వాడుకరి చర్చ:Edukulla gayatri

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నమస్కారం నా పేరు ఇడుకుల్ల గాయత్రి, విద్యార్హత   MBA(HR)                  B.Ed(Maths &English)                  Hindi (vidvaan)                 

మా పుట్టింటి పేరు సూరిశెట్టి, మార్చి 30 1984లో నాగర్ కర్నూల్ లో నేను జన్మించానని మా అమ్మగారు చెప్పారు, మా తాతగారు ఆర్య సమాజ్ లో ఉండి యజ్ఞయాగాలు నిరంతరం చేస్తూ ఉండేవారు, అందుకే నా పేరు గాయత్రి అని మా తాతగారు నిర్ణయించడం జరిగింది, రుద్రదేవ్ పండిత్ జీ గారు నాకు గాయత్రి అనే పేరుని నామకరణం చేశారు, మా మేనత్త గారు అయినా జూలూరి శైలజ గారు నాకు మధురంగా ప్రత్యూష అని పేరు పెట్టుకున్నారు, ఎందరు ఎన్ని పేర్లు పిలిచినా మా అమ్మ మాత్రం నన్ను బంగారు తల్లి అని ప్రేమగా పిలుస్తూ ఉంటుంది, మా తండ్రిగారు కరుణాకర్ గారు వ్యాపారి ,మా అమ్మ లక్ష్మీ ప్రసన్న గృహిణి, నా బాల్యం అచ్చంపేట మండలంలో గడిచింది, నా ప్రాథమిక విద్య ఇంటర్ మొదటి సంవత్సరం వరకు అచ్చంపేటలో జరిగింది. ఇంటర్ నుండి ఎంబీఏ వరకు ఉన్నత విద్య అంతా భాగ్యనగరంలో జరిగింది.

నేను ఇంటర్ మొదటి సంవత్సరం చదివే సమయంలో మా తాతగారు  భక్తి పారవశ్యంలో ఎన్నో పాటలు రచించి ఆయనే స్వయంగా దానికి స్వరాలాపన చేసేవారు, అప్పుడే నాకు కూడా ఒక రచయిత కావాలి అనే బీజం మనసులో శిలా రూపం దాల్చింది  ,నా స్నేహితులు నా సృజనాత్మకతను గుర్తించి నాకు ప్రోత్సాహం అందించేవారు, జానపద పాటలు రాసి పాడుతూ ఉంటే వారు కూడా నాతో పాటు స్వరం కలిపి పాడుతూ నాకు ఎంత ఉత్సాహం కలిగిస్తూ ఉండేవారు ,విద్యార్థి దశలోనే నేను నవలలు చదవడం మొదలు పెట్టాను ,మా అమ్మగారికి నవలలు చదవడం అంటే గొప్ప అభిరుచి, ప్రతివారం మా అమ్మ కోసం గ్రంథాలయం వెళ్లి పుస్తకాలు తీసుకొస్తూ ఉండేదాన్ని ,అలా నాకు కూడా నవలలు చదవడం అభిరుచిగా మారిపోయింది..

నాకు 16 ఏండ్ల వయసు ఉన్నప్పుడు నా ప్రాణ మిత్రులు రాధిక, కళ్యాణిని వదిలి అనివార్య కారణాల వలన ఊరు వదిలి మేము మరొక ప్రదేశానికి మారవలసిన పరిస్థితి ,పుట్టిన ఊరు నా జ్ఞాపకాలన్నీ పంచుకున్న ఊరు, నా స్నేహితులతో నేను ఆనందంగా గడిపిన నా ఊరు వదిలి వెళుతూ ఉంటే ,మనసంతా చీకటి నిండిపోయింది, రోజు వెన్నెల్లో కబుర్లు చెప్పుకున్న జ్ఞాపకాలు మదిని తాకుతూ ఉంటే, నాపై వాలిన వెన్నెల కిరణాలు కూడా ఆ క్షణం నాకు చీకటిలాగే కనిపించాయి, నక్షత్రాలన్నీ నేను ఎక్కిన బస్సు వెంట పరిగెడుతూ వస్తుంటే ,నా బాల్యం నా స్నేహం నా జ్ఞాపకాలు ఒక్కొక్కటిగా వెనక్కి వెళుతూ ఉంటే, నిశ్శబ్దంగా నా మనసు రోదిస్తూ ఉంది ,అప్పుడు మనసులో కెరటాలు లాంటి ఆలోచనలు ,మనసు స్వాంతన కోసం తహదాలాడిపోయింది, నా కలాన్ని మించిన నేస్తం మరొకటి లేదని ,నా నేస్తపు ఆనవాళ్లను అక్షరాల్లో చిత్రీకరించాను ,నా వేదనను వారితో గడిపిన మధురమైన ప్రేమ రాగాలను భద్రంగా కవిత రూపంలో పొందుపరచుకున్నాను, ఈనాడు నా నేస్తాలు నా దగ్గర ఉన్న ఆనాటి జ్ఞాపకాలు మధురంగా నెమరు వేసుకుంటూ ఉంటాం అప్పుడప్పుడు, అందుకే అక్షరంలో ప్రేమ, ద్వేషం అభిమానం ,అనురాగం ,ఆశ్చర్యం ఒక్కటేమిటి ఎన్నో భావాలు పలికించవచ్చునని ఆనాడే నా తొలి కవితకు నాంది పలికాను , నా నేస్తం అనే కవితని నేను రాయడం జరిగింది. నేను గొప్ప రచయిత నవ్వకపోయినా పరవాలేదు ,పది మంది ఆస్వాదించి ఆనందించగలిగే సాహిత్యం అందిస్తే చాలు అనుకున్నాను, నా తొలి కవిత "నా నేస్తం" ,నా నేస్తాలకి ఉత్తరంలో రాసి పంపించాను, నా మనసులోని భావాలన్నింటినీ అక్షరాల్లో తీర్చి వారికి పంపాను, ఆ క్షణం వారు స్పందించిన తీరుకి నాలో ఉత్సాహం రెట్టింపు అయింది, ఆ రోజు నుంచి ఈనాటి దాకా 20 సంవత్సరాలుగా నా సాహిత్య ప్రయాణం కొనసాగుతూ వస్తోంది.

కథ ,కవిత , సిరీస్ ,పాటలు, పద్యాలు, జానపద గేయాలు, తేనీయాలు, రుబాయిలు ,సిసింద్రీలు ,బుల్లెట్ పాయింట్స్, వెంజకాలు ఇలా పలు ప్రక్రియలలో రచనలు చేశాను, కొన్ని పుస్తకాలలో ప్రచురితమయ్యాయి, సమాజం జాగృతం అవ్వడానికి, సమాజ హితానికి రచనలు చాలా అవసరం ,దానికోసం నిరంతరం నేను అన్వేషిస్తాను, నేను ఒక స్త్రీవాదిని, ప్రతిక్షణం ఆమె అంతర్గతాన్ని అన్వేషిస్తూ ,అంతరంగాన్ని చిత్రించే ప్రయత్నమే నా కథాంశాలుగా ఎంచుకోవడానికి ఇష్టపడతాను, నా తొలి సంచిక "శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జీవిత చరిత్ర", ఆ పరమేశ్వరి కృప వలన పుస్తకాన్ని ఆవిష్కరించే ఆశీర్వాదం నాకు లభించింది 1000 ప్రతులు ఉచితంగా అందరికీ పంపిణీ చేయడం జరిగింది, ప్రతిలిపి అనే సాహిత్య యాప్ లో 272 రచనలు చేయడం జరిగింది( ఇందులో కథలు కవితలు సీరియల్స్ తేనియాలు పద్యాలు అన్ని ప్రక్రియలు పై రచనలు ఉన్నాయి. మామ్స్ ప్రెస్ అనే సాహిత్య యాప్ లో 98 రచనలు చేయడం జరిగింది ,కహానీ యాప్లో ఐదు రచనలు చేయడం జరిగింది, నా కథలలో బహుమతి, ఇల్లాలు అంతరంగం ,పసుపుతాడు, సుందరమ్మ పంచాయతీ, పెండ్లి పత్రిక, నేటి అనుబంధాలు వర్సెస్ రాదా, చాలా కథలు చాలెంజ్ విన్నర్ గా నన్ను నిలిపాయి, అంతర్జాల వేదికగా జరిగిన ఎన్నో పోటీలలో వందకి పైగా నేను ప్రశంసా పత్రాలని అందుకున్నాను 50 పైగా బహుమతి పత్రాలను అందుకున్నాను  ,ఉస్మానియా రచయితల సంఘం నుండి" కవనోద్దండ" బిరుదు పురస్కారం అందుకున్నాను. ప్రతి లిపి నుండి అచీవ్మెంట్ అవార్డు లభించింది, ఇవన్నీ నా జీవితంలో ఎన్నో అపురూపమైన జ్ఞాపకాలు, వృత్తి రిత్యా గణిత ఉపాధ్యాయురాలిని , నాకు మహాకవి శ్రీశ్రీ, సి నారాయణ రెడ్డి గారు ,సుధా మూర్తి గారు, కాలోజీ గారి రచనలు అంటే, చాలా ఇష్టం. వీరి రచనలన్నీ నా లోపల ఎంతో స్ఫూర్తి నింపాయి, సమాజాన్ని చూసే నా యొక్క దృష్టి కోణాన్ని మార్చాయి, నాలో ఒక కథా రచయితకి పునాది వేసాయి, చిన్ననాటి నుండి సాహిత్యం పై గల మక్కువ నన్ను రచయితగా మార్చింది,ఈరోజు మీ అందరికీ ఒక రచయితగా పరిచయం చేసుకునే అవకాశం నాకు కల్పించింది.

అభిరుచి ఉండగానే సరిపోదు, దానికి అవకాశాలని కూడా కల్పించుకోవాలి మనం, బాధ్యతలు నడుమ నా రచన అభిరుచిని కొనసాగించడం కొంతవరకు కష్టతరమైనప్పటికీ అన్ని బాధ్యతలు నెరవేర్చిన తర్వాత, రోజు కొంత కొంత సమయాన్ని కేటాయిస్తూ, నేను సాహిత్య ప్రయాణాన్ని మొదలుపెట్టాను, నేను రచనలు మొదలుపెట్టినప్పుడు నా చుట్టూ జరిగిన అనేక అనేక సంఘటనలన్నీ కథలుగా నేను చిత్రీకరించాను, ఒక కథ ప్రాణం పోసుకోవాలంటే అది నిజ జీవితంలో జరిగిన సంఘటన అయితే ఇంకా మన మనసులకి దగ్గరగా ఉంటుందని, దాని నుంచి మనం ఎన్నో నేర్చుకుని, జీవితంలో ఎదుర్కొనే ధైర్యాన్ని పెంపొందించుకుంటామని... నేను బలంగా నమ్ముతాను అందుకే నిజ జీవిత సంఘటనలను కథలుగా మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను , సాహిత్య ప్రక్రియ ఏదైనా సరే నువ్వు ఆ పాత్రలోకి ప్రవేశించినప్పుడు అద్భుతాలను సృష్టించగలవు, పాత్రలో నిమగ్నమై మనము రాసినప్పుడే పాఠకుల హృదయం స్పందిస్తుంది, ఒక రచయిత్రిగా ప్రతి పాత్రలో నన్ను నేను నిమగ్నం చేసుకొని అనుభూతి చెంది కథలు రాస్తూ ఉంటాను ,కవితలు రాస్తూ ఉంటాను.... సరస్వతీ మాత అనుగ్రహం లేనిదే ఇది సాధ్యం అని నేను అనుకోవడం లేదు, ఆ అమ్మవారి కృపాకటాక్షాలకి సర్వదా శరణాగతి కలిగి ఉంటానని ,"అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే" అని భావిస్తూ ...

సెలవు ధన్యవాదములు🙏

స్వాగతం

[మార్చు]
Edukulla gayatri గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం!!

Edukulla gayatri గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • తెలుగు వికీపీడియా పరిచయానికి వికీపీడియాలో రచనలు చేయుట, 2014 (ఈ-పుస్తకం), తెలుగులో రచనలు చెయ్యడం (వికీ వ్యాసాలు), టైపింగు సహాయం, కీ బోర్డు చదవండి.
  • "మరియు" అనే పదం తెలుగుకు సహజమైన వాడుక కాదు. ప్రామాణిక ప్రచురణల్లో దాన్ని వాడరు. వికీపీడియాలో కూడా దాన్ని వాడరాదు. మరింత సమాచారం కోసం వికీపీడియా:శైలి/భాష చూడండి.
  • వికీపీడియాలో ప్రతీ పేజీకి అనుబంధంగా ఒక చర్చ పేజీ ఉంటుంది. వ్యాస విషయానికి సంబంధించిన చర్చ, సంబంధిత చర్చ పేజీలో చెయ్యాలి. మీ వాడుకరి పేజీకి కూడా అనుబంధంగా చర్చ పేజీ ఉంది. ఆ పేజీలోనే ఈ స్వాగత సందేశం పెట్టాను, గమనించారా?
  • చర్చ పేజీల్లో ఏమైనా రాసినపుడు దాని పక్కన సంతకం పెట్టాలి. నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా రాస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి - అదే సంతకం! దిద్దుబాటు పెట్టె (వికీలో ఎక్కడైనా సరే.., రాసేది, ఇప్పుడు నేను ఇదంతా రాసినదీ దిద్దుబాటు పెట్టెలోనే) పైభాగం లోని () బొమ్మపై నొక్కినా సంతకం చేరుతుంది. (సంతకం, చర్చ పేజీల్లో మాత్రమే చెయ్యాలి. వ్యాస పేజీలలో చెయ్యరాదు.) చర్చ పేజీలను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోండి.
  • వికీపీడియాలో విజ్ఞాన సర్వస్వం పేజీలే కాకుండా వాటికి ఉపయోగపడే అనేక ఇతర పేజీలు కూడా ఉంటాయి. ఇవన్నీ వేరువేరు పేరుబరుల్లో ఉంటాయి. ఈ పేజీల పేర్లకు ముందు ఆ పేరుబరి పేరు వస్తుంది - "వికీపీడియా:" "వాడుకరి:" "మూస:" "వర్గం:" -ఇలాగ (విజ్ఞాన సర్వస పేజీలకు ముందు ఇలాంటిదేమీ ఉండదు.). ఈ పేజీలకు కూడా అనుంబంధంగా చర్చ పేజీలుంటాయి.
  • వికీ గురించి, వికీపద్ధతుల గురించీ, వికీలో పనిచెయ్యడం గురించీ తెలుసుకోండి, ఇతరులకు చెప్పండి.

ఇకపోతే..

  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి. ఫేస్బుక్ వాడేవారైతే తెలుగు వికీపీడియా సముదాయ పేజీ ఇష్టపడండి.
  • ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   Nrgullapalli (చర్చ) 15:51, 25 ఫిబ్రవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

Edukulla gayatri writer

[మార్చు]

ఇడుకుల్ల గాయత్రి(march30,1984 జననం)

హైదరాబాద్ మదినగూడ కు చెందిన తెలుగు రచయిత్రి . ""కవనో ద్దండ""బిరుదు పొందారు. తెలుగు సాహిత్యంలో ఎన్నో ప్రశంసలు అందుకున్నారు. వీరి తొలి ప్రచురన "" శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జీవిత చరిత్ర"".

ప్రతిలిపి సాహిత్య యాప్ లో 264 రచనలు ఇప్పటివరకు చేశారు, ఇంకా చేస్తూ ఉన్నారు. అచ్చంపేట గ్రామం, మహబూబ్నగర్ జిల్లాలో పెరిగి పెద్దవారయ్యారు ,నాగర్ కర్నూలు జిల్లా లో జన్మించారు. తాతయ్య రాములు గారి స్ఫూర్తితో సాహిత్య ప్రయాణం 16వ యేట మొదలుపెట్టారు. వీరి తండ్రి గారి పేరు సూరిశట్టికరుణాకర్ తల్లి గారి పేరు సూరిశెట్టి లక్ష్మి భర్త గారు:ఇడుకుల్ల నగేష్ పాప: తేజస్వి

ప్రతిలిపి అనే సాహిత్య ఆప్ లో ఇప్పటివరకు 267 రచనలు చేశారు ,ఇంకా చేస్తూనే ఉన్నారు. కహానీ అనే యాప్ లో నాలుగు రచనలు చేశారు, కొన్ని సాహిత్య ప్రక్రియలలో కూడా ప్రవేశం ఉంది ,వ్యంజకాలు ,నానీలు, సిసింద్రీలు, రూబాయిలు, పద్యాలు మొదలైన ప్రక్రియ కూడా రాశారు. 223.233.106.119 16:20, 15 జూలై 2022 (UTC)[ప్రత్యుత్తరం]

గాయత్రి గారి అంతరంగ ఆవిష్కరణ ఆమె మాటల్లో

[మార్చు]

విద్యార్హత   MBA(HR)

                B.Ed(Maths &English)

                Hindi (vidvaan)

మా పుట్టింటి పేరు సూరిశెట్టి, మార్చి 30 1984లో నాగర్ కర్నూల్ లో నేను జన్మించానని మా అమ్మగారు చెప్పారు, మా తాతగారు ఆర్య సమాజ్ లో ఉండి యజ్ఞయాగాలు నిరంతరం చేస్తూ ఉండేవారు, అందుకే నా పేరు గాయత్రి అని మా తాతగారు నిర్ణయించడం జరిగింది, రుద్రదేవ్ పండిత్ జీ గారు నాకు గాయత్రి అనే పేరుని నామకరణం చేశారు, మా మేనత్త గారు అయినా జూలూరి శైలజ గారు నాకు మధురంగా ప్రత్యూష అని పేరు పెట్టుకున్నారు, ఎందరు ఎన్ని పేర్లు పిలిచినా మా అమ్మ మాత్రం నన్ను బంగారు తల్లి అని ప్రేమగా పిలుస్తూ ఉంటుంది, మా తండ్రిగారు కరుణాకర్ గారు వ్యాపారి ,మా అమ్మ లక్ష్మీ ప్రసన్న గృహిణి, నా బాల్యం అచ్చంపేట మండలంలో గడిచింది, నా ప్రాథమిక విద్య ఇంటర్ మొదటి సంవత్సరం వరకు అచ్చంపేటలో జరిగింది. ఇంటర్ నుండి ఎంబీఏ వరకు ఉన్నత విద్య అంతా భాగ్యనగరంలో జరిగింది.

నేను ఇంటర్ మొదటి సంవత్సరం చదివే సమయంలో మా తాతగారు  భక్తి పారవశ్యంలో ఎన్నో పాటలు రచించి ఆయనే స్వయంగా దానికి స్వరాలాపన చేసేవారు, అప్పుడే నాకు కూడా ఒక రచయిత కావాలి అనే బీజం మనసులో శిలా రూపం దాల్చింది  ,నా స్నేహితులు నా సృజనాత్మకతను గుర్తించి నాకు ప్రోత్సాహం అందించేవారు, జానపద పాటలు రాసి పాడుతూ ఉంటే వారు కూడా నాతో పాటు స్వరం కలిపి పాడుతూ నాకు ఎంత ఉత్సాహం కలిగిస్తూ ఉండేవారు ,విద్యార్థి దశలోనే నేను నవలలు చదవడం మొదలు పెట్టాను ,మా అమ్మగారికి నవలలు చదవడం అంటే గొప్ప అభిరుచి, ప్రతివారం మా అమ్మ కోసం గ్రంథాలయం వెళ్లి పుస్తకాలు తీసుకొస్తూ ఉండేదాన్ని ,అలా నాకు కూడా నవలలు చదవడం అభిరుచిగా మారిపోయింది..

నాకు 16 ఏండ్ల వయసు ఉన్నప్పుడు నా ప్రాణ మిత్రులు రాధిక, కళ్యాణిని వదిలి అనివార్య కారణాల వలన ఊరు వదిలి మేము మరొక ప్రదేశానికి మారవలసిన పరిస్థితి ,పుట్టిన ఊరు నా జ్ఞాపకాలన్నీ పంచుకున్న ఊరు, నా స్నేహితులతో నేను ఆనందంగా గడిపిన నా ఊరు వదిలి వెళుతూ ఉంటే ,మనసంతా చీకటి నిండిపోయింది, రోజు వెన్నెల్లో కబుర్లు చెప్పుకున్న జ్ఞాపకాలు మదిని తాకుతూ ఉంటే, నాపై వాలిన వెన్నెల కిరణాలు కూడా ఆ క్షణం నాకు చీకటిలాగే కనిపించాయి, నక్షత్రాలన్నీ నేను ఎక్కిన బస్సు వెంట పరిగెడుతూ వస్తుంటే ,నా బాల్యం నా స్నేహం నా జ్ఞాపకాలు ఒక్కొక్కటిగా వెనక్కి వెళుతూ ఉంటే, నిశ్శబ్దంగా నా మనసు రోదిస్తూ ఉంది ,అప్పుడు మనసులో కెరటాలు లాంటి ఆలోచనలు ,మనసు స్వాంతన కోసం తహదాలాడిపోయింది, నా కలాన్ని మించిన నేస్తం మరొకటి లేదని ,నా నేస్తపు ఆనవాళ్లను అక్షరాల్లో చిత్రీకరించాను ,నా వేదనను వారితో గడిపిన మధురమైన ప్రేమ రాగాలను భద్రంగా కవిత రూపంలో పొందుపరచుకున్నాను, ఈనాడు నా నేస్తాలు నా దగ్గర ఉన్న ఆనాటి జ్ఞాపకాలు మధురంగా నెమరు వేసుకుంటూ ఉంటాం అప్పుడప్పుడు, అందుకే అక్షరంలో ప్రేమ, ద్వేషం అభిమానం ,అనురాగం ,ఆశ్చర్యం ఒక్కటేమిటి ఎన్నో భావాలు పలికించవచ్చునని ఆనాడే నా తొలి కవితకు నాంది పలికాను , నా నేస్తం అనే కవితని నేను రాయడం జరిగింది. నేను గొప్ప రచయిత నవ్వకపోయినా పరవాలేదు ,పది మంది ఆస్వాదించి ఆనందించగలిగే సాహిత్యం అందిస్తే చాలు అనుకున్నాను, నా తొలి కవిత "నా నేస్తం" ,నా నేస్తాలకి ఉత్తరంలో రాసి పంపించాను, నా మనసులోని భావాలన్నింటినీ అక్షరాల్లో తీర్చి వారికి పంపాను, ఆ క్షణం వారు స్పందించిన తీరుకి నాలో ఉత్సాహం రెట్టింపు అయింది, ఆ రోజు నుంచి ఈనాటి దాకా 20 సంవత్సరాలుగా నా సాహిత్య ప్రయాణం కొనసాగుతూ వస్తోంది.

కథ ,కవిత , సిరీస్ ,పాటలు, పద్యాలు, జానపద గేయాలు, తేనీయాలు, రుబాయిలు ,సిసింద్రీలు ,బుల్లెట్ పాయింట్స్, వెంజకాలు ఇలా పలు ప్రక్రియలలో రచనలు చేశాను, కొన్ని పుస్తకాలలో ప్రచురితమయ్యాయి, సమాజం జాగృతం అవ్వడానికి, సమాజ హితానికి రచనలు చాలా అవసరం ,దానికోసం నిరంతరం నేను అన్వేషిస్తాను, నేను ఒక స్త్రీవాదిని, ప్రతిక్షణం ఆమె అంతర్గతాన్ని అన్వేషిస్తూ ,అంతరంగాన్ని చిత్రించే ప్రయత్నమే నా కథాంశాలుగా ఎంచుకోవడానికి ఇష్టపడతాను, నా తొలి సంచిక "శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జీవిత చరిత్ర", ఆ పరమేశ్వరి కృప వలన పుస్తకాన్ని ఆవిష్కరించే ఆశీర్వాదం నాకు లభించింది 1000 ప్రతులు ఉచితంగా అందరికీ పంపిణీ చేయడం జరిగింది,

ప్రతిలిపి అనే సాహిత్య యాప్ లో 272 రచనలు చేయడం జరిగింది( ఇందులో కథలు కవితలు సీరియల్స్ తేనియాలు పద్యాలు అన్ని ప్రక్రియలు పై రచనలు ఉన్నాయి. మామ్స్ ప్రెస్ అనే సాహిత్య యాప్ లో 98 రచనలు చేయడం జరిగింది ,కహానీ యాప్లో ఐదు రచనలు చేయడం జరిగింది, నా కథలలో బహుమతి, ఇల్లాలు అంతరంగం ,పసుపుతాడు, సుందరమ్మ పంచాయతీ, పెండ్లి పత్రిక, నేటి అనుబంధాలు వర్సెస్ రాదా, చాలా కథలు చాలెంజ్ విన్నర్ గా నన్ను నిలిపాయి, అంతర్జాల వేదికగా జరిగిన ఎన్నో పోటీలలో వందకి పైగా నేను ప్రశంసా పత్రాలని అందుకున్నాను 50 పైగా బహుమతి పత్రాలను అందుకున్నాను  ,ఉస్మానియా రచయితల సంఘం నుండి" కవనోద్దండ" బిరుదు పురస్కారం అందుకున్నాను. ప్రతి లిపి నుండి అచీవ్మెంట్ అవార్డు లభించింది, ఇవన్నీ నా జీవితంలో ఎన్నో అపురూపమైన జ్ఞాపకాలు, వృత్తి రిత్యా గణిత ఉపాధ్యాయురాలిని , నాకు మహాకవి శ్రీశ్రీ, సి నారాయణ రెడ్డి గారు ,సుధా మూర్తి గారు, కాలోజీ గారి రచనలు అంటే, చాలా ఇష్టం. వీరి రచనలన్నీ నా లోపల ఎంతో స్ఫూర్తి నింపాయి, సమాజాన్ని చూసే నా యొక్క దృష్టి కోణాన్ని మార్చాయి, నాలో ఒక కథా రచయితకి పునాది వేసాయి, చిన్ననాటి నుండి సాహిత్యం పై గల మక్కువ నన్ను రచయితగా మార్చింది,ఈరోజు మీ అందరికీ ఒక రచయితగా పరిచయం చేసుకునే అవకాశం నాకు కల్పించింది.

అభిరుచి ఉండగానే సరిపోదు, దానికి అవకాశాలని కూడా కల్పించుకోవాలి మనం, బాధ్యతలు నడుమ నా రచన అభిరుచిని కొనసాగించడం కొంతవరకు కష్టతరమైనప్పటికీ అన్ని బాధ్యతలు నెరవేర్చిన తర్వాత, రోజు కొంత కొంత సమయాన్ని కేటాయిస్తూ, నేను సాహిత్య ప్రయాణాన్ని మొదలుపెట్టాను, నేను రచనలు మొదలుపెట్టినప్పుడు నా చుట్టూ జరిగిన అనేక అనేక సంఘటనలన్నీ కథలుగా నేను చిత్రీకరించాను, ఒక కథ ప్రాణం పోసుకోవాలంటే అది నిజ జీవితంలో జరిగిన సంఘటన అయితే ఇంకా మన మనసులకి దగ్గరగా ఉంటుందని, దాని నుంచి మనం ఎన్నో నేర్చుకుని, జీవితంలో ఎదుర్కొనే ధైర్యాన్ని పెంపొందించుకుంటామని... నేను బలంగా నమ్ముతాను అందుకే నిజ జీవిత సంఘటనలను కథలుగా మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను , సాహిత్య ప్రక్రియ ఏదైనా సరే నువ్వు ఆ పాత్రలోకి ప్రవేశించినప్పుడు అద్భుతాలను సృష్టించగలవు, పాత్రలో నిమగ్నమై మనము రాసినప్పుడే పాఠకుల హృదయం స్పందిస్తుంది, ఒక రచయిత్రిగా ప్రతి పాత్రలో నన్ను నేను నిమగ్నం చేసుకొని అనుభూతి చెంది కథలు రాస్తూ ఉంటాను ,కవితలు రాస్తూ ఉంటాను....

సరస్వతీ మాత అనుగ్రహం లేనిదే ఇది సాధ్యం అని నేను అనుకోవడం లేదు, ఆ అమ్మవారి కృపాకటాక్షాలకి సర్వదా శరణాగతి కలిగి ఉంటానని ,"అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే" అని భావిస్తూ ...

సెలవు ధన్యవాదములు🙏 Gayatriteja Edukulla Writer (చర్చ) 10:47, 2 మే 2023 (UTC)[ప్రత్యుత్తరం]