వాడుకరి చర్చ:Alugu1948

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

స్వాగతం[మార్చు]

Alugu1948 గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం!!

Alugu1948 గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి వికీపీడియాలో రచనలు చేయుట, 2014 (ఈ-పుస్తకం), తెలుగులో రచనలు చెయ్యడం (వికీ వ్యాసాలు), టైపింగు సహాయం, కీ బోర్డు చదవండి.
  • "మరియు" అనే పదం తెలుగుకు సహజమైన వాడుక కాదు. ప్రామాణిక ప్రచురణల్లో దాన్ని వాడరు. వికీపీడియాలో కూడా దాన్ని వాడరాదు. మరింత సమాచారం కోసం వికీపీడియా:శైలి/భాష చూడండి.
  • వికీపీడియాలో ప్రతీ పేజీకి అనుబంధంగా ఒక చర్చ పేజీ ఉంటుంది. వ్యాస విషయానికి సంబంధించిన చర్చ, సంబంధిత చర్చ పేజీలో చెయ్యాలి. మీ వాడుకరి పేజీకి కూడా అనుబంధంగా చర్చ పేజీ ఉంది. ఆ పేజీలోనే ఈ స్వాగత సందేశం పెట్టాను, గమనించారా?
  • చర్చ పేజీల్లో ఏమైనా రాసినపుడు దాని పక్కన సంతకం పెట్టాలి. నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా రాస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి - అదే సంతకం! దిద్దుబాటు పెట్టె (వికీలో ఎక్కడైనా సరే.., రాసేది, ఇప్పుడు నేను ఇదంతా రాసినదీ దిద్దుబాటు పెట్టెలోనే) పైభాగం లోని () బొమ్మపై నొక్కినా సంతకం చేరుతుంది. (సంతకం, చర్చ పేజీల్లో మాత్రమే చెయ్యాలి. వ్యాస పేజీలలో చెయ్యరాదు.) చర్చ పేజీలను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోండి.
  • వికీపీడియాలో విజ్ఞాన సర్వస్వం పేజీలే కాకుండా వాటికి ఉపయోగపడే అనేక ఇతర పేజీలు కూడా ఉంటాయి. ఇవన్నీ వేరువేరు పేరుబరుల్లో ఉంటాయి. ఈ పేజీల పేర్లకు ముందు ఆ పేరుబరి పేరు వస్తుంది - "వికీపీడియా:" "వాడుకరి:" "మూస:" "వర్గం:" -ఇలాగ (విజ్ఞాన సర్వస పేజీలకు ముందు ఇలాంటిదేమీ ఉండదు.). ఈ పేజీలకు కూడా అనుంబంధంగా చర్చ పేజీలుంటాయి.
  • వికీ గురించి, వికీపద్ధతుల గురించీ, వికీలో పనిచెయ్యడం గురించీ తెలుసుకోండి, ఇతరులకు చెప్పండి.

ఇకపోతే..


  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి. ఫేస్బుక్ వాడేవారైతే తెలుగు వికీపీడియా సముదాయ పేజీ ఇష్టపడండి.
  • ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   ప్రభాకర్ గౌడ్ నోముల(చర్చ)17:19, 26 అక్టోబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రభాకర్ గౌడ్ నోముల గారు, మీరు పంపిన వికీపీడియా స్వాగత వచనాలు వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు నాకు చాలా ఉపయోగపడతాయి. నాకు విధివిధానాలు తెలిపినందుకు ధన్యవాదాలు. Alugu1948 (చర్చ) 01:37, 27 అక్టోబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

అభినందనలు[మార్చు]

అలుగు 1948 గారు, ఖాతా సృష్టించుకుని చాలా చురుకుగా మార్పులు చేర్పులు చేస్తున్నారు. అభినందనలు. మీ లాంటి వారి అవసరం తెలుగు వికీపీడియా చాలా ఉంది, వేమన లాంటి పేజీల్లో... మీ మార్పులు చేర్పులు అలాగే ఇవ్వండి, కానీ మీకు తెలిసిన సమాచారం ఆధారాలు ఉన్న సమాచారాన్ని చేరడం చాలా ముఖ్యం, సరి అయిన పద్ధతి ఎందుకంటే ఇది తెలుగు వికి. ప్రతి వ్యాసానికి సంబంధించి కింది విషయాలను గమనించాలి. మీ పేరు ఎరుపు రంగులో ఉంటుంది ... మీ పేరు తాకగానే కొత్త పేజీ మీ పేరున సృష్టించంబడుతుంది ... అందులో మీ వివరాలు రాయండి. బద్రపరుచండి ... అంటే సేవ్ చేయండి ... మీ గురించి తెలుగులో రాయండి ... వికీపీడియాలో తప్పులు చేస్తే సరి రాసే వారికి సూచనలు ఇస్తారు, కూడా ఉంటారని తెలుసుకోండి. వికీపీడియా "నీలం రంగు" పదాలు కాస్తా గట్టిగా నోక్కినచో ఆ పేరు గల వ్యాసంలోకి వెల్లడం గమనించే ఉంటారు, వేరే సైట్ల నుండి కాపీ చేసి ఇక్కడ పేస్టు చెయ్యరాదు. నాలుగు లైన్లు వ్యాసం కాదండి, మీ ఊరు గురించి ఉంటుంది చూడండి, రాసిన ఒక వ్యాసం, మీ మండలం గురించి ఉంటుంది చూడండి అది ఒక వ్యాసం, చర్చ పేజీల్లో ఏమైనా రాసినపుడు దాని పక్కన సంతకం పెట్టాలి. నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి. ఇది ఫేస్బుక్ లాంటిది కాదు అని మీకు తెలుసు, వికీపీడియా అనేది చాలా మహోన్నతమైనది, ఇందులో ఏ విషయం రాయాలన్న మూలాలు, ఆధారాలు ఉండాలి అంటే పేపర్లో... కాని టీవీలలో కాని ఆ విషయం పైన వచ్చి ఉండాలి. మీరు కొత్త వారు కాబట్టి కొత్త పేజీలు మరి కొన్ని విషయాలు తెలుసుకోండి. వికీపీడియాలో ఎలాంటి వ్యాసాలు సృష్టించాలి. అనే విషయం చదవండి. వాడుకరి పేజీ మీ గురించి అలుగు 1948 గారు, ఇక్కడ నొక్కి ఇందులో వాడుకరి పేజీ లో ఏమి రాసుకోవాలి అనేది ఇంతకుముందున్న పేజీలను చూడండి, అలాగే మీరు కూడా రాసుకోవచ్చు, వికిలో వాడుకరులు ఉంటారు, నిర్వాహకులు ఉంటారు, అధికారులు ఉంటారు, ముందు ముందు తెలుస్తుంది. మళ్లీ అన్ని చదవండి. ఏదైనా ఇంకా అర్థం కాకపోతే మళ్లీ అడగండి ధన్యవాదాలు.ప్రభాకర్ గౌడ్ నోముల(చర్చ)04:15, 27 అక్టోబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]