వాడుకరి చర్చ:Prudhvikumar thakkella
స్వాగతం
[మార్చు]Prudhvikumar thakkella గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
- మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. సుల్తాన్ ఖాదర్ (చర్చ) 12:20, 15 జూలై 2013 (UTC)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #1 |
వికీ పేజీని దిద్దుబాటు చెయ్యడం చాలా తేలిక. పేజీకి పైనున్న "మార్చు" లింకును (లేదా వ్యాసపు విభాగానికి కుడి పక్కన ఉన్న ఎడిట్ లింకును) నొక్కితే చాలు. అప్పుడు వచ్చే దిద్దుబాటు పేజీలో దిద్దుబాట్లు చెయ్యడానికి వీలుగా ఒక టెక్స్ట్ బాక్స్ ఉంటుంది. ఈ టెక్స్ట్ బాక్స్‌లో దిద్దుబాటు చెయ్యగల వ్యాసపు భాగం సిధ్ధంగా ఉంటుంది. మీరు ప్రయోగం చేద్దామనుకుంటే, ప్రయోగశాలలో చెయ్యండి
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
పదవ తరగతి తర్వాత ఎటువంటి గ్రూపు తీసుకోవాలి?
[మార్చు]పదవ తరగతి ప్రతి వ్యక్తి జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఈ దశలోనే విద్యార్థి చాల జాగ్రత్తగా ఉండాలి. పదవ తరగతి కి వచ్చేలోపు అప్పటి వరకు తనకు ఏయే విషయాల పట్ల మంచి అవగాహన ఉందో తెలుసుకుని ఉండటం ఒక విద్యార్థి ప్రథమ కర్తవ్యం. కొంతమందికి సైన్శ్ గ్రూపులంటే ఇష్టం, కొందరికి ఆర్ట్స్ (కళలు) అంటే ఇష్టం. గణితము, సామాన్యశాస్త్రము బాగా ఇష్టమైతే వాళ్ళు ఇంటర్ లో యం.పి.సి గ్రూపు తీసుకోవదడం ఉత్తమం. గణితము ఇష్టం లేనట్లైతే కాని సామాన్యశాస్త్రం బగా ఇష్టం ఐతే అలాంటి వాళ్ళు బై.పి.సి గ్రూపు తీసుకొవడం మంచిది. కాని ఈ గ్రూపు చాల కష్టమైనది మరియు ఓర్పు, సహనం, కష్టపడి పనిచేసే గుణం ఉన్నవాళ్ళు మత్రమే ఈ గ్రూపుకు మంచి అర్హత కలవారు. అసలు సైంసు గ్రూపులంటేనే ఇష్టం లేకపోతే అలాంటి వారు ఆర్ట్స్ గ్రూపులు తీసుకొవచ్చు. కళలు జీవితానికి మంచి ఉపాదిని కల్పించడమే కాకుండా మనస్సుకు త్రుప్తిని కలిగిస్తాయి. సి.ఏ లాంటి కోర్సులు చదవడానికి యం.ఇ.సి గ్రూప్ అత్యంత ఉపయోగకరం. సి.ఇ.సి గ్రూపు కుడ మంచి ఆర్ట్స్ గ్రూపే లెక్కలు సరిగా రాని వారు ఈ గ్రూపు ని ఎంచుకోవచ్చు. యం.ఇ.సి మరియు సి.ఇ.సి గ్రూపులు రెండూ మంచి కామర్స్ గ్రూపులు. ఈ రోజుల్లో ఈ రెండు గ్రూపులకి మంచి డెమాండు ఉన్నది. అసలు కామర్సు కూడ చెయలేను అన్నవారికి హెచ్.ఇ.సి గ్రూపు మంచిది. ఈ మద్య కాలంలో హెచ్.ఇ.సి గ్రూపు ప్రాధాన్యత తగ్గుతూ వస్తుంది కాని చరిత్రని, అర్థశాస్త్రాన్ని, పౌరశాస్త్రాన్ని ఈ మూడిటిని కలిపి చదవటం అనేది యం.పి.సి గ్రూపుకన్నా కష్టమైన విషయం. హెచ్.ఇ.సి గ్రూపు తీసుకున్న వారు తరవాత బి.ఎ, బి.కాం వంటి గ్రూపులు తీసుకొవడానికి అర్హులు. వీరు సివిల్స్, గ్రూప్స్ వంటి ప్రభుత్వ ఉద్యోగాలకు చక్కగా సరిపోతారు. ఇవే కాక ఆంధ్రప్రదేశ్ ఇంటెర్మీడియట్ లొ అనేక వ్రుత్తివిద్యా గ్రూపులు (వొకేషనల్ గ్రూపులు) ఉన్నాయి. సైంసు గ్రూపులు వొకేషనల్లో చాల ఉన్నాయి. సి.యస్.ఇ, ఫైనార్ట్స్ మొదలైన అనేక కోర్సులు ఉన్నాయి కాని అన్ని కోర్సులు అన్నిచోట్ల లభ్యం అవడంలేదు. మనకు ఏ సబ్జెక్టు అంటే బాగ ఇష్టమో తెలుసుకుని మంచి గ్రూపుని ఎంచుకుని తెలివిగా భవిష్యత్తుని రూపుదిద్దుకోవాలి.
దశాబ్ధి ఉత్సవాలకు ఆహ్వానం
[మార్చు]తెవికీ మిత్రులందరకూ దశాబ్ది ఉత్సవ కమిటీ తరపున ఆహ్వానం
2003 డిసెంబర్ 10న తెలుగు వికీపీడియా ప్రారంభమయింది. పది సంవత్సరాల ఈ ప్రయాణంలో ఎందరో ఔత్సాహికుల తోడ్పాటుతో యాభై వేల పైబడి వ్యాసాలతో భారతదేశంలోని అన్ని భాషలలో అధిక వ్యాసాలు కలిగిన భాషలలో ఒకటిగా నిలిచింది. ఇందుకు కారణం వికీపీడియాలో వ్యాసాలు రాస్తూ అభివృద్ధి పరుస్తున్న ఎందరో మహానుభావులు. వీరిలో విశేష కృషిచేసిన కొందరిని సత్కరించాలనీ, సమూహ సభ్యులు ఒకరినొకరు ప్రత్యక్షంగా కలవడం ద్వారా సమిష్టి కృషిలో పాల్గొనేందుకు మరింత స్ఫూర్తి దొరుకుతుందనే ఆశయంతో ఈ నెల (ఫిబ్రవరి) 15, 16 తేదీలలో దశాబ్ది సంబరాలుగా జరుపుకోబోతున్నాం.
ఈ కార్యక్రమంలో ఎందరో కొత్త ఔత్సాహికులకు వికీతో అనుబంధాన్ని ఏర్పరచి భావి వికీపీడియా:వికీపీడియనులుగా తీర్చిదిద్దాలని కోరికతో పలు కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. వాటిలో మీరూ పాల్గొని కొత్త వారికి విజయవాడలోగల కే.బీ.యన్. కళాశాల వద్దనే ప్రత్యక్ష సహాయం చేస్తూ మార్గనిర్దేశం చేయాలని మా కోరిక, ప్రయాణం, వసతి [[1]] వంటివి ఏర్పాటు చేయబడినవి. కనుక ఇప్పటికీ నమోదు చేసుకొనకపోతే దయచేసి పైన గల సైటునోటీసు[[2]] ద్వారా మీ వివరాలు నమోదుచేసుకొంటే మాకు ఏర్పాట్లకు అంచనా ఏర్పడుతుంది.
ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకొని వికీ మిత్రులంతా సహకరించి కార్యక్రమం విజయవంతం చేసి భావితరాలకు వికీ మార్గదర్శినిగా ఉండేలా చేయాలని మా కోరిక
......దశాబ్ది కార్యనిర్వాహకవర్గం, సహాయమండలి
- https://te.wikipedia.org/wiki/వికీపీడియా:తెవికీ_దశాబ్ది_ఉత్సవాలు-Tewiki_10th_Anniversary
- https://te.wikipedia.org/wiki/వికీపీడియా_చర్చ:తెవికీ_దశాబ్ది_ఉత్సవాలు-Tewiki_10th_Anniversary
- https://te.wikipedia.org/wiki//వికీపీడియా:తెవికీ_దశాబ్ది_ఉత్సవాలు-Tewiki_10th_Anniversary/ProgramDetails
- https://te.wikipedia.org/wiki/వికీపీడియా:తెవికీ_దశాబ్ది_ఉత్సవాలు-Tewiki_10th_Anniversary/Committee------