వాడుకరి చర్చ:Mpradeep/పాత చర్చ 3

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మహాప్రభో మీటపా ఇప్పుడే చూశాను, తెలుగు భాషకు చేస్తున్న సేవ చాలా బాగుంది. నా ఉద్యోగం ఊడి పోకుండా ఉంటే ఇంఖో 6 నెలలు తిరుగులేకుండా నా వంతు సహాయం చేస్తాను అని ఈ మాటలబాబు మాట ఇస్తున్నాడు.--మాటలబాబు 01:31, 5 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

నా ఉద్యోగం మరో మూడు నెలలు పొడిగించబడింది.ఈ రోజే ఆ విషయం తెలిసింది--మాటలబాబు 20:54, 13 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రదీప్ గారు నేను తళ్ళికోట యుద్ధాన్ని ఆడియో పైలు క్రింద మార్చాను విన్నారా, మరచి పోయాను నేను ఈ మధ్య ఒక వెబ్‌సైటు చేసుకొంటున్నాను, మీరు ఒకదర్శించ మని వేడుకొంటున్నాను --మాటలబాబు 18:33, 5 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

ధన్యవాదాలు[మార్చు]

ప్రదేప్ గారు నా వెబ్ సైటు చూసినందుకు చాలా ధన్యవాదాలు, నా వెబ్‌సైటు లొ ఉన్న చిత్రం(బొమ్మ) నాది కాదు, నాతో ఉన్న స్నేహితుడిది.వాడు తియ్యద్దు తియ్యద్దు అంటె తీసిన ఫొటో, నా మెహం నా చేష్టలలాగే చాలా చిన్నగా ఉంటుంది. వికీపీడియా లొ ఎంత సేపు వ్రాస్తుంటే బోరు కూడా కొట్టుతుంది కదా అందుకే సభ్యులను ఉత్సాహ పరిచేందుకు ఈ చేష్టలన్ని చేస్తున్నాను. నా చేష్టలన్ని చర్చా పేజిలకు మాత్రమే పరిమితం, వ్యాసాల పేజిలకు వెళ్ళను వ్యాసాలను అభివృద్ధి చేయడమే నా మనోగతం, నాకు కంప్యూటర్లలొ అసలు ప్రవేశం లేదు. --మాటలబాబు 21:56, 5 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

బొమ్మల లైసెన్సుల గురించి[మార్చు]

ప్రదీప్, నేను కొన్ని సైటుల నుండి బొమ్మలను దిగుమతి చేసుకుని వాటిలో కొన్ని మార్పులు చేసి (లోగోలు, పేర్లు గట్రా తీసేసి, కాస్త శుభ్రపరచి) నా సైటులోకి (http://bommalu.50webs.com) ఎగుమతి చేస్తున్నాను. వాటిని ఇక్కడ ఉపయోగిస్తున్నాను. కాబట్టి నేను ఆ చిత్రాలకి ఏ లైసెన్సు వివరాలు అందించాలో చెబితే వాటిని సరిదిద్దుతాను. -- శ్రీనివాస 17:46, 7 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

సినిమా screenshots లేదా వాటికి సంబందించిన ఫొటోల లైసెన్సులు, కాపీరైట్లు వగైరా వాటి సినిమా నిర్మాతల వద్ద ఉంటుంది. వాటిని తీసుకుని మనమే వాటిపై మార్పులు చేసినా కూడా ఆ ఫొటోలపై మనకు ఎటువంటి హక్కులు ఉండవు, ఫొటోలపై మీరు చేసిన మార్పులకు మాత్రమే మీకు హక్కులు ఉంటాయి. అయితే వికీపీడియా సర్వర్లన్నీ అమెరికాలో ఉండటం వలన, అక్కడి చట్టాల ప్రకారం, ఎటువంటి ఉచిత ఫొటోలు లభించనప్పుడు, మనం రాసే వ్యాసాలకు ఫొటోలు తప్పనిసరిగా అవసరమైనప్పుడు ఇటువంటి బొమ్మలను వాడుకోవచ్చు. అవికూడా low resolution ఫొటోలు మాత్రమే. మరిన్ని వివరాలకు ఆంగ్ల వికీపీడియాలో ఉన్న ఈ పేజీని చదవండి. ఇలా FAIR USEతో అప్లోడు చేసిన బొమ్మలకు, వాటిని ఉపయోగించిన ప్రతీ వ్యాసానికి తగిన కారణాలు చూపించి, బొమ్మ పేజీలో FAIR USE కిందకు ఎందుకు వస్తుందో కూడా తెలుపాలి, అలాగే మీరు బొమ్మలపై మార్పులు చేయకమునుపు ఏ వెబ్‌సైటు నుండి బొమ్మను తీసుకున్నారో కూడా తెలుపాలి. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 19:25, 7 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

బాటు[మార్చు]

ప్రదీపు గారు ఇలా ప్రతి పట్టాణానికి సమాచార పెట్టె మార్చడం కష్టం కదా ఏదైనా బాటు ని ఏర్పాటు చెయ్య వచ్చుకదా!!!--మాటలబాబు 19:03, 8 జూలై 2007 (UTC) ప్రదీపు గారు మీరు ఎందుకు నేను ఏమి అడిగిన సమాధానం చెప్పరు. నేనంటె ఎందుకు మీకింత అయిష్టం , నేనేమేనా తప్పులు చెస్తే సరిదిద్దాలి కాని, నాతో మాట్లాడక పోతె ఎలా, మీరు నాతో మాట్లాడక పోతే ఏదో లా ఉంటుంది.--మాటలబాబు 19:18, 8 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

నేను సమాధానాలు ఇచ్చేసరికి కొంత ఆలస్యమవుతుంది, అంతకంటే ఏమీలేదు. ఇక బాటుతో అన్ని పనులు చేయించటం కుదరదు. కొన్ని కొన్ని పనులు వాటి ద్వారా చేయించలేము, ఒక వేళ చేయించ గలిగినా వాటికి బాటును తయారు చేయడానికి చాలా కష్టపడాల్సి రావచ్చు. బాటుతో ఏదయినా పని చేయించాలంటే మొదటగా ఆ పనిని గురించి మనకు పూర్తి అవగాహన ఉండాలి, అప్పుడె ఒక మంచి బాటును తయారు చేయగలం. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 19:30, 8 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

టి.జి.కమలాదేవి[మార్చు]

తెవికీకి మరిన్ని వినగలిగే వ్యాసాలను అందిస్తారని కోరుకుంటున్నాను. ఈ వారానికి టి.జి.కమలాదేవి వ్యాసాన్ని "ఈ వారం వ్యాసం"గా ఎంపిక చేస్తున్నాను. మీరేమంటారు? __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 15:14, 9 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

క్షమించండి ఆలస్యంగా సమాధానం చెప్పుతున్నందుకు, ఇప్పుడె తిరిగి వచ్చాను, పతాకం ఇచ్చినందుకు వైజాసత్యాగారికి ధన్యవాదాలు. ఏదో వచ్చిరాని మాటలతొ అక్కడ ఉన్న వ్యాసాన్ని చదివాను,అంతే.., మరిన్ని శ్రవణ పైల్సు చేయడానికి నా ప్రయత్నం చేస్తాను. టి.జి.కమలాదేవి తప్పకుండా ఈ వారం వ్యాసంగా మలుద్దాం, ఆ వ్యాసం లొ నా హస్తం కూడా ఉన్నది నేను సభ్యుడి చేరక మునుపు. --మాటలబాబు 16:44, 9 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

సెలవు మూసలు[మార్చు]

సెలవు మూసలు తయారు చేసినందుకు,రాత్రి కంగారు లొ మీకు కృతజ్ఞతలు చెప్పడం మర్చి పోయాను, సెలవు మూసలు చేసినందుకు చాలా కృతజ్ఞతలు, నాకు తెవికి ఒక జబ్బు లాగే పట్టుకొంది, పగలు నిద్ర పోయఏటప్పూదు కూడా అప్పుడప్పుడు లేచి ఇటీవల మార్పులు పేజి మీద నొక్కి ఏమి జరుగుతోందో చూస్తున్నాను--మాటలబాబు 16:59, 10 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

మీకే కాదు, నాకు కూడా అంతే. తెలుగు వికీలో ఇలాంటి శెలవు మూసలాంటి దానిని మొదటి సారిగా పెట్టుకుంది నేనే అనుకుంటా... ఆ తరువాత ఇంకో రెండు మూడు సార్లు వెళ్ళిపోదామని అనుకున్నాను. కానీ కుదరలేదు. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 17:48, 10 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

వీక్షనరీ బాటు[మార్చు]

వీక్షనరీలో బాటుతో కొన్ని పదాలకు పేజీలను చేర్చాను. ఆ పేజీలలో ఉన్న సమాచారాన్ని ఒక సారి గమనించి, ఇంకేమయినా కలపొచ్చేమో లేకపోతే, సమాచారాన్ని ఇంకో విధంగా చేర్చాలేమో చెప్పండి. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 19:26, 12 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

బాగుంది ఈ పద్ధతి సరిపోతుంది. కాకపోతే ఆ రెఫరెన్స్ సమాచారాన్ని ఒక మూసలో పెట్టి ప్రతిపేజీలో ఆ మూస మాత్రమే వాడితే బాగుంటుంది. --వైజాసత్య 03:48, 13 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]
సరే అలాగే. మీరు అక్కడి మార్పులను గమనిస్తే, నేను ఇప్పటికే అలాంటి మూసను తయారు చేసాను. అయితే దానిని, వేరే అవసరానికి తయారు చేసాను. బయటి లింకులను (IIITకి మరియు sf.netకి) చేరుస్తుంటే ఆ లింకుల వలన, స్పాము జరుగుతుందని వీక్షనరీ ఒక capthaను ఇస్తుంది, దీని వలన బాటూ ఆగిపోతుంది. మూసలో పెట్టటం వలన సమస్య తీరిపోతుందేమో అని అనుకున్నాను, కానీ వాళ్ళు సాఫ్టూవేరును కొంచెం తెలివిగానే తాయారుచేసారు, మూసకూడా పనిచేయడంలేదు. అందుకని దానిని ఉపయోగించడం మానేసాను. అయితే ఇప్పుడు మూసలో ఆ లింకులను తీసేసి వాడుకోవాలన్నమాట. ఇంకోటి బ్రౌను డిక్షనరీలోనే కొన్ని పదాలు ఒకటికంటే ఎక్కువసార్లు వస్తున్నాయి (యూనీకోడులోకి మార్చినప్పుడు జరిగిన పొరపాటు గావచ్చు) దీనికి తనిఖీ మూస లాంటిదానిని ఒకటి తయారు చేస్తున్నాను(ఇలాంటి పదాలు 100 - 200 కంటే ఎక్కువ ఉండవని నా ఊహ). __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 04:04, 13 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రదీప్ గారు, బ్రౌన్ నిఘంటువును విక్షనరీలోకి మార్చడం చాలా మంచిపని. కానీ తొందరపడవద్దు. మీరు మార్చిన కొన్ని పేజీలు చూసాను. అనువాదము తెలుగు నుండి ఇంగ్లీష్ లోనికి ఉంటే బాగుంటుంది. లేకపోతే మీరు 31,000 ఇంగ్లీష్ పదాలు చేర్చిన తర్వాత అది ఇంగ్లీష్ విక్షనరీ అయిపోతుంది. మూలములో మీరు వ్రాసిన దానిని కుదించి ఒక లింక్ లో వివరాలు (technical) వేరేదగ్గర ఉంచండి. ఈ వివరాలన్నీ 31,000 సార్లు ప్రతి పేజీలో వస్తే చిరాకుగా ఉంటుంది.

పద ప్రయోగాలు వేరుగా వస్తే చాలా బాగుంటుంది. బుల్లెట్లతో సహా. ప్రతి పదానికి, పదానికి మధ్య కామా ఉంటే అర్ధవంతంగా ఉంటుంది.Rajasekhar1961 11:26, 13 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

అంగ్లవిక్షనరీలో అన్ని పదాలు ప్రత్యేకంగా అవసరమైతే తప్ప డీఫాల్టుగా స్మాల్ లెటర్స్‌తో ప్రారంభంకావాలని నిర్ణయించారు. మనమూ అదే పద్ధతిని పాటిస్తే బాగుంటుంది లేకపోతే మన తెలుగు విక్షనరీనుండి ఆంగ్లవిక్షనరీకి ఇస్తున్న అంతర్వికీ లింకులు దారిమార్పు పేజీలకి వెళుతున్నాయి --వైజాసత్య 16:21, 13 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]
అవును నేను కూడా దానిని గమనించాను. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 16:25, 13 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ-మైయిల్[మార్చు]

ప్రదీప్ గారు నా ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ చెయ్యగలరా శని వారం రోజు, వీలు కలిగితే పి.డి.యఫ్. పైలు గా మార్చి పంపండి. నా ఇ-మైల్ చిరునామా S172142230149@gmail.com--మాటలబాబు 07:42, 18 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

తుడిచివేయకండి[మార్చు]

నేను ఇవికీ నుండి కాపీ చేసి ఇంకా అనువాదం మొదలుపెట్టాకుండానే మీరుతుడిచేశారు. ఇలా అయితే తెవికీలో పనిచేయడం కష్టం.Rajasekhar1961 04:30, 30 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

ఇంతకు ముందరే నేను మీ చర్చ రచ్చబండలో చూసాను. తెవికీ లో అనువాదం చేయాల్సినందువలననే ఇవికి నుండి కాపీ చేసి మదర్ థెరీసా వ్యాసము మరియు మేరీ క్యూరీ వ్యాసాలను ఉంచాను. మీరు తెవికీ లో చాలా కాలంగా కృషి చేస్తున్నారు కాబట్టి మీ మాటను నేను గౌరవిస్తాను. అనువాదము కావాలని మూసలను పేర్చిన తర్వాత మిగతా సభ్యులు కూడా తోడ్పడతారని అనుకున్నాను. ఎందుకంటే కొంతమంది సభ్యులకు అనువదించడము అలవాటుగా ఉండవచ్చని అనుకున్నాను. Dvratnam 09:30, 18 సెప్టెంబర్ 2007 (UTC)

అభిప్రాయాలు తెలుపండి[మార్చు]

ఒక్కసారి ఈ ఈ పేజిలని చూసి అభిప్రాయాలు తెలుపండి.కాసుబాబు గారి చర్చా పేజిలోనే తెలుపండి.

  1. వ్యాసాల మూసల పేర్ల గురించి మాటలబాబు మెదలు పెట్టిన పెంట
--మాటలబాబు 20:00, 4 ఆగష్టు 2007 (UTC)
కాసుబాబు గారి చర్చా పేజి జరుతున్న చర్చ లొ మీ అభిప్రాయాన్ని తెలుపలేదే?--మాటలబాబు 21:39, 6 ఆగష్టు 2007 (UTC)

మీరు కూడా గోడని కొట్టి కొట్టి అలసిపోతున్నారా?--మాటలబాబు 21:39, 6 ఆగష్టు 2007 (UTC)

కర్ణాటక ప్రాజెక్టు[మార్చు]

కర్ణాటక ప్రాజెక్టు కాని మెదలు పెడుతున్నారా ఎ? నాకు చెప్పండి.నేను పాలు పంచుకొంటా..--మాటలబాబు 21:39, 6 ఆగష్టు 2007 (UTC)

ప్రాజెక్టు ఏమీ మొదలు పెట్టటం లేదు. ప్రస్తుతానికి ఆంద్రప్రదేశ్‌లోనే చేయాల్సింది ఇంకా చాలాఉంది. ప్రస్తుతానికి పేర్లను సరి చేస్తున్నాను అంతే. __మాకినేని ప్రదీపు (+/-మా) 21:42, 6 ఆగష్టు 2007 (UTC)


Telegu wikiquote[మార్చు]

Discussion is underway about the closure of Telegu wikiquote at metawiki. Please visit the page. Thank you.--Eukesh 16:17, 8 ఆగష్టు 2007 (UTC)

తెలుగు వికీఖోట్ ని మూశేస్తున్నారంటా. ఏం చేద్దాం? ప్రస్తుతానికి అందులో పరిరక్షించుకోవటానికేం సమాచారం లేదు. అభివృద్ధి చేయటానికి మనకు వనరులూ లేవు. పోతే పోయింది భవిష్యత్తులో అభివృద్ధి చేయాలనుకుంటే ఒక ప్రతిపాదన పెట్టి మళ్ళీ ప్రారంభించవచ్చు అని నా అభిప్రాయం --వైజాసత్య 16:35, 8 ఆగష్టు 2007 (UTC)
అవును మూసేయలనుకుంటే మూసేయనివ్వండి. మనం అక్కడ ఎట్లాగూ పెద్దగా చేస్తున్నది ఏమీలేదు. ప్రస్తుతానికి మూసేస్తేనే మంచిదేమో. తెలుగు వికీపీడియాలోనే మనకు సరిపడా వనరులు లేవు, ఇలా దానిలో కూడా మార్పులు-చేర్పులు చేస్తూ ఉండటం మనకు తలకు మించిన భారం అని నాకు అనిపిస్తుంది. కాసుబాబుగారు, అక్కడ(మెటావికీలో) ఒక నెల రోజులు సమయం అడిగారు మరి. ఆయన అక్కడ వ్యాసాలు చేర్చటానికి ఏమయినా ప్రణాళికలు తయారు చేస్తున్నారేమో!!! మూసేస్తున్నారనగానే, దానిని మూసేయకుండా ఉండటానికి అక్కడ చేర్చాల్సినవి ఏముంటాయని ఆలోచన చేస్తే మొదటగా నాకు తెలుగు సినిమా డైలాగులు గుర్తుకువచ్చాయి!!! __మాకినేని ప్రదీపు (+/-మా) 20:24, 8 ఆగష్టు 2007 (UTC)
Pradeep, Thanks for your message. I am on tour in Dubai and can not write in Telugu properly now. I think it is better to keep the door open than close it. So I requested for time extension of Telugu Wiki quote. Even though all wiki enthusiasts are busy, I will try to put some initial contribution and design a user frame work to Wiki quote to keep it open. Regarding adminship, I do not have media wiki account. Nor am I familiar with adminship tasks. Can you consider applying for adminship for Telugu wiki quote? - --కాసుబాబు 17:42, 9 ఆగష్టు 2007 (UTC)

భాహా పరిజ్ఞానం మూసలు[మార్చు]

వాటికి [[వర్గం:సభ్యుల పేజీ మూసలు]] అని కూడా చేర్చాలి కదా?--మాటలబాబు 13:22, 9 ఆగష్టు 2007 (UTC)

అవసరం లేదు. వర్గం:సభ్యుల పేజీ మూసలులో వర్గం:సభ్యుల భాషా పరిజ్ఙానాన్ని తెలిపే మూసలు ఒక ఉపవర్గం. __మాకినేని ప్రదీపు (+/-మా) 13:25, 9 ఆగష్టు 2007 (UTC)

కమ్మ[మార్చు]

ప్రదీప్ గారు,

వేపఛేదు గారి వ్యాసములు ఛారిత్రకము కాదు. కొత్థ భావయ్య ఛవుదరి గారి కమ్మవారి ఛరిత్ర ఛూడుడు.

వ్యాసల సైజు[మార్చు]

వ్యాసల సైజు కొలిచే పరికరాల గురించి చెప్పగలరా?? హెచ్.టి.ఎమ్.ఎల్. తొ కలిపి సైజు, తీసేసి సైజు కనుగోవడం ఎలా???--మాటలబాబు 00:37, 15 ఆగష్టు 2007 (UTC)

పరికరాల గురించి నాకు తెలియదు. నేను వ్యాసాల సైజు(అక్షరాల సంఖ్య) కనుక్కోవడానికి నేనే ఒక ప్రోగ్రాము రాసుకున్నాను. అది బాటుకు అనుసంధానంగా నడుస్తుంది. ఇది, ఒంత వరకూ సహాయ పడవచ్చు. __మాకినేని ప్రదీపు (+/-మా) 01:07, 15 ఆగష్టు 2007 (UTC)

తాంసీలో తప్పు[మార్చు]

తాంసీలో మీరు చూసిన తప్పును సరిచేసాను. థాంక్సు. __చదువరి (చర్చరచనలు) 04:35, 15 ఆగష్టు 2007 (UTC)

గ్రామాల బాటు[మార్చు]

ఏదైనా పేజీలో క్రింద అంటించేటప్పుడు స్పేసులు లేకుండా అంటించమంటారా?? --వైజాసత్య 09:40, 15 ఆగష్టు 2007 (UTC)

నా బాటు ప్రస్తుతం ఇలా ఉన్న పేజీలపై మాత్రమే పని చేస్తుంది. అంటే ప్రతీ వాక్యం కొత్తలైనులో ఉండాలి. ఖాళీ లైనులు ఉండకూడదు. __మాకినేని ప్రదీపు (+/-మా) 09:44, 15 ఆగష్టు 2007 (UTC)
అయితే నేను ఇకచెయ్యబోయే పేజీలలో అలాగే మారుస్తా. --వైజాసత్య 09:48, 15 ఆగష్టు 2007 (UTC)
గ్రామాల పేజీలు తయారుచెయ్యటం పూర్తి అయ్యింది. కొత్తగా 639 పరిశీలించవలసిన గ్రామాలు తయారైనాయి. మీకు వీలున్నప్పుడు వాటిపై మీ అయోమయ నివృత్తి బాటు నడపండి --వైజాసత్య 15:15, 16 ఆగష్టు 2007 (UTC)

వీరతాడు[మార్చు]

[[బొమ్మ:Veerataadu.png|thumb|left|తెవికీ అభివృద్ధికి ప్రదీపు చేసిన విశేష కృషికి గుర్తింపుగా మొట్టమొదటి వీరతాడు ఈయనకే వేస్తున్నా[[సభ్యుడు:వైజాసత్య|వైజాసత్య]] 13:26, 15 ఆగష్టు 2007 (UTC)]]

ఈ వీరతాడును మీ సభ్యుని పేజీలో పెట్టుకోవాలని మనవి --వైజాసత్య 13:26, 15 ఆగష్టు 2007 (UTC)
అలాగే పెట్టుకుంటాను. వీరతాడు వేసినందుకు ధన్యవాదాలు. __మాకినేని ప్రదీపు (+/-మా) 13:50, 15 ఆగష్టు 2007 (UTC)
అభినందనలు, ప్రదీప్! మంచి కృషికి సరైన గుర్తింపు. సమయానికి గుర్తించినందుకు వైజాసత్యకూ అభినందనలు! __చదువరి (చర్చరచనలు) 14:36, 15 ఆగష్టు 2007 (UTC)

మీఊరు[మార్చు]

మీ ఊరొ వెబ్ సైటులో ఉన్న పొటోల్లో నలుగురు కుర్చుని ఉన్న పొటో భలే బాగుంది. వీలైతే దానిని తెవికీ మీ ఊరి పేజీలో పెట్టేందుకు ప్రయత్నించండి. విశ్వనాధ్. 07:24, 12 సెప్టెంబర్ 2007 (UTC)

సినిమా గణాంకాలు[మార్చు]

సినిమా గణాంకాలలో చివరిదైన "సినిమాలతో కలిసిన ఇతరవ్యాసాలు" ఏంటో నాకు సరిగా అర్ధం కాలేదు. నేను అర్ధం చేసుకున్నదేమిటంటే ఈ జాబితాలో ఉన్న పేజీల్లో సినిమా సమాచారంతో పాటు ఇంక వేరే విషయంపై కూడా సమాచారం కలిసి ఉన్నదని. (ఉదాహరణకు బృందావనం పేజీలో బృందావనం సినిమాతో పాటూ బృందావనం అనే రెండు గ్రామాల సమాచారం కూడా ఉన్నది) వీటన్నింటినీ నిన్ననే తనిఖీ చేసి సరిచేయవలసిన 3 పేజీలు మాత్రం సరిచేసి మిగిలినవి తీసేశాను. వీటి ఉపయోగము నేను సరిగా అర్ధం చేసుకోలేదో లేక వీటిని ఏరటానికి బాటు ఉపయోగించిన తర్కం సరికాదో తెలియదు.--వైజాసత్య 15:15, 16 సెప్టెంబర్ 2007 (UTC)

సినిమా పేజీలలో ఉన్న సినిమా మూస, ఆ పేజీని వర్గీకరించేస్తుంది. అలా కాకుండా మూసతో పాటుగా ఏదయినా వర్గాన్ని కూడా చేరిస్తే ఆ పేజీని "సినిమాలతో కలిసిన ఇతరవ్యాసాలు" అనే శీర్షిక కిందకు తీసుకుని వస్తుంది. మీరు ఉదాహరణగా ఇచ్చిన పేజీలను ఏరటానికి ఇలాంటి తర్కాన్ని ఉపయోగించాను. ఇప్పుడు అలాంటి పేజీలు లేపుకాబట్టి ఆ శీర్షికను తీసేయవచ్చు. __మాకినేని ప్రదీపు (+/-మా) 15:24, 16 సెప్టెంబర్ 2007 (UTC)

Classical Japanese[మార్చు]

Hi, I am 榎, a user of Japanese Wikipedia. Now, I have a request to you. Could you write a new article about Classical Japanese in Telugu based on the English article or the Japanese article or the others, and then please put an External link to Wp/jpn-classical. A few sentences would be enough.-- 02:56, 5 అక్టోబర్ 2007 (UTC)

Fundraiser 2007 - Translation of Sitenotice[మార్చు]

Hi, the Fundraiser 2007 of the Wikimedia Foundation will last from 22 October to 22 December. Right now we are preparing the sitenotice. Could you please help by translating the two sentences in your language? If you cannot do this, could you please help me to contact a person who can help? You can find the text to be translated on meta. Thank you so much for your help! Best, --SabineCretella 19:34, 6 అక్టోబర్ 2007 (UTC)

మొదటిపేజీ శీర్షిక[మార్చు]

మొదటిపేజీ శీర్షిక ఇప్పుడు హుందాగా బాగుంది. తగిన మార్పులు చేసినందుకు చాలా నెనర్లు --వైజాసత్య 19:07, 10 అక్టోబర్ 2007 (UTC)

ప్రదీప్ గారికి, కొండవీటి చేంతాడులు గురించి వివరించినందుకు నా కృతజ్ఞతలు. మీరు గతంలో కూడా తెలుగులో వ్రాయటం గురించి నాకు చాలా సహాయం చేసారు.అపుడు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సందేశం వ్రాసాను.కానీ దానిని ఎక్కడ అంటించాలో తెలియక మీపేరు సంబోదిస్తూ ,దానిని "సహాయక కేంద్రం" లో అంటించాను.మీరు చూసారో లేదో ? --గెడ్డంబాబు.

మూసలు[మార్చు]

మీరన్నట్టుగానే అనువదిస్తాను. ధన్యవాదాలు.దేవా 11:28, 24 అక్టోబర్ 2007 (UTC)
ప్రదీప్‌గారు మీరుచేసిన మార్పు చాలా బాగుంది. నాకు అలా కూడా చేయవచ్చని తెలవదు. ఇలా కొత్త కొత్త విషయాలు తెలుసుకోవచ్చు గనకనే నేను వికీకి బానిసనయ్యాను.దేవా 16:13, 25 అక్టోబర్ 2007 (UTC)

విజయవాడ ఫోటో[మార్చు]

ఈ ఫోటోలో ఉన్నది బెంజి సర్కిలే కదా?? --వైజాసత్య 18:52, 26 అక్టోబర్ 2007 (UTC)

అది బెంజిసర్కిలు కాదు. ఈ ఫొటోలో కనపడేది బెంజి సర్కిలు. అలాగే బింజిసర్కిలు దగ్గరనుండి కృష్ణానది కనపడదు.. __మాకినేని ప్రదీపు (+/-మా) 20:19, 26 అక్టోబర్ 2007 (UTC)
NH5-NH9 కలిసే చోటు బెంజిసర్కిలు. గూగుల్ మ్యాప్సులో చూడండి... __మాకినేని ప్రదీపు (+/-మా) 20:24, 26 అక్టోబర్ 2007 (UTC)

మంచి సలహా ఇచ్చారు[మార్చు]

ప్రదీప్ గారూ మీరిచ్చిన సలహా మంచిదే, ఆలోచిస్తాను. ఇక మూలాల గురించి అంటారా ఇందిరా గాంధీ వ్యాసంలో పొందుపర్చిన వ్యాసంలో మామూలు విషయాలు తప్ప ప్రత్యేకంగా ఒక గ్రంథంలో ఉన్న విషయాలను కాపీ చేయలేను. ఎప్పుడో చదివి జ్ఝాపకం ఉంచుకున్న, నోట్స్ వ్రాసుకున్న విషయాలకు మూలాలు దొర్కడం కూడ కష్ట సాధ్యమే. ఇక నుంచి ప్రయత్నిస్తాను.

ఈ వారం వ్యాసం[మార్చు]

ప్రదీపు, 5-6 వారాల పాటు నేను తెవికీ వైపు రాలేకపోవచ్చు. ఈ వారం వ్యాసాన్ని మీరు పంపించగలరా. ముందస్తుగా నెనర్లు --వైజాసత్య 02:01, 1 నవంబర్ 2007 (UTC)

ఆంగ్ల వికీ నుంచి తెవికి లోకి బొమ్మను ఎలా అప్‌లోడ్ చేయాలి[మార్చు]

ప్రదీప్ గారూ, మీరు సూచించినట్లే చేయాలనుకున్నాను. Full Resolution వరకు వచ్చాక అక్కడి నుంచి రావట్లేదు. Full Resolution ను లింక్ చేస్తే రాకేశ్ శర్మ బొమ్మ లేకుండా ఖాళీ పేజీ వస్తుంది. సూచనలు ఇవ్వగలరు.

ఏవైనా పనికొచ్చేవున్నాయా?[మార్చు]

ఏవైనా పనికొచ్చేవున్నాయా? http://oremuna.com/blog/?p=594 Chavakiran 08:59, 8 నవంబర్ 2007 (UTC)