వాడుకరి చర్చ:JVRKPRASAD/పాత చర్చ 1
JVRKPRASAD/పాత చర్చ 1 గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
- మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
- ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. అర్జున 06:14, 17 సెప్టెంబర్ 2010 (UTC)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #1 |
వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబరు 15
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
గమనించ గలరు
[మార్చు]రామకృష్ణ ప్రసాదుగారూ!
మీరు మంచి విషయాలు చేరుస్తున్నందుకు కృతజ్ఞతలు. క్రింది విషయాలు గమనించగలరు.
- వికీ సంప్రదాయానికి అనుగుణంగా స్వాగత సందేశాన్ని మీ సభ్యుని పేజీనుండి మీ చర్చా పేజీకి మార్చాను. మీ సభ్యుని పేజీలో మీ గురించిన పరిచయం వ్రాయవచ్చును.
- మీరు వ్రాసిన విషయాలలో నేను చిన్న చిన్న సవరణలు చేశాను. "సున్న" రావడానికి "M" నొక్కండి.
- వ్యాసాలలో మీ పేరు వ్రాయవద్దు. ఇది వికీ నిబంధనలకు విరుధ్ధం. ఎందుకంటే ఇక్కడ అన్ని వ్యాసాలూ సమిష్టి కృషిగా పరిగణింపబడుతాయి.
- ఏవైనా సందేహాలుంటే నా చర్చా పేజీలో వ్రాయగలరు.
--కాసుబాబు 08:28, 17 సెప్టెంబర్ 2010 (UTC)
- మీరు వ్యాసాలను వికీ శైలి అనుసరించి రాయండి. "సశేషం, ఇంకా వుంది" అని వ్యాసములో రాయద్దు. అంతేగాక మీరు రాసినదానికి ఆధారాలు పేర్కొనండి. ఊర్వశి వేశ్య కాదు. రంభ, ఊర్వశి, మేనకలు స్వర్గంలో ఉండే అప్సరసలు. --శశికాంత్ 15:08, 17 సెప్టెంబర్ 2010 (UTC)
Sasikanth
[మార్చు]శశికాంత్ గారికి, నమస్కారములు. ఈ రోజు తమరు నాకు సలహా మరియు తప్పు చెప్పినారు. తప్పు:ఊర్వశి వేశ్య అని నేను వ్రాయలేదని గ్రహించగలరు. మీ సలహా తప్పకుండా పాటించేందుకు ప్రయత్నము చేయగలను.
మీ జ.వె.రా.ప్రసాదు.
- ఓహ్, నిజమే. మీకన్నా ముందే వేరే ఎవరో అజ్ఙాత సభ్యుడు రాశాడు. ధన్యవాదాలు. --శశికాంత్ 15:45, 17 సెప్టెంబర్ 2010 (UTC)
- కొత్త వ్యాసాలు సృష్టించడానికి వ్యాసం పేరును కింది పెట్టెలో రాసి , బటన్ నొక్కండి.
ఎర్ర లింకుని నొక్కి కూడా కొత్త వ్యాసాలు సృష్టించవచ్చు.
వంశవృక్షాలు
[మార్చు]ప్రసాద్ గారూ, తెలుగు వికీపీడియా వ్యక్తిగత విషయాలైన వంశవృక్షాలు, వంశచరిత్రలు పొందుపరచుకొనే వెబ్‌సైటు కాదు. మీరు బాగా సమయం వెచ్చించి వంశచరిత్రను ఇక్కడ జోడిస్తున్నారు. అవి ఇవ్వాళో, రేపో తొలగించబడతాయి. ఏమీ అనుకోకపోతే, మీరు సమయం వృధా చేసుకొంటున్నారని చెప్పగలను. తెలుగు వికీలో ఏవైనా సాధారణ విషయాలు వ్రాయగలరు --వైజాసత్య 19:37, 18 సెప్టెంబర్ 2010 (UTC)
- ప్రసాద్ గారు, వైజాసత్యగారు చెప్పినది నిజమే. పూర్వీకుల గురించి, గోత్రనామాల గురించి, మీ వంశవృక్షం గురించి వ్యాసాలు వ్రాయడానికి తెవికీ వేదిక కాదు. ఇందులో అందరికీ ఉపయోగపడే విజ్ఞానకరమైన వ్యాసాలు మాత్రమే వ్రాయవలసి ఉంటుంది. మీరు చేర్చిన సమాచారం మొత్తం త్వరలోనే తొలిగించవలసి ఉంది. ఎందుకంటే తెవికీ నిబంధనలు దీనికి ఒప్పుకోవు. మీరు చేర్చే సమాచారంకై అలాంటి ఉద్దేశ్యం కొరకు ప్రత్యేక వెబ్‌సైట్లు ఏవైనా ఉంటే అక్కడ చేర్చడానికి ప్రయత్నించండి లేదా మీరే ఒక బ్లాగు ప్రారంభించండి. సి. చంద్ర కాంత రావు - చర్చ 07:47, 19 సెప్టెంబర్ 2010 (UTC)
జలసూత్రం వంశ వృక్షం
[మార్చు]మీకు నమస్కారములు. మీరు పంపిన సందేశము అందినది. విషయములు గ్రహించినాను. ముఖ్యముగా తెలియ చేయునది ఏమనగా, మీరు అన్నట్లుగా ప్రస్తుత వ్యక్తుల వివరములు అంతగా అవసరము లేదు. కానీ పూర్వ కాలములో వలె సమిష్టి కుటుంబాలు ఇప్పుడు లేవు. ఉన్నయేక కుటుంబములో కూడా వారి సంతతి దేశాలు విడిఛి యెక్కడెక్కడో నివశిస్తూ వున్నారు. కనీసము ఆ కుటుంబము లోని పిల్లలకు వారి వారి తాత, ముత్తాత ల గురించి పేర్లు కూడా తెలియని ఎంతో మంది వున్నారు. ప్రస్తుతము జరుగుతున్నది అదే. మనము మన పూర్వీకుల గురించి చదువు కుంటున్నాము. అలాగే ఈ 100 సం. వారు మరో 1000 సం. లకు వీరే మనకు పూర్వీకులు అవుతారు. ముఖ్యముగా బ్రాహ్మణ కుటుంబాలలో పూర్వీకులయిన తాత, ముత్తాత ల పేర్లు, గోత్ర నామములు, ప్రవరలు గురించి మంచి, చెడు కార్యక్రమములలో ప్రతి వారు తెలుసుకోవలసి వుంటుంది. వారు యాత్రలలో వుండవచ్చు, విదేశాలలో, తదితరములయిన స్త్తితులలో వుండవచ్చు. తగిన సమయానికి వారికి గుర్తుకు రాక పోవచ్చును. అలాంటి ఇబ్బంది లేకుండా యెంతో విలువైన సమాచారము అని నాకు అనిపించింది. ఈ సమాచారము వలన తెలుగు వారు ఎక్కడ వున్నా మన అందరి బంధుత్వములు యెప్పటికైనా తెలుసుకోగలుగుతారు. దయచేసి వికీ పెద్ద లందరు ఈ విషయము గురించి కూలంకషముగా చర్చ చేయగలరు అని భావిస్తూ వున్నాను. ఇప్పుడు నా వయసు 55 సం.లు. మీరు పెద్దలతో కూడా సంప్రదించ గలరు. అనుకూల మయిన నిర్ణయము తీసుకోగలరని ఆశిస్తూ వున్నాను. మీ పెద్దలందరికీ నమస్కారములు. భవదీయుడు, ़జె.వి.ఆర్.కె.ప్రసాద़్
- ప్రసాద్ గారూ, మీరు పితృసమానులు. నన్ను పెద్దగా భావించవద్దు. మీ ఉద్దేశము, మీరు చేస్తున్న పని రెండూ మంచివే. కానీ వీటికి వికీపీడియా వేదిక కాదని మాత్రమే మనవి చేసుకుంటున్నాను. మీకు వికీ యంత్రాంగం నచ్చితే, ఒక సొంత వికీనీ సులభంగానే స్థాపించుకోవచ్చు. అదేం పెద్ద విషవమేవీ కాదు, తెలుగు బ్లాగు గూగుల్ గుంపులో ఎవరిని అడిగినా మీకు సహాయం చేయగలరు. తెలుగు వంశవృక్షాల వికీని ప్రారంభించి పుణ్యం కట్టుకోండి. అక్కడా అందరూ వాళ్ల వాళ్ళ వంశవృక్షాలు జోడించి మీరనుకున్న లక్ష్యం నేరవేర్చగలరు. మీరు శ్రమతీసుకొని వ్రాసిన విషయాలు ఎక్కడైన పదిలపరచుకొనేవరకు తొలగించకుండా ఉంచుతాము --వైజాసత్య 03:43, 20 సెప్టెంబర్ 2010 (UTC)
నాకు అంతగా కంప్యూటరు గురించి తెలియదు. మీకు ఖాళీ వున్నప్పుడు నాకు సహాయము చేయగలరు. నేను మీలాంటి వారి నుండి తెలుసుకోవలసిన విషయములు యెన్నో వున్నాయి. బుద్దిలో పెద్దవారు, మీ (అందరు)లో నేను ఛాలా చిన్న వాడిని. నాకు సహాయ పడగలరని ఆశిస్తున్నాను. ़08:09, 20 సెప్టెంబర్ 2010 (UTC)జె.వి.ఆర్.కె.ప్రసాద़్
- మన వంశవృక్షాల వికీకి ఏ పేరు పెడదాం? ఉదాహరణకి telugufamily.wikidot.com. పేరు నిశ్చయమవగానే నేను ఒక వికీని ప్రారంభిస్తాను --వైజాసత్య 14:25, 21 సెప్టెంబర్ 2010 (UTC)
నేను తెలుగువంశవృక్షం.వికీ.కాం అని ప్రధానమయిన విభాగము పేరు అని అనుకుంటున్నాను.. ఉప విభాగము: (1) బ్రహ్మణ, (2) వైశ్య, (3) క్షత్రియ, .....ఇలా ఉంటాయి. ఉప ఉప విభాగము: (1) బ్రహ్మణ కుటుంబాలలోని శాఖలు: వైదీకులు, నియోగులు, ఆరువేల నియోగులు, క్షత్రియ బ్రాహ్మణులు, ఆంద్ర వైష్ణవులు, ద్రావిడులు, శ్రీ పాంచరాత్ర బ్రాహ్మణులు, శిష్టు కరణములు, ఆర్వేల అమాత్యులు.........ఇలా ఉంటాయి. ఉప ఉప ఉప విభాగము: (1) వైదీకులు : వీరు వెలనాటి, తెలగాణ్య, మురికి నాట్లు, కాసుల నాట్లు.........అని విభాగాలు ఇలా ఉంటాయి. ఉప ఉప ఉప ఉప విభాగము: (1) వైదీకులు: ఈ శాఖ లోని ఇంటి పేర్లు గల వారు వారి వారి వివరాలు (వంశ చరిత్ర) ఒక్కొక్క పేజీలో పొందుపరుస్తారు. ఉప ఉప ఉప ఉప ఉప విభాగము: లో ఒక్కొక్క ఇంటి పేరు గల వారి చరిత్ర వుంటుంది. క్లిక్ చేస్తే వివరాలు, ఇంటిపేరు వ్రాస్తే వచేవిధముగా, గోత్రము వ్రాస్తే ఆ గోత్రము వారి చరిత్ర,.... ఇలా తెలుగు వికి లా చేయ వచ్చును. ఆలోచించ గలరు. నా బ్లాగు అడ్రస్సు "వాడుకరి" లో ఇచ్చాను. http://jalasutampadmaprasad.blogspot.com/ నాకు కంప్యూటరు అనుభవము లేదు. నేను ఆర్కుట్ లో అక్కడ 5-6 సం. నుంఛి వున్నాను. నాకు నిజ జీవితములో స్నేహితులు లేరు. నాకు అంతా నెట్ స్నేహితులు. ప్రదీపు ని తప్ప యెవరినీ వ్యక్తిగతముగా చూడ లేదు. సహకరించి, సహాయము చేయగలరని ఆశిస్తున్నాను. ़జె.వి.ఆర్.కె.ప్రసాద़్జె.వి.ఆర్.కె.ప్రసాద़్జె.వి.ఆర్.కె.ప్రసాద़్ హిందువులలో చాలా మతాలు వున్నాయి. ముందుగా "మతాలు ఉండాలి. ఆ తరువాత హిందూ మతములో విభాగాలు వుండాలి. గమనించగలరు. ़జె.వి.ఆర్.కె.ప్రసాద़్జె.వి.ఆర్.కె.ప్రసాద़్జె.వి.ఆర్.కె.ప్రసాద़్
వర్గం:తనిఖీ చేయాల్సిన బ్రౌను పదాలు
[మార్చు]వర్గం:తనిఖీ చేయాల్సిన బ్రౌను పదాలు విక్షనరీ లోని వర్గం:తనిఖీ చేయాల్సిన బ్రౌను పదాలు అన్ని పుటలు తనిఖీ ప్రాధమిక స్థాయిలో ఈ రోజున అనగా ది.10.10.2010 తారీఖున పూర్తి అయినది. జె.వి.ఆర్.కె.ప్రసాద్ 09:53, 10 అక్టోబర్ 2010 (UTC)
ధన్యవాదాలు
[మార్చు]- మీ గురించి తెలుసుకొని సంతోషిస్తున్నాను. నాకూ వంశవృక్షాలు వికీలో చేర్చాలని కోరిక. ఎప్పుడు తీరుతుందో. తెలుగు వారి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటాలని చిరకాల వాంఛ. తెలుగు కాలెండరు కు సంబంధించిన పేజీలను విస్తరిస్తున్నాను. దానికి మీలాంటి వారి సహాయం ఎంతో అవసరం. పాలుపంచుకుంటారని భావిస్తాను.Rajasekhar1961 11:21, 27 అక్టోబర్ 2010 (UTC)
- రాజశేఖర్ గారికి,
- మీరు పంపిన సందేశం లోని అంతరార్ధము గ్రహించినాను. ప్రస్తుతము మన తెలుగు వికీలో వంశవృక్షాలు గురించి ఇంకా ఆలోచనలో వున్నారు. తప్పకుండా నా వంతు సహాయ సహకారములు ఎల్లప్పుడూ అందించగలను.
- జె.వి.ఆర్.కె.ప్రసాద్ 13:04, 27 అక్టోబర్ 2010 (UTC)
నేను కాదు మొర్రో...
[మార్చు]ప్రసాదు గారూ, మీరు చదివింది నేను రాయలేదు. JAMBO అనే ప్రభుద్ధుడు రాశాడు. అతడు సంతకం చేయకపోవడం, నేను అందరికన్నా ముందు జవాబు ఇవ్వడంతో నేనే రాశాననుకున్నారు మీరు. అతడి కోసం ఇక్కడ నొక్కండి.
--శశికాంత్ 17:41, 15 నవంబర్ 2010 (UTC)