వాడుకరి చర్చ:JVRKPRASAD/పాత చర్చ 7
నూతన సంవత్సర శుభాకాంక్షలు
[మార్చు]ప్రసాద్ గారూ,
మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు 2015 ఆంగ్ల సంవత్సర ప్రారంభ శుభాకాంక్షలు. మీరు గత కొద్ది కాలంగా మెరుపువేగంతో తెవికీలో కృషి చేయడం నాకు ఎంతగానో స్ఫూర్తినిచ్చింది. ఈ కొత్త సంవత్సరంలో కూడా భగవంతుడు మీకు అలా కృషిచేయడానికి తగిన ఆయురారోగ్యములను అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఇట్లు,
మీ మిత్రుడు
--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 06:34, 2 జనవరి 2015 (UTC)
సమాచారం బాక్సు ఆహారం
[మార్చు]మీరు సృష్టించిన సమాచారం బాక్సు ఆహారం మరియు సమాచారం బాక్సు ఆహారం/doc అనేవి వ్యాసాల కోవలోనికి రావని నా అభిప్రాయం. వాటిని మూసలుగా ఉంచాలేమో పరిశీలించగలరు. వాటిని మూస:సమాచారం బాక్సు ఆహారం మరియు మూస:సమాచారం బాక్సు ఆహారం/doc గా మార్చవలెనని నా భావన. మీరు ఒకసారి పరిశీలించి సరియైన విధంగా మార్చండి.-- కె.వెంకటరమణ⇒✉ 04:01, 10 జనవరి 2015 (UTC)
- మీరు పై విధమైన మూసలు చేశారని గమనించితిని. అయితే పైన తెలుపబడిన వ్యాసాలు సమాచారం బాక్సు ఆహారం మరియు సమాచారం బాక్సు ఆహారం/doc తొలగించవచ్చా?-- కె.వెంకటరమణ⇒✉ 04:03, 10 జనవరి 2015 (UTC)
- ' కె.వెంకటరమణ గారు, అవసరమైతే నేనే తొలగిస్తానండి ! JVRKPRASAD (చర్చ) 04:21, 10 జనవరి 2015 (UTC)
- మీరు పై విధమైన మూసలు చేశారని గమనించితిని. అయితే పైన తెలుపబడిన వ్యాసాలు సమాచారం బాక్సు ఆహారం మరియు సమాచారం బాక్సు ఆహారం/doc తొలగించవచ్చా?-- కె.వెంకటరమణ⇒✉ 04:03, 10 జనవరి 2015 (UTC)
హిందుమతంలో కర్మ
[మార్చు]హిందుమతంలో కర్మ అనే వ్యాసం 7:39, 20 నవంబర్ 2010 న Nikhiladesicrew చే ప్రారంభించబడినది. మీరు ఆ వ్యాసాన్ని మొత్తంగా తొలగించి కర్మ (హిందూ మతము) లో చేర్చి ఒకేసారి మీ పేరున వ్యాసం సృష్టించారు మరియు మీ వ్యాసానికి దారి మార్పు చేశారు. ఈ విధంగా చేస్తే గతంలో కృషిచేసిన వారి కృషికి భంగం వాటిల్లుతుంది. మీరు మార్పు చేయాలంటే ఆ వ్యాసాన్ని వ్యాస చరిత్రకు భంగం వాటిల్లకుండా తరలిస్తే బాగుండునేమో పరిశీలించండి. -- కె.వెంకటరమణ⇒✉ 09:31, 12 జనవరి 2015 (UTC)
- కె.వెంకటరమణ గారు, వ్యాసం దారి మార్పు చేశాను చూడండి. పోనీ మీరు వ్యాసం పేరు కొత్తగా ఈ పేరుతో కర్మ (హిందూ మతము) గా వారి కృషి చెడకుండా ఎలా మార్చాలో మార్చండి. నాకు పేరుతో సంబందం లేదు. JVRKPRASAD (చర్చ) 09:41, 12 జనవరి 2015 (UTC)
- మీరు కోరినట్లు వ్యాస చరిత్రలను విలీనం చేశాను. వ్యాసాన్ని విస్తరించిన వారి కృషిని గుర్తించేందుకు తోడ్పడిన మీకు ధన్యవాదాలు.-- కె.వెంకటరమణ⇒✉ 09:56, 12 జనవరి 2015 (UTC)
- కె.వెంకటరమణ గారు, నాకు ఎలా మార్పు చేయాలో నిజానికి తెలియదు, మీరు చేసినది చూసి, వీలయితే నేర్చుకొని ఆ విధంగా కొత్తవి మార్పు చేస్తాను. నేనే మీకు కృతజ్ఞతలు తెలియ జేయాలి. దయచేసి చరిత్ర చెడకుండా ఎలా మార్పు చేయాలో తెలియజేయ గలరు. మీకు నా నుంచి ధన్యవాదాలండి! JVRKPRASAD (చర్చ) 10:01, 12 జనవరి 2015 (UTC)
- మీరు మొదట హిందుమతంలో కర్మ వ్యాసాన్ని కర్మ (హిందూ మతము) కు దారిమార్పుతో తరలిస్తే సరిపోతుంది. వ్యాసచరిత్ర తరలింపు చేసిన వ్యాసంలోనికి పోతుంది. మీరు అలా చేయకుండా కర్మ (హిందూ మతము) వ్యాసాన్ని సృష్టించారు. ఆ తదుపరి హిందుమతంలో కర్మ అనే వ్యాసం నుండి దారిమార్పు చేశారు. ఆ విధంగా చేసినపుడు మీరు సృష్టించిన వ్యాసంలో పాత వ్యాసం యొక్క చరిత్ర కనబడదు. అపుడు ప్రత్యేక పేజీలు] లో గల "పేజీ పనిముట్లు" ఉపశీర్షిక లో గల "వ్యాస చరిత్రలను విలీనం చేయి" అనే విభాగం ద్వారా రెండు వ్యాసాల చరిత్రలను విలీనం చేయవచ్చు.-- కె.వెంకటరమణ⇒✉ 10:13, 12 జనవరి 2015 (UTC)
- మీరు కోరినట్లు వ్యాస చరిత్రలను విలీనం చేశాను. వ్యాసాన్ని విస్తరించిన వారి కృషిని గుర్తించేందుకు తోడ్పడిన మీకు ధన్యవాదాలు.-- కె.వెంకటరమణ⇒✉ 09:56, 12 జనవరి 2015 (UTC)
- కె.వెంకటరమణ గారు, వ్యాసం దారి మార్పు చేశాను చూడండి. పోనీ మీరు వ్యాసం పేరు కొత్తగా ఈ పేరుతో కర్మ (హిందూ మతము) గా వారి కృషి చెడకుండా ఎలా మార్చాలో మార్చండి. నాకు పేరుతో సంబందం లేదు. JVRKPRASAD (చర్చ) 09:41, 12 జనవరి 2015 (UTC)
పాత చర్చలను ఆర్కైవ్ చేయడము
[మార్చు]ప్రసాద్ గారూ, నమస్కారం.
పాత చర్చలను ఆర్కైవ్ ఎలా చేయాలో తెలుపగలరు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 10:14, 12 జనవరి 2015 (UTC)
- పాత చర్చలు పాత్ర
సుల్తాన్ ఖాదర్ గారు, ముందుగా మీరు వాడుకరి చర్చ:సుల్తాన్ ఖాదర్/పాత చర్చ 1 అనే ఈ పేజీని సృష్టించండి. అందులో మీరు మీ పాత చర్చలు ఎంత వరకు అందులో ఉంచ దలచుకున్నారో అంత వరకు విషయాలను కాపీ చేయండి. తదుపరి, ఆ మొత్తాన్ని మీ కొత్త పేజీలో పేస్ట్ చేయండి. ఆ తదుపరి సేవ్ చేయండి. అంతకు ముందు మీ చర్చా పేజీలో ఉన్న పాత విషయాన్ని తొలగించండి. అంతే. ఒకసారి ప్రయత్నించండి. శుభమస్తు. JVRKPRASAD (చర్చ) 10:22, 12 జనవరి 2015 (UTC)
- ప్రసాద్ గారూ, సత్వర స్పందనకు ధన్యవాదములు. మీరు చెప్పిన విధానం ప్రకారం పాతచర్చలని విజయవంతంగా ఆర్కైవ్ చేశాను.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 10:32, 12 జనవరి 2015 (UTC)
- మూసను మీ చర్చా పేజీలో చెప్పడము మరిచాను. అయినా వాడుకరి:Kvr.lohith గారు వెంటనే స్పందించి మీకు తెలియజేశారు. వారికి కూడా నా ధన్యవాదములు తెలియజేస్తున్నాను. JVRKPRASAD (చర్చ) 10:37, 12 జనవరి 2015 (UTC)
- ప్రసాద్ గారూ, సత్వర స్పందనకు ధన్యవాదములు. మీరు చెప్పిన విధానం ప్రకారం పాతచర్చలని విజయవంతంగా ఆర్కైవ్ చేశాను.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 10:32, 12 జనవరి 2015 (UTC)
నమస్కారం
[మార్చు]నమస్కారం ప్రసాద్ గారు,
మీయొక్క స్వాగతాభినందనలకు కృతజ్ఞతలు. బహుశా మీరు తెలుగు వికీపీడియా నిర్వాహక సిబ్బందిలో ఒకరని నా అభిప్రాయము. కావున నాదొక చిన్న మనవి. మన తెలుగు వికీపీడియాలో "మొదటి పేజీ" అని ఉంది. నేను కొన్ని ఇతర భారతీయ భాషల వికీపీడియాలను చూశాను. అందులో వారు "పేజీ" అనే పదాన్ని కూడా అనువదించి వ్రాశారు. ఉదాహరణకు, మరాఠీలో "ముఖపృష్ఠ" అని ఉంది. మనం కూడా "మొదటి పేజీ" ని "మొదటి పుట" అనో "మొదటి పొరట" అనో వ్రాస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అలా సవరించడానికి నాకు ప్రస్తుతం అర్హత లేదు. అందుకే మీకు తెలియజేస్తున్నాను.
ధన్యవాదములు. --భాషాభిమాని (చర్చ) 06:48, 20 జనవరి 2015 (UTC)
- భాషాభిమాని గారికి, మీకు ముందుగా ధన్యవాదములు. మీరు సూచించినట్లు నేను కూడా ఇంతకు ముందు "పుట" ఉంటే బావుంటుందని మౌఖికంగా చర్చించాను. కానీ ఈ నాటి తరం వారికి, అలాగే చాలా మందికి ఆ పదము అర్థం అంతగా అవదేమో, అవగతం కాదేమోనని విరమించి ముందుకు వెళ్ళలేదు. మరోసారి తప్పకుండా ప్రయత్నము చేద్దాము. JVRKPRASAD (చర్చ) 11:37, 20 జనవరి 2015 (UTC)
మూసలు పని చేయడము లేదు
[మార్చు]- ప్రసాద్ గారూ నాకు మూసల విషయంలో అంత అవగాహన లేదు. దానిపై రహమానుద్దీన్ మీకు సరియైన సలహా సహకారాలు అందించవచ్చు. ఆయనను అడగగలరా.--విశ్వనాధ్ (చర్చ) 04:40, 25 జనవరి 2015 (UTC)
- విశ్వనాధ్ గారు, మీ స్పందనలకు ముందుగా ధన్యవాదములు. రహమానుద్దీన్ గారిని కూడా ఆదిగాను. నేను చేసిన తప్పిదము కాదేమోనని అనుకుంటున్నాను. ఏది ఏమయినా మనకి ప్రస్తుతము ఇబ్బంది కలిగినది. త్వరలోనే సమస్యకు పరిష్కారము లభించ వచ్చునని ఆశిస్తున్నాను. JVRKPRASAD (చర్చ) 04:55, 25 జనవరి 2015 (UTC)
- ప్రసాద్ గారూ నాకు మూసల విషయంలో అంత అవగాహన లేదు. దానిపై రహమానుద్దీన్ మీకు సరియైన సలహా సహకారాలు అందించవచ్చు. ఆయనను అడగగలరా.--విశ్వనాధ్ (చర్చ) 04:40, 25 జనవరి 2015 (UTC)
Hello! Could you translate an article about boycott of Russian goods in Ukraine for the Telugu Wikipedia? Thanks for the help.--Trydence (చర్చ) 22:41, 25 జనవరి 2015 (UTC)
స్వాగతం
[మార్చు]తిరుపతిలో జరుగనున్న తెవికీ 11వ వార్షికోత్సవాల ఉత్సవాలకు మిమ్ములను సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈ రెండు రోజులు అనగా ఫిబ్రవరి 14 మరియు 15 తేదీలలో (రెండవ శనివారం, ఆదివారం) మీరు రావడానికి ముందుగా నమోదు చేసుకున్న వికీ సభ్యులకు వసతి, రవాణా సదుపాయాలు సమకూరుస్తున్నది. కనుక ముందుగా ఇక్కడ మీ పేరు నమోదు చేసుకోండి. |
- T.sujatha గారికి, మీకు ధన్యవాదములు. JVRKPRASAD (చర్చ) 00:18, 30 జనవరి 2015 (UTC)
వాడుకరులపై నిషేధం
[మార్చు]ప్రసాద్ గారూ, వాడుకరులపై నిషేధం చాలా తక్కువగా తప్పనిసరి పరిస్థితుల్లో అన్ని విధాల కుదరకపోయినప్పుడు మాత్రమే ఉపయోగించాలి. దిద్దుబాట్ల విషయంలో అభిప్రాయబేధాలుండటం సహజం. అది నిషేధానికి హేతువు కాదు. వాండలిజం (దుశ్చర్యలు), ఉద్దేశ్యపూర్వకంగా తుడిచివేతలు వంటి తీవ్రచర్యలు మాత్రమే నిషేధయోగ్యమైనవి, అది కూడా రెండు మూడు సార్లు చెప్పిచూసిన తర్వాతే --వైజాసత్య (చర్చ) 05:49, 7 ఫిబ్రవరి 2015 (UTC)
సమాధానము కోసం నిరోధించ లేదండి
[మార్చు]వైజాసత్య గారికి, ఈ రోజున కూడా చాలా వ్యాసాలలో అనేక మార్పులు వారికి తోచిన విధముగా చేశారు. . అందువలన 2 గం. నిరోధించాను, సమాధానము తెలిసి ఇవ్వలేదో, తెలియక ఇవ్వలేదో ఇప్పుడు ఫోను చేసి సంప్రదించాను. నిన్న కూడా ఓ వాడుకరి వారి రచనా వ్యాసాంగమునకు భంగము కలిగినట్లు రాజకీయంగా చర్చ చేశారు. వేగ నిరోధకాలు గమ్యానికి అడ్డురావు కనుక, ముందుకు వెళ్ళుతునే ఉంటాము. మనము పెద్దరికంతో కొత్త తరం వారికి చేతనయినంత ఆసరా అందించి, మనకి తెలిసిన విద్యను భవిష్యత్తు వారికి అందించడమే కర్తవ్యం. JVRKPRASAD (చర్చ) 05:57, 7 ఫిబ్రవరి 2015 (UTC)
12 వ వార్షికోత్సవానికి సంబంధించి
[మార్చు]ప్రసాద్ గారూ, నమస్కారం, కుశలమేనా? తిరుపతి సమావేశాలలో మీరు రాకపోవడం తీవ్రంగా నిరాశ కలిగించింది. మిమ్ములను కలిసే అవకాశం కోల్పోయాను.భవిష్యత్తులో కలిసే అవకాశం తప్పకుండా వస్తుందని ఎదురు చూస్తున్నాను --సుల్తాన్ ఖాదర్ (చర్చ) 06:12, 17 ఫిబ్రవరి 2015 (UTC)
- సుల్తాన్ ఖాదర్ గారు, ఉభయకుశలోపరి. తప్పకుండా వ్యక్తిగతంగా త్వరలోనే కలవగలమని ఆశిస్తున్నాను. మీ అభిమానమునకు నా కృతజ్ఞతలు. ఆ భగవంతుడు (అల్లా) మన అందరకు ఎల్లప్పుడూ అండగా ఉంటాడు. JVRKPRASAD (చర్చ) 06:18, 17 ఫిబ్రవరి 2015 (UTC)
మొలకల జాబితా
[మార్చు]ప్రసాద్ గారూ, ఇదిగో మీ మొలకల జాబితా. వీలైనప్పుడల్లా విస్తరించే ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాను --వైజాసత్య (చర్చ) 06:31, 18 ఫిబ్రవరి 2015 (UTC)
- వైజాసత్య గారు ఒక వ్యాసము మొలకలో ఉన్నదని మనకు ఎలా తెలుస్తుంది ? మొలక నుండి ప్రాథమిక వ్యాసరూపము పొందినదని ఎలా తెలుసుకోవాలి ? వ్యాసమునకు ప్రస్తుతము ఎంత నిడివి ఉండాలి ? దయచేసి తెలియజేయండి. JVRKPRASAD (చర్చ) 06:43, 18 ఫిబ్రవరి 2015 (UTC)
- జాబితా ఇచ్చారు. తప్పకుండా విస్తరిస్తాను. అంతకన్నా సాధ్యము కాకపోతే అ వ్యాస చర్చలో వ్రాస్తాను. ఎటువంటి ఇబ్బంది లేకుండా, వ్యాస విస్తరణ సాధ్యం కాదు అనుకున్నప్పుడు వెంటనే తొలగిస్తాను. మొలకలకు సృష్టికర్తగా మాత్రము ఉండను. అటువంటి మొలకలను తొలగించండి. వేరే ఎవరయినా మరో వ్యాసము కొత్తగా తయారు చేయగలరు. ప్రస్తుతము ఇప్పటి మొలకలు మాత్రము అన్నీ ఒకసారి చూసి, తొలగించాలనుకున్నవి తొలగిస్తాను. వీలయితే విస్తరిస్తాను. JVRKPRASAD (చర్చ) 06:48, 18 ఫిబ్రవరి 2015 (UTC)
- మొలకలను తొలగించడం ఈ జాబితా ఉద్దేశం కాదు. దయచేసి, కేవలం సమాచారం తక్కువగా ఉన్నదని తొలగించవద్దు. అసలు సమాచారం తక్కువగా ఉండటం తొలగించడానికి సరైన కారణం కాదు. --వైజాసత్య (చర్చ) 06:52, 18 ఫిబ్రవరి 2015 (UTC)
- మొలక, వ్యాస పరిమాణము కొలతలు (లెక్కలు) ఏమిటి ? ఎలా ? అనే విషయాలు దయచేసి తెలియజేయండి. JVRKPRASAD (చర్చ) 06:55, 18 ఫిబ్రవరి 2015 (UTC)
- వైజాసత్య గారు ఒక వ్యాసము మొలకలో ఉన్నదని మనకు ఎలా తెలుస్తుంది ? మొలక నుండి ప్రాథమిక వ్యాసరూపము పొందినదని ఎలా తెలుసుకోవాలి ? వ్యాసమునకు ప్రస్తుతము ఎంత నిడివి ఉండాలి ? దయచేసి తెలియజేయండి. JVRKPRASAD (చర్చ) 06:43, 18 ఫిబ్రవరి 2015 (UTC)
రైల్వే లలో వాడు టెక్నాలజీ (సాంకేతిక) అంశాలపై వ్యాసాలు
[మార్చు]ప్రసాద్ గారూ, నమస్కారము. రైల్వే వ్యాసలను చక్కగా విస్తరిస్తున్నందుక అభినందనలు. అలాగే రైల్వేలలో ఉపయోగించే సాంకేతిక అంశాలపై కూడా వ్యాసాలు రాస్తే మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థులకు ఉపయుక్తంగా ఉంటుందని అనుకుంటున్నాను. పరిశీలించగలరు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 09:38, 18 ఫిబ్రవరి 2015 (UTC)
- సుల్తాన్ ఖాదర్ గారు, మీ సలహా, సూచనలు బాగున్నాయి. కానీ మొలకలు జాబితలో అవి చేరిపోతాయి. మొలక గురించిన ప్రమాణాలు తెలుసుకోవాలంటే ఎవరు తెలియజెప్పడం లేదు. రైల్వేలు గురించి ఒక ప్రాజెక్టుగా పని జరుగుతున్నది. అప్పుడు సినిమా వ్యాసముల వలెనే మొలకలు వర్తించ కూడదు. ఇంకా అనేక విషయాలు ప్రస్తావించాలి. అందుకు సరి అయిన సహకారము అవసరము. నా సందేహాలు వాడుకరుల పని (నాణ్యత మరియు పరిమాణము) గురించి ఉన్నాయి. సందేహాలు తీరకపోయినా, అయినా నేను వ్రాస్తునే ఉంటాను. JVRKPRASAD (చర్చ) 10:59, 18 ఫిబ్రవరి 2015 (UTC)
deletion of my user page
[మార్చు]Can you please delete my user page? So, I can see my global page there.☆★సంజీవ్ కుమార్ (చర్చ) 10:24, 22 ఫిబ్రవరి 2015 (UTC)