వాడుకరి చర్చ:Rameshgoud

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Rameshgoud గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

మీకేమైనా సందేహాలుంటే, తప్పకుండా నా చర్చా పేజీలో పోస్టు చెయ్యండి. వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉందాం. --వీవెన్ 08:54, 7 నవంబర్ 2006 (UTC)

కేశవరం[మార్చు]

రమేష్ గారూ, మీ గ్రామానికి పేజీ సృష్టించే పద్ధతి తెలీక విండోస్ 98 పేజీలో రాసారని అనిపిస్తోంది. కేశవరం కు పేజీ ఇలా తయారు చెయ్యాలి..

  1. ముందు మీ మండలమైన షామీర్‌పేట్‌ పేజీకి వెళ్ళండి.
  2. గ్రామాల జాబితాలో మీ గ్రామం పేరు కూడా ఉంటుంది. అది ఎర్రగా ఉంటే పేజీ లేనట్టు, నీలంగా ఉంటే ఇప్పటికే పేజీ ఉన్నట్టు.
  3. అది ఏ రంగులో ఉన్నా సరే దాన్ని నొక్కగానే ఆ పేజీకి వెళ్తారు. ఇప్పటికే ఏమైనా రాసి ఉంటే అది కనిపిస్తుంది. లేదంటే, రాసేందుకు వీలుగా ఎడిట్ పెట్టె కనిపిస్తుంది. ఇక మీ వ్యాసం రాసెయ్యడమే.

అయితే, ముందు ఏదైనా గ్రామం పేజీని చూడండి. దాని కంటే బాగా ఎలా రాయాలో మీకు తెలుస్తుంది. ఉదాహరణకు మా ఊరి పేజీ చూడండి. పోతే, విండోసు 98 కు, మీ ఊరిపేరుకు ఏ సంబంధం లేదు కాబట్టి దాన్ని తీసేస్తున్నాను.__చదువరి (చర్చ, రచనలు) 10:24, 7 నవంబర్ 2006 (UTC)