వాడుకరి చర్చ:Gln.sarma

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

Gln.sarma గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
  • ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. రవిచంద్ర (చర్చ) 04:59, 28 జనవరి 2011 (UTC)[ప్రత్యుత్తరం]


ఈ నాటి చిట్కా...
సాంకేతిక ఇబ్బందులు

వ్యాసం అయితే వ్రాస్తాను గాని మూసలూ, పట్టికలూ, లింకులూ ఇలాంటి సాంకేతిక విషయాలతో చాలా గందరగోళంగా ఉంది.

వికీలో సరైన సమాచారంతో, మూలాలతో వ్యాసం వ్రాయడమే అత్యంత ప్రధానమైన అంశం. దానికొరకు {{cite web}} లాంటి మూస వాడడం తప్పదు. కొత్త విజువల్ ఎడిటర్ కు మారితే, సులభంగా మూసలు, పట్టికలు, లింకులు చేర్చవచ్చు. మరిన్ని వివరాలకు మీ చర్చాపేజీలోని తొలి స్వాగత సందేశంలో లింకులు చూడండి. ఇంకా మీకు సందేహాలుంటే, మీ చర్చాపేజీలో అడగండి. సహసభ్యులు స్పందనలతో కొద్ది రోజుల్లో మీరు నేర్చుకోగలుగుతారు.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

మూలాలు చేర్చుట[మార్చు]

వాడుకరి చర్చ:Gln.sarma గారు... తెలుగు వికీపీడియాలో రాస్తుంన్నందుకు ముందుగా మీకు ధన్యవాదాలు. మీరు గబ్బిట దుర్గాప్రసాద్ బాగుంది. అయితే, మీరు ఆ వ్యాసాంలో రాసిన సమాచారానికి సంబంధించిన మూలాలు చేర్చలేదు. మూలాలు ఉంటేనే అది వ్యాసంగా పరిగణించబడుతుంది. కనుక ఫిబ్రవరి 25వ తేది లోపల మూలాలు చేర్చగలరు. అలా చేయని పక్షంలో వ్యాసం తొలగించబడుతుంది.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 21:34, 19 ఫిబ్రవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

బ్లాగ్ ల నుండి యదాతథంగా కాపీ పేస్టు[మార్చు]

వాడుకరి చర్చ:Gln.sarma గారు... మీరు రాసిన హేలాపురి (ఏలూరు )శతకం, సోమగిరి కోదండరామ శతకం వ్యాసాలలోని సమాచారం సరస భారతి ఉయ్యూరు అనే బ్లాగ్ నుండి యదాతథంగా కాపీ పేస్టు చేశారు. అది వికీ నియమాలకు విరుద్ధం. మూలం లోని సమాచారాన్ని తీసుకొని వికీ శైలిలో రాయవలసివుంటుంది. అలా చేయనిపక్షంలో మీరు రాసిన వ్యాసాలు తొలగించబడుతాయి. గమనించగలరు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 19:50, 1 జనవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

వికీ రచన నిబంధనలు, సూచనలు[మార్చు]

వాడుకరి చర్చ:Gln.sarma గారు, వికీపీడియాలో రచనకు సంబంధించి ఈ క్రింది నిబంధనలు, సూచనలు గమనించగలరు:

  1. సమాచారాన్ని వేరే సైట్ల నుండి కాపీ చేసి ఇక్కడ పేస్టు చెయ్యరాదు. తమ కంటెంటును ఫ్రీగా వాడుకోవచ్చని ఆ వెబ్‌సైటులో రాసినా సరే అలా చెయ్యరాదు. ఆ వెబ్‌సైటు స్వయంగా మీదే అయినా సరే అలా కాపీ పేస్టు చెయ్యరాదు. అక్కడి పాఠ్యాన్ని తీసుకుని మళ్ళీ మీ స్వంత వాక్యాల్లో తిరగ రాయాలి. సదరు వెబ్ సైటును మూలంగా ఇక్కడ ఉదహరించాలి (నేను ఈ పాఠ్యాన్ని ఫలానా సైటు నుండి తీసుకున్నాను అని చెప్పాలన్నమాట).
  2. అయితే ఏ సైటు బడితే ఆ సైటును మూలంగా తీసుకోరాదు. స్థూలంగా కింది నియమాలు చూడండి..
    1. వ్యక్తుల స్వంత వెబ్‌సైట్లు, సామాజిక మధ్యమాలు (ట్విట్టరు, బ్లాగులు, ఫేసుబుక్కు వంటి చోట్లు) మూలంగా పనికిరావు.
    2. ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణ వంటి సైట్లు మూలంగా పనికొస్తాయి.
  3. మన స్వంత ఆలోచనలు, అభిప్రాయాలు, మన పరిశోధనలు వాటి ఫలితాలు వికీలో రాయకూడదు. వివిధ ప్రామాణిక ప్రచురణల్లో (గ్రంథాలు, పత్రికలు, వెబ్‌సైట్లు వగైరా) ఉన్న సమాచారాన్ని సేకరించి వికీపీడియా అనే చోట పెడుతున్నాం అనే సంగతిని గ్రహించండి.
  4. మూలం లేందే మనం రాసే సమాచారానికి వికీలో విలువ ఏమీ ఉండదు. సమాచారం ఇంకా వేరే చోట్ల కూడా ఉందా లేక ఈ వ్యక్తి స్వయంగా కల్పించి రాసినదా అనేది చదివేవాళ్ళు కూడా తెలుసుకోగలగాలి. అలా తెలుసుకునే అవకాశం రాసేవాళ్ళు ఇవ్వాలి.
    1. మీరు స్వంతంగా రాసిన కథైతే - వికీలో పనికిరాదు, తొలగించాలి.
    2. ఎక్కడో ఈసరికే రాసి ఉన్న కథైతే ఆ మూలాన్ని ఉదహరించాలి. మూలాలుగా ఏవి పనికొస్తాయో ఏవి పనికిరావో పైన చూసారు కదా!
  5. శైలి: వికీలో రాసే శైలి ఇతర వెబ్‌సైట్లు, సామాజిక మాధ్యమాలతో పోలిస్తే భిన్నంగా ఉంటుంది. అది మీరు రాస్తున్నట్లు రాయకూడదు. ("ఏం జరిగిందో చెబుతాను వినండి", "ఆ సంగతి మనందరికీ తెలిసినదే కదా" లాంటి శైలి వికీకి పనికిరాదు) వికీపీడియా:శైలి చూడండి.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 02:54, 2 జనవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters[మార్చు]

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (చర్చ) 16:37, 30 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.