వాడుకరి చర్చ:సుల్తాన్ ఖాదర్/పాత చర్చ 1

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సుల్తాన్ ఖాదర్/పాత చర్చ 1 గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
  • ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.png రవిచంద్ర(చర్చ) 15:56, 5 జూలై 2009 (UTC)


ఈ నాటి చిట్కా...
Wiki-help.png
వికీ పీడియాలో మీరు వ్రాసింది మీ స్వంతం కాదు

తాము ఎంతో కష్టపడి వ్రాసిన వ్యాసాలు ఇతరులు (ఒకోమారు నిర్దాక్షిణ్యంగా) తప్పు పట్టినా, మార్చేసినా రచయితలకు కష్టం కలుగుతుంది. వికీపీడియా ఎవరైనా రాయదగిన ఒక స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము అని మొదటి పేజీలోనే చెప్పేశారు కదా?

కొద్ది పరిమితులలో మాత్రమే వ్యాసాలపై ఇతరులు చేసే మార్పులకు మీరు ఆభ్యంతరం పెట్టవచ్చును. మరి కొన్ని వివరాలకు en:Wikipedia:Ownership of articles అనే ఆంగ్ల వికీ వ్యాసం చూడండి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

ఈ తనంతట తాను అప్‌డేట్ అయ్యే మూసను మీ సభ్య పేజీలో తగిలించుకోవడానికి {{ఈ నాటి చిట్కా}}ను వాడండి.


కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

చిన్న మాట[మార్చు]

సుల్తాన్ ఖాదర్ గారూ! జానపద కళాకారుడు మునెయ్య గారి గురించి సమాచారం చేరుస్తున్నందుకు సంతోషం. ఆయన గురించి మీడియాలో ఎక్కడైనా ప్రచురించిఉంటే వాటిని కూడా వ్యాసంలో తెలియజేయండి. ఆయనకు ఏవైనా అవార్డులు వచ్చి ఉంటే వాటి గురించి కూడా ప్రస్తావించండి. —రవిచంద్ర (చర్చ) 15:41, 8 ఆగష్టు 2009 (UTC)

రవిచంద్రగారికి ధన్యవాదములు. డాక్టర్ మునెయ్య 80 వ దశకంలో రాయలసీమ జిల్లాలలో పేరుగన్న జానపద గాయకుడు. మరుగున పడుతున్న జానపదగేయాలను ఎంతో శ్రమకోర్చి సేకరించడమే కాకుండా వాటిని విస్తృతంగా ప్రచారం చేసారు. వీరు వృత్తిపరంగా ఉపాధ్యాయుడు ఐననూ జానపదగేయాలపై ప్రత్యేక అభిమానంతో ఇంతటి కృషి చేసారు. దురదృష్టవశాత్తు ఒక ప్రమాదంలో వీరు చనిపోవడం జరిగింది. అప్పటిలో ప్రచారమాధ్యమాలు ఇంతగా విస్తరించకపోవడం వలన వీరు తన స్థాయికి తగినట్లుగా ప్రచారాన్ని పొందలేకపోయారు. ఈ వ్యాసము కల్పితం అయి ఉండవచ్చునని మీ అభిప్రాయము కాబోలు. అది నిజంకాదని మనవి. అయిననూ మీకు నమ్మకము కలుగకపోయినచో ఈ వ్యాసాన్ని తొలగించగలరు. తుది నిర్ణయం మీదే.--సుల్తాన్ ఖాదర్ 08:16, 9 ఆగష్టు 2009 (UTC)

సుల్తాన్ ఖాదర్ గారూ! నా ఉద్దేశ్యం ఈ వ్యాసాన్ని మీరు కల్పించి రాస్తున్నారని కాదు. మరికొంత సమాచారం చేర్చమని మాత్రమే. వికీపిడియాలో చిన్న చిన్న వ్యాసాలు ఎక్కువై నాణ్యత తగ్గిపోతుందన్న సంగతి మీకు తెలిసే ఉంటుంది. అందులో భాగంగానే కొత్తగా సృష్టించే వ్యాసాలు కనీస సమాచారం ఉండేటట్లుగా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. వ్యాసాన్ని తొలగించే తుది నిర్ణయం నాది కాదు. తెవికీ ఒక సమిష్టి కృషి. అందరి ఆమోదంతోనే ఎలాంటి నిర్వహణ కార్యాలైనా నిర్వర్తింపబడతాయి. ఆయనకు ప్రచార మాధ్యమాలు తగినంత ప్రాధాన్యం ఇవ్వలేదనే సంగతి మీరు చెబితేనే కదా నాకు తెలిసింది. అయినా మీరు ఆయన గురించి విషయాలు సేకరించి రాస్తే ఒక జానపద కళలకు వీరాభిమానిగా నా కంటే సంతోషించే వారు ఉండరు. —రవిచంద్ర (చర్చ) 13:13, 9 ఆగష్టు 2009 (UTC)

రవిచంద్ర గారికి, మీ సూచనలకు ధన్యవాదములు. శ్ర్రీ మునెయ్య గారి గురించి మరికొంత సమాచారాన్ని వ్యాసంలో తెలియజేయడం జరిగింది. పరిశీలించగలరు. అలాగే ప్రస్తుతము ఆయన జీవించిలేరు కనుక ఆయన గురించిన మరిన్ని విశేశాలు మరియు ఆయన సేకరించిన వేలాది పాటల వివరాలు సేకరించడానికి కొద్ది సమయం పడుతుంది. కనుమరుగవుతున్న జానపద కళల పట్ల మీరు చూపిన ఆసక్తి ఇలాంటి మరికొన్ని వ్యాసాలు వ్రాయడానికి నన్ను మరింత ప్రోత్సహించింది.--సుల్తాన్ ఖాదర్ 08:04, 10 ఆగష్టు 2009 (UTC)

మోరగుడి[మార్చు]

సుల్తాన్ ఖాదర్ గారూ, మీది మోరగుడా? --వైజాసత్య 21:37, 9 ఆగష్టు 2009 (UTC)

లేదండి వైజాసత్యా గారు. ఎందుకలా అడిగారు?--సుల్తాన్ ఖాదర్ 08:05, 10 ఆగష్టు 2009 (UTC)

మీరు మోరగుడి గురించి వ్రాయటం చూశాను. అందుకని మీకు ఆ ఊరు తెలుసనుకున్నాను. పదోతరగతిలో నా స్నేహితురాలు ఒకమ్మాయి వాళ్ళ ఊరు మోరగుడి. అలా తెలుసు నాకా ఊరు. జమ్మలమడుగు చాలా సార్లు వెళ్ళాను కానీ మోరగుడి ఎప్పుడూ వెళ్లలేదు --వైజాసత్య 05:55, 2 జూన్ 2010 (UTC)

ధన్యవాదాలు[మార్చు]

సలాం వాలేకుం సుల్తాన్ భాయ్! కల్ హో న హో, రబ్ నే బనాదీ జోడీ, వోక్స్ వాగన్ వంటి నా వ్యాసాలను సరిచేయటం గమనించాను. చొరవ తీసుకున్నందుకు ధన్యవాదాలు. తెలుగు, ఆంగ్లంలో ఉన్నంత పట్టు నాకు హిందీలో లేదు. (Conversational Skills వరకు అయితే సరి కానీ వ్యాకరణంలో కొద్దిగా బలహీనుణ్ణే!) కావున ఏ భాషలోనైననూ ఏదేని తప్పిదం జరిగిన దయచేసి సరిచేయగలరు. ధన్యవాదములు - వీర శశిధర్ జంగం 08:43, 27 మే 2010 (UTC)

2010 తెలుగు సినిమా వర్గం[మార్చు]

రవిచంద్రగారు 2010 తెలుగు సినిమాలు వర్గాన్ని సృష్టించేవిషయాన్ని పరిశీలించగలరు. అలాగే ఆంగ్ల వికీ మూసల సోర్సుకోడు కోసం ఎక్కడ వెతకాలో తెలియజేయగలరు. --సుల్తాన్ ఖాదర్ 06:19, 12 జూలై 2010 (UTC)

వర్గం:2010 తెలుగు సినిమాలు వర్గం సృష్టించాను. మనకు మూస అనే నేమ్ స్పేస్ ఎలా ఉందో ఆంగ్ల వికీలో Template అనే నేమ్‌స్పేస్ ఉంటుంది. ఉదాహరణకు Infobox Person అనే మూస ఆంగ్ల వికీ లో Template:Infobox Person అనే పేజీలో ఉంటుంది. --రవిచంద్ర (చర్చ) 15:52, 12 జూలై 2010 (UTC)

అదిలాబాదు జిల్లా ప్రముఖులు వర్గం[మార్చు]

చంద్రకాంతరావు గారూ, ఆదిలాబాద్ జిల్లా ప్రముఖులు వర్గాన్ని సృష్టించవలసిందిగా మనవి. సుల్తాన్ ఖాదర్

సుల్తాన్ ఖాదర్ గారు, అదిలాబాదు వర్గాన్ని సృష్టించాను. వర్గాన్ని సృష్టించడం చాలా సులభం. ఆ వర్గం ఏ ప్రధాన వర్గంలో చేరుతుందో ఆ వర్గాన్ని లేదా వర్గాలను పేజీలలో చేరిస్తే చాలు. సి. చంద్ర కాంత రావు - చర్చ 19:11, 23 అక్టోబర్ 2010 (UTC)

Invite to WikiConference India 2011[మార్చు]

WCI banner.png

Hi సుల్తాన్ ఖాదర్,

The First WikiConference India is being organized in Mumbai and will take place on 18-20 November 2011.
You can see our Official website, the Facebook event and our Scholarship form.

But the activities start now with the 100 day long WikiOutreach.

Call for participation is now open, please submit your entries here. (last date for submission is 30 August 2011)

As you are part of Wikimedia India community we invite you to be there for conference and share your experience. Thank you for your contributions.

We look forward to see you at Mumbai on 18-20 November 2011

Copyright problem: దస్త్రం:Susarla.jpg[మార్చు]

Hello, and welcome to Wikipedia! We welcome and appreciate your contributions, such as దస్త్రం:Susarla.jpg, but we regretfully cannot accept copyrighted text or images borrowed from either web sites or printed material. This article appears to contain material copied from http://eenadu.net/Homeinner.aspx?qry=break10, and therefore to constitute a violation of Wikipedia's copyright policies. The copyrighted text has been or will soon be deleted. While we appreciate contributions, we must require all contributors to understand and comply with our copyright policy. Wikipedia takes copyright violations very seriously, and persistent violators are liable to be blocked from editing.

If you believe that the article is not a copyright violation, or if you have permission from the copyright holder to release the content freely under license allowed by Wikipedia, then you should do one of the following:

It may also be necessary for the text be modified to have an encyclopedic tone and to follow Wikipedia article layout. For more information on Wikipedia's policies, see Wikipedia's policies and guidelines.

If you would like to begin working on a new version of the article you may do so at [[[:మూస:Fullurl:Talk:దస్త్రం:Susarla.jpg/Temp]] this temporary page]. Leave a note at [[Talk:దస్త్రం:Susarla.jpg]] saying you have done so and an administrator will move the new article into place once the issue is resolved. Thank you, and please feel welcome to continue contributing to Wikipedia. Happy editing! అర్జున 16:49, 12 ఫిబ్రవరి 2012 (UTC)

మరల స్వాగతం[మార్చు]

సుల్తాన్ ఖాదర్ గారు, మీరు మరల తెవికీలో మార్పులు చేస్తున్నందులకు సంతోషం. మీలాంటి అనుభవజ్ఞులు సహకారం తెవికీ ఎంతో అవసరం. --అర్జున (చర్చ) 04:14, 4 మే 2012 (UTC)

పతకం[మార్చు]

తెలుగు మెడల్.JPG
సుల్తాన్ ఖాదర్ గారికి, తెవికీ లో వివిధ అంశాలపై మీ కృషికి అభివందనలు. గుర్తింపుగా ఈ మెడల్ ప్రదానం చేస్తున్నాను--అర్జున (చర్చ) 09:03, 1 జూలై 2012 (UTC)

2012 లోమీ కృషికి అభివందనలు[మార్చు]

2012ArticleBarnstar.png--అర్జున (చర్చ) 07:04, 15 జనవరి 2013 (UTC)

సినిమా వ్యాసాలు[మార్చు]

సినిమాల గురించి వ్యాసాలు తిరిగి ప్రారంభించినందుకు ధన్యవాదాలు. సమాచార పెట్టె కాకుండా కొత్త సినిమాల పేజీల్లో కనీసం నటీనటుల పేర్లైనా చేరిస్తే బాగుంటుంది. లేకపోతే అవన్నీ ఖాళీగా చాలా కాలం అలాగే ఉంటున్నాయి. దయచేసి అర్ధం చేసుకోండి.Rajasekhar1961 (చర్చ) 06:08, 1 ఫిబ్రవరి 2013 (UTC)

సినీ వ్యాసాల్ని చిన్నవిగానే విడిచిపెట్టకుండా విస్తరించి పెద్దవిచేస్తున్నందుకు ధన్యవాదాలు. కొత్తవే కాకుండా మంచి పాత సినిమాలను కూడా విస్తరించండి. నేను కూడా సహాయం చేస్తాను.Rajasekhar1961 (చర్చ) 07:37, 19 ఫిబ్రవరి 2013 (UTC)

పైకప్పు పంఖా[మార్చు]

సుల్తాన్ ఖాదర్ గార్కి నమస్కారములు,

మీరు సీలింగ్ ఫ్యాన్ యొక్క తెలుగు పేరు పైకప్పు పంఖా గా మార్చారు. సాధారణంగా పంఖా అనగా విసనగర్ర,వీవెన అనే అర్థం వస్తుంది. అది మన శక్తితో పనిచేస్తుంది. కాని సీలింగ్ ఫ్యాను అనునది విధ్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మార్చి తిరిగి గాలినిచ్చే సాధనం. దీనిని పైకప్పు పంఖా అనవచ్చునా! కొన్ని ఆంగ్లపదములకు సరియైన తెలుగు పదములు లభించవు. ఇంచుమించు సమానార్థం ఇచ్చే అర్థాలు లభిస్తాయి. కొన్ని అన్య భాషా పదములు జన సామాన్యంలో విరివిగా వాడేవి ఉంటాయి. వాటిని వాటిగానే చదవాలి గాని అచ్చమైన తెలుగులోనికి తర్జుమా చేయలేమని గమనించాలి. మనం వాడే "బస్సు" అనే పదం ఆంగ్ల పదమైనా దానిలాగానే చదవాలి కాని చతుష్చక్ర వాహనం అని అనిన ఎవరికీ అర్థం కాదు మరియు అటువంటి వాహనాలు అనేకం ఉంటాయి. కనుక కొన్ని పదాలు అన్యభాషా పదాలైనను వాటిని తర్జుమా చేయరాదని గమనించాలి.దీనిపై చర్చ జరపకుండా వ్యాస నామమును మార్చవచ్చునా?( కె.వి.రమణ- చర్చ 16:28, 13 ఫిబ్రవరి 2013 (UTC))

Nuvola apps edu languages.svg
నమస్కారం సుల్తాన్ ఖాదర్ గారూ. మీకు Arjunaraoc గారి చర్చా పేజీ లో కొత్త సందేశాలు ఉన్నాయి. దయచేసి చదవండి.
 {{Talkback}} ను లేదా {{Tb}} మూసను తీసేసి, మీరీ నోటీసును ఎప్పుడైనా తొలగించవచ్చు.
మీరు తెలుగు పదముల అభివృద్ధికి కృషిచేయటం తెలుగు వారు గర్వించదగ్గ విషయం. మీ వాదనతో ఏకీభవిస్తాను. "పైకప్పు పంఖా" శీర్షిక బాగుంది. దయచేసి "టెలివిజన్" కు సరైన తెలుగు పదం తెలుపగలరు. భౌతిక శాస్త్రం లో "టెలిస్కోప్" అనిన "దూరదర్శిని" అని అర్థం. మరి టెలివిజన్ వ్యాసం వ్రాయాలనుకుంటున్నాను. సహాయం చేయండి.  కె. వి. రమణ. చర్చ 14:24, 20 ఫిబ్రవరి 2013 (UTC)
స్పందనకు ధన్యవాదములు. మీరు సూచించినట్లు తెవికీ లో గల దూరదర్శన్ వ్యాసాన్ని విస్తరిస్తాను. భౌతిక శాస్త్ర అభివృద్ధికి మీరు సహయపడగలిగితే నా శాయశక్తులా విస్తరిస్తానని తెలియజేసుకుంటున్నాను. మీ వంటి విజ్ఞుల సహాయ సహకారములుంటే తెవికీని నాకు తెలిసిన అంశాలను అభివృద్ధి పరుస్తాను.(  కె. వి. రమణ. చర్చ 15:34, 20 ఫిబ్రవరి 2013 (UTC))

యోగి వేమన విశ్వవిద్యాలయం..వ్యాసం . విలీనం గురించి[మార్చు]

తెలుగు పేరు మార్చుట[మార్చు]

రేడియో అనే వ్యాసం యొక్క తెలుగుపేరు ఆకాశవాణి కి తరలిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. (  కె. వి. రమణ. చర్చ 09:24, 24 ఫిబ్రవరి 2013 (UTC))

టెలిఫోన్ అనే వ్యాసం యొక్క పేరును దూరవాణి అనిన బాగుంటుందేమో పరిశీలించగలరు.(  కె. వి. రమణ. చర్చ 09:30, 24 ఫిబ్రవరి 2013 (UTC))
అనేక ఎలక్ట్రానిక్ పరికరాలు, వివిధ పరికరాలు భౌతిక శాస్త్రంలో ఉంటాయి. వాటి వివరాలను సంగ్రహంగా తెలిపే మూస ఏదైనా ఉన్నదా? పరికరం,ఆవిష్కర్త,ఉపయోగం, కనుగొనే సంవత్సరం,ఇతర పేర్లు,వంటి అంశాలతో ఏదైనా పరికర సమాచారం తెలిపే మూస ఏదైనా ఉంటె తెలియజేయండి(  కె. వి. రమణ. చర్చ 09:42, 24 ఫిబ్రవరి 2013 (UTC))

తెలుగు సినిమా నటీమణులు[మార్చు]

ఈనెల తెలుగు వికీపీడియాలో మహిళా దినోత్సవం జరుగుతున్న సందర్భంగా తెలుగు సినిమాలలో మీకున్న ఆసక్తి గురించి తెలిసి నేనొక ప్రతిపాదన చేస్తున్నాను. తెలుగు సినిమాలో నటించిన నటీమణుల వ్యాసాలు ఆంగ్లంలో చాలా ఉన్నాయి. వాటిలో కొన్నింటిని తెలుగులోని చేర్చి, లేకపోతే ప్రారంభించి విస్తరించండి. మేము కూడా సహాయం చేస్తాము. మీకు అభ్యంతరం లేకపోతేనే. ధన్యవాదాలు.Rajasekhar1961 (చర్చ) 08:06, 4 మార్చి 2013 (UTC)

మీ స్పందనకు ధన్యవాదాలు. ఈ జాబితా చూడండి: తెలుగు సినిమా నటీమణులు. ఇవి ఆకార క్రమంలో ఉన్నాయి. ఇది ఆంగ్ల వికీపీడియాలో భారతీయ సినిమా నటీమణుల జాబితా: en:List of Indian film actresses చాలా మంది గురించి వ్యాసాలున్నాయి. తెలుగు నటీమణులకు సంబంధించిన వారి వ్యాసాలను తీసుకొని అనువదించండి. శుభాకాంక్షలు.Rajasekhar1961 (చర్చ) 11:51, 4 మార్చి 2013 (UTC)
రాజసులోచన వ్యాసాన్ని విస్తరిస్తున్నారు కదా. ఈ హిందూ వ్యాసం చాలా బాగుంది. [1] చూసి సమాచారాన్ని వ్యాసంలోకి చేర్చండి. Rajasekhar1961 (చర్చ) 06:29, 5 మార్చి 2013 (UTC)

వివరాలు[మార్చు]

సుల్తాన్ ఖాదర్ గారూ ! మీకు అభ్యంతరం లేకుంటే మీ సభ్యపేజీలో మీ స్వస్థలం ప్రస్థుత నివాస స్థలం వంటి వివరాలను చేర్చగలరా ? --t.sujatha (చర్చ) 12:25, 9 మార్చి 2013 (UTC)

సుల్తాన్ ఖాదర్ గారూ పరవా లేదు. మీపని మామూలుగా కొనసాగించండి.--t.sujatha (చర్చ) 03:08, 11 మార్చి 2013 (UTC)

అభినందనలు మరియు ఇంగ్లిష్ వికీపీడియా నుండి లింకులు[మార్చు]

నమస్కారం సుల్తాన్ ఖాదర్ గారు. మీరు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తె-వికీలో చేస్తున్న కృషి చాలా అభినందనీయం. ఇలాగే continue చేయండి. ఒక చిన్ని సలహా. మీరు ఇంగ్లిష్ వికీపీడియా నుండి లింకులు ఇస్తున్నప్పుడు బహిర్గత లింకులుగా ఇస్తున్నారు. వాటిని అంతర్గత లింకులుగా ఇస్తే బాగుంటుంది. Sample గా మీరు చేసిన స్వాతి పిరమాల్ వ్యాసంలో నేను సవరణలు చేసాను. మీరు దీనిని follow అవుతారని ఆశిస్తూ...విష్ణు (చర్చ)21:33, 9 మార్చి 2013 (UTC)

ధన్యవాదాలు విష్ణు గారు. అంతర్గత లింకుల విషయంలో మీ సూచనలను తప్పక పాటిస్తాను.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 05:17, 10 మార్చి 2013 (UTC)
చాలా సంతోషమండి సుల్తాన్ ఖాదర్ గారు. నాకు సినిమాలంటే మక్కువ విష్ణు (చర్చ)06:05, 10 మార్చి 2013 (UTC)

దూరదర్శిని పై చర్చ[మార్చు]

నేను దూరదర్శిని లో నా అభిప్రాయాలను తెలియజేశాను. మీరు చర్చ:దూరదర్శిని లో స్పందించండి.(  కె. వి. రమణ. చర్చ 05:54, 10 మార్చి 2013 (UTC))

హైదరాబాదులో తెవికీ సమావేశం[మార్చు]

సుల్తాన్ ఖాదర్ గారూ ! రాబోయే ఉగాది రోజున హైదరాబాదులో వికీపీడియా:సమావేశం/2013 తెవికీసమావేశం(ఇది పరిశీలించి) నిర్వహించాలనుకునే తెవికీ సర్వసభ్య సమావేశం గురించి మీ అభిప్రాయం తెలియ జేయండి.--t.sujatha (చర్చ) 05:08, 13 మార్చి 2013 (UTC)

తెవికీ సమావేశం - మీరు తప్పక రావాళి[మార్చు]

సుల్తాన్ ఖాదర్ గారు మీరు మన తెవికీ సమావేశానికి తప్పక రావాలండి. ఉండడానికి మా ఇంట్లో కాసింత చోటుంది. మీరు రాలేకపోవడానికి కేవలం మీరు హైదరాబాదు వెలుపల ఉండడం అంతా ఇబ్బంది కరమైన కారణం కాదని నా నివేదన. విష్ణు (చర్చ)04:39, 15 మార్చి 2013 (UTC)

విష్ణు గారూ, మీ ఆత్మీయ ఆహ్వానానికి మరియు అభిమానానికి మిక్కిలి ధన్యవాదములు. ఆ వారంలో నేను హైదరాబాదు వెలుపల ప్రయాణంలో ఉండటం వలన రావడం వీలు కాదు. ప్రయాణ తేదీలు సహకరిస్తే తప్పక హాజరౌతాను. మీ ఆదరణకు మరొక్కసారి ధన్యవాదములు.సుల్తాన్ ఖాదర్ (చర్చ) 06:53, 15 మార్చి 2013 (UTC)

భౌతిక శాస్త్రం - పారిభాషిక పదాలు(ఆంగ్లం-తెలుగు)[మార్చు]

మీ అభీష్టం మేరకు విధ్యార్థులకు అవసరమైన పారిభాషిక పద కోశాన్ని తయారు చేసితిని. దీనికి మీ సహకారం అవసరం. మీ వద్ద గల సమాచారాన్ని అందులో చేర్చిసహకరించండి  కె. వి. రమణ. చర్చ 23:39, 23 మార్చి 2013 (UTC)

చూశాను రమణ గారూ, చాలా ఉపయుక్తంగా ఉన్నది. నా దగ్గరున్న తెలుగు అకాడమీ వారి పారిభాష పదకోశం ఉపయోగించి ఈ వ్యాసాన్ని అభివృద్ది చేయడానికి ప్రయత్నిస్తాను. అలాగే రాబోవు తెవికీ మహోత్సవంలో దీని పై చర్చించి తెలుగు విద్యార్థిలోకానికి దీనిని పరిచయం చేస్తే వారికి చాలా మేలు కలుగుతుంది.సుల్తాన్ ఖాదర్ (చర్చ) 05:33, 27 మార్చి 2013 (UTC)
స్పందనకు ధన్యవాదాలు. నేను ఇంకా విస్తరించటానికి ప్రయత్నిస్తాను.-- - -  కె.వెంకటరమణ చర్చ 09:36, 27 మార్చి 2013 (UTC)
నేను కూడా ఈ నిఘంటువు విస్తరణలో భాగమై కొంత సమాచారాన్ని చేరుస్తున్నాను.Rajasekhar1961 (చర్చ) 14:54, 30 మార్చి 2013 (UTC)

సినిమా పాటలు[మార్చు]

మీరు తెలుగు సినిమా వ్యాసాల మీద, మరియు బొమ్మల గురించి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నందుకు ధన్యవాదాలు. అలాగే రాగా.కాం లాంటి వెబ్‌సైటు నుండి ఆయా సినిమాలలో పాటల్ని, సంగీత దర్శకుల్ని, గాయకుల్ని గురించి మంచి వివరాలు సేకరించి చేర్చవచ్చును.Rajasekhar1961 (చర్చ) 14:40, 30 మార్చి 2013 (UTC)

మిధునం, జఫ్ఫా పోస్టర్లు[మార్చు]

నమస్కారం సుల్తాన్ గారు. నిజానికి ఆంగ్ల వికీలోని పోస్టర్లనే చేర్చాలనుకున్నను. కానీ ఎందుకో ఇవి ఆంగ్ల వికీలోని పోస్టర్లకంటే అందంగా, మంచి క్లారిటీతో ఉండటాన్ని గమనించాను. అందుకే వీటిని ఎగుమతి చేసాను. మీరు ఇచ్చిన ఈ సమాచారానికి ధన్యవాదాలు.Pavanjandhyala (చర్చ) 06:04, 1 ఏప్రిల్ 2013 (UTC)

పంట్లాము గురించి[మార్చు]

సలాం సుల్తాన్ భాయ్! ప్రస్తుతానికి పంట్లాముని ప్యాంటుకి రీ-డైరెక్టు చేశాను. బహు కొద్ది మందికే పంట్లాము గురించి తెలుసు. (ఈ చర్చ చూసేవరకు నాకు కూడా తెలియదు!) అందుకే ప్యాంట్, ప్యాంట్స్, ప్యాంట్సు, ట్రౌజర్, ట్రౌజరు, ట్రౌజర్స్, ట్రౌజర్సు లని అన్నింటినీ ప్యాంటు కే రీ-డైరెక్టు చేశాను. అలాగే పంట్లాముని కూడా ప్యాంటు కే రీ-డైరెక్టు చేశాను. - శశి (చర్చ) 05:49, 6 ఏప్రిల్ 2013 (UTC)

ప్రత్యుత్తరం[మార్చు]

Nuvola apps edu languages.svg
నమస్కారం సుల్తాన్ ఖాదర్ గారూ. మీకు T.sujatha గారి చర్చా పేజీ లో కొత్త సందేశాలు ఉన్నాయి. దయచేసి చదవండి.
Message added 13:24, 8 ఏప్రిల్ 2013 (UTC).  {{Talkback}} ను లేదా {{Tb}} మూసను తీసేసి, మీరీ నోటీసును ఎప్పుడైనా తొలగించవచ్చు.

t.sujatha (చర్చ) 13:24, 8 ఏప్రిల్ 2013 (UTC)

తెలుగు ప్రముఖులు[మార్చు]

తెలుగు ప్రముఖులు ప్రాజెక్టు ప్రారంభించాను. మీరు ఇంతకుముందు మహిళల వ్యాసాల విషయంలో చేసిన సహాయం మరువలేను. అదేవిధంగా ఈ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులో మీరు భాగస్వాములై; తెలుగు సినిమాకు చెందిన వ్యక్తుల వ్యాసాలను విస్తరిస్తారని; ఒకవేళ లేకపోతే కొత్త వ్యాసాల్ని ప్రారంభిస్తారని కోరుతున్నాను. ఒకసారి ప్రాజెక్టు పేజీలో వివరాలను చూడండి. ధన్యవాదాలు.Rajasekhar1961 (చర్చ) 19:37, 5 మే 2013 (UTC)

నాకు తెలిసిన మరియు సేకరించిన విషయాలను ఈ ప్రాజెక్టు పేజీలో చేర్చి విస్తరించడానికి కృషిచేస్తాను .--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 14:39, 23 మే 2013 (UTC)

మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు[మార్చు]

నమస్కారం సుల్తాన్ గారూ. ఇప్పుడే మీరు ఆంగ్ల వికీలో సృష్టించిన "మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు" పేజీని సందర్శించాను. ఇది ఇంతకు మునుపే సృష్టించబడిందని తెలియక నేను మరలా అదే పేజీని ఆంగ్ల వికీలో సృష్టించాను. అందుకు నన్ను క్షమించండి. ఇకపోతే, మీ ఆలోచనలకి జోహారులు. ఇలాంటి మంచి సినిమా గురించి మీరు ఆంగ్ల వికీలో పేజిని సృష్టించడం నిజంగా హర్షించదగ్గ విషయం. ఇదే సినిమా గురించి తెవికీలోనూ పేజీని సృష్టిస్తారని ఆశిస్తున్నాను.Pavanjandhyala (చర్చ) 13:44, 7 జూలై 2013 (UTC)

పవన్, ఈ చిత్ర వ్యాసాన్ని మొదట తెలుగు లోనే సృష్టించి తర్వాత ఆంగ్లంలో సృష్టించాను. వివరాలకు మల్లెలతీరంలో సిరిమల్లెపువ్వు చూడండి. ఆంగ్లంలో రెండు వ్యాసాలను విలీనం చేస్తే బాగుంటుంది.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 07:16, 8 జూలై 2013 (UTC)

ఖచ్చితంగా. విలీనానికి నేను పూర్తిగా సమ్మతిస్తున్నాను.Pavanjandhyala (చర్చ) 15:01, 8 జూలై 2013 (UTC)

నిర్వాహక హోదాకు మద్దతు[మార్చు]

మీరు నాయొక్క నిర్వాహ హోదాకు మద్దతునిచ్చినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. తెలుగు వికీపీడియా అభివృద్ధికి నావంతు కృషి చేస్తానని హామీ యిస్తున్నాను.Plume pen w.gif-- కె.వెంకటరమణ చర్చ 12:06, 18 జూలై 2013 (UTC)

నిర్వాహకత్వ హోదాకు మద్దతు తెలిపింనందుకు ధన్యవాదాలు[మార్చు]

మీరు నాయొక్క నిర్వాహక హోదాకు మద్దతునిచ్చినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. తెలుగు వికీపీడియా అభివృద్ధికి నావంతు కృషి చేస్తానని హామీ యిస్తున్నాను.రహ్మానుద్దీన్ (చర్చ) 15:52, 22 జూలై 2013 (UTC)

స్కేల వ్యాసం గురించి అభినందనలు[మార్చు]

స్కేల పై వ్యాసం సృష్తించినందుకు ధన్యవాదాలు. మరింత సమాచారం చేర్చగలరు. రహ్మానుద్దీన్ (చర్చ) 15:43, 3 అక్టోబర్ 2013 (UTC)

WP:FUW వాడుక సూచనలు[మార్చు]

WP:FUW వాడినందులకు ధన్యవాదాలు. వాడినప్పుడు సరియైన సమాచారం చేర్చితే బొమ్మలకు కావలసిన సమాచారం చేరుతుంది. మీరు చేర్చిన దస్త్రం:VaddeRamesh.jpg లో సముచిత వినియోగ మూసలో సమాచారం నేను మార్చాను. గమనించారనుకుంటాను. ఇంకేమైనా సందేహాలుంటే ఎక్కింపు ఉపకరణం చర్చాపేజీలో రాయండి. --అర్జున (చర్చ) 05:31, 28 నవంబర్ 2013 (UTC)

ధన్యవాదములు అర్జునరావు గారూ. కొత్త దస్త్రపు ఎక్కింపు పేజీ (వికీపీడియా:ఫైల్ ఎక్కింపు విజర్డు) వాడుక కొంచెం కష్టంగా ఉన్నది. పాత విజార్డు చాలా సౌకర్యవంతంగా ఉండేది. పాత విజార్డును పూర్తిగా తీసేశారా? లేక దానిని వాడటానికి ఏదైనా ఆప్షన్ ఉన్నదా? దయచేసి తెలుపగలరు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 14:25, 28 నవంబర్ 2013 (UTC)
కొత్తదికాబట్టి కష్టం అనిపించవచ్చు. కొద్ది సమయం వెచ్చించితే సులభమే. వికీపీడియా లో కాపీరైట్ పై అవగాహనతక్కువగావున్న వాళ్లు పాత ఎక్కింపు ప్రక్రియతో సరైన వివరాలు ఇవ్వకుండా ఎక్కించే వీలుంది. ఇది నిర్వహణ పనులను ఎక్కువచేస్తుంది మరియు సమస్య పరిష్కరించని బొమ్మలు భవిష్యత్తులో తొలగింపబడటానికి దారితీయవచ్చు. ఇప్పటికే ఎక్కించిన బొమ్మలలో సమస్యలు చాలా వున్నాయని గుర్తించడం జరిగింది. ఇప్పటినుండైనా బొమ్మలు నాణ్యతను పెంచడానికి కొత్త విజర్డు ని (ఆంగ్ల వికీపీడియానుండి తెలుగు స్థానికీకరణ చేసి) ప్రవేశపెట్టడం జరిగింది. దీనిని వాడటానికి గుర్తుంచుకోవలసిన ముఖ్యమైనవి, ఎక్కించే బొమ్మకి తగిన వ్యాసాన్ని ముందు గానే గుర్తించడం, మరియు ఎర్ర నక్షత్రం వున్న పెట్టెలలో సూచనలప్రకారం తగిన సమాచారం చేర్చడం. ఇలాచేస్తే బొమ్మకి పూర్తి సమాచారం చేరుతుంది. ఇతరులు దానిని ధృవపరచడానికి వీలుంటుంది. తెవికీలో ఎక్కువ బొమ్మలు ఎక్కించినవారిలో మీరుకూడా ముఖ్యులు కనుక దీనినిప్రయత్నించి ఆ తరువాత మీరు పాత విజర్డు సులభమనుకుంటే దానిని వాడవచ్చు. దీని లింకు ఆ పేజీలోని సమాచార పెట్టెలో వుంది. అయితే అలా వాడినప్పుడు సంబంధిత లైసెన్స్ ని( తాజాపరచలేదు) మరియు సముచిత వినియోగహేతువులతో సరిపడే మూసను మీరు వేరుగా చేర్చాలని గమనించండి. --అర్జున (చర్చ) 23:27, 28 నవంబర్ 2013 (UTC)

పురస్కార ప్రతిపాదనకు సమ్మతి[మార్చు]

సుల్తాన్ ఖాదర్ గారికి, మిమ్మల్ని వికీపీడియా:2013 కొలరావిపుప్ర/సుల్తాన్ ఖాదర్ ప్రతిపాదన చేశాను. మీ అంగీకారం తెలుపగలరు.----కె.వెంకటరమణ (చర్చ) 16:09, 3 డిసెంబర్ 2013 (UTC)

రమణ గారూ, కొమర్రాజు లక్ష్మణరావు వికీమీడియా పురస్కారానికి నన్ను అర్హునిగా పరిగణించి ప్రతిపాదించినందులకు మీకు మరియు ఇతర సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 04:27, 4 డిసెంబర్ 2013 (UTC)

పొట్టి వీరయ్య[మార్చు]

పొట్టి వీరయ్య వ్యాసం బాగుంది. IMDb లో ఒక సినిమా లింకు దొరికింది. http://www.imdb.com/name/nm5980587/?ref_=fn_al_nm_1 వీలుంటే వ్యాసంలో చేర్చండి.Rajasekhar1961 (చర్చ) 05:56, 4 డిసెంబర్ 2013 (UTC)

సూచనకు ధన్యవాదములు రాజశేఖర్ గారూ. వ్యాసాన్ని విస్తరిస్తున్నాను. వీరయ్య గారు నటించిన సినీ జాబితా సేకరిస్తున్నాను. మీకు అందుబాటులో సమాచారముంటే తెలుపగలరు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 07:14, 4 డిసెంబర్ 2013 (UTC)

ధన్యవాదాలు / షుక్రియా[మార్చు]

సుల్తాన్ గారూ సలాం. పురస్కారానికి నాపేరును సమర్థించారు, ధన్యవాదాలు. తెవికీలో నేను కేవలం ఇస్లాం గురించే వ్రాయలేదండి. అన్ని మతాల వ్యాసాలనూ వ్రాసాను. స్వతహాగా విద్యావ్రత్తిలో ఉన్న కారణంగా, అనేక విషయాలపై రచనలు చేసాను. విద్య అందులో ముఖ్యమైనది. భారతదేశంలో విద్య, పౌరశాస్త్ర విషయాలపై వ్రాసాను. భారత్ మరియు ఆంధ్రప్రదేశ్ లో లోక్ సభ నియోజకవర్గాలు పై కుస్తీ చేసాను. అలాగే, ఖగోళశాస్త్రము పై, ప్రపంచవారసత్వ ప్రదేశాలపై పలు రచనలు ఉన్నాయి. మీ పేజీ లో ఇంత వ్రాయడానికి కారణం, నేను కేవలం ఇస్లాం పై వ్రాసాననే మీరు భావిన్చినట్టున్నారు కాబట్టి. మీలో, నాలో ఉన్న సామరూపం ఏమంటే, అది, సినిమాలపై అభిమానం. తేడా, మీకు కొత్త తెలుగు సినిమాలపై మరియు నాకు పాత హిందీ సినిమాలపై ఓ రకమైన అభిమానమే. నిన్నటి నుండి నా లాప్టాప్ లో లిప్యాంతరీ కరణ ఆప్షన్ గాని, బాక్సు కానీ కనబడుటలేదు. గూగుల్ తెలుగు టూల్ ఇన్స్టాల్ అయి ఉన్నందున దానిపై వ్రాస్తున్నాను. అక్షర దోషాలు దొర్లి ఉండవచ్చు. అహ్మద్ నిసార్ (చర్చ) 14:09, 4 డిసెంబర్ 2013 (UTC)

వాలేకుమ్‌ అస్సలామ్‌ వరహమతుల్లాహి వబరకాతుహు , నిస్సార్ గారూ. మీరు ఇన్ని విషయాలపై వ్యాసాలు రాసారని ఇప్పుడే తెలుసుకున్నాను. మీ మార్పులు చేర్పులు జాబితా చూసి వాటిని తప్పక చదువుతాను. నేను కూడా సినిమా లపైనే కాకుండా వైద్య సంబంధిత, కంప్యూటర్ మరియు చారిత్రక సంబంధిత వ్యాసాలు రాశాను. మీ సభ్య పేజీలోని కవిత (ఉమ్ర్ మేరీ ఖలీల్ లగ్‌తీహై ఔర్ కర్‌నీ హైఁ ముఝ్‌కో కామ్ బహుత్) మరియు ఇస్లాం సంబంధిత వ్యాసాలు నన్ను ఎక్కువగా ఆకట్టుకున్నాయి మరియు వీటిని మిత్రులకు కూడా చూపించడం జరిగింది. మీరు మన రాష్ట్రం వెలుపల ఉన్నా వివిధ అంశాలపై చక్కని తెలుగులో వ్యాసాలు రాస్తూ మాకు ప్రేరణగా నిలుస్తున్నారు. మీ నుండి మరిన్ని మంచి వ్యాసాలు రావాలని ఆశిస్తూ, భగవంతుడు మీకు ఆ శక్తిని ప్రసాదిస్తాడని కోరుకుంటున్నాను. సుమామీన్ .--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 14:24, 4 డిసెంబర్ 2013 (UTC)
నా వాడుకరి పేజీ లో "నా ప్రధాన వ్యాసాలు" విభాగం చూడండి. అది కూడా పాతదే. మరియు "ఉమ్ర్ మేరీ ఖలీల్ లగ్‌తీహై ఔర్ కర్‌నీ హైఁ ముఝ్‌కో కామ్ బహుత్" అనే షేర్, నా గజల్లలోని ఒక గజల్ యొక్క ఒక షేర్ మాత్రమే. అహ్మద్ నిసార్ (చర్చ) 14:34, 4 డిసెంబర్ 2013 (UTC)

Possibly unfree దస్త్రం:GudumbaShankar.jpg[మార్చు]

A file that you uploaded or altered, దస్త్రం:GudumbaShankar.jpg, has been listed at Wikipedia:Possibly unfree files because its copyright status is unclear or disputed. If the file's copyright status cannot be verified, it may be deleted. You may find more information on the file description page. You are welcome to add comments to its entry at the discussion if you object to the listing for any reason. Thank you. అర్జున (చర్చ) 15:54, 5 డిసెంబర్ 2013 (UTC)

This is a DVD image of Gudumba Shankar Movie. As per my knowledge , Low Resolution DVD images, Wallposters can be used in Wikipedia. Please change the Uploading Description if it is not matching with Wiki Standarads. If this image is not matching with any Wiki licences, then you can Delete it.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 09:19, 6 డిసెంబర్ 2013 (UTC)
నా స్పందన మీ స్పందనతో పాటు సంబంధిత చర్చాపేజీలో చేర్చాను గమనించగలరు. చర్చను అవసరమైతే అక్కడే కొనసాగించమని మనవి.--అర్జున (చర్చ) 09
43, 6 డిసెంబర్ 2013 (UTC)

ఫేస్ బుక్ పేజీ[మార్చు]

సలాం సుల్తాన్ భాయ్! లింకు సరిగానే ఇచ్చిననూ దాని పై క్లిక్ చేసినపుడు వేరే క్యారెక్టర్లు లింకు పక్కన జత కావటం తో అలా అవుతున్నది. మీ సౌలభ్యం కొరకు అసలైన లింకుని ఇక్కడ పేస్టు చేస్తున్నాను. https://www.facebook.com/vira.jangam - శశి (చర్చ) 15:23, 12 డిసెంబర్ 2013 (UTC)

కొమర్రాజు లక్ష్మణరావు పురస్కార ఎంపిక మండలి సందేశం[మార్చు]

మీ గురించి కొమర్రాజు లక్ష్మణరావు పురస్కారానికి ప్రతిపాదన వచ్చినందులకు సంతోషం. 16-12-2013 23:59(UTC) తో ప్రతిపాదనల గడువు ముగుస్తుందుకాబట్టి, ఇప్పటికే అంగీకారము తెలుపకపోయినట్లైతే త్వరలో అంగీకారం తెలపవలసినది మరియు ప్రతిపాదన పత్రం ఎంపికలో కీలకమైనది కాబట్టి పురస్కార కొలబద్ద కనుగుణంగా మీ ప్రతిపాదనని విస్తరించమని కోరడమైనది.-- ఎంపికమండలి తరపున,ఎంపికమండలికార్యదర్శి అర్జున,(చర్చ)(--Arjunaraocbot (చర్చ) 16:33, 13 డిసెంబర్ 2013 (UTC))

విస్తరణ ఆప్షన్ కనిపించడం లేదు. కేవలము సోర్స్ మాత్రమే కనిపిస్తున్నది. దయచేసి ఎలా విస్తరించవలెనో తెలుపగలరు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 04:23, 25 డిసెంబర్ 2013 (UTC)
ప్రతిపాదన గడువు అయిపోయినందున పేజీ సంరక్షించబడింది. --అర్జున (చర్చ) 04:24, 25 డిసెంబర్ 2013 (UTC)
సత్వర స్పందనకు ధన్యవాదములు అర్జునరావు గారూ--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 04:33, 25 డిసెంబర్ 2013 (UTC).

పతకం[మార్చు]

సుల్తాన్ గారూ, తెవీకీని తమ విశేష కృషితో పరుగులెత్తిస్తున్నందుకు, అందుకోండి ఈ చిరుకానుక. వాడుకరి:అహ్మద్ నిసార్.

ధన్యవాదాలు[మార్చు]

మీ అభినందనలకు ధన్యవాదాలు. తెవేకీ ప్రస్థాన వేగాన్ని అందరమూ కలసి పెంచుదాం. అహ్మద్ నిసార్ (చర్చ) 21:18, 28 డిసెంబర్ 2013 (UTC)!

ధన్యవాదాలు[మార్చు]

సలాం సుల్తాన్ భాయ్! మీ అభినందనలకు ధన్యవాదాలు. ప్రశంసా పత్ర విజేతగా నిలిచినందుకు మీకు కూడా నా శుభాభినందనలు. ఈ పురస్కారం లభించినందుకు మహదానందంగా ఉన్ననూ, ఆంధ్రుల దుస్తులు, భారతీయులు ధరించే విదేశీ వస్త్రాలు, ఫోటోగ్రఫీ, వికీపీడియా:వాడుకరి పెట్టెలు, హైదరాబాదులో ప్రదేశాలు, రాయలసీమ, రాయలసీమ సంస్కృతి, రాయలసీమ వర్గీకరణ మరియు రాయలసీమ వేదిక వంటివి పూర్తయినందుకు పొందే ఆత్మసంతృప్తే ఇంకనూ ఎన్నో పాళ్ళు అధిక ఆనందదాయకం. నా రచనలకు మీ తోడ్పాటు ఈ వ్యాసాలకి మరింత పరిపూర్ణత్వం సాధించాయి. స్పైడర్ మ్యాన్ చిత్రంలో పీటర్ పాత్రకి తన అంకుల్ చెప్పే విత్ ద పవర్స్, కం ద రెస్పాన్సిబిలిటీస్ సంభాషణ, మరియు నా ఆటోగ్రాఫ్ చిత్రంలోని మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది పాటలే ఇకపై మనకి స్ఫూర్తి నిస్తాయని ఆశిస్తూ - సదా మీ సేవలో - శశి (చర్చ) 05:57, 29 డిసెంబర్ 2013 (UTC)

ఆలీ మరియు అలీ[మార్చు]

ఆలీ" మరియు "అలీ" కు తేడా వున్నది. "ఆలీ" అనేది విశేషణం, దీనికి అర్థం "గ్రేట్", "ఖ్యాతి గడించించిన" "ఘనమైన" మొదలగునవి. "అలీ" అనునది నామవాచకం (Proper noun), సాధారణంగా ముస్లింలు తమ పేర్లను "అలీ" అని పెట్టుకుంటారు. ఉదాహరణకు, "ఇమాం అలీ", "మౌలా అలీ", "ముహమ్మద్ అలీ జిన్నా", "ముహమ్మద్ అలీ క్లే", "ముహమ్మద్ అలీ జౌహర్" లాంటివి. వ్యవహారం లో విశేషణాలను ఈ విధంగా ఉపయోగిస్తారు, ఉదా: ఆలీ జనాబ్, ఆలీ జాహ్, ఆలీ మకాం, మొదలగునవి. కావున, పేర్లలో అలీ మాత్రమే ఉపయోగించమని మనవి. తెలుగు నటుడు కూడా "అలీ" యే, కాని వ్యవహారంలో "ఆలీ" అని ఉపయోగిస్తున్నారు, గ్రాంధిక రూపం లో ఇది తప్పు, కావున "అలీ" మాత్రమే ఉపయోగించమని మనవి. అహ్మద్ నిసార్ (చర్చ) 09:26, 31 డిసెంబర్ 2013 (UTC)

సూచనకు ధన్యవాదములు నిస్సార్ గారూ. ఇకపై అలీ ని మాత్రమే ఉపయోగిస్తాను. ఉర్దూ భాష గూర్చి సంపూర్ణ అవగాహన లేక ఈ పొరపాటు తలెత్తినది. సరిచేసినందుకు కృతజ్ఞతలు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 14:23, 31 డిసెంబర్ 2013 (UTC)

యోగి వేమన విశ్వ విద్యాలయం.. వ్యాసం విలీనం గురించి....[మార్చు]

ఖాదర్ గారూ...

సరైన సమయంలో స్పందించారు.... అందుకు నెనరులు. నాకున్న సాంకేతిక పరిజ్ఞానం మేరకు పరిశీలించి ఒక వ్వాసం ఇదివరకు లేదని చూచి అలాంటి వాటిని చేరుస్తుంటాను. ఈ వ్యాసంకూడా అల ప్రవేశించినదే. ఈ వ్యాసం ఇదివరకే వున్నదంటున్నారు. నేను తయారు చేసిన విషయము ప్రాధమికాంశాలు మాత్రమే. కనుక అవి కూడ ఇదివరకే వుండి వుండ వచ్చు. అంచేత నా వ్యసాన్ని పూర్తితా తొలిగించ వచ్చునేమో పరి శీలించి తొలిగించండి. మరొక్క విషయం: అలాటిడే NIN, National Institution of nutrition NIN.. ఈ సంస్థ చాల ప్రసిద్ధమైనది. వెతుకు లో చూడగా నాకు కనిపించ లేదు.... లేదేమోననే సందేహంతోనే ఉత్సాహం కొద్దీ కొద్ది కొద్దిగా విషయం చేర్చాను. (వ్యక్తిగతంగా నాకు ఆ సంస్థ గురించి తెలుసు) దీనిని కూడ పరిశీలించి ఇది ఇదివరకే వున్నదో లేదో పరిశీలించి తగు చర్య తీసుకోండి.. ధన్య వాదములు. Bhaskaranaidu (చర్చ) 15:40, 1 జనవరి 2014 (UTC)

ప్రత్యుత్తరం[మార్చు]

Nuvola apps edu languages.svg
నమస్కారం సుల్తాన్ ఖాదర్ గారూ. మీకు వైజాసత్య గారి చర్చా పేజీ లో కొత్త సందేశాలు ఉన్నాయి. దయచేసి చదవండి.
Message added 05:07, 5 జనవరి 2014 (UTC).  {{Talkback}} ను లేదా {{Tb}} మూసను తీసేసి, మీరీ నోటీసును ఎప్పుడైనా తొలగించవచ్చు.

ముంజేతి కంకణం గురించి వైజాసత్య (చర్చ) 05:07, 5 జనవరి 2014 (UTC)

వికీప్రాజెక్టు సలహా[మార్చు]

ఉదయ్ కిరణ్ వ్యా సం విస్తరించినందులకు ధన్యవాదాలు. అయితే మూలాలు చేర్చకపోవడం వలన నాణ్యత పెంచడానికి వీలుండదు. మీరు వికీపీడియా:వికీప్రాజెక్టు/వికీట్రెండ్స్_ఆధారిత_నాణ్యతాభివృద్ధి లో చేరి మెళకువలుతెలుసకొని వికీపీడియాలో వ్యాసాల నాణ్యత పెంచడానికి కృషి చేస్తే బాగుంటుంది.--అర్జున (చర్చ) 05:33, 11 జనవరి 2014 (UTC)

అర్జున గారూ, మూలాలు చేర్చాను. సూచనకు ధన్యవాదములు.

Non-free rationale for దస్త్రం:1 (Nenokkadine) film poster.jpg[మార్చు]

Thanks for uploading or contributing to దస్త్రం:1 (Nenokkadine) film poster.jpg. I notice the file page specifies that the file is being used under non-free content criteria, but there is not a suitable explanation or rationale as to why each specific use in Wikipedia is acceptable. Please go to the file description page, and edit it to include a non-free rationale.

If you have uploaded other non-free media, consider checking that you have specified the non-free rationale on those pages too. You can find a list of 'file' pages you have edited by clicking on the "my contributions" link (it is located at the very top of any Wikipedia page when you are logged in), and then selecting "File" from the dropdown box. Note that any non-free media lacking such an explanation will be deleted one week after they have been tagged, as described on criteria for speedy deletion. If the file is already gone, you can still make a request for undeletion and ask for a chance to fix the problem. If you have any questions, please ask them at the Media copyright questions page. Thank you. అర్జున (చర్చ) 04:34, 12 జనవరి 2014 (UTC)

ధన్యవాదం[మార్చు]

సుల్తాన్ ఖాదర్ గారు, నా అనారోగ్యం(టైపాయిడ్)కారణంగా మీ అభినందనలకు ధన్యవాదాలు ఆలస్యంగా తెలుపుతున్నందులకు మన్నించండి.Palagiri (చర్చ) 08:36, 22 జనవరి 2014 (UTC)

దశాబ్ధి ఉత్సవాలకు స్వాగతం[మార్చు]

Telugu-Wiki-10-Wecome Note.png

తెవికీ మిత్రులందరకూ దశాబ్ది ఉత్సవ కమిటీ తరపున ఆహ్వానం

2003 డిసెంబర్ 10న తెలుగు వికీపీడియా ప్రారంభమయింది. పది సంవత్సరాల ఈ ప్రయాణంలో ఎందరో ఔత్సాహికుల తోడ్పాటుతో యాభై వేల పైబడి వ్యాసాలతో భారతదేశంలోని అన్ని భాషలలో అధిక వ్యాసాలు కలిగిన భాషలలో ఒకటిగా నిలిచింది. ఇందుకు కారణం వికీపీడియాలో వ్యాసాలు రాస్తూ అభివృద్ధి పరుస్తున్న ఎందరో మహానుభావులు. వీరిలో విశేష కృషిచేసిన కొందరిని సత్కరించాలనీ, సమూహ సభ్యులు ఒకరినొకరు ప్రత్యక్షంగా కలవడం ద్వారా సమిష్టి కృషిలో పాల్గొనేందుకు మరింత స్ఫూర్తి దొరుకుతుందనే ఆశయంతో ఈ నెల (ఫిబ్రవరి) 15, 16 తేదీలలో దశాబ్ది సంబరాలుగా జరుపుకోబోతున్నాం.

ఈ కార్యక్రమంలో ఎందరో కొత్త ఔత్సాహికులకు వికీతో అనుబంధాన్ని ఏర్పరచి భావి వికీపీడియన్లుగా తీర్చిదిద్దాలని కోరికతో పలు కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. వాటిలో మీరూ పాల్గొని కొత్త వారికి విజయవాడలోగల కే.బీ.ఎన్ కళాశాల వద్దనే ప్రత్యక్ష సహాయం చేస్తూ మార్గనిర్దేశం చేయాలని మా కోరిక, ప్రయాణం, వసతి వంటివి ఏర్పాటు చేయబడినవి. కనుక ఇప్పటికీ నమోదు చేసుకొనకపోతే దయచేసి పైన గల సైటు నోటీసు ద్వారా మీ వివరాలు నమోదుచేసుకొంటే మాకు ఏర్పాట్లకు అంచనా ఏర్పడుతుంది.

ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకొని వికీ మిత్రులంతా సహకరించి కార్యక్రమం విజయవంతం చేసి భావితరాలకు వికీ మార్గదర్శినిగా ఉండేలా చేయాలని మా కోరిక

......దశాబ్ది ఉత్సవ కార్యవర్గం, సహాయమండలి

ప్రాజెక్టు ఆహ్వానం[మార్చు]

మీరు వికీపీడియా:వికీప్రాజెక్టు/నాణ్యతాభివృద్ధి-వికీట్రెండ్స్ ‎ కు చెందిన వ్యాసంలో మార్పులు చేయడం గమనించాము. మీరు కూడా ప్రాజెక్టు సభ్యునిగా పాల్గొంటే తెవికీ మరింత అభివృద్ధి చేయవచ్చు. మీ పేరు వికీపీడియా:వికీప్రాజెక్టు/నాణ్యతాభివృద్ధి-వికీట్రెండ్స్#సభ్యులు నమోదు చేసుకోమని ఆహ్వానిస్తున్నాము.--అర్జున (చర్చ) 04:17, 25 జనవరి 2014 (UTC)

ఆహ్వానానికి ధన్యవాదములు అర్జున గారూ. మీరు కోరినట్లే పేరు నమోదు చేసుకున్నాను.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 08:11, 25 జనవరి 2014 (UTC)

జాల వ్యాసాలనుండి సమాచారం వాడుక[మార్చు]

జాల వ్యాసాలనుండి సమాచారం తీసుకునేటప్పుడు నకలు హక్కులువుల్లంఘన జరగకుండాతప్పనిపరిస్థితులలో కొద్ది సమాచారం తప్ప సాధ్యమైనంతవరకు మీ స్వంతమాటలతో క్లుప్తంగా తిరగరాయండి. ఇటీవలి మీ చేర్పులను నేను సరిచేశాను గమనించండి. అన్నట్లు సాధ్యమైనంతవరకు శాశ్వతమైన జాలమూలాలు వాడడం మంచిది. సాక్షి పత్రిక లింకులు నాకు తెలిసి తాత్కాలికమే. ఇతర శాశ్వత మూలాలకు వికీపీడియా:వికీప్రాజెక్టు/నాణ్యతాభివృద్ధి-వికీట్రెండ్స్ ‎ చూడండి --అర్జున (చర్చ) 12:21, 31 జనవరి 2014 (UTC)

మహాత్మా గాంధీ మరణానికి సంబంధించి ఆంగ్ల జాల మూలము ఉన్నట్లు తెలియదు. సరిచేసినందులకు సంతోషము. పత్రికా మూలములు తాత్కాలికము కావున cite web మూస ను వాడుతున్నాను. ఇందులో ప్రచురణ కర్తలు, ప్రచురించిన తేదీ మరియు సంగ్రహించిన తేదీ, వార్తా శీర్షికను చేర్చుతున్నాను. సూచనకు ధన్యవాదములు అర్జున గారూ.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 13:03, 31 జనవరి 2014 (UTC)
  • Cite web మూస వాడడం మంచిదే అయినా అది శాశ్వత జాల లింకులికి మరింత ఉపయోగంగా వుంటుంది. మరీ తప్పనిసరిఅయితే తప్ప తాత్కాలిక జాలలింకులు వాడడం మంచిది కాదు ఎందుకంటే చదువరులు ధృవపరచుకోవాలంటే ఆ లింకు దొరకదు మరియు పాత వెబ్ పేజీలు దాచే వేబేక్ మెషీన్ లాంటివి ఇంకా తెలుగు తోడ్పాటు అంతంతమాత్రమే.--అర్జున (చర్చ) 04:18, 1 ఫిబ్రవరి 2014 (UTC)

వికీపీడియా:తెవికీ దశాబ్ది ఉత్సవాల ఆహ్వానం[మార్చు]

నమస్కారం సుల్తాన్ ఖాదర్ గారు.... మీరు వికీపీడియా:తెవికీ దశాబ్ది ఉత్సవాలు లకు ధరఖాస్తు చేయగలరని మనవి. Pranayraj1985 (చర్చ) 11:09, 11 ఫిబ్రవరి 2014 (UTC), కార్యదర్శి, తెవికీ దశాబ్ది ఉత్సవ కార్యవర్గం

ఆహ్వానానికి ధన్యవాదములు ప్రణయ్ రాజ్ గారు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 11:14, 11 ఫిబ్రవరి 2014 (UTC)
ధరఖాస్తు ఫారం [ఇక్కడ ] కలదు Pranayraj1985 (చర్చ) 11:22, 11 ఫిబ్రవరి 2014 (UTC)

కొలరావిపు ప్రశంసాపత్రం[మార్చు]

Komarraju Lakshmana Rao Puraskaram 2013 prasamsa patakam.png కొమర్రాజు లక్ష్మణరావు వికీమీడియా పురస్కారం - ప్రశంసా పతకం (2013)
సుల్తాన్ ఖాదర్ గారూ, తెలుగు వికీమీడియా ప్రాజెక్టులలో సినిమాల వ్యాసాల పై మీరు చేసిన కృషిని గుర్తిస్తూ , పురస్కారాల ఎంపిక మండలి తరఫున ఈ ప్రశంసా పతకాన్ని బహూకరిస్తున్నాను. మీ కృషి సర్వదా అభినందనీయం. మున్ముందు కూడా మీ కృషిని ఇలాగే కొనసాగిస్తారని ఆశిస్తున్నాం.
ధన్యవాదములు వైజాసత్య గారూ. --సుల్తాన్ ఖాదర్ (చర్చ) 15:38, 17 ఫిబ్రవరి 2014 (UTC)

నాణ్యతాభివృద్ధి-వికీట్రెండ్స్ సభ్య మూస[మార్చు]

సభ్యుల అభిప్రాయాలు, అర్జున గారి సూచనల మేరకు మార్పులు చేయబడ్డ ఈ క్రింది మూసని మీ సభ్య పేజీలో ఉపయోగించుకోగలరని మనవి. - శశి (చర్చ) 08:24, 20 ఫిబ్రవరి 2014 (UTC)

నాణ్యతాభివృద్ధి-వికీట్రెండ్స్ పతకం[మార్చు]

AnimWIKISTAR-laurier-WT.gif నాణ్యతాభివృద్ధి-వికీట్రెండ్స్ పతకం
సుల్తాన్ ఖాదర్ గారికి,నాణ్యతాభివృద్ధి-వికీట్రెండ్స్ పైలట్ ప్రాజెక్టు లో విశేష కృషికిధన్యవాదాలు--అర్జున (చర్చ) 06:49, 17 మార్చి 2014 (UTC)
ధన్యవాదములు అర్జున రావు గారు. నా కృషికి గుర్తింపుగా అందించిన ఈ పతకము మరిన్ని వ్యాసాల నాణ్యతను పెంచేందుకు నాకు ప్రేరణ నిస్తున్నది.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 10:42, 17 మార్చి 2014 (UTC)

ఏప్రిల్ 27, 2014 సమావేశం[మార్చు]

ఈనెల 27 తేదీన తెవికీ సమావేశం జరుగుతున్నది. మీరు దయచేసి ఇందులో ప్రత్యక్షంగా గాని స్కైప్ ద్వారా పాల్గొని సమావేశాన్ని సఫలీకృతం చేస్తారని కోరుతున్నాను.Rajasekhar1961 (చర్చ) 12:40, 23 ఏప్రిల్ 2014 (UTC)

ఆహ్వానానికి ధన్యవాదములు రాజశేఖర్ గారూ. హైదరాబాదు వెలుపల ఉండటంవలన దీనిలో ప్రత్యక్షముగా పాల్గొనలేక పోతున్నాను. స్కైప్ ద్వారా ప్రయత్నిస్తాను.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 18:11, 25 ఏప్రిల్ 2014 (UTC)

ప్రాజెక్టు విషయంలో సహకారం కోసం[మార్చు]

నమస్కారం..
తెలుగు వికీపీడియాలో, మరీ ముఖ్యంగా వైవిధ్యభరితమైన అంశాల్లో, మీరు చేస్తున్న కృషికి అభినందనలు. తెలుగు వికీపీడియాలో ప్రస్తుతానికి వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు సమాచారం అందుబాటులోకి అనే ప్రాజెక్టు జరుగుతోంది. ఆ ప్రాజెక్టుకు బాధ్యునిగా మీరు ఇటువంటి ప్రాజెక్టుల్లో మరింత ఉత్సాహంగా పనిచేయగలరని భావిస్తున్నాను. ఇందులో భాగంగా డిజిటల్ లైబ్రరీ ఆ ఇండియాలోని తెలుగు పుస్తకాలను వికీపీడియన్లకు పనికివచ్చే విధంగా కాటలాగ్ చేస్తున్నాము. అలాగే కాటలాగులోని తెలుగు పుస్తకాలను డిజిటల్ లైబ్రరీ ద్వారా దించుకుని చదివి వికీలో చక్కని వ్యాసాలూ రాస్తున్నాము, ఉన్న వ్యాసాలూ అభివృద్ధి చేస్తున్నాం. వికీసోర్సులో రాజశేఖర్ గారి చొరవతో సమర్థ రామదాసు, ఆంధ్ర వీరులు మొదటి భాగం, రెండవ భాగం, భారతీయ నాగరికతా విస్తరణము, కలియుగ రాజవంశములు, కాశీ యాత్రా చరిత్ర, కోలాచలం శ్రీనివాసరావు, నా జీవిత యాత్ర (టంగుటూరి ఆత్మకథ) వంటి అపురూపమైన గ్రంథాలు ఈ ప్రాజెక్టు ద్వారా చేర్చి అభివృద్ధీ చేస్తున్నాం. వీటిలో మీకు ఏదైనా విభాగం ఆసక్తికరంగా తోస్తే దానిని ఎంచుకుని మొత్తం ప్రాజెక్టును అభివృద్ధి చేసే దిశకు వెళ్ళాలని ఆశిస్తున్నాము. మీతో పాటుగా ఈ ప్రాజెక్టులో పనిచేయడానికి ఉత్సుకతతో --పవన్ సంతోష్ (చర్చ) 07:44, 26 జూలై 2014 (UTC)

వికీపీడియా - విశేష వ్యాసాల ఎంపిక ప్రక్రియ[మార్చు]

నమస్కారం, సభ్యులు వికీపీడియా:విశేష వ్యాసాలు/ప్రతిపాదనలు/2014 పేజీని ఓసారి చూసి అందులోని ప్రతిపాదిత వ్యాసాల జాబితాను పరిశీలించండి. అందులో విశేష వ్యాసాలకు కావలసిన లక్షణాలుంటే, వాటిని మీ ఆమోదం తెలుపండి, వాటిని విశేష వ్యాసాలుగా గుర్తించేందుకు వీలుంటుంది. మీ అభిప్రాయాలు ప్రతిపాదిత వ్యాసాల క్రింద "సభ్యుల అభిప్రాయాలు" శీర్షికలో వ్రాయండి. అలాగే, వ్యాసాలపేర్ల క్రింద మీ అంగీకారం తెలుపుతూ సంతకం చేయండి. మీ అంగీకారం ఓటుగా పరిగణింపబడును. మెజారిటీ సభ్యుల అభిప్రాయాలతోనే వ్యాసం విశేష వ్యాసంగా ఎన్నుకోబడుతుంది. సభ్యులందరూ తప్పక పాల్గొనవలసినదిగా మనవి. అహ్మద్ నిసార్ (చర్చ) 20:01, 3 ఆగష్టు 2014 (UTC)

మీ ఇమెయిల్ ఐడి కావాలి[మార్చు]

సుల్తాన్ ఖాదర్ గారూ సలాం. మీతో ఇమెయిల్ లో సంభాషించ దలచాను. నా ఇమైల్ ఐడి.ahmadnisarsayeedi@yahoo.co.in , మీ ఇమెయిల్ ఐడి ఇవ్వగలరా! అహ్మద్ నిసార్ (చర్చ) 16:01, 4 ఆగష్టు 2014 (UTC)

వాలైకుం అస్సలాం నిసార్ గారు. నా ఇ-మెయిల్ నుండి పైన తెలిపిన మీ ఇ-మెయిల్ ఐడికి వ్యక్తిగత సందేశాన్ని పంపాను. --సుల్తాన్ ఖాదర్ (చర్చ) 06:33, 5 ఆగష్టు 2014 (UTC)

పేజీ పేరు మార్చవలసివచ్చినప్పుడు ఆ పేజీ చరితం సరిగా ఉండేలా చూడండి[మార్చు]

నమస్కారం, నియంతలు అనే పేజీని నియంతగా మార్చాలనుకోవడం మంచిదే కాని ఆ పేజీ యొక్క చరితం ఉన్నది ఉన్నట్లుగా మార్చవలసి ఉంటుంది. YVSREDDY (చర్చ) 15:47, 19 సెప్టెంబరు 2014 (UTC)

YVSREDDY] గారికి. పేజీకి సరైన పేరు నియంత. నేను పేజీని తరలించలేదు. ఇదివరకే నియంత అనే పేజీ సినిమా కి దారిమార్పు అయి ఉన్నది. మీరు రాస్తున్న నియంతలు అనే వ్యాసానికి సరైన పేరు నియంత అయితే బాగుంటుందని నియంతలు అనే పేజీ లో ఉన్న సమాచారమునంతా అక్కడికి చేర్చాను. మీరు చేసిన కృషిని నాకు అన్యయించాలనేది నా ఉద్దేశ్యము కాదు. --సుల్తాన్ ఖాదర్ (చర్చ) 07:26, 20 సెప్టెంబరు 2014 (UTC)

వ్యాస చరిత్రల విలీనం[మార్చు]

ఒక వ్యాసంలోని విషయం వేరొక వ్యాసంలో విలీనం చేయవలసి వచ్చినపుడు, సంబంధిత విలీన మూసను ఉంచిన తదుపరి చర్చ జరిగిన తర్వాత విలీనం చేయవచ్చుననే అభిప్రాయానికి వచ్చిన తర్వాత నిర్వాహకులు ఏ వ్యాసం విలీనం చేయవలెనో ఆ వ్యాసంలోని విషయాన్ని కాపీ,పేస్టు ద్వారా సంబంధిత వ్యాసంలో ముందుగా చేర్చాలి. ఆ తర్వాత వ్యాస చరిత్రలను విలీనం చేసే ఆఫ్షన్ ఉపయోగించి నిర్వాహకులు మాత్రమే చరిత్రలను విలీనం చేయగలరు. ప్రస్తుత వ్యాసం విషయంలో నియంత అనే వ్యాసం రాజశేఖర్ గారు 3 డిసెంబరు 2008‎ న సృష్టించారు. నియంతలు అనే వ్యాసాన్ని రెడ్డి గారు 18 సెప్టెంబరు 2014‎ న సృష్టించారు. ఈ పేజీలను మీరు దారిమార్పులు చేశారు. ఈ రెండు వ్యాస చరిత్రలను విలీనం చేస్తే నియంతలు అనే వ్యాసంలో మొట్టమొదటగా 2008 లో సృష్టించిన వారు మరియు యితరుల వ్యాస చరిత్ర వస్తుంది. ఆ తరువాత 2014 లో చేర్చిన వారు మరియు యితరుల వ్యాస చరిత్ర వస్తుంది.ఈ విధంగా చేసిన యెడల ఈ వ్యాసం యొక్క సృష్టికర్త రాజశేఖర్ గారి పేరు మీద వస్తుంది. ----Plume pen w.gif కె.వెంకటరమణ చర్చ 15:58, 20 సెప్టెంబరు 2014 (UTC)

మీ అభిప్రాయంతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను రమణ గారూ . రెడ్డిగారు సృష్టించిన నియంతలు అనే వ్యాసాని పేరు మార్పు ప్రతిపాదన ఇప్పటికే ఆ వ్యాస చర్చా పేజీలో చేర్చాను. దీనికి నియంత అనే పేరైతే సమంజసంగా ఉంటుంది. అలాగే నియంతృత్వం నుంది కూడా ఒక లంకె వేయవచ్చు. కానీ నియంత అనే పేజీ ఇదివరకే ఉన్నది కానీ సినిమా పేరుకు దారిమార్పు చేయబడిఉన్నది. రాజశేఖర్ గారి అనుమతితో ఈ తరలింపు చేస్తే సమంజసంగా ఉంటుంది. అలాగే రెడ్డి గారికి అన్యాయం చేయకుండా వారి క్రెడిట్స్ వారికి ఇచ్చేస్తే ఎలాంటి బాధ ఉండదు. మీరు సరైన పరిష్కారాన్ని సూచించాలని కోరుతున్నాను.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 16:07, 20 సెప్టెంబరు 2014 (UTC)

సహాయం[మార్చు]

నేను తోలి మస్జిద్ అనువాదం చేయునపుడు మసీదుకు సంబంధించిన కొన్ని విషయాలను తెలుగులోనికి అనువందించలేకపోయాను. దయచేసి సహకరించండి.---- కె.వెంకటరమణ 12:26, 6 అక్టోబరు 2014 (UTC)

మంగలి వ్యాసం[మార్చు]

సుల్తాన్ ఖాదర్ గారూ, ప్రస్తుతానికి మీరు మంగలి వ్యాసం దిద్దటం ఆపెయ్యండి. రాయల్ గారూ చేస్తున్న మార్పులు తరువాత రద్దుచేసేందుకు వీలుగా ఉంటుంది --వైజాసత్య (చర్చ) 06:44, 22 అక్టోబరు 2014 (UTC)

తప్పకుండా వైజాసత్య గారు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 06:47, 22 అక్టోబరు 2014 (UTC)

సమాచార పెట్టె[మార్చు]

వాడుకరి:సుల్తాన్ ఖాదర్ గారు.నాపేజిలో సమాచార పెట్టె చేర్చుటకు నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ధన్యవాదాలు.Palagiri (చర్చ) 02:08, 27 అక్టోబరు 2014 (UTC)

వాడుకరి:సుల్తాన్ ఖాదర్ గార్కి,నా సమాచార పెట్టెచేర్చినందులకు మీకు ధన్యవాదంలు.06:59, 29 అక్టోబరు 2014 (UTC)

11 వ వార్షికోత్సవాల గురించి.....[మార్చు]

ఆర్యా.... పై విషయం గురించి రచ్చబండ లో కొన్ని ప్రతిపాదనలు చేయడమైనది. వాటిని పరిశీలించి... పరిశోధించి మీ అమూల్యమైన అభిప్రాయాలను, సూచనలను, అవసరమైన చోట్ల దిద్దు బాట్లను చేసి దానికి సమగ్ర రూపమివ్వాలని కోరడమైనది. వాడుకరి: Bhaskaranaidu

సుల్తాన్ ఖాదర్ గారూ ప్రణయ్ మా ద్వారా జరిగిన పొరపాటు తెలియచేసాడు. అది ఉద్దేశ్యపూర్వకంగా జరిగినది కాదు. ఇంకా దానిపై చాలా పని జరగాలి తీరిక లేక చేయలేకపోయాం. పరిశీలీంచే అవకాశం దొరకలేదు. ఈ రోజు రేపు అవి పూర్తి చేయాలి. అందరం దానిపై పనిచేస్తేనే త్వరగా అవుతుంది. కనుక మీరూ సహకరించగలరని నా కోరిక--విశ్వనాధ్ (చర్చ) 06:05, 2 జనవరి 2015 (UTC)
విశ్వనాధ్ గారూ, సత్వర ప్రతిస్పందనకు ధన్యవాదాలు. అందరి పేర్లూ పేర్కొని నా పేరు లేకపోవడం చూసి ఆవేదన చెందాను. తిరుపతి రావాలనుకొని చేసుకున్న ప్రయాణ ఏర్పాట్లను కూడా రద్దు చేసుకున్నాను. ప్రణయ్ గారు అందరి పేర్లూ చక్కగా తెలుగులో పేర్కొని నా పేరు కనీసం కాపీ పేస్ట్ చేయకపోవడం చూసి బహుశా సమావేశాలలో చర్చించి నా పేరు తొలగించారేమో అని భావించాను. కొద్ది సమయం వేచి చూసినా కూడా ఇతర విభాగాలు అప్‌డేట్ అవుతున్నాయి కానీ , సహాయమండలి జాబితా అప్‌డేట్ అవ్వకపోయేసరికి నిరాశ చెందాను. చివరకు ఈ సమావేశాలలో ప్రత్యక్షంగా పాల్గొనాలన్న ఆసక్తి సన్నగిల్లి, కష్టమైనా నా సెలవులను ,నష్టమైనా నా ప్రయాణ ఏర్పాట్లను రద్దు చేసుకున్నాను.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 06:29, 2 జనవరి 2015 (UTC)
సుల్తాన్ ఖాదర్ గారూ- మీకూ ఆంగ్ల నూత సంవత్సర అభినందనలు. మేము మొన్న నిన్న వికీకి రాలేదు. కాని ఎలాగైనా 3 వతేదీకి బడ్జెట్ పెట్టాలని మిగతావి అంతగా పరిశీలించడం లేదు. ఆఫ్ వికీ కార్యక్రమాల గురించి ఎవరెవరు ఏ ఏ భాద్యతలు తీసుకోవాలనేది ఇంకా చర్చించలేదు. బడ్జెట్ అప్&డేట్ అవ్వకపోతే మనం ఏం చేయాలన్న వత్తిడి అయిపోతుంది. కనుక ముందస్తు ఏర్పాట్లకొరకు తిరుపతి ఎప్పుడు వెళ్ళాలనేది కూడా నిర్ణయించలేదు. మీరు నాకు ఫోన్లో అందుబాటులోకి రాగలిగితే ప్రత్యక్ష పనుల్లో పురోగతి వివరించగలను. ధన్యవాదాలు.--విశ్వనాధ్ (చర్చ) 06:43, 2 జనవరి 2015 (UTC)

ప్రధాన శాస్త్ర పరిశోధన సంస్థల జాబితా లో మూలాలు చేర్చాను[మార్చు]

మూలాలు లేవు అన్న మూస తొలగించండి. --Sammetasravani (చర్చ) 11:48, 30 డిసెంబరు 2014 (UTC)

పాత చర్చలు పాత్ర[మార్చు]

సుల్తాన్ ఖాదర్ గారు, ముందుగా మీరు వాడుకరి చర్చ:సుల్తాన్ ఖాదర్/పాత చర్చ 1 అనే ఈ పేజీని సృష్టించండి. అందులో మీరు మీ పాత చర్చలు ఎంత వరకు అందులో ఉంచ దలచుకున్నారో అంత వరకు విషయాలను కాపీ చేయండి. తదుపరి, ఆ మొత్తాన్ని మీ కొత్త పేజీలో పేస్ట్ చేయండి. ఆ తదుపరి సేవ్ చేయండి. అంతకు ముందు మీ చర్చా పేజీలో ఉన్న పాత విషయాన్ని తొలగించండి. అంతే. ఒకసారి ప్రయత్నించండి. శుభమస్తు. JVRKPRASAD (చర్చ) 10:22, 12 జనవరి 2015 (UTC)

పై విధంగా వాడుకరి చర్చ:సుల్తాన్ ఖాదర్/పాత చర్చ 1 సృష్టించిన తదుపరి మీ చర్చా పేజీలో {{పాత చర్చల పెట్టె|auto=small}} అనే మూసను చేర్చండి. పాతచర్చల శీర్షికలు కనబడతాయి.-- కె.వెంకటరమణ 10:29, 12 జనవరి 2015 (UTC)
ధన్యవాదాలు రమణ గారు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 13:52, 20 జనవరి 2015 (UTC)