Jump to content

వాడుకరి చర్చ:సత్యమేవ జయతే

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

స్వాగతం

[మార్చు]
సత్యమేవ జయతే గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం!!

సత్యమేవ జయతే గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి వికీపీడియాలో రచనలు చేయుట, 2014 (ఈ-పుస్తకం), తెలుగులో రచనలు చెయ్యడం (వికీ వ్యాసాలు), టైపింగు సహాయం, కీ బోర్డు చదవండి.
  • "మరియు" అనే పదం తెలుగుకు సహజమైన వాడుక కాదు. ప్రామాణిక ప్రచురణల్లో దాన్ని వాడరు. వికీపీడియాలో కూడా దాన్ని వాడరాదు. మరింత సమాచారం కోసం వికీపీడియా:శైలి/భాష చూడండి.
  • వికీపీడియాలో ప్రతీ పేజీకి అనుబంధంగా ఒక చర్చ పేజీ ఉంటుంది. వ్యాస విషయానికి సంబంధించిన చర్చ, సంబంధిత చర్చ పేజీలో చెయ్యాలి. మీ వాడుకరి పేజీకి కూడా అనుబంధంగా చర్చ పేజీ ఉంది. ఆ పేజీలోనే ఈ స్వాగత సందేశం పెట్టాను, గమనించారా?
  • చర్చ పేజీల్లో ఏమైనా రాసినపుడు దాని పక్కన సంతకం పెట్టాలి. నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా రాస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి - అదే సంతకం! దిద్దుబాటు పెట్టె (వికీలో ఎక్కడైనా సరే.., రాసేది, ఇప్పుడు నేను ఇదంతా రాసినదీ దిద్దుబాటు పెట్టెలోనే) పైభాగం లోని () బొమ్మపై నొక్కినా సంతకం చేరుతుంది. (సంతకం, చర్చ పేజీల్లో మాత్రమే చెయ్యాలి. వ్యాస పేజీలలో చెయ్యరాదు.) చర్చ పేజీలను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోండి.
  • వికీపీడియాలో విజ్ఞాన సర్వస్వం పేజీలే కాకుండా వాటికి ఉపయోగపడే అనేక ఇతర పేజీలు కూడా ఉంటాయి. ఇవన్నీ వేరువేరు పేరుబరుల్లో ఉంటాయి. ఈ పేజీల పేర్లకు ముందు ఆ పేరుబరి పేరు వస్తుంది - "వికీపీడియా:" "వాడుకరి:" "మూస:" "వర్గం:" -ఇలాగ (విజ్ఞాన సర్వస పేజీలకు ముందు ఇలాంటిదేమీ ఉండదు.). ఈ పేజీలకు కూడా అనుంబంధంగా చర్చ పేజీలుంటాయి.
  • వికీ గురించి, వికీపద్ధతుల గురించీ, వికీలో పనిచెయ్యడం గురించీ తెలుసుకోండి, ఇతరులకు చెప్పండి.

ఇకపోతే..


  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి. ఫేస్బుక్ వాడేవారైతే తెలుగు వికీపీడియా సముదాయ పేజీ ఇష్టపడండి.
  • ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   --ప్రభాకర్ గౌడ్ నోముల(చర్చ)13:21, 11 అక్టోబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

అభినందనలు

[మార్చు]

సత్యమేవ జయతే గారు,, మీరు వికీపీడియాలో ఖాతా సృష్టించుకోగానే ఇతర మార్పులు చేర్పులు మీరు చాలా బాగా చేస్తున్నారు సంతోషం, అభినందనలు. కొన్ని నిబంధనలు ఉంటాయి. అవి. ఇది పేజీ వాడుకరి చర్చ మీ పేజీ, మీ పేజీని వాడుకరి పేజీ అంటారు, వాడుకరి పేజీ ఎలా ఉండాలో ఇంతకుముందు ఉన్న పేజీలను చూడండి... పైన ఉన్న స్వాగతం చూడండి. ఇది ఫేస్బుక్ లాంటిది కాదు అని మీకు తెలుసు, వికీపీడియా అనేది చాలా మహోన్నతమైనది, ఇందులో ఏ విషయం రాయాలన్న మూలాలు, ఆధారాలు ఉండాలి అంటే పేపర్లో... కాని టీవీలలో కాని ఆ విషయం పైన వచ్చి ఉండాలి. మీరు కొత్త వారు కాబట్టి కొత్త పేజీలు మరి కొన్ని విషయాలు తెలుసుకోండి. వికీపీడియాలో ఎలాంటి వ్యాసాలు సృష్టించాలి. అనే విషయం చదవండి. ఇంతకుముందున్న పేజీలను చూడండి, కొంత అనుభవం వచ్చాక కొత్త వ్యాసాలు రాయవచ్చు ఇక్కడ ముందు మీ గురించి రాసుకోండి. వికిలో వాడుకరులు ఉంటారు, నిర్వాహకులు ఉంటారు, అధికారులు ఉంటారు, ముందు ముందు తెలుస్తుంది. అన్ని చదవండి. ఏదైనా ఇంకా అర్థం కాకపోతే మళ్లీ అడగండి ధన్యవాదాలు. ప్రభాకర్ గౌడ్ నోముల(చర్చ)17:35, 11 అక్టోబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]