, 28 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

నవీన్, సభ్యుని పేజీలో కన్నడ సభ్యుని పెట్టె ఒకటి పెట్టుకో. త్వరలో చెయ్యాల్సిన పనులు చెబుతా --వైజాసత్య 11:12, 28 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
సత్య గారు నాకు కన్నడ చదవడం, మాట్లాడడమ్, కొద్దిగా రాయడం వచ్చు కాని టైపు ఎంతమాత్రం చేయలేను.నేను మంగళూరు లొ 6 సంవ్త్సరాలు ఉన్నాను. అందుకే ప్రదీప్ గారిని కాపు బీచ్ లొ కలుస్తాను అని అయాననేమో బెంగుళూరు లొ ఉన్నారుట --మాటలబాబు 16:37, 28 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

అక్షరధాం

[మార్చు]

ఈ ఆడియో పైలు కూడా మీరు వింటారని భావిస్తున్నాను,మీ అభిప్రాయాన్ని వెలిబుస్తారని భావిస్తున్నాను--మాటలబాబు 04:35, 9 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

గవాక్షము

[మార్చు]

వైజా సత్యగారూ తెలుగు ఇంగ్లీష్ దిక్షనరీలో చెక్ చేశానండీ గవాక్షము రూపాంతరమే గవాజీ లాగుందడీ.మా తాతగారు ఎక్కువగా గవాక్షము అనే మాట వాడేవారు. t.sujatha 18:20, 28 జూన్ 2007 (UTC)

చెక్ చేసి చెప్పినందుకు కృతజ్ఞతలు --వైజాసత్య 18:33, 28 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
అలా తరిస్తున్న చేత్తోనే ఈ వారం జోక్ అనే పేజిని దయచేసి తొందరగా తొలగించెయ్యండి. చేతి దురద ఏమి చేస్తాం అందుకే రాశాను --మాటలబాబు 19:49, 28 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

సుందరకాండము

[మార్చు]

రామాయణం చేసినట్లు సుందరకాండ కు ఒక మూస చేస్తే ఎలా ఉంటుంది. సుందరకాండలోనే చాలా కథలు ఉన్నాయి కదా.. ఉదాహరణకు లంకా లంఘనం,కాంచనలంకావలోకనం+లంకిణి మరణం,పుష్పక విమాన వర్ణణం,అశోకవనాన్ని సీతమ్మ ను కాంచడం, రావణాసురుడు సీతమ్మ వద్దకు రావడం,త్రిజటా స్వప్నం, హనుమ సీతమ్మ తొ మాట్లాడ్డం, సీత అభజ़్తం+తకాకాసుర వృత్తాంతం,జంబుమాలి రావణ కింకరుల మరణం, అక్ష కుమారుడు మరణం, ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రం, హనుమ రావణుడిని చూడడం,లంక అగ్ని లొ పూర్తిగా దగ్ధం అవ్వడం, మళ్ళి సీత దర్శనం, మహేంద్రగిరి కి చేరుకోవడం, వానరాలు కిష్కిందకు చేరడం హనుమ రామునకు సీత విషయాలు చెప్పడం. ఇది ప్రాధమిక సమాచారం, నేను ప్రతి వ్యాసం లొ 2 kb వచ్చేటట్లు చేస్తాను --మాటలబాబు 23:05, 28 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

చెయ్యొచ్చు కానీ..నేని విషయంలో కొంచెం సంధిగ్ధంలో ఉన్నాను. ఇంత వివరంగా సుందరకాండలోని వివిధ ఘట్టాల గురించి రాస్తే వికీపీడియా పరిధి దాటిపోతుందేమోనని నా అనుమానం. వికీసోర్స్‌లో చేర్చటానికి మీరు ఒక పబ్లిక్ డొమైన్ మూలాన్ని యధాతధంగా రాయటం లేదు కదా. వికీ బుక్స్ పరిధిలోకి వస్తుందేమో చూడాలి. ఈ విషయమై మిగిలిన సభ్యుల అభిప్రాయాలను కోరటం మంచిది. నేనూ ఆంగ్ల తదితర వికీల్లో ఇలాంటి సమస్యనెదుర్కున్నారేమో కొంచెం అధ్యయనం చేస్తా. ఒక 4-5 రోజులు ఆగండి. --వైజాసత్య 23:16, 28 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
మీరు ఏమి అనుకోనని భావిస్తున్నాను. ఈ ప్రశ్నని రచ్చ బండకు ఈడ్చా.....--మాటలబాబు 23:34, 28 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
అదే మంచి పద్ధతి..మరి అందరి అభిప్రాయాలను తెలుసుకోవటానికి మంచి మార్గం --వైజాసత్య 23:38, 28 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

అయోమయ నివృత్తి

[మార్చు]

అయోమయ నివృత్తి పెంట చేసినందుకు క్షమించాలి.ప్రతి సారి మిమ్మల్ని విసిగించడం ఎందుకు అని ప్రయోగం చేసాను,కాని ఉత్తీర్ణత పొందలేదు. --మాటలబాబు 00:21, 29 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

పర్వాలేదు. నాతో సహా ప్రతి ఒక్కరు అలా గందరగోళం చేసి నేర్చుకున్నవాళ్లే. అక్కడ ప్రధానంశమేమిటంటే సుందరకాండ అనేది ప్రధానంగా రామాయణ కాండముగానే ప్రసిద్ధ మైనది కాబట్టి ఒక చిన్న సినిమా ఉన్న కారణంగా సుందరకాండ అన్న పేరును అయోమయ నివృత్తి పేజీకి ఇవ్వటం భావ్యం కాదు. అందుకే సుందరకాండ (అయోమయ నివృత్తి) అనే ప్రత్యేక పేజీని సృష్టించి. సుందరకాండ (రామాయణం) ను సుందరకాండ కు తరలించటం జరిగింది --వైజాసత్య 00:44, 29 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

బ్లాగు

[మార్చు]

ఇది వికీ అంతర్గత విషయం కాదు. నాకు ఇప్పటి దాకా బ్లాగు లేదు, రాకేశ్వర్ గారి బ్లాగు చూసేటప్పటికి, నాకు ఒక బ్లాగు వేయాలనిపించింది. మీ బ్లాగు గీతలహరేనా ... తెలుగు టైపింగు సహాయం ఎడిట్ బాక్స్ ప్రక్కకు వచ్చే ఏర్పాటు చేయగలరా....--మాటలబాబు 15:10, 29 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

ఎడిట్ బాక్స్ పక్కకు వచ్చేట్లు ఏర్పాటు చేయటానికి ప్రయత్నిస్తా. ఇక బ్లాగు గురించి మీకు ఈమెయిల్ పంపిస్తా --వైజాసత్య 15:16, 29 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
మీరు ఇక్కడ ఈమెయిల్ ఇచ్చినట్టు లేరు..మీ బ్లాగులోనే టపాకింద నా బ్లాగడ్రసు ఇస్తా --వైజాసత్య 15:22, 29 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
మీకో బొమ్మ పంపించాలి మీరు అన్ లైను ఉన్నారా చెప్పండి? --మాటలబాబు 19:23, 29 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
పంపించండి --వైజాసత్య 19:37, 29 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
పంపాను--మాటలబాబు 19:40, 29 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ వారం వ్యాసం

[మార్చు]

వైజాసత్యగారు, ఈ వారం వ్యాసాన్ని ఇంకా ఎన్నుకున్నట్లు లేరు. దానిని ఎన్నుకుంటే నేను ఒక ఈమెయిలు తయారు చేసి అందరికీ పంపిస్తాను. తళ్ళికోట యుద్ధము వ్యాసాన్ని ఈ వారం వ్యాసంగా చేద్దాము. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 06:21, 30 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

అలాగే..ఇక ముందు కూడా నేనే వీటిని ఎన్నుకోవలసిన అవసరం లేదు. ఎవరైనా ప్రతిపాదించవచ్చు --వైజాసత్య 06:23, 30 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
తళ్ళికోట వ్యాసానికి రంగుల బొమ్మలు ఎక్కడ దొరకలేదా.. పుస్తకాలలొ కూడా లేవా--మాటలబాబు 15:56, 30 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
దొరకలేదు..చాలా నెలల క్రితం సుల్తానులు రామరాయల తలను ఖండించి చేత్తో పట్టుకున్న చిత్రాన్ని చూశాను..ఆ తర్వాత ఎన్నిసార్లు వెతికినా అది దొరకలేదు --వైజాసత్య 20:01, 30 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

అనువాదం

[మార్చు]
ఇక్కద కన్నువెయ్యాలి ఆంగ్ల అనువాదం కష్టం గా ఊంది [2]--మాటలబాబు 15:56, 30 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
కాస్త వీలు కుదరగానే తప్పకుండా అనువాదానికి సహాయం చేస్తాను --వైజాసత్య 20:02, 30 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
లేదండి నేను మిమ్మల్ని ఒకసారి అనువాదం సరిగా ఉందో లేదో చూడమంటున్నాను,ఆంగ్ల పదాలు కదా అందుకని వీలుంటే చూడండి --మాటలబాబు 20:06, 30 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
రేపు ఈ వారం వ్యాసంగా తళ్ళికోట యుద్ధం పెట్టడానికి నిశ్చయించి నట్లేనా...
కొంచెం పార్థ సారధి దేవాలయం ( చెన్నై) అనే లింకుని తొలగించరా..., అక్షర క్రమము లొ దోషం ఉంది.--మాటలబాబు 23:45, 1 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]
అవును..రేపు తళ్ళికోట యుద్ధం ఈ వారం వ్యాసంగా వస్తుంది --వైజాసత్య 00:10, 2 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

జిస్ట్ తెలుగు ఓపెన్ టైపు ఫాంట్లు

[మార్చు]

నా pcqlinux2007 కంప్యూటర్ లో జిస్ట్ ఇంస్టాల్ చేస్తే జిస్త్ మాక్రోమీడియా అనే పేరు మిగతా వాటితో కనపడింది. అందుకని రాసాను. మీరెందుకు తప్పనుకుంటున్నారు. (అర్జు 17:40, 2 జూలై 2007 (UTC))[ప్రత్యుత్తరం]

అది నేను తొలగించలేదు. కానీ ఈ జిస్ట్-మాక్రోమీడియా అన్నది ఫాంటేనా అని నాకూ అనుమానమే --వైజాసత్య 19:12, 3 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

తీరిక

[మార్చు]

మీరు విజయ నగర రాజుల మీద పరిశోధన చేస్తున్నట్లు న్నారు. ఒకసారి నేను వ్రాసిన విద్యారణ్యుడు వ్యాసం చూసి చిన్న చిన్న సవరణలు చేయండి(దయ చేసి), సరైన ఇంటర్నల్ లింకు ఇవ్వండి (ప్లీజ్ ప్లీజ్), మద్రాసు వ్యాసంలో ఒక కొత్త మూస (ఆడియౌ) తయారైంది, ఆడియౌ పైలుమూస దానీ మీద కూడా ఒక కన్ను వేయగలరు, ప్రదీప్ గారిని అడిగాను ఆయనకు తీరిక లేనట్లుంది --మాటలబాబు 20:52, 2 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

ఒకే, నేను విద్యారణ్యుని సమాచారం కోసం వెతకలేదు కానీ అనుకోకుండా కొంత సమాచారం దొరికింది. అది అందులో చేర్చుతా --వైజాసత్య 22:16, 2 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

telugu typing problem

[మార్చు]

నాకు ఒక సమస్య వచ్చింది.మీరు సహాయం చేయగలరా?

వికిపీడియాలో, వికిమూలములో నేను రాయగలుగుతున్నాను. కాని విక్షనరీలో మాత్రం తెలుగులో రావడములేదు. ఏదైనా మార్పులు చెయ్యాలంటే చెప్పండి. ధన్యవాదాలు.

ఇంగ్లీష్ - తెలుగు అనువాదం కోసం ఏదైనా డిక్షనరీ దొరుకుతుందా.రాజశేఖర్1961

మీ సమస్యని త్వరలొ పరిష్కరించగలమని ఆశిస్తున్నాను. ఇక్కడ మరియు తెలుగు మూలములు, వికీ సోర్సు లొ జావ ఏన్స్క్రెప్ట్ చేశాము కాని విక్షనరి ఇంకా చేయ లేదు కాబట్టి తెలుగు లొ రాయలేక పోతున్నారు, ఆ సదుపాయం త్వరలొ కల్పిస్తాము.

మీ కృషి బాగుంది అలానే కానివ్వండీ సుమా సాహితి నిఘంటువు ఉందికదా గొప్పగా ఉండదు కాని ఏదో ఉంటుంది ఇది ఇక్కడ చూడ వచ్చు --మాటలబాబు 08:35, 3 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]


2 రోజుల క్రితమే విక్షనరీలో కూడా ఈ స్క్రిప్టు అమలుపరిచాను. ఇప్పడు అక్కడ కూడా ఇలాగే సులువుగా తెలుగు రాయవచ్చు --వైజాసత్య 13:25, 3 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

మైలు రాళ్ళు

[మార్చు]

నా కొత్త బ్లాగు చూశారా చెప్పండి.యాభై వేలొ వికీపీడియా వ్యాసాన్ని నేనే(మాటలబాబు) సృష్టించానని ప్రదీప్ గారు వ్రాశారు నాకెంతో గర్వంగా ఉన్నది. నా బ్లాగు లొ వ్రాసిన విషయాలు వికిపీడియా లొ పెట్టవచ్చా పెట్ట రాదా.. చెప్పండి. ప్లీజ్ ప్లీజ్ --మాటలబాబు 16:31, 3 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

కొత్త బ్లాగు కాదు..కొత్త టపా అనాలనుకుంటా..విషయాన్ని బట్టి..మీ సొంత విషయాలైతే కొంత సభ్యుని పేజీలో పెట్టుకోవచ్చు. ఇంతకీ ఏం పెట్టాలనుకుంటున్నారు. --వైజాసత్య 16:33, 3 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]
50 వేల పేజీ రాసిన సందర్భంగా శుభాకాంక్షలు..జీర్ణం జీర్ణం..అదేనా ఇక్కడ పెట్టాలనుకుంటున్నది. ఇక్కడ అంత సరిగా ఉండదేమోనని నాకనిపిస్తుంది. ఏ విషయం క్రింద దాన్ని పెట్టాలన్నదే ప్రశ్న --వైజాసత్య 16:37, 3 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]
మహాప్రభో!, క్షమించండి మిమ్మల్ని ఉద్దేశించి రాయ లేదు. నేను ప్రదీప్ గారిని ఉద్దేశించి రాశాను వారు మాములుగా నేను ఏమి అడిగనా కిమ్మనకుండ ఉంటారు, నేను తప్పులు చేస్తే తప్పితే మాట్లాడరు.--మాటలబాబు 19:08, 3 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

లొకేషన్ మాప్

[మార్చు]

లొకేషన్ మాప్ మూసను సరిచేసినందుకు కృతజ్ఞతలు. --వైజాసత్య 16:25, 3 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

మీడియావికీలో ఉపయోగించే సాఫ్టువేరులో, SVG బొమ్మలను PNGలుగా మార్చే ఇంకో సాఫ్టువేరు ఉంటుంది, ఆ సాఫ్టువేరు బొమ్మల పేర్లు యూనీకోడులో ఉంటే PNGలుగా మార్చటం లేదు. దీనివలన ప్రస్తుతానికి SVGలకు మనం ఆంగ్లపేర్లనే వాడాలి. ఇప్పుడు మార్చిన దానుకంటే ఇంకొంచెం సులువుగా ఉండేటట్లు మార్చటానికి ప్రయత్నిస్తాను. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 18:13, 3 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

మంగళూరు

[మార్చు]

ఒకసారి మంగళూరు కన్నడ పేరు గమనించండి. అక్కడ మంగళూరు అని ఎంది, కాని మంగుళూరు అని లేదు కదా.... అక్కడ బొమ్మలు బాగున్నాయి అక్కడ నుండి కొన్ని బొమ్మలు తెస్తాను.

అవును నేనది గమనించాను. అక్కడక్కడ కొన్ని వ్యాసాల్లోమంగుళూరు అని రాశారు. ఆ లింకుల సౌకర్యార్ధం నేనొక దారిమార్పు పేజీ చేశాను --వైజాసత్య 01:15, 4 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రశ్నలు

[మార్చు]
ఆడియౌ పైలు పూర్తిగా విన్నందుకు ధన్యవాదాలు, వ్యాసం లొ చాలా మార్పులు చేయవలసి వచ్చింది, వ్యాసాన్ని పైకి చదివితే గాని వ్యాసం లొ ఉన్న తప్పులు తెలియవు. అంతేకాదు వాక్యలు పైకి చదివితే గాని వ్యాసం యెక్క కంటిన్యువిటి తెలియదు. ముందు అంత ముక్కలుగా continuity గా లేదు.
దైనందిన అంటే అర్థం ఏమిటి మంచి పాలన లేక అద్వాన పాలన
మెదటి పేజి లొ వ్యాసాన్ని వినండి అనే లింకు చిన్నది క్రింద ఉంటె బాగుంతుందని నా అభిప్రాయం. మరి పెద్దదిగా ఉంది. దానిని ఏమౌనా చిన్నది గా చెయ్యగలరేమో చూడండి.
ఇంకో విషయం కన్నడలొ మంగళురు కాని మంగళూరు కాదు. ళ ఉ కారమే ఉంది, ళ ఊ కారం లేదు.

--మాటలబాబు 01:44, 4 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

దైనందిన అంటే (daily) ఈ సందర్భములో పేరుకు సదాశివరాయలు రాజైన రోజూవారీ వ్యవహారాలను అళియరాయరాయలే చూశాడని అర్ధం. ఆడియో లింకు చిన్నది చేస్తాను. ఇక మంగళూరు తెలుగు ఉఛ్ఛారణ ప్రకారం అలానే ఉంచేద్దాం తెలుగులో మంగళ+ఊరు = మంగళూరు అవుతుంది (ఉరు కాదుకదా అందుకని) --వైజాసత్య 01:52, 4 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

సభ్య పేజి ఖాళీ

[మార్చు]

మీరు గాని తెవికీ నుండి సన్యాసం తీసుకోవాలసిన ప్రణాళిక ఏమైన రచన చేస్తున్నారా.. సభ్యత్వ పేజి ఖాళీ చేశారు. ఈ రోజు మీకు సెలవుకదా.. జూలై 4 వ తారీఖు అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం కదా --మాటలబాబు 11:02, 4 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

సన్యాసం అప్పుడే ఎక్కడ..చేసే పనులు చాలా ఉన్నాయి. అవును..సెలవే --వైజాసత్య 11:24, 4 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

అనువాదం

[మార్చు]

కన్నడ బాగానే అనువాదం చేశారే...--మాటలబాబు 04:20, 5 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

సరదాగా ఏదో ప్రయత్నించా. కన్నడ చదవటానికి గానీ అర్ధం చేసుకోవటానికి గానీ అంత కష్టంగా ఏమీ ఉన్నట్టులేదు. నాకు తమిళం కూడా కొద్దిగా అర్ధం అవుతుంది కానీ అక్కడ లిపితో కొంచెం సమస్య. మరీ ఆ లిపిని నేనింకా నేర్చుకోలేదు --వైజాసత్య 04:30, 5 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]
మీకు తమిళం తెలిస్తే గనక భోమియో వాడి తెలుగులోనే చదువుకోవచ్చు. ఇది కన్నడ భాషను బాగానే చూపిస్తుంది కానీ తమిళాన్ని తెలుగులో అంత బాగా చూపించటం లేదు. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 06:01, 5 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]
ప్రదీప్ గారి బుర్రే బుర్ర.. అందుకనే ప్రదీప్ గారు తెవికీ మాంత్రికుడయ్యాడు. భలే భలే.. బాగుంది భోగియా.. కన్నడ లిపి తెలుగు లిపి సుమారుగా ఒకలాగే ఉంటుంది కదా. భాష కూడా సుమారుగా ఒకలాగే ఉంటుంది.కొన్ని కీ పదాలు తెలిస్తే అర్థం అవ్వడానికి డొకా ఉండదు. ప్రదీప్‌ గారు ఇప్పటికే చాలా సంవత్సరాల నుండి కర్ణాటక్ లొ ఉంటున్నారు కన్నడ బాగానే వచ్చి ఉండాలి. ప్రదీప్ గారు మరచి పోయాను బెంగళురులొ సిటి బస్సుల నంబర్లు కన్నడ అంకెలలొ రాస్తారు కదా. సరిగా గుర్తు లేదు. ముంబాయి లొ అయితే సందేహం లేకుండా మరాఠి అంకెలు. అందుకని ప్రదీప్‌ గారైన్ లేక సత్యా గారేనా తెలుగు అంకెలు ఎలా రాయాలొ చెబుతారు --మాటలబాబు 06:09, 5 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]
నన్నీ దిశగా నడిపించిన మీ ఐడియాకు థాంక్స్..చూశాను. తమిళంతో సమస్యే అది. అందులో తెలుగులో ఉన్నట్టుగా సంస్కృత వర్ణమాలంతా లేదు..చాలా అక్షరాలు వాళ్లకు లేవు. ఉదాహరణకు క,ఖ,గ,ఘ కు నాలిగింటికి కలిపి ఒకే అక్షరం. ఇప్పుడున్న లిప్యాంతరీకరణ పద్ధతులన్ని గుడ్డిగా దేవనాగరి నుండి బైట్ షిఫ్ట్ చేసి వేరే భాష తెప్పించేవే (దేవనాగరిలో ఉన్న అన్ని అక్షరాలు మిగిలిన భాషల్లోనూ ఉన్నాయని..వైసీ వర్సా అని వాళ్ల అజంప్షన్)..తెలుగులో లిప్యాంతరీకరణ కొంతలో కొంత మేలు. (ఒ/ఓ, ఎ/ఏ ల విషయంలో తప్పులోకాలేస్తారు తప్ప మిగిలినంతా ఫర్వాలేదు). అసలే నాది ఏదో స్నేహితులు మాట్లాడుతుంటే కేవలం విని నేర్చుకున్న తమిళం కాబట్టి ఎవరైనా తమిళులు రాసిన తిరుగు లిప్యాంతరీకరణ పరికరం ఉపయోగించి ఆంగ్లములో చదవటం మేలేమోనని నకనిపిస్తుంది
తెలుగు అంకెలు ఇదివరకు ఇక్కడ వచ్చేవి..కానీ సభ్యులందరు చర్చజరిపిన మీదట మార్చేశాం. మీరు ఇన్‌స్క్రిప్ట్ ఉపయోగిస్తే అందులో తెలుగు అంకెలు వస్తాయి--వైజాసత్య 07:38, 5 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రశ్న పరంపర

[మార్చు]
వైజా సత్యా గారు ఈ వ్యాసం అనువాదం మూస ను సాధ్యమైనంత త్వరలొ తొలగించాలి. అంతే కాదు ఈ వ్యాసాన్ని సంరక్షించాలి కూడా. ఆంగ్ల వ్యాసం సంరక్షించబడింది`. నా కొత్త వెబ్సైటు చూశారా...నా సభ్యత్వ పేజి నుండి లింకు ఉంది .ఇన్‌స్క్రిప్ట్ ఎలా చెయ్యాలొ చెప్పరా కొంచెం--మాటలబాబు 08:37, 5 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]
ఏ వ్యాసం? విజయనగరం (హంపి)? అంగ్లవికీ చాలా మంది తింగర సభ్యులు తమవాదమే సరైనదని మార్పులు ప్రతిమార్పులు చేస్తుంటారు..దానివళ్ల అక్కడ వ్యాసాలను సంరక్షించాల్సి వస్తుంది. ఇంకా మన తెవికీ అంత అవస్థ పట్టలేదు. కాబట్టి అలా స్వేఛ్ఛగా వదిలేద్దాం. వెబ్సైటు చూశాను..నేను సైతం విశ్వాంతర్జాలంలో తెలుగు బావుటా ఎగురవేస్తా అన్నట్టు మంచి ప్రయత్నం.. శుభారంభం. ఇప్పుడు ఇన్‌స్క్రిప్టు వాడాలంటే వికీపీడియా:విండోసు XP చూడండి --వైజాసత్య 08:47, 5 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

గణాంకాలు

[మార్చు]

నాకున్న విపరీత ఆలోచనలలో కొన్ని

  • తెలుగు వికీపీడియాలో ఇంగీషు ఎంత శాతముందో కనుక్కోవడం.
  • అలాకే సైజుల వారీగా ఇతర భారతీయ భాషలలో వ్యాసాల గణన.
  • ఇతర వికీలలో ఇంగ్లీషు శాతమెంత ఉందో తెలుసుకోవడం.

ఈ ఆదివారం ఒక బాటును తయారు చేసి అన్ని వికీపీడియాలలో నడుపటానికి ప్రయత్నిస్తాను. మీదగ్గర ఇలాంటి గణాంకాలకు సంబందించిన అయిడియాలు ఏమయినా ఉంటే చెప్పండి, వాటిని కూడా ప్రయోగించటానికి ప్రయత్నిస్తాను. వీటికి 1000 మంది కంటే ఎక్కువమంది సభ్యులు ఉన్న వికీపీడియాననే పరిగణలోకి తీసుకోవాలని చూస్తున్నాను. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 12:45, 5 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

బాగున్నాయి మీ అలోచనలు..నాకేమీ విపరీతాలనిపించట్లేదు. పైవి కాకుండా అదనంగా నాకు ఇప్పుడు తోచినవి ఇవి
  • వివిధ భారతీయ వికీపీడియాల్లో బాటుతో చేసిన వ్యాసాల సంఖ్య
  • వివిధ భారతీయ వికీపీడియాల్లో బాటుతో చేసిన దిద్దుబాట్ల సంఖ్య
  • సంవత్సరాల పేజీల సంఖ్య

ఇవి కాక స్థానికంగా తెవికీలో నాకు కొన్ని గణాంకాలు కావాలి. నేను విస్టాకి మారినప్పటినుండి పైవికీపీడియాతో అంత సాఫీగా నడవట్లేదు. ట్రబుల్షూట్ చెయ్యటానికి బద్ధకం

  • అనువాదం మూసలేని 10 కేబీ కంటే ఎక్కువున్న వ్యాసాల జాబితా
  • అనువాదం మూస ఉన్న 10 కేబీ వ్యాసాల జాబితా
  • మొత్తం సినిమా (కేవలం సినిమాలు)వ్యాసాల సంఖ్య
  • ఎక్కడికీ లింకులేని సినిమా వ్యాసాల జాబితా
  • ఒకటి కంటే ఎక్కువ సినిమా మూసలున్న పేజీల జాబితా

మీకు చాలా పనిపెట్టినట్టున్నాను --వైజాసత్య 13:28, 5 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ చర్చను రచ్చబండకు మారుస్తున్నాను. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 20:29, 7 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

స్తోత్రములు

[మార్చు]

వైజాసత్య గారు నేను స్తోత్రములను సోర్స్ లో కొత్త ఉపవర్గం లోకి మార్చుతాను. ఇంకా కొన్నిస్తోత్రములను జతపరిచి మార్చుతాను. మీ సూచనకి కృతజ్ఞతలు. --దూర్వాసుల Bdurvasula

విజయనగరం

[మార్చు]

విజయనగరం అయోమయ నివృత్తి మీద మీరు వ్యక్తం చేసిన విషయం బాగుంది,వికిపీడియా లొ చర్చ జరిపే సభ్యులు చాలా తక్కువ, సుందరకాండ గురించి ఒక చర్చా అంశం పెట్టాను ఇప్పటికి చాలా రోజులైయ్యింది ఫలితం రాలేదు, నన్ను బహిష్కరించమని మీరు రచ్చబండ లొ చర్చా అంశం పెట్టారు అది అలాగే కూర్చొని ఉంది ఫలితం లేదు, ఇకనుంది చర్చలకు టిక్కు లు పెట్టాలి. సరే మీరు చెప్పినట్లు విజయనగరం అయోమయ నివృత్తి అని విజయనగరం ఆంధ్ర ప్రదేశ్ పేజి లొ పెట్టంది, కాని విజయనగరం , హంపి అని రెందు పేజిలు ఉండాలని నా అభిప్రాయం. ఇంకొ విషయం, కుక్కె సుబ్రమణ్య్ పేజి చూశాను, అక్కడ కుక్కే అని ఉంది కాని ఉండవలసినది కుక్కె అని మాత్రమే, బొమ్మలు బాగాసేకరించారు.. బాగున్నాయి. నావద్ద దేవాలయలొని విగ్రహ చిత్రాలు ఉన్నాయి, బహుశా అవి పబ్లిక్ డొమైన్ లొకి వస్తాయి అని అనుకొంటున్నాను.--మాటలబాబు 19:25, 6 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

ఉన్నవాళ్ళే చర్చజరుపుతారు. అసలు చర్చనే ప్రారంభించకపోతే మిగిలిన వాళ్లకి ఎలా తెలుస్తుంది. సుందరకాండ గురించి మిగిలిన వాళ్లు చూసినట్టు లేరు. నా ఆంగ్ల వికీ శోధన వళ్ల తెలిసిందేమంటే రామాయణం కధ నెలాగూ రామాయణం వ్యాసంలో చెబుతున్నాము. వికీలో రామాయణం గురించి రాయచ్చు కానీ రామాయణం రాయకూడదు (అది సొంత వాక్యాల్లోనైనా సరే). ఆంగ్లవికీలో కాండలకు కూడా పేజీల్లేవు..కాస్త పట్టువిడుపుగా ఇక్కడ కాండలకు వ్యాసాలు రాసినా అంతకంటే ముందుకు వెళ్ళి ప్రతి ఘటనకూ వ్యాసం మెదలుపెట్టడం అనవసరం. అది విజ్ఞానసర్వస్వ పరిధిని దాటిపోతుంది కూడా. ఇక ఇప్పట్నుండి చర్చల పర్యవసానం రాసే మంచి పద్ధతిని తెవికీలో కూడా అలవరుచుకోవాలనుకుంటా. మీ బహిష్కరణ చర్చలో ఇంకొక్క సారి దుశ్చర్యకు పాల్పడితే బహిష్కరించాలని అక్కడ ఆగినట్టున్నాము కదా..ఆ తరువాత మీరు బుద్ధిమంతులయ్యే సరికి ఆ చర్చను కొనసాగించాల్సిన అవసరం రాలేదు..కాకపోతే మరళా ఒక గడువు సమయం దాటిన తర్వాత నేను తిరిగి దానికి వెళ్లి చర్చ పర్యవసానం రాయలేదు..కానీ మీరు అర్ధం చేసుకున్నారనుకున్నాను. అయినా ఇప్పుడు వెనక్కి వెళ్ళి పర్యవసానం రాయటం అవసరమా? మీకది తృప్తి కలిగిస్తుందనుకుంటే అలాగే --వైజాసత్య 07:37, 7 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

కాసుబాబు ఎలాగు పని వత్తిడి లొ తెవికి వైపు కన్ను వేయడం లేదు,వారితొ మాట్లాడే అవకాశం లేదు.తెవికి లొ ఉన్న ఏకైక మిత్రులు మీరు కూడా నా తో మాట్లాడం మానేస్తే నేనేమైపోవాలి చెప్పండి --మాటలబాబు 00:42, 7 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

ఇప్పడే తిరిగి వచ్చాను. కాసేపట్లో మీ ప్రశ్నలకు సమాధానం రాస్తాను. నన్ను మీ మిత్రునిగా భావించినందుకు కృతజ్ఞతలు --వైజాసత్య 04:46, 7 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]
ఈరోజు నేను వికి కి ఆలస్యంగా వచ్చాను, ఏమిటొ ఇది ఒక పెద్ద వ్యసనం లాగ తయారైంది. రాకుడదు రాకుడదు అని అనుకుంటాను, వచ్చి ఇటివల మార్పులు అనే లింకు మీద నొక్కాలి అని అనిపిస్తుంది, సరె లెండి, ఇప్పుడిప్పుడే html, css నేర్చుకొంటున్నాను కూడా...సరే మీరు రెండు సంఖ్యల పేజిలు బాగా తెచ్చారు, నేను అనువాదానికి చేసిన బొమ్మ ఎలాగ ఉన్నది.--మాటలబాబు 21:04, 7 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]
బొమ్మ సరదాగా ఉంది..నాకు నచ్చింది. నేనా పేజీలు తేలేదు (కొత్తవి తేకూడదని నిర్ణయించుకున్నాను కదా)..వాటికి అనువాదం మూస లేకుంటే తగిలించానంతే --వైజాసత్య 21:06, 7 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రశ్న

[మార్చు]

furniture, stained glass window కి సరైన అనువాద పదాలు చెప్పగలరా, సహాయానికి కృతజ్ఞున్ని--మాటలబాబు 19:31, 8 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

నాకూ దొరకలేదు..దొరికేదాకా వాటిని తెలుగు లిపిలో రాసేయండి. సాధారణంగా అనువాదపదాలకు మన తెవికీ సభ్యుడు, తెలుగు ఆచార్యుడైన వేమూరి గారి డిక్షనరీ వాడుతుంటాను [3]. అప్పుడప్పుడు గ్విన్ డిక్షనరీ కూడా వాడతాను, [4], బ్రౌణ్య పదకోశం సమకాలీన పదాలకు సరిపోవటం లేదు. --వైజాసత్య 19:49, 8 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]
వీటిపై తెలుగుపదంలో చర్చని చూడండి. — వీవెన్ 09:24, 9 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

ఉన్నారా

[మార్చు]

అయ్యా మీరు ఉన్నారా అక్కడ ఎక్కడికైన తిరగడానికి వెళ్ళారా?--మాటలబాబు 22:35, 8 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

ఉన్నాను --వైజాసత్య 22:37, 8 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

అనువాదం

[మార్చు]

కింగ్ కోబ్రా మళయాల వికీ లొ విశేషవ్యాసం గా ప్రదర్శించబడింది, కింగ్ కోబ్రా సరైన తెలుగు పదం ఏమిటి? నాగు పాము కాదు వేరే ప్రజాతికి చెందినది, దీన్ని రాజనాగు అని పిలవాలా.. లెక కింగ్ కోబ్రా గా వదిలి పెట్టాలా.. జీవశాస్త్ర పరిజ్ఞానం ఉన్న మీరే చెప్పాలి.--మాటలబాబు 23:41, 8 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

ఆ తెలుగుపేర్లు తెలియకేగా ప్రస్తుతానికి ఇక్కడ జీవశాస్త్ర వ్యాసాలేవి ఇక్కడ లేకపోవటం. ప్రస్తుతానికి కింగ్ కోబ్రా అనే ఉంచండి. తరువాత మారుద్దాం --వైజాసత్య 23:51, 8 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]
వేమూరి వారు రాజనాగు అన్నారు.. అలా డిసైడై పోదాం --వైజాసత్య 23:54, 8 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]
నాకు తెలిసినంత వరకూ "కింగ్ కోబ్రా" అంటే "నల్లత్రాచు" అని అనుకుంటున్నాను. ఏదో తెలుగు నవలలో చదివినట్లు గుర్తు. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 05:40, 9 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]
ఆహా! ప్రదీపు గారు బాగా గుర్తుచేశారు. మొదడులో ఎక్కడో దాక్కున నిక్షిప్తమైన సమాచారం బయటికొచ్చినట్టైంది. అవును కోబ్రా అంటే త్రాచు పాము. కింగ్ కోబ్రా అంటే నల్లత్రాచు ..యాహూ --వైజాసత్య 06:30, 9 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]