వాడుకరి చర్చ:Naagulavancha

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Naagulavancha గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!
  • వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు. సభ్యుల పట్టికకు మీ పేరు జత చేయండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు, వాటిలో మీ పేరు నమోదు చేసుకుని వికీ ప్రస్థానం మొదలు పెట్టండి.
  • మీ సందేహాలు నివృత్తి చేసుకోవడానికి పక్కనున్న లింకులను అనుసరించండి, అవికూడా మీ సందేహాలు తీర్చకపోతే అప్పుడు తెవికీ అధికారిక మెయిలింగు లిస్టుకి ఒక జాబు రాయండి.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి గూగుల్ గుంపులలో ఈ వ్యాసాన్ని చదవండి.
  • నాలుగు టిల్డె లతో (~~~~) - ఇలా సంతకం చేస్తే మీపేరు, తేదీ, టైము ప్రింటవుతాయి. ఇది చర్చా పేజీలలో మాత్రమే చెయ్యాలి సుమండీ!

మీకేమైనా సందేహాలుంటే, తప్పకుండా నా చర్చా పేజీలో పోస్టు చెయ్యండి. వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉందాం.

కాసుబాబు 16:21, 25 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]

కొన్ని ఉపయోగకరమైన లింకులు
వికిపీడియా 5 మూలస్థంబాలు
5 నిమిషాల్లో వికీ
తరచూ అడిగే ప్రశ్నలు
సహాయము లేదా శైలి మాన్యువల్
ప్రయోగశాల
సహాయ కేంద్రం
రచ్చబండ
సముదాయ పందిరి
ఇటీవలి మార్పులు

అభ్యర్ధన[మార్చు]

వికీలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని గ్రామాల గురించి సమాచారం పొందుపరచే ప్రయత్నం జరుగుతున్నది. వివరాలకు ఇక్కడ మరియు ఇక్కడ చూడండి. మీ వూరు గురించి, మీకు తెలిసిన వూళ్ళగురించి వికీలో వ్రాయండి. అలాగే ఇతర మిత్రులను కూడా ప్రోత్సహించండి --కాసుబాబు 16:21, 25 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]

మీ కవిత గురించి[మార్చు]

వసంతరావుగారూ! మాతృభాషా మాధుర్యం అనే మీ కవిత హృద్యంగా ఉన్నది. కాని కవితల ప్రచురణ వికీ ఉద్దేశ్యం కాదు గనుక ఆ పేజీని నిర్వాహకులు త్వరలో తొలగిస్తారు. అయితే ఆ కవితను మీ సభ్యుని పేజీలో తప్పక ఉంచమని నా విన్నపం. అక్కడ వ్రాసేది మీ ఇష్టం. తెలుగు వికీ శ్రామికులంతా తెలుగు భాషపైని అభిమానంతో శ్రమిస్తున్నారు. కనుక మీవంటి సభ్యులు చేరడం ఎంతో సంతోషం. విరివిగా విజ్ఞాన సర్వస్వానికి అనుగుణమైన రచనలు చేసి తెలుగు వికీ పురోగతికి తోడ్పడవలసినదిగా కోరుతున్నాను. --కాసుబాబు 16:21, 25 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]


ఒకమారు "విద్యార్ధీ లేవరా!" కవిత పై జరుగుతున్న చర్చ చూడండి. --కాసుబాబు 12:05, 26 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]

వికీపీడియాలో ఏవి రాయకూడదు?[మార్చు]

వసంతరావు గారూ, కింది విషయాలను గమనించగలరు.

  • గతంలో ప్రచురించిన రచనల పూర్తి పాఠాలు వికీపీడియాలో యథాతథంగా రాయరాదు. వీటి కోసం వికీబుక్స్,వికీసోర్సులు ఉన్నాయి. అక్కడ కూడా కాపీహక్కులు లేనివి, సార్వజనికమైన వాటిని మాత్రమే పెట్టవచ్చు.
  • స్వీయ, కల్పిత రచనలు పెట్టరాదు. అది మౌలిక పరిశోధన కిందకు వస్తుందనుకుంటాను. మౌలిక పరిశోధనలు వికీపీడియాలో నిషిద్ధం. ఇక్కడ మనమేది రాసినా వాటికి తగు మూలాలు, వనరులు చూపించగలగాలి. వికీపీడియా:మౌలిక పరిశోధనలు నిషిద్ధం పేజీ చూడండి.

మీరు రాసిన జీవిత పరమార్థం, దివ్యుడా! కనువిప్పుకో!! రచనలు వికీపీడియాలో పెట్టదగినవి కావు. మీ సభ్యుని పేజీలో పెట్టుకోవచ్చు. (కానీ దానికీ కొన్ని పరిమితులున్నాయి.) ఇప్పటికే మాతృభాషా మాధుర్యం అనే కవితను మీ సభ్యుని పేజీలో పెట్టారు. ఇవీ పెడితే సభ్యుని పేజీ క్రిక్కిరిసి పోతుందేమో చూడండి. పైగా, సభ్యుని పేజీలో కూడా వికీపీడియాకు సంబంధించినవే పెట్టాలని ఓ నియమం ఉంది. వివరాలకు వికీపీడియా:సభ్యుని పేజీ చూడండి. ఇవి మీ స్వీయ రచనలైతే మీ స్వంత వెబ్ సైటులో పెట్టుకుని మీ సభ్యుని పేజీ నుండి దానికి లింకు ఇవ్వడం సరైన పద్ధతి. ఈ విషయమై మీకేదైనా సందేహాలుంటే ఈ పేజీలో గానీ, నా చర్చాపేజీలోగానీ, సీనియరు సభ్యుల చర్చాపేజీల్లోగానీ, వికీపీడియా:సహాయ కేంద్రం లో గానీ రాయండి. __చదువరి (చర్చ, రచనలు) 07:01, 29 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]