Jump to content

వాడుకరి చర్చ:Reddy Ratnakar Reddy

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి


Reddy Ratnakar Reddy గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

Reddy Ratnakar Reddy గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై ( లేక ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   Bhaskaranaidu (చర్చ) 13:45, 9 ఆగస్టు 2018 (UTC)[ప్రత్యుత్తరం]



ఈ నాటి చిట్కా...
మీ సభ్యుని పేజీ

వికీపీడియాలో నమోదైన సభ్యులందరూ తమ తమ సభ్యుని పేజీలను సృష్టించుకోవచ్చు. మీరు లాగిన్ అయి ఉంటే, తెరపై పైని, కుడి మూలన మీ పేరు, ఇతర లింకులు కనిపిస్తాయి. పేరును నొక్కినపుడు మీ సభ్యుని పేజీకి వెళ్తుంది. మార్చు నొక్కి, దిద్దుబాటు పేజీకి వెళ్ళి మీ గురించి రాసుకోవచ్చు. మీ గురించి, వికీలో మీరు చేస్తున్న, చెయ్యదలచిన పనుల గురించి రాయవచ్చు. మీ "సభ్యుని చర్చ" పేజీలో ఇతరులు మీతో చెయ్యదలచిన చర్చలు రాస్తారు. మీరు చెయ్యదలచిన ప్రయోగాల కోసం మీ సభ్యుని పేజీకి అనుబంధంగా ఉప పేజీలను సృష్టించుకోవచ్చు.

మరిన్ని వివరాల కోసం వికీపీడియా:సభ్యుని పేజీ చూడండి


తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల Bhaskaranaidu (చర్చ) 13:45, 9 ఆగస్టు 2018 (UTC)[ప్రత్యుత్తరం]

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters

[మార్చు]

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (చర్చ) 16:38, 30 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.

రెడ్డి రత్నాకర్ రెడ్డి

[మార్చు]

Discover Man రెడ్డి రత్నాకర్ రెడ్డి "డిస్కవర్ మ్యాన్" గా సుప్రసిద్ధులు. ఆర్ ఆర్ ఆర్ గానూ "ఆర్ క్యూబ్ సార్ "గానూ పిలుచుకుంటారు.

    జనగామ జిల్లాలోని అన్ని గ్రామాలలో ఆది మానవుల ఉనికిని  గుర్తించారు, జనగామ మరియు హనుమకొండ జిల్లాలపై  ప్రాచీన చరిత్ర వ్యాసం రాశారు.

బాల్యం: జననం: 08-06-1971 తల్లిదండ్రులు: రాధమ్మ , రెడ్డి బుచ్చిరెడ్డి కుటుంబ సభ్యులు తాత పేరు బండయ్య, బాపమ్మ పేరు బుచ్చమ్మ. ఇద్దరు అక్కలు : తిరుపతమ్మ, సువర్ణ ఇద్దరు అన్నలు : బాపు రెడ్డి, సంపత్ రెడ్డి భార్య పేరు రాధిక, కొడుకు పేరు రైతు. స్వగ్రామం గంగిపల్లి . మానకొండూర్ మండలం. కరీంనగర్ జిల్ల . ప్రస్తుతం జనగామ జిల్ల

విద్యాభ్యాసం : ఎనమిదవ తరగతి వరకు స్వగ్రామంలో చదివారు. తొమ్మిది, పది తరగతులు శ్రీనివాస హై స్కూలు, కరీం నగర్. ఇంటర్మీడియట్ సైన్స్ కాలేజీ కర్కాన గడ్డ, కరీం నగర్. SDLCE కాకతీయ యూనివర్సిటీ లో డిగ్రీ చదివారు 1995-97 లో కాకతీయ విశ్వ విద్యాలయంలో ఎం. ఎ తెలుగు చదివారు. డిగ్రీ చదువుతున్న రోజుల్లో ప్రైవేట్ పాఠశాల నెలకొల్పారు. 2001లో ఉద్యోగరిత్య వరంగల్ జిల్లా లోని జనగామకు వచ్చారు. ఉద్యోగం: ఏకశిల విద్యా కళాశాల , జనగామ జిల్లాలో అధ్యాపకుడిగా పని చేస్తున్నారు. ఉద్యమాలు: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు నిరాహార దీక్షకు పూనుకొని కరీం నగర్ నుండి బయలుదేరినప్పుడు ఆలుగునూర్ చౌరస్తాలో అరెస్ట్ చేశారు. అదే సమయంలో తన మేన కోడలు లావణ్య పెళ్లికి వెళుతూ రెడ్డి రత్నాకర్ రెడ్డి అక్కడే ఆగి పోయారు.

   జై తెలంగాణ అనీ నినదిస్తూ చౌరస్తాలో  బైఠాయించారు. టీవీ9 ఆ రోజు జరిగిన ఉద్యమాన్ని లైవ్ లో ప్రసారం చేసింది. జనగామ చేరుకున్నాక తెలంగాణ ఉద్యమ సాధనలో భాగంగా "జనగామ లెక్చరర్ జాక్ " ఏర్పాటు చేశారు . అందులో భాగంగా అనేక విన్నూత్న కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థి జాక్ కి కన్వీనర్ గా వ్యవహరించారు. విద్యార్థుల రిలే నిరాహార దీక్షలలో భాగంగా కూర్చున్న విద్యార్థులకు ప్రతీ రోజు తెలంగాణ  రాష్ట్ర ఆవశ్యకతపై  ఉద్యమ పాఠాలు బోధించారు. తాను పని చేస్తున్న కళాశాల విద్యార్థులు సైతం కళాశాల ముందు రిలే దీక్షలు చేశారు. జిల్లా వ్యాప్తంగా అనేక గ్రామాలలో నిర్వహించిన ధూం ధాం వేదికలపై ప్రధాన వక్త గా అనేక ప్రసంగాలు చేశారు. వేలాది మంది విద్యార్థులతో చౌరస్తాలో తెలంగాణ రచయతల పుస్తకాలను రోడ్డుపై పర్చి  " మా పుస్తకాల్లో మా చరిత్ర " కావాలంటూ ఒక్కొక్క పుస్తకం గొప్పతనాన్ని తెలియజేశారు.
మట్టి సత్యాగ్రహం :
  తెలంగాణ లోని ప్రసిద్ధ ప్రాంతాలు , నదులు, గ్రామాలలోని చెరువుల నుండి , చుట్టు పక్కల గ్రామాల నుంచి  తన విద్యార్థులతో కలిసి , జనగామ జాక్ అధ్వర్యంలో "మట్టి సత్యాగ్రహం " నిర్వహించారు. బచ్చన్న పేటలో జరిగిన ధూమ్ ధాం కార్యక్రమం ప్రారంభానికి ముందు కోదండ రాం సార్, విమలక్క తదితరులు తెలంగాణ అమర వీరుల స్తూపం ముందు మట్టి ముడుపు కట్టారు.

2009 డిసెంబర్ లో తెలంగాణ ప్రకటన వెలువడిన రోజు జనగామ చౌరస్తాలో దర్వాజ ఎత్తారు. మట్టి మీద "జై తెలంగాణ " అని రాపిచ్చి తన కొడుకుకు అక్షరాభ్యాసం చేయించారు.

జనగామ జిల్ల ఏర్పాటు ఉద్యమం: జనగామ జిల్లా సాధనలో క్రియాశీలక పాత్ర పోషించడం కాక జిల్లా ఏర్పడటానికి కావలసిన రిపోర్ట్ తయారు చేశారు. ఈ ప్రాంతంలోని నైజాం ప్రభుత్వము పై తిరుగుబాటు చేసిన వీరుల చరిత్ర వెలుగులోకి తెచ్చారు. జిల్లా సాధనలో భాగంగా వరంగల్ సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న కాలంలో జైలు అనుభవాలు డైరీ రాశారు. విడుదల అనంతరం సంవత్సరం పాటు జరిగిన జిల్లా సాధన ఉద్యమాన్ని రికార్డు చేశారు

పరిశోధనా రంగం : 2009 లో తెలంగాణ ప్రకటన వెలువడిన తర్వాత జనగామ ప్రాంతంపై తన పరిశోధనను వేగవంతం చేశారు.

2010-11 మధ్యలో జనగామ పట్టణ ప్రాంతం పై విస్తృతంగా పరిశోదించారు.

    ఏ ఊరికి వెళ్ళినా ఆది మానవుల ఉనికిని గుర్తించి ఆయా గ్రామ ప్రజలకు తెలియజేయడం వలన డిస్కవర్ మ్యాన్ అనీ , ఆది మానవుడు అనీ,  అనేక గుట్టలనుఎక్కడం వల్ల హిల్ మ్యాన్ అని తెలిసిన వారు పిలుస్తారు.

12 మండలాలు ,176 గ్రామాలు ఉన్న జనగాం జిల్లా లో 120 గ్రామాల్లో శిలా యుగం నాటి ఆది మానవుల ఉనికిని గుర్తించారు. వీటిలో 1) 100 కు పైగా గ్రామాలలో రాకాసి గూళ్ళు , 2)30 గుట్టలపై 100 డాల్మెన్ సమాధులు , 3)60 నిలువు రాళ్లు , 4) 6 మానవాకృత శిల్పాలు ,

5)వివిధ కాలాలకు చెందిన 20 శిలా చిత్ర లేఖనం ఉన్న గుట్టలు , 

6)తెలంగాణలోనూ అయ్యప్ప ఆరాధన ఉందని తెలిపే "అయ్య"శిల్పము ను జనగామ జిల్ల ఎల్లంల గ్రామంలో కనుగొన్నారు. 7)200 లకు పైగా ఉన్న పరుపు బండలపై వేలాది కప్ మార్క్స్ పరిశోధించి వెలుగులోకి తెచ్చారు. 8)కొత్త రాతి యుగం నాటి రాతి పనిముట్లు తయారు చేసుకున్న తావులను 50 గ్రామాలలో గుర్తించారు. 9)15 గ్రామాల్లో మధ్య శిలా యుగం నాటి సూక్ష్మ రాతి పనిముట్లు గుర్తించారు. వీటితో పాటు బూడిద సమాధులు , 10)3 చిత్ర లేఖన గుహలు ఉన్నాయి. 11) జనగామ జిల్లా వ్యాప్తంగా 60 కి పైగా శాసనాలను వెలుగులోకి తెచ్చారు.

  12)  సుమారుగా 30 k.m ల పొడవున్న సంగీతం పలికే (ఏనే) గుట్టపై నడుచుకుంటూ శిలా యుగం అన్ని దశలను మొదలుకొని కాకతీయుల కాలం వరకు ఉన్న చారిత్రక అధారాలను గుర్తించారు. 

13) భౌద్దం జైనం విలసిల్లిన అనేక గ్రామాలను గుర్తించడం తో పాటు బౌద్ద తారా , జైన యక్షినిలను గుర్తించి వెలుగు లోకి తెచ్చారు. 14) చేర్యాలలో లజ్జ గౌరీ( petroglip)- వెలుగులోకి తెచ్చారు 15) కిక్కిరిసి ఉన్న శిలాజాల స్థావరం"గెర్ర"అనే ప్రాంతాన్ని గుర్తించి పరిశోధన చేశారు. stromatolites నీ గుర్తించారు. 16) జనాగామ జిల్లాలో పర్యాటక ప్రాంతాలను గుర్తించి ప్రచారం లోకీ తెస్తున్నారు. 17)కొలనుపాక, హనుమకొండలోని అగ్గలయ్య గుట్ట, హుజూరాబాద్ లో గుట్ట మొదలైన చోట్ల ప్రాచీన వైద్య కేంద్రాలను చారిత్రక ఆధారాలతో గుర్తించారు.

     పురావస్తు శాఖ గుర్తించిన దామెరవాయి లోని డోల్మెన్ సమాధులను , ఏటూరు నాగారం గోదావరి నది ఒడ్డున ఉన్న శిలాజాలను , మైలారంసున్నం గుహలను బహుళ ప్రచారం లోకి తెచ్చారు.
  • ఇళ్లే మ్యూజియం :

పరిశోధనలో బాగంగా శిలాయుగం నాటి అన్ని దశలకు సంబంధించిన రాతి పనిముట్లు, అనేక రకాల మృన్మయ పాత్రలు , టెర్రకోట బొమ్మలు , టెర్రకోట కేక్స్ , రాతి మట్టి పూసలు , దంతపు పూసలు, గాజులు , బంగారం కరిగించే మూసలు , శిలాజాలు , నాణాలు , నీటిలో తేలే ఇటుక మొదలైన చారిత్రక ఆధారాలను సేకరించి తన ఇంటినే మ్యూజియంగా చేశారు. ఈ మ్యూజియం చూసే కొన్నె గ్రామంలో పురావస్తు త్రవ్వకాలు జరిగాయి. అనేక గ్రామ చరిత్రలను రికార్డు చేస్తున్నారు.

  • 700 వీడియోలు

చరిత్ర పరిశోధన, సంస్కృతి పై 700 వీడియోలు చేశారు. ఇందులో అనేక డాక్యుమెంటరీలు , గ్రామ చరిత్రలు ఉన్నాయి.

  • ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా మూసి పత్రిక ఆలోకనం పేరిట తెలంగాణలోని 33 జిల్లాల చరిత్ర తీసుకొని వచ్చింది. ఈ పుస్తకానికి జనగామ జిల్లా చరిత్ర సాహిత్యం, సంస్కృతి పై పరిశోధకుడు రెడ్డి రత్నాకర్ రెడ్డి వ్యాసం రాసారు.
  • తన పాలపిట్ట కవితా పుస్తకాన్ని ఎలగందుల ఖిలా( కరీంనగర్ )పై ఆవిష్కరించారు. వాన కోయిల అనే దీర్ఘ కావ్యాన్ని తుర్రేబాజ్ ఖాన్ స్థూపం ( మహిళా డిగ్రీ కళాశాల, హైదరాబాద్ )ముందు ఆవిష్కరించారు.
  • ఉపాధ్యాయ వృత్తిలో ఉండి తన విద్యార్థులతో ఎన్నో గుట్టలను ఎక్కుతున్నారు. గ్రామ ప్రజల్లో చరిత్ర సంస్కృతి పై అవగాహన కలిగిస్తున్నారు. 2401:4900:4E10:CAFC:4741:64C1:9F28:DB1D 08:59, 17 సెప్టెంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]

రెడ్డి రత్నాకర్ రెడ్డి పరిచయం 1.పూర్తి పేరు రెడ్డి రత్నాకర్ రెడ్డి కలం పేరు - ఆర్ క్యూబ్ పుట్టిన తేది 08/06/1971 2.తల్లిదండ్రుల పేర్లు :రాధమ్మ , బుచ్చిరెడ్డి 3. భార్య :రాధిక ఏకైక కుమారుడు: రైతు 4.చదువు :ఎం. ఏ ( తెలుగు) ఎం.ఇడి 5.స్వగ్రామం : గంగిపల్లి , మానకొండూర్ మం.,కరీంనగర్ జిల్ల. 6.విద్యాభ్యాసం : 8వ తరగతి వరకు స్వగ్రామంలో ప్రభుత్వ పాఠశాల లో చదివారు.9 వ తరగతి నుండి డిగ్రీ వ రకు కరీంనగర్ లో చదివారు. పోస్టు గ్రాడ్యుయేషన్ (ఎం. ఎ తెలుగు సాహిత్యం )కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్ లో చదివారు. ఉద్యోగం:ప్రస్తుతం ఉద్యోగరిత్యా జనగామ జిల్లలోని ఏకశిల విద్యా కళాశాలలో అధ్యాపకుడిగా పని చేస్తున్నారు. 7.కళా సాహిత్య రంగాల్లో 1990లో ప్రవేశం చేశారు. వీరి తండ్రిగారు కళలు కళాకారులను ఆదరించేవారు. వీరి సోదరీ మణులు పెద్దక్క తిరుపతమ్మ, చిన్నక్క సువర్ణ లు బతుకమ్మ పాటలు పాడేవారు. తిరుపతమ్మ పాఠశాల రోజుల్లో నాటకాలు వేసారు . రత్నాకర్ రెడ్డి చిన్ననాట తన చిన్నక్కతో కలిసి రేడియోలో బాలానందం, ఆదివారం ఒక గంట నాటిక తప్పక వినేవారు.ముప్పై ఏళ్ల జీవితం నిండా గ్రామీణ కళలను చూస్తూ ఊరిలోనే పేరుగారు. ఈనాడు దినపత్రికలో వచ్చే బొమ్మల కథలను ఎప్పటి కప్పుడు కత్తిరించి ఎన్నో పుస్తకాలు తయారు చేసేవారు. చందమామ వంటి పిల్లల పుస్తకాలు నెల నెలా చదువుతుండేవారు.. డిగ్రీ చదివే రోజుల్లో స్వగ్రామంలో తమ ఇంటిలోనే ఒక పాఠశాల ప్రారంభించి పదేళ్లు నడిపారు. విద్యార్థుల కోసం ఎన్నెన్నో వ్యాసాలు , పాటలు రాశారు. ఈ నేపథ్యం నుంచి కవితా రచన లోకి వచ్చారు. మా ఊరే కవిత్వం, నా బాల్యమే సాహిత్యం అని చెప్పే రెడ్డి రత్నాకర్ రెడ్డి 1995 నుండి తెలంగాణా వాడుక భాషలో కవితలు రాస్తున్నారు. అచ్చైన పుస్తకాలలో తెలంగాణ సోయి , గ్రామీణ సంక్షుభిత వాతావరణం , ఆధిపత్య దిక్కారం , ప్రపంచీకరణ నేపథ్యం , అందమైన బాల్యం , వానలో తడిసిన పల్లె , పురా వస్తు చరిత్ర కవితా వస్తువులుగా ఉన్నాయి.సాహిత్యంలోకి కొత్తగా ఆది మానవుల చరిత్రను, స్వీయ పురావస్తు పరిశోధనాంశాలను కవిత్వ వస్తువులుగా తీసుకొని వచ్చాడు. 10. ఇప్పటి వరకు 1)పాలపిట్ట ఎలగందుల ఖిల గుట్ట పైన( కరీం నగర్), నందిని సిధారెడ్డి ఆవిష్కరించారు 2)వాన కోయిల( 2007) తుర్రే బాజ్ ఖాన్ స్థూపం( హైదరాబాద్) ముందు కే. శివారెడ్డి ఆవిష్కరించారు 3)బమ్మెరను దర్శించు పదములు పదములు ( తాటాకులపై రాసిన ఆధునిక పద్య కావ్యం) 4) ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా "ఆలోకనం "(2017)కు జనగామ చరిత్ర 5) శైలీ సాహితీ కళా సంస్థ ప్రధాన కార్యదర్శిగా తెలంగాణా రాష్ట్ర సాధన ఉద్యమంలో కరపత్ర కవిత వెలువర్చారు. సాహిత్య సేవ: 6) జనగామ జిల్ల రచయితల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడిగా ' సంకలనం వేసారు. 7) జనగామ జిల్ల సాధన ఉద్యమంలో భాగంగా జిల్ల జే ఏ సి తరపున ఉద్యమ పాటల క్యాసెట్ వెలువడడంలో కీలక పాత్ర పోషించారు **అముద్రితం: 1)కట్లపువ్వు 2)కుళ్లిన పళ్ళతోట ( దీర్ఘ కావ్యం) 3)బుజ్జి గాడి కలల రాజ్యం ( దీర్ఘ కావ్యం) 4)ఈ యుద్ధం కొనసాగుతది ( దీర్ఘ కావ్యం) 5) డిస్కవర్ మ్యాన్ 6) డిస్కవర్ మ్యాన్ (పురావస్తు పరిశోధనాత్మక కవితలు) 11.అవార్డులు/ రివార్డుల వివరాలు 1)కరీంనగర్ చాలానంద సంఘం వారు నిర్వహించిన రాష్ట్రస్థాయి కవితల పోటో లో ద్వితీయ , 2) శ్రీలేఖ సాహితి సంస్థ హన్మకొండ వారు రాష్ట్ర రచయితల సదస్సు సందర్భంగా నిర్వహించిన రాష్ట్ర స్థాయి కవితల పోటీలో ప్రథమ బహుమతి పొందాడు . 3)మట్టి పూసే పచ్చ పూవు(1996) ర్యాగింగ్ ( 1997) 4)ఇట్లు నీ పి. జి. మిత్రుడు (2004) ఈ మూడు విడి కవితలకు ఎక్స్ రే సాహిత్య అవార్డు 5)" ఊరు "అనే కవితకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర స్థాయి కవితల పోటీ నగదు పురస్కారం 6)2007 లో మానస జాతీయ అవార్డు 7) విద్యా బోధనలో "ఎమెస్కో" వారి "బడి నేర్పిన పాఠాలు " రాష్ట్ర స్థాయి పురస్కారం 8)'ఊర బర్ల పోరడు " కవితకు ప్రకృతి సాహితీ సాహిత్య పత్రిక అవార్డు 9) జనగామ చరిత్ర రచన కై మూసీ మాస పత్రిక వారి ఆలోకనం జ్ఞాపిక 10)2021లో పర్యాటక శాఖ,తెలంగాణ ప్రభుత్వం చరిత్ర పరిశోధకుడిగా గుర్తించింది. 13.ప్రముఖుల ప్రశంసల వివరాలు ***తెలంగాణ గర్వించ దగ్గ కవి అని నందిని సిధారెడ్డి" వాన కోయిల " దీర్ఘ కావ్యం ముందు మాటలో ప్రస్తుతించారు. **** కొత్త డిక్షన్ తో తనదైన ముద్ర వేసే కవి అని ప్రముఖ కవి దర్భశయనం శ్రీనివాసా చార్యులు అభినందించారు. ****** "A Poet with the Essence " అని కాసుల ప్రతాప్ రెడ్డి గారు ప్రశంసించారు. ****** " ఒంటరి క్రూసేడర్ "మరియు "ఆసక్తి తో కూడిన అన్వేషకుడు", ఇతని శక్తిని అంచనా వేయడం చాలా కష్టం. ఒంటరిగా అన్వేషిస్తూ కొత్తదనంతో వస్తాడు. "డిస్కవరీ మ్యాన్‌" గా ప్రసిద్ధి చెందాడు. ప్రముఖ ఆంగ్ల పత్రిక హన్స్ ఇండియ ప్రత్యేకంగా పేర్కొంది **** హిల్ మ్యాన్, డిస్కవర్ మ్యాన్ అంటూ నమస్తే తెలంగాణ కితాబు ఇచ్చింది. ** డోల్మెన్ ( dol -men) అనీ ప్రసిద్ధ స్థపతి , చరిత్రకారుడు ఈమని శివనాగిరెడ్డి గారు ప్రశంసించారు. ఉద్యమాలు: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా అలుగునూర్ చౌరస్తాలో కె సి ఆర్ ని అరెస్ట్ చేయగా అక్కడే ఉన్న రత్నాకర్ రెడ్డి చౌరస్తాలో బైఠాయించి నినాదాలు చేశారు. తెలంగాణా ఉద్యమంలో భాగంగా "జనగామ లెక్చరర్ జే ఏ సి "ఏర్పాటు చేసి అనేక విన్నూత్న కార్యక్రమాలు నిర్వహించారు. తెలంగాణ కోసం"మట్టి సత్యాగ్రహం "చేశారు. కోదండరాం, విమలక్క మొదలైన అనేక ఉద్యమకారులతో మట్టి ముడుపు కట్టించారు. "మా పుస్తకాలలో మా చరిత్ర" రావాలంటూ జనగామ చౌరస్తాలో రోడ్ మీద తెలంగాణ సాహిత్య పుస్తకాలను పరిచి ఒక్కోక్క పుస్తక ప్రాముఖ్యతను తెలియజేశారు. వివిధ గ్రామాలలో నిర్వహించిన ధూంధాం వేదికలపై ఉపన్యాసాలు ఇచ్చారు. తెలంగాణ ప్రకటన వెలువడగానే తెలంగాణ కోసం చౌరాస్తలో దర్వాజ ఎత్తారు. అక్కడే తన కొడుకు రైతు కు మట్టి మీది " జై తెలంగాణ "అంటూ అక్షరాభ్యాసం చేయించారు. తెలంగాణ చిహ్నాల జాబితా విడుదల చేశారు. నూతన జిల్లాల ఏర్పాటులో భాగంగా జనగామ జిల్లా కోసం నిరవధిక పోరాటం చేశారు. జిల్ల సాధన ఉద్యమానికి తాత్విక భూమికను అందించారు. చరిత్ర పరిశోధన : 2010 నుండి పురావస్తు పరిశోధన చేస్తున్నారు. "డిస్కవర్ మ్యాన్ " గా పేరు పొందిన రెడ్డి రత్నాకర్ రెడ్డి తెలంగాణ చరిత్ర లోకి కొత్తగా వజ్రయాన బౌద్ధాన్ని, అయ్యనర్ సంస్కృతిని, ఏటూరు నాగారం అభయారణ్యం లోని శిలాజాలను , శిలా యుగం దశలను , సంగీతం వినిపించే ఏనెలను తీసుకొని వచ్చాడు. నైనా గుహలపై నూతన ఆలోచనలను రేకెత్తించారు. జనగామ జిల్ల పరిధి లోని ప్రతి గ్రామములో శిల యుగం ఆధారాలను గుర్తించడం విశేషం. తన ఇంటినే పురావస్తు మ్యూజియం ఏర్పాటు చేసరు

[మార్చు]

వికీపీడియా 2401:4900:60F5:E795:5F18:F33A:DD8B:FCC6 09:17, 9 అక్టోబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]

అగ్గలయ్య గుట్టపై ఇటుకలతో కట్టిన నిర్మాణాలు ఉన్నట్లు చరిత్ర పరిశోధకుడు రెడ్డి రత్నాకర్ రెడ్డి గుర్తించారు. ఈ గుట్టపై ఉన్న ఇటుకల దిబ్బపై పాలరాతి ముక్కలు లభించడం విశేషం Reddy Ratnakar Reddy (చర్చ) 12:24, 9 మే 2023 (UTC)[ప్రత్యుత్తరం]