వాడుకరి చర్చ:S172142230149/పాత చర్చ 4

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


నా ఉద్యోగం మరో మూడు నెలలు పొడిగించబడింది.ఈ రోజే ఆ విషయం తెలిసింది--మాటలబాబు 20:54, 13 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

మీ ఉద్యోగాన్ని కాపాడుకున్నందుకు శుభాకాంక్షలు. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 01:49, 14 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]
శుభం. అభినందనలు. మూడునెలలలో మరో మార్గం లభించకపోదు.--కాసుబాబు 08:24, 16 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

మరేం ఫర్వాలేదు[మార్చు]

మీరు ఉద్యోగం నిలబెట్టుకుట్టుకున్నందుకు సంతోషం. వికీలో అర్జంటు వ్యవహారాలంటూ ఏమీ ఉండవు. స్వకార్యాలు చక్కగా నిర్వర్తించి ఆపైన సమయముంటేనే వికీలో రాయటానికి వినియోగించగలరు. --వైజాసత్య 21:51, 15 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

ఇంతకీ ఏమి పని చేస్తున్నారేమిటి? నాకు ఈ-ఉత్తరం చేయవచ్చు పర్సనల్ అనుకుంటే చావాకిరణ్ ఎట్ జీమెయిల్
నేనూ అదే వ్రాయాలనుకొన్నాను. కాని వెనుకాడాను. మీకు అభ్యంతరం లేకుంటే teluguwiki ఎట్ యాహూ డాట్ కమ్ కు వ్రాయండి.--కాసుబాబు 11:44, 16 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ వారం వ్యాసం[మార్చు]

అలాగే పంపిస్తాను. __మాకినేని ప్రదీపు (+/-మా) 08:16, 18 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

పతకధారికి అభినందనలు[మార్చు]

మాటలబాబూ! శ్రవణవికీ పతకం అందుకున్నవేళ మీకు నా అభినందనలు! ఇప్పటిదాకా నేనది గమనించలేదు. __చదువరి (చర్చరచనలు) 03:39, 19 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

పునఃస్వాగతం[మార్చు]

మాటలబాబూ, తెవికీకి పునఃస్వాగతం. మీ మాటలు కరువై తెవికీ మూగబోయిందంటే అతిశయోక్తి కాదు --వైజాసత్య 02:05, 27 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

వైజాసత్యా గారి కి ధన్యవాదాలు, నేను 2-3 రోజులు సరిగా వ్రాయలేను తరువాత బాగా వ్రాస్తాను, వనరులు సమకూర్చుకొనే పని లొ ఉన్నాను. మీరు కాసుబాబు చేస్తున్న కృషి చాలా బాగుంది--మాటలబాబు 02:46, 27 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

కుశలమే[మార్చు]

మాటలబాబూ! కుశలమే. --కాసుబాబు 11:33, 27 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

బొమ్మల పేర్లు[మార్చు]

మీరు అప్లోడ్ చేస్తున్న బొమ్మలకు కొంచెం విస్తృతమైన పేర్లు ఇవ్వండి. ఆ విధంగా అవి స్పష్టంగా ఉంటాయి. ఉదాహరణకు Varahaswamy బదులు Tirumala varahaswamy temple అని ఇచ్చివుంటే బాగుండేది. ఇప్పటికే చేర్చిన వాటిని ఏమీచెయ్యక్కర్లేదు. అలాగే ఉంచెయ్యండి --వైజాసత్య 14:06, 27 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

భీమిలి బొమ్మలు[మార్చు]

మీరు అప్లోడ్ చేసిన రెండు బొమ్మలు సమాన అర్ధభాగాలు కాదనుకుంటా వాటిని ఎలా కలపాలో అర్ధం కావట్లేదు. వీటి గురించే కదా మీరు చెప్పింది బొమ్మ:Bhimli.JPG, బొమ్మ:Bmili part1.JPG? --వైజాసత్య 07:33, 31 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

మీరిచ్చిన బొమ్మలతో నేను చెయ్యగలిగినది ఇది బొమ్మ:Bhimli2.jpg --వైజాసత్య 08:08, 31 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]
బొమ్మల రిజిస్ట్రేషను చాలా బాగా చేసారు. ఆ మాయమైన ముక్క కూడా ఉంటే బాగుండేది. అలాగే బొమ్మకు కాంట్రాస్టు, షార్పనెస్సు రెండూ తక్కువయ్యాయి. __మాకినేని ప్రదీపు (+/-మా) 09:25, 31 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]
మాటలబాబు, ఇదిగో నాయనా నీ బొమ్మ. ఎలా వచ్చింది బొమ్మ:Bhimli2.jpg --వైజాసత్య 20:32, 2 ఆగష్టు 2007 (UTC)
అత్యద్భుతం.. మీరు అసాధ్యులు--మాటలబాబు 20:39, 2 ఆగష్టు 2007 (UTC)
మాటలబాబు, అభిమానముతో పతాకమిచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. నేను ఇప్పుడే చూసుకొని చాలా సంతోషపడ్డాను --వైజాసత్య 02:18, 3 ఆగష్టు 2007 (UTC)

నిర్వాహక హోదా[మార్చు]

మాటలబాబూ,

నేను మిమ్మల్ని నిర్వాహక హోదాకై ప్రతిపాదించాను. ఇక్కడ అంగీకారము తెలుపగలరు --వైఙాసత్య 19:55, 12 ఏప్రిల్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

ఎంతో ఔదార్యం తొ సత్యాగారు నన్ను నిర్వాహక హోదాకు ప్రతిపాదించారు , కాని దానికి నేను అర్హుడునా అనే ఒక పెద్ద సందేహం ఉన్నది. ప్రతిపాదించినందుకు చాలా సంతోషం. నిర్వాహకుడిని అయితే చిలిపి పనులు చేయడానికి ఉండదు.--మాటలబాబు 20:04, 7 ఆగష్టు 2007 (UTC)
నిర్వాహుకులైన సందర్భముగా శుభాకాంక్షలు --వైజాసత్య 12:48, 15 ఆగష్టు 2007 (UTC)
ధన్యవాదాలు--మాటలబాబు 12:50, 15 ఆగష్టు 2007 (UTC)

లిప్యాంతరీకరణ స్క్రిప్టు[మార్చు]

నేను స్క్రిప్టును పాత సంచికకు తిరుగుసేత చేశాను. ఇప్పుడు బాగానే పనిచేస్తుండాలి. మీకీ మార్పులింకా వర్తించకపోతే ఒక సారి Ctrl+F5 నొక్కి చూడండి --వైజాసత్య 19:17, 7 ఆగష్టు 2007 (UTC)

సత్యా గారు మీకు అస్తమానం పని చెబుతున్నాను అందుకు క్షమించండి. నాకు కంప్యూటర్లంటే పెద్దగా పరిచయం లేదు,అందువల్ల నాకు చాలా సందేహాలు వస్తుంటాయి. నేనుకోవడం ప్రకారం స్క్రిప్టు లొm అనే అక్షరం మారడం వల్ల బాధలు వస్తున్నాయని అనిపించింది. ఇప్పుడు సౌమ్యవారం వ్రాయగలుగు తున్నాను.సాధకభాదకాలు చర్చా పేజిలో వ్రాయమన్నందుకే వ్రాశాను --మాటలబాబు 19:23, 7 ఆగష్టు 2007 (UTC)
చెప్పి మంచి పని చేశారు. అందుకనే కదా దానికీ చాలా మరమ్మత్తు అవసరమని షెడ్డుకు పంపించేశాను. ఇంతకీ నేను మిమ్మల్ని నిర్వాహుకునిగా ప్రతిపాదించా, అంగీకారం తెలుపలేదే? --వైజాసత్య 19:32, 7 ఆగష్టు 2007 (UTC)
m గురించి మీరనుకున్నది నిజమే. పాత స్క్రిప్టు m అనగానే మ్ వచ్చేది. ఆ కొత్త స్క్రిప్టులో m నొక్కగానే ం వస్తుండటంతో చాలా ఇబ్బందులేర్పడుతున్నాయి --వైజాసత్య 19:35, 7 ఆగష్టు 2007 (UTC)
నేనూ ఇది గమనించాను. ఇది ముఖ్యంగా మ కు య వత్తు ఇచ్చేటపుడే వస్తోంది. మ్య, మ్ల,మ్క,మ్ప,మ్హ,మ్గ,.. ఇలాంటివి రాయాలంటే ఇంగ్లీషులో రాసి తరువాత మార్చాల్సి వస్తోంది. __చదువరి (చర్చరచనలు) 03:04, 8 ఆగష్టు 2007 (UTC)

రాజమండ్రి పొటోలు[మార్చు]

మీరు రాజమండ్రి ఫొటోలు ఇస్తున్నారుగా అదే చేత్తో {కెమెరాతో} ఇస్కాన్ వారి కృష్ణ మందిరం మరియు కొత్తగా డెల్టా పేపర్ మిల్లు వైపుగా కట్టిన సింహాద్రి అప్పన్న దేవాలయాలను గోదావరి స్టేషన్ దగ్గర పెద్ద శివలింగములను కూడా చేర్చండి వీలయితే.vissu 04:15, 8 ఆగష్టు 2007 (UTC)
ఆ పని నేను చెయ్యలేను. నాకు సమయం చిక్క లేదు, గోదావరి స్టేషన్ దగ్గర ఉన్న పెద్ద శివలింగం బొమ్మ చిత్రించాలి(తియ్యాలి తియ్యాలి) అని అనుకొన్నాను, పుణ్యకాలం దాటి పోయింది, ప్రస్తుతానికి ఆ అవకాశం లేదు(ప్రవాసాంధ్రత కారణం).అయిదు-ఆరు నెలలు ఆగితేకాని నేను ఆ ఫొటోలు అందించ లేను, కారణం నేను భారత దేశంలో లేను, మొన్న భారతదేశం వెళ్ళినప్పుడు తీసిన బొమ్మలు ఒక్కొక్కటి అందిస్తున్నాను.--మాటలబాబు 07:34, 8 ఆగష్టు 2007 (UTC)
మీరుగానీ అమెరికాలో లేరు కదా?? --వైజాసత్య 07:46, 8 ఆగష్టు 2007 (UTC)
హా తెలిసిందిలే..మీరు మా చెరువవతల దేశంలో ఉన్నట్టున్నారు --వైజాసత్య 07:51, 8 ఆగష్టు 2007 (UTC)
అమెరికా లో లేను, చెరువతల దేశం అంటే ఏ దేశం అని మీ ఉద్దేశం.--మాటలబాబు 07:58, 8 ఆగష్టు 2007 (UTC)
మాకు చెరువవతల (across the pond) దేశమంటే ఇంగ్లండే --వైజాసత్య 08:42, 8 ఆగష్టు 2007 (UTC)
ఎట్లు కనిపెట్టిరి--మాటలబాబు 09:10, 8 ఆగష్టు 2007 (UTC)
మీ ఖాతాపేరులో ఉన్న ఐ.పి అడ్రసును ఇందులో వేసి చూశా --వైజాసత్య 09:32, 8 ఆగష్టు 2007 (UTC)

మీకు తెలుసా[మార్చు]

వికీపీడియాలో వ్యాసాలు పూర్తవటం అని ఉండదు. ఎప్పుడూ ఎవరో ఒకరు వ్యాసాన్ని మెరుగుపరుస్తూనే ఉంటారు. అందుకని మీరు కొత్తగా తెలుసుకున్న విషయాలను ఎప్పటికప్పుడు "మీకు తెలుసా భాండాగారంలో" చేర్చేయండి. అలాగే అక్కడ చేర్చిన విషయాలను దాయనవసరం లేదు. __మాకినేని ప్రదీపు (+/-మా) 11:48, 8 ఆగష్టు 2007 (UTC)

Thanks for sugetions to join in TEVIKI[మార్చు]

మాటల బాబు గారు చాల కృతజ్ఞతలు, నాకు తెవికి లో సభ్యత్వం ఉంది. కాని అది ఎలా ఉపయోగించాలో తెలియదు. మీ లాంటి వారి సహాయం ఉంటే తెవికీ కి నా వంతు కృషి చేయాలని ఉంది. తలకోన గురించి ఇంకా చాల రాయలని ఉంది.వ్రాస్తాను. ````

భాషా పరిజ్ఞానం మూసలు[మార్చు]

వాటికి [[వర్గం:సభ్యుల పేజీ మూసలు]] అని కూడా చేర్చాలి కదా?--మాటలబాబు 13:22, 9 ఆగష్టు 2007 (UTC)

అవసరం లేదు. వర్గం:సభ్యుల పేజీ మూసలులో వర్గం:సభ్యుల భాషా పరిజ్ఞానాన్ని తెలిపే మూసలు ఒక ఉపవర్గం. __మాకినేని ప్రదీపు (+/-మా) 13:26, 9 ఆగష్టు 2007 (UTC)
గ్ తర్వాత ం (అంటే గం లో గ బదులు గ్ ఉండాలి ) రావాలంటే ఏమిచెయ్యాలి?

కంపశాస్త్రి 09:09,10ఆగస్టు 2007

అలా రాయడం ఇప్పటికి కుదరడం లేదు. నేను ఓగ్‌ం శివః అని ఒకచోట వ్రాయవలసి వచ్చింది, కాని పని జరగలేదు. మీరు సంతకం పెట్టడానికి ~~~~ఉపయోగించండి, లేదా ఎడిట్ బాక్స్(తెలుగులో రాయడానికి టిక్కు పెట్టండి. ESC - భాషల మధ్య మారడానికి. IEలో ESC తరువాత ctrl+z కూడా నొక్కాలి. ) పై నున్నఎడమ వైపు నుండి 10 వ బటన్ నొక్కండి మీసంతకం పడుతుంది.--మాటలబాబు 13:33, 10 ఆగష్టు 2007 (UTC)

మైక్రోసాఫ్‌ట్ వర్డ్ లో ఈ విధంగా చేయవచ్చు(గ్ తర్వాత సున్న రావడానికి)

i+d+<shift+ctrl+2>+x+<left arrow>)+<Shift+Ctrl+1)+<right arrow>+<shift+ctrl+2> --కంపశాస్త్రి 03:24, 13 ఆగష్టు 2007 (UTC)

అభినందనలు, స్వాగతం![మార్చు]

నిర్వాహకులైనందుకు అభినందిస్తూ, కొత్త గుంపులోకి స్వాగతిస్తున్నాను. __చదువరి (చర్చరచనలు) 02:48, 16 ఆగష్టు 2007 (UTC)

చదువరి గారు అంతా మీ చలవ ప్రోత్సహం.ధన్యవాదాలుమాటలబాబు 02:49, 16 ఆగష్టు 2007 (UTC)
అభినందనలు.. __మాకినేని ప్రదీపు (+/-మా) 17:16, 16 ఆగష్టు 2007 (UTC)
ధన్యవాదాలుమాటలబాబు 21:14, 16 ఆగష్టు 2007 (UTC)

ధన్యవాదాలు[మార్చు]

ఆర్యా, మీ ఇమెయిలుకు ధన్యవాదాలు.మీకు తిరిగి మెయిలు చేశాను. కాని తిరిగివచ్చింది. మళ్లీ ప్రయత్నిస్తాను. ----కంపశాస్త్రి 17:09, 17 ఆగష్టు 2007 (UTC)

నా పేజీపై మీ అభిప్రాయాన్ని తెలిపినందుకు ధన్యవాదాలు.దేవా 17:00, 20 అక్టోబర్ 2007 (UTC)

తానా[మార్చు]

అంతా వెతికాను తానా గురించిన వ్యాసము తెవికీ లేదు --వైజాసత్య 03:48, 22 ఆగష్టు 2007 (UTC)

ధన్యవాదాలు వెతికి నందుకు, మీరు తెలుగు వికీ పితామహులు కదా వ్యాసం సృష్టి జరిగితే మీకు తెలుస్తుందని అడిగాను. వెతికి నందుకు మళ్ళి ధన్యవాదాలు --మాటలబాబు 03:52, 22 ఆగష్టు 2007 (UTC)

సంతకం రూపొందించుకునే విషయమై..[మార్చు]

వికీపీడియా:కస్టమైజేషన్ పేజీ ఒకసారి చూడండి. సంతకాన్ని ఎలా రూపొందించుకోవాలో అక్కడ ఉంది. ఏమైనా సందేహాలుంటే మనం చర్చిద్దాం. __చదువరి (చర్చరచనలు) 06:56, 23 ఆగష్టు 2007 (UTC)

ఎన్,టి,రామారావు గారి ప్రచార సమయంలో ఫొటో ఈనాడు పేపర్లో వచ్చినది వికీలో వాడుకోవచ్చా? కోవచ్చు అయితే అప్లోడు చేస్తా.విశ్వనాధ్. 06:00, 26 ఆగష్టు 2007 (UTC)
నాకు ఈ విహయం లొ అనుభవం తక్కువే , ఇక్కడ చూడండి
  • [1]
  • [:w:Wikipedia:Image copyright tags/Non-free]

అప్లోడ్ చెయ్యండి , దాని మీద చర్చ కానిద్దాం సారాంశం లొ [[Template:India-politician-photo]] ఉంచండి--మాటలబాబు 06:14, 26 ఆగష్టు 2007 (UTC)

దిద్దుబాటు ఘర్షణ[మార్చు]

హైదరాబాదు బాంబు పేలుళ్ళు, ఆగష్టు 25 పేజీలో నేను మరికొంత సమాచారాన్ని చేర్చాను. దిద్దుబాటు ఘర్షణ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక నేను రాయడం ఆపుతున్నాను. మీకు ఘర్షణ ఎదురైతే మీరు రాసిన భాగాన్ని కాపీ చేసి పెట్టుకొని, దిద్దుబాటు పేజీని కొత్తగా మళ్ళీ తెరిచి అప్పుడు చేర్చండి. ఇబ్బంది ఎదురైతే నాకు చెప్పండి. __చదువరి (చర్చరచనలు) 09:50, 26 ఆగష్టు 2007 (UTC)

ఈ వారం వ్యాసం[మార్చు]

ఈ వారం వ్యాసం తయారు చేసినందుకు కృతజ్ఞతలు. ఈమెయిలు ద్వారా త్వరలోనే పంపిస్తాను --75.163.60.186 22:34, 26 ఆగష్టు 2007 (UTC)

నాకో సహాయం చెయ్యగలరా?? మీకు వీలైతే సభ్యుడు:వైజాసత్య/monobook.jsను తొలగించి నన్ను స్వతంత్రున్ని చెయ్యండి.--75.163.60.186 04:43, 27 ఆగష్టు 2007 (UTC)
థాంక్స్ --వైజాసత్య 04:47, 27 ఆగష్టు 2007 (UTC)

వంశవృక్షం మూస[మార్చు]

వంశవృక్షం మూసలన్నీ ఇదివరకు నేను తెలుగీకరించినాను. మూసలకు తెలుగులో పేర్లు పెట్టడం వలన ఇదే కొంచెం చిక్కు. ఇప్పుడు ఆంగ్ల పేర్లతో ఉన్న మూసలను దారిమార్పులు చేశాను. ఈ దారిమార్పులను తుడిచివేయవద్దు భవిష్యత్తులో కొత్త సభ్యులు తిరిగి మూసలను తీసుకునిరాకుండా ఉంటుంది. మూసలన్నింటినీ తాజకరించి సిద్ధం చేశాను. వంశవృక్షం బాగానే పనిచేస్తుంది. ఇక్కడ చూడండి సభ్యుడు:వైజాసత్య/ఇసుకపెట్టె9 --వైజాసత్య 05:53, 28 ఆగష్టు 2007 (UTC)

దారిమార్పు పేజీలు[మార్చు]

తరలింపు చేయటం వళ్ళ యేర్పడే దారిమార్పులను సాధారణంగా తొలగించాల్సిన అవసరం లేదు (ఆ పేరు మరో వ్యాసానికి అవసరమైతే తప్ప) --వైజాసత్య 06:16, 29 ఆగష్టు 2007 (UTC)

కృతజ్ఞతలు - స్వాగతం తెలియజేసినందుకు.మరొకటి వర్గం పశ్చిమగోదావరి గ్రామాలులో ఉన్న గ్రామాలపేర్లలో [కొ]డమంచిలి [క]కడమంచిలిగా ఉంది దాన్ని మార్చుట నాకు వీలవలేదు మార్పు క్లిక్ చేస్తే పేజీ మొత్తం రాలేదు. పరిశీలించగలరు.విశ్వనాధ్. 06:35, 30 ఆగష్టు 2007 (UTC)

వెయ్యి స్థంభాల గుడి / వేయి స్తంభాల గుడి ఏది సరియైనదని మీ అభిప్రాయం. నాకు తెలిసినంత వరకు రెందవదే సరైనది. మొదటి వ్యాసాన్ని రెండవ వ్యాసానికి మరలిస్తే బాగుంటుందేమోనని నేననుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారు? Dvratnam 10:59, 16 సెప్టెంబర్ 2007 (UTC)

కృతజ్ఞతలు[మార్చు]

మొదటిపేజీ మెచ్చి పతాకాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ఇలా మంచిపనులు చేసినవారందరికీ పతకాలు ఇస్తున్నందుకు కృతజ్ఞతలు. తెవికీలో మొట్టమొదటి మెటాపీడియను మీరేననుకుంటా --వైజాసత్య 15:46, 1 సెప్టెంబర్ 2007 (UTC)

ఈవారం బొమ్మ చాలా బాగుంది. ధనుష్కోడి గురించి ఎప్పడినుంచో ఒక వ్యాసం రాద్దామనుకుంటున్నా ఇదే సరైన సమయమనుకుంటా --వైజాసత్య 05:42, 3 సెప్టెంబర్ 2007 (UTC)
మీరు చెప్పిన విధంగానే చేస్తాను. మార్గదర్శికి కృతజ్ఞతలు.విశ్వనాధ్. 08:14, 5 సెప్టెంబర్ 2007 (UTC)

కృతజ్ఞతలు--Dvratnam 09:40, 19 సెప్టెంబర్ 2007 (UTC)

ఈవారం వ్యాసం[మార్చు]

మాటలబాబు, నేనీ వారాంతము శెలవుపై వెళుతున్నాను. అక్కడ నాకు అంతర్జాల సౌకర్యం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మీరు ఈ వారపు వ్యాసాన్ని పంపించగలరా. పీడిఎఫ్ ను ముందస్తుగా తయారుచేసి పంపిస్తాను. కానీ మీరు వ్యాసాన్ని ప్రింటింగ్ వ్యూ (ముద్రణా సంచిక క్లిక్ చేసి వ్యాసాన్ని మొత్తం మెయిల్లో అతికించి మూడు గుంపులకు పంపాలి. ఏమంటారు? --వైజాసత్య 11:20, 7 సెప్టెంబర్ 2007 (UTC)

ఈ వారం మరియు ఈ వారాతం అంతా నాది కూడా అదే పరిస్థితి.ప్రస్తుతం నేను కూడా ఇక్కడ అక్కడ తిరుగుతున్నాను. కాని ఆదివారం రాత్రి కి గూడికి చేరుకోంటాను.కాబట్టి ఆదివారం రాత్రి అందరికి వ్యాసాన్ని పంపుతాను. కాని ప్రశ్న ఏమిటంటే పి.డి.యఫ్.గా మార్చడానికి పలుమార్లు ప్రయత్నించాను. సరైన మృదులాయంత్రం సూచించగలరు. ప్రదిపు గారు చెప్పిన యంత్రం తో పనిచేయడం నావల్ల కాలేదు. లింకు ఇవ్వండి పంపుతాను.--మాటలబాబు 11:25, 7 సెప్టెంబర్ 2007 (UTC)
ప్రదీపు చెప్పిన మృదుసామగ్రి నాక్కూడా పనిచెయ్యలేదు. నేను బుల్ జిప్ పీడిఎఫ్ ప్రింటర్ని ఉపయోగించాను. నేను బుధవారం దాకా తిరిగి రాకపోవచ్చు --వైజాసత్య 11:32, 7 సెప్టెంబర్ 2007 (UTC)

ఐ.పి.అడ్రసు[మార్చు]

మాటల బాబూ! 87.60.181.73 అడ్రసు గోపీకృష్ణగారిదని ఎలా తెలుసుకొన్నావు? (గుర్తుంచుకొన్నావు?) - ఈ విషయంలో నీకు ప్రత్యేకమైన టాలెంట్ ఏమైనా ఉందా? - --కాసుబాబు 16:53, 9 సెప్టెంబర్ 2007 (UTC)

ప్రత్యేకమైన ట్యాలెంటా పాడా?ఇప్పుడే గూగుల్ బ్లాగులొ గోపి కృష్ణ గారు చిన్న సందేహం అడిగారు. దానికి ప్రదీప్ గారు సమధానం చెప్పారు. ఆ ప్రశ్న కి సంబంధించిన సమాచారాన్ని వ్రాస్తున్నారు. ఆయన ఇదివరకు ఒకసారి వికీ వ్రాయడం గుర్తుంది. అందువలన ఆయనను గుర్తు పట్టి పలకరించాను. సొంత డబ్బా అని అనకోడాదు కాని సంఖ్యలు,జ్ఞాపకశక్తి కి సంబంధించిన విషయాలలొ నా బుర్ర కొద్దిగా పదునే కాని ఇతర విషయాలొ చాలా మందం --మాటలబాబు 16:59, 9 సెప్టెంబర్ 2007 (UTC)

గ్రామాల వ్యాసాల గురించి ప్రచారం[మార్చు]

మాటల బాబూ! ఇంతకు ముందు నీవు చూడకపోతే ఒకసారి ఈ వ్యాసాన్ని చూడు. ఆర్కుట్‌లో నీ ప్రచారానికి ఉపయోగపడవచ్చును. --కాసుబాబు 07:09, 10 సెప్టెంబర్ 2007 (UTC)

కృతజ్ఞతలు[మార్చు]

వచ్చినపుడల్లా స్వాగతం పలుకుతున్నందుకు కృతజ్ఞతలు , అనువాదం చెయ్యాలంటే చిఱ్ఱెత్తుతుంది. కాబట్టి అనుకున్నంతగా తోడ్పడలేక పోతున్నా. పౌరాణిక పురుషుల ప్రాజెక్టు ఉంటే బాగుండును, వివిధ చోట్లనుండి సమాచారం సేకరించి వ్రాయొచ్చు. అప్పటి వరకూ హాకీ లాంటి ఇష్ట వ్యాసాలను అనువాదించుతుంటా. --రాకేశ్వర 11 sep 2007

మాటలబాబూ మీకు వినాయక చతుర్ధి శుభాకాంక్షలు.విశ్వనాధ్. 11:45, 15 సెప్టెంబర్ 2007 (UTC)

మీ ప్రోత్సాహానికి నా కృతజ్ఞతలు దేవా 03:49, 20 అక్టోబర్ 2007 (UTC)

మీ అభినందనలకి నా ధన్యవాదాలండి బ్లాగేశ్వరుడుగారు! దేవా 05:30, 25 అక్టోబర్ 2007 (UTC)

సహాయం కావాలి[మార్చు]

{{సహాయం కావాలి}}విక్షనరి కి, వికీవ్యాఖ్య కి అంతర్లింకులు ఇవ్వడానికి సహాయం కావాలి--మాటలబాబు 17:21, 16 సెప్టెంబర్ 2007 (UTC)

వికీపీడియా నుండి విక్షనరీకి :wikt: వికీవ్యాఖ్యకు :q: అని ఇస్తే సరిపోతుంది --వైజాసత్య 17:29, 16 సెప్టెంబర్ 2007 (UTC)

4000 మార్పులు-చేర్పులు[మార్చు]

నేటితో మీరు వికీపీడియాలో సభ్యత్వం తీసుకుని సరిగ్గా నాలుగు నెలలవుతుంది. చేరిన నాలుగు నెలలకే 4000 సార్లు తెలుగు వికీపీడియాను మెరుగుపరిచారు. మీ కృషి అమోఘం. __మాకినేని ప్రదీపు (+/-మా) 19:58, 19 సెప్టెంబర్ 2007 (UTC)

ధన్యుడిని కృతజ్ఞతలు --మాటలబాబు 20:04, 19 సెప్టెంబర్ 2007 (UTC)
4000 మార్పులు చేసిన సందర్భంగా అభినందనలు. మీ ఖాతాపేరు మాటలబాబు కానీ మీరుమాత్రం చేతలబాబే --వైజాసత్య 02:53, 22 సెప్టెంబర్ 2007 (UTC)

మీరు ఉండేది హైదరాబాదేనా? అయితే బేషుగ్గా రావచ్చు. ఎక్కడ ఉంటారో చెపితే ఎవరితోనయినా కలిసి రావచ్చు, ఆటో ఖర్చులు కలసి వస్తాయి. Chavakiran 20:06, 21 సెప్టెంబర్ 2007 (UTC)

ప్రస్తుతానికి ఖండాతరంగా ఉంటున్నాను. కొద్ది రోజులలొనే రావచ్చు. వచ్చినప్పుడు తప్పక తెలుగు మీటింగ్స్ కి వస్తాను --మాటలబాబు 20:37, 21 సెప్టెంబర్ 2007 (UTC)
ఏంటీ, హైదరాబాదు వెళుతున్నారా? --వైజాసత్య 02:53, 22 సెప్టెంబర్ 2007 (UTC)

తెలుగు లిపి బొమ్మ[మార్చు]

ఇదిగో కొత్త తెలుగులిపి బొమ్మ తయారైంది బొమ్మ:Telugulipi evolution.jpg --వైజాసత్య 21:46, 23 సెప్టెంబర్ 2007 (UTC)

Image:Bheema.jpg needs description and source! Please add.[మార్చు]

.

Request for help from kannada (kn) wikipedia[మార్చు]

ಬಾಬು ಅವರೆ,
This is ಶುಶ್ರುತ from kannada wikipedia. I am now an administrator on kannada wikipedia and want to implement automatic transliteration like in the telugu wiki. Can you help me with it either by giving me instructions on how to do it or by helping me establish contact with someone who can instruct me regarding this. Any help on this matter will be greatly appreciated. Thank you. shushruth from kn wiki

Thanks for your message. Currently administrator Ravi is helping me out a lot with this. I'll keep you updated. Thanks again. ~ Shushruth.

ఈ వారం బొమ్మ[మార్చు]

ఈ వారం బొమ్మగా ప్రదర్శించటానికి మీకేమైనా తోచిందా? --వైజాసత్య 01:34, 15 అక్టోబర్ 2007 (UTC)

శివలింగ పుష్పాలు ప్రదర్శిస్తే ఎలా ఉంటుంది??--బ్లాగేశ్వరుడు 02:05, 15 అక్టోబర్ 2007 (UTC) నా మెదటి పేజి మారడం లేదు, బ్రౌజర్ ను కాచ్ నుండి తొలగించాను, ఇంకో సహాయం వికీ సోర్సు కి అంతర్లింకు డబ్బా చేసి పెట్టరు. --బ్లాగేశ్వరుడు 02:05, 15 అక్టోబర్ 2007 (UTC)

బ్లాగేస్వరుడు గార్కి, మీ సందేశం చూసాను,చాలా సంతోషం.గోపరాజు వెంకటానందం గారు ఈ నిడదవోలు వాస్తవ్యులే కాని ప్రస్తుతం కేర్తిశేషులు. ఆయన వ్రాసిన నిడదవోలు చరిత్ర నేను కూడా చూడలేదు.నిడదవోలుకు సంబందించి ఒక ప్రైవేట్ టెలిఫోన్ డైరెక్టరిలో సంక్షిప్తంగా గోపరాజుగారి నిడదవోలు చరిత్ర ప్రస్తావించారు.అది మాత్రమే నేను చదివాను.ఆయన వారసులు ఇక్కడ లేరు.త్వరలోనే ఆ పుస్తకాన్ని సంపాదిస్తాను.మీకు తెలియపరుస్తాను.

       తీరిక దొరికినపుడల్లా మా చుట్టుప్రక్కల గ్రామాల గురించి వ్రాస్తాను.మీరు కూడా సలహాలు ఇవ్వండి. 

ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్. నేను ఏపేజికైనా ఏదయినా మార్పు చేసి భద్రపరిస్తే అది కొండవీటి చాంతాడులా ఒకే లైనులో పోతుందెందుకని ? తెలియజేయండి.

                                    --గెడ్డంబాబు.


బ్లాగేస్వరుడు గార్కి నమస్కారములు! నా పేజి లో నా ఫొటొ పెట్టినందుకు thanks తెలియజేస్తున్నాను. నేను స్వంతం గా వ్రాసిన వ్యాసాలకు మూలము ఏమని వ్రాయాలి. న్యూస్ పేపరులో చదివిన విషయాలు తెవికీ లో పెడితే మూలము ఆన్యూస్ పేపరు పేరు వ్రాయవచ్చునా? డా.శేషగిరిరావు-శ్రీకాకుళం

వృత్రాసురుడు[మార్చు]

మీరు తెలుగులో చాలా వేగంగా వ్యాసరచన గావిస్తున్నారు. నేను ఎంత ప్రయత్నం చేసినా వేగంగా అనువదించలేకపోతున్నాను. శభాష్! బ్లాగేశ్వరుడు గారు! దేవా 02:25, 25 అక్టోబర్ 2007 (UTC)

వృతాసురుని వ్యాసం కోసం మీరు కామన్స్ లో ఎక్కించిన బొమ్మలు కాపీహక్కుల సమాచారం లేనందున వాళ్ళు ఇంకో 7 రోజుల్లో వాటిని తీసెయ్యబోతున్నారు. --వైజాసత్య 04:12, 25 అక్టోబర్ 2007 (UTC)
వాటిని తొలగిస్తారని తెలుసు , ఆ బొమ్మలు నేను వెబ్ సైటు నుండి సంపాదించాను. వ్యాసము పూర్తి అయ్యాక ఆ వ్యాసం ఒక పి.డి.యఫ్ లొకి మార్చి దాచుకొంటాను. పోతన గారు , వ్యాసుడు వృతాసుర వృత్తాంతం చదివిన వ్రాసిన కష్టాలు తప్పుతాయి, పుణ్యం వస్తుంది అని అన్నారు. అందుచేత ప్రస్తుతానికి వ్రాస్తున్నాను--బ్లాగేశ్వరుడు 04:19, 25 అక్టోబర్ 2007 (UTC)
భలే ప్లాను వేశారే!! బొమ్మలు చాలా బాగున్నాయి. ఉండించే అవకాశముంటే బాగుండేది :-( --వైజాసత్య 04:22, 25 అక్టోబర్ 2007 (UTC)